బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు- Double standards


    దేవాలయాల్లో చూస్తూంటాము పెద్ద పెద్ద బోర్డులు- ‘Switch off your mobiles’ అని ఒకటీ, ‘Photography not allowed’ అని ఇంకోటీ! అవి మనలాటి సామాన్య మానవమాత్రులకి మాత్రమే వర్తిస్తాయనుకుంటాను!
ఈ మధ్యన చాలా చానెల్స్ లో ఆంధ్రదేశంలోని రమారమి ప్రతీ దేవాలయం గురించీ ( ఒక్క పెద్ద తిరుపతి తప్ప), ఏదో ఒకపేరు- తీర్థయాత్ర, గోపురం, మాఊరి దేవతలు… ఇంకోటేదో-తో కార్యక్రమం చూపిస్తూనే ఉంటారు. మరి ఆ చానెల్ వాళ్ళని అనుమతించగా లేనిది, మనలాటివారిని కూడా ఫొటోలు తీసికోనిస్తే ఏం నష్టంట? ఏ దేవాలయంలోనైనా సరే, ‘ఫొటోలు తీసికొచ్చాండీ’ అని అడగండి, ఠక్కుమని చెప్పేస్తారు, అక్కడివారు, ‘ లేదండీ కావలిసిస్తే, దేవస్థానం వారు తీసిన ఫొటోలు కావలసిస్తే కొనుక్కోండీ’ అంటారు! ఆ తరువాత ఏ చానెల్ లోనో చూస్తూంటాము, మనని ఫొటోలు తీసికోకూడదన్న దేవాలయం గురించి ఓ కార్యక్రమం, కొసమెరుపేమిటంటే, మనల్ని ఏ పూజారైతే ఫొటోలు తీసికోవద్దన్నాడో. ఆయనే ప్రామినెంటు గా కనిపిస్తాడు!!

   అలాగే సెల్ ఫోన్ల విషయంలోనూ- మన దగ్గర ఉన్న సెల్ ఫోన్లు గేటుదగ్గరే తీసేసికుంటారు. తీరా లోపలికి వెళ్ళి చూస్తే, దేవాలయ సంబంధిత అధికారో, లేక పూజారో, ఎవరితోనో సెల్ ఫోనులో మాట్లాడుతూ కనిపిస్తాడు! పోనీ అలాటి దృశ్యమేదైనా రికార్డు చేద్దామంటే, మన కెమేరాలూ, కెమెరా ఫోన్లూ అసలు లోపలికే తీసికెళ్ళనీయరే! బహుశా ఇదే కారణం అనుకుంటాను- వాళ్ళు చేసే దుష్కార్యాలని కెమేరా లో బంధించనీయకపోవడానికే! అంతే కానీ ఆ దేముడి sanctity ఏదో కాపాడదామని కాదు!

    అలాగే ఏ ప్రైవేటు డాక్టరు దగ్గరకైనా వెళ్ళండి, అక్కడో బోర్డు దర్శనం ఇస్తుంది- Take off your shoes/chappals- అని. మనం ఏదో దేవాలయంలొకి వెళ్తున్నట్లు, బుధ్ధిగా చెప్పులో/షూసో బయటే విడిచి లోపలకి అడుగెడతాము. మన ముందరే, ఏ నర్సో, ఏ డాక్టరో బయటకీ లోపలకీ చెప్పులతోనో, బూట్లతోనో తిరిగేస్తూంటారు! మరి,అక్కడుండే రూలు వాళ్ళకి వర్తించదా లేక వాళ్ళవేమైనా దేవతా చెప్పులా? వచ్చే రోగాలేవో ఆ డాక్టర్ల ద్వారానూ రావచ్చుకదా?

   అలాగే పెట్రొల్ బంకుల దగ్గర ‘Switch off your mobiles’ అనే బోర్డు తప్పకుండా చూస్తాము!అక్కడుండే ఎటెండెంట్లు ఎడా పెడా సెల్ ఫోన్లలో మాట్లాడేస్తూంటారు!ఏం వాళ్ళ ఫోన్లలో ఏమైనా ప్రత్యేకమైన సదుపాయం ఉందా,అంటుకోకుండా ఉండేందుకు! అన్నిటిలోకీ పెద్ద జోకు ఏమిటంటే, ఈ మధ్యన ఓ శ్మశాన వాటికకి, ఓ గ్యాసు గోడౌన్ కీ మధ్యన ఓ గోడ మాత్రమే అడ్డు, ఆ గోడమీద పెద్ద పెద్ద అక్షరాలతో ‘ ‘No smoking’ అని. గోడ పక్కనున్నదేమిటో?
ఇలా వ్రాసుకుంటూ పోతే ఎన్నెన్నో Double standards. చెప్పేవాడికి వినేవాడెప్పుడూ లోకువే !!

    నిన్నటి నాటపా లో పెట్టిన ఐ.పి.ఎడ్రసూ,శ్రీ వెంకట్, శ్రీ పానిపురి ఇచ్చిన వ్యాఖ్యలోని ఐ.పి.ఎడ్రసూ డిలీట్ చేశాను. కారణం మరేమీ లేదు, అసభ్య వ్యాఖ్యలు పెట్టిన పాఠకుడు క్షమాపణ చెప్పాడూ, మళ్ళీ అలాగ చేయనని ప్రామిస్ చేశాడు, పోనీ ఒక ఛాన్సిద్దాము.ఎవరైనా తప్పులు చేస్తారు, కానీ పశ్చాత్తాపం చెందినట్లు కనిపిస్తున్నారు, ఎంతైనా వయస్సులో పెద్దవాణ్ణి, అలా చేయడంలో ఎవరికీ అభ్యంతరం లేదనే భావిస్తున్నాను.

11 Responses

  1. ఇవన్నీ ఒక రకమైన కరప్షనే అని నేనంటాను.

    ఆ అభాగ్యుడ్ని క్షమించిన మీ పెద్దరికానికి హ్యాట్స్ ఆఫ్ఫ్

    Like

  2. అసభ్య వ్యాఖ్యలు పెట్టిన పాఠకుడు క్షమాపణ చెప్పాడూ, మళ్ళీ అలాగ చేయనని ప్రామిస్ చేశాడు
    ___________________________________________

    Cool!

    Like

  3. Phani Babu gaaroo, What I feel is that we cannot equate once in a while TV shooting in the Temples with that of permitting the devotees to go on a clicking spree. Just imagine that there is permission to click away in any Temple, how our public behaves. With the advent of Cell Phone cameras, everybody would be tempted to take a photo of the deity and the Mangala Haratulu would fade before the camera flashes.

    Regarding Nurses and other Doctors coming with shoes into the cabin of the Doctor, I feel that in all big Hospitals, the staff have to leave their footwear and wear disinfected hospital provided footwear. So, it may look odd for us, but they may not be coming inside with their normal chappals they treaded on all the unmentionable.

    …”పోనీ ఒక ఛాన్సిద్దాము.ఎవరైనా తప్పులు చేస్తారు, కానీ పశ్చాత్తాపం చెందినట్లు కనిపిస్తున్నారు, ….” our entire country is suffering from this one weakness.But for this, our Country would not have been invaded and ruled by marauding mobs across the deserts and later across the seas.

    Like

  4. I love the information you shared.Its very nice.Keep up the good work

    Like

  5. అలా నిషేదించిన దేవాలయం ఫోటోలు ఎక్కడా చూడలేదండీ! మీరు ఏ దేవాలయం గురించి ప్రస్తావించారో?అయితే కెమెరాలూ,సెల్లుఫోన్లూ నిషేదించడాన్ని నేనూ సమర్ధిస్తానండీ,అవి దేవాలయాల పవిత్రవాతావరణాన్ని చెడగొడతాయి.చట్టాన్ని ఉల్లంఘించేవాళ్ళు ఎప్పుడూ ఉంటారండీ, మనం మాత్రం వాళ్ళతో చేరంకదా.అలాంటి వాళ్ళను నిలదీద్దాం. గ్యాసు గోడౌన్ దగ్గర “NO SMOKING” బోర్డ్ అగ్ని ప్రమాదాల గురించనుకుంటానండీ.

    Like

  6. ద్వంద్వ ప్రవృత్తి గురించి మీ టపా బాగుంది. నేను సాధారణం గా గుళ్లకీ, డాక్టర్ల దగ్గరకీ వెళ్లను కాబట్టి నాకంత అవగాహన లేదు కానీ, ఇప్పటికీ గుళ్లో విగ్రహాలని ఫోటోలు తీస్తే ఆ దేవుడి తేజస్సూ, మహిమా తగ్గిపోతాయనే మూర్ఖులు ఇంకా పెరుగుతున్నారు. మీరన్నట్టు ఆ గుడి వాళ్లు అమ్ముకునే ఫోటేలే కొనాలని నిర్బంధమే కారణమేమో!

    ఇక పెట్రోలు బంకుల విషయానికొస్తే, మా వూళ్లో వున్నవి మూడే. ఇన్నాళ్లూ నా బండిని మా దగ్గర పనిచేసే వాళ్లెవరికైనా ఇచ్చి, పెట్రోలు కొట్టించుకు రమ్మనడమే గానీ, ఇప్పుడు రిటైరు అయ్యాక, యే పది రోజులకో నేనే వెళ్తున్నాను. నిజం చెప్పాలంటే, అక్కడ నాకు సెల్ ఫోన్ సీన్లేమీ కనబడలేదు. సిటీల్లో సంగతి నాకు తెలియదు. మీరన్నది నిజమేనేమో!

    ఇక హైలైట్ శ్మశానం ప్రక్కనే గ్యాస్ గోడౌన్!

    నిజమా? భలే వ్రాశారు!

    Like

  7. మీరు ఆ బూతులు రాసిన అనామకుణ్ణి క్షమించడం ఓకే. వాడితో ఏ వృద్ధాశ్రమానికో, ఓ 10వేలు చందా ఫైన్ గా మీ పేరు మీద కట్టించి రశీదు స్కాన్ చేసి మెయిల్ లో పంపమని చెప్పాల్సింది. వాడింకో చోట మరీ చేయడని నమ్మకమేంటి?

    Like

  8. శివ గారూ,
    I beg to differ with you. The Temple authorities need not give a blanket permission for photography. They can give permission on each case , just as they do for video shooting.
    As for the hospitals, what I mentioned, was what i observed in some private hospitals.
    We can not rewrite history.our culture has taught us to pardon even a hardcore criminal, if he repents.

    Like

  9. వజ్రం,

    నేను తూర్పు, పశ్చిమ గొదావరి జిల్లాల్లో చూసిన దేవాలయాల్లో నాకు జరిగిన అనుభవం ఇది.అవే దేవాలయాలని, వాటిలోని మూల విరాట్లనీ, టి.వీ చానెల్స్ లో చూశాము!గ్యాసు గోడౌన్ల దగ్గర ‘నో స్మోకింగ్’ అన్నది, అగ్నిప్రమాదాల గురించే. కానీ నేను పూణె లో ఒక శ్మశానవాటికి కీ, ఓ గ్యాస్ గోడౌన్ కీ ఒక గోడ(అదికూడా పూర్తిగా కవరు అవలేదు!) మాత్రమే అడ్డుగా చూశాను.ఆ గోడమిద వ్రాసిన దానిని గూర్చి వ్రాశాను!

    Like

  10. కృష్ణశ్రీగారూ,

    నా టపా నచ్చినందుకు ధన్యవాదాలు. మాది ఎంత చెప్పినా ‘నగరం’ కదా! ఇక్కడ పెట్రోలు బంకుల్లో చూస్తూంటాము!

    Like

  11. అనానిమస్,

    మీరు చెప్పిన సలహా నిజంగా చాలా బాగుంది. నాకు తట్టనేలేదు.

    Like

Leave a comment