బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– మీరే చెప్పండి


    మామూలుగా ఎవరైనా ఫోను చేసి, ఏదైనా సమాచారం అడిగితే, మనకు తెలిస్తే సమాధానం చెప్తాము, లేకపోతే తెలియదని చెప్పేస్తాము! నా అనుభవంలో ఈ రెండేళ్ళలోనూ జరిగినదేమిటంటే, ఏదో నేను గత 47 సంవత్సరాలనుండీ ఇక్కడే ఉండడం వలన అనండి, ఏవరో ఒకరు ఫోను చేసి దేనికోదానికి సమాచారం అడుగుతూంటారు. కోఇన్సిడెంటల్ గా వారు అడిగేదేమిటంటే, వారింట్లో స్వర్గస్థులైన ఏ పెద్దవారిదో,సెరిమనీ గురించే! నాకు తెలిసినంతలో రాఘవేంద్ర మఠం గురించి వివరాలు తెలుపుతూంటాను. అక్కడివరకూ బాగానే ఉంది. కానీ వచ్చిన గొడవల్లా ఏమిటంటే, అలా ఫోను చేసి తెలిసికున్న తరువాత, వారి పని అయిందా, నేనిచ్చిన సమాచారం సరైనదేనా, తెలిపితే, మరోసారి ఎవరైనా అడిగినా చెప్పొచ్చు. ఈ మాత్రం కర్టిసీ ఆశించడంలో తప్పేమీ లెదని నా అభిప్రాయం.ముక్కూ మొహం తెలియని నాకు ఫోను చేయడంలో లేని మొహమ్మాటం, ఓసారి పని అయిందో లేదో తెలియచేయడంలో ఎందుకో అర్ధం కాదు!
అలాగని నాకేదో జీవితాంతం గ్రేట్ ఫుల్ గా ఉండాలనడం లేదు. ఏదో ఓ సారి ఫోను చేసి చెప్పేస్తే అదో తృప్తీ!

    నేను ఏదైనా సందర్భాల్లో ఎవరైనా సహాయం చేస్తే మాత్రం వారిని జీవితాంతం గుర్తుంచుకుంటాను. వారి బాగోగులు వీలున్నప్పుడు తెలిసికుంటూంటాను.అదేదో పేద్ద గొప్ప విషయం అని చెప్పడంలేదు, మానవ సంబంధాలు ఇంప్రూవ్ చేసికోవడం వీటివల్లే.

    నేనేదో కాలక్షేపానికి బ్లాగులోకంలోకి వచ్చి నా దారిన నేను టపాలు వ్రాస్తూంటాను.అందరికీ నచ్చాలని లేదు. నచ్చినవారు ఏదో వ్యాఖ్య పెట్టినప్పుడు, ఏనుగెక్కినంత సంబర పడతాను. లేనప్పుడు, అయ్యో మనం వ్రాసిన టపా ఎవరికీ నచ్చలేదనుకుని ఊరుకుంటాను! చాలామందికి చదవడానికి సమయమున్నా, వ్యాఖ్య పెట్టడానికి మూడ్ ఉండకపోవచ్చు, లేదా ప్రతీ రోజూ వ్రాస్తూనే ఉంటాడీయనా, రోజూ వ్యాఖ్యలు పెట్టే ఓపిక ఎవరికుంటుందీ అనీ అనుకోవచ్చు.దీంట్లో అభ్యంతరం ఏమీ లేదు. ఎవరిష్టం వారిది. ఉదాహరణకి, నేను ప్రతీ రోజూ చాలా టపాలు చదువుతూనే ఉంటాను, అయినా వ్యాఖ్య పెట్టడానికి బధ్ధకం! అలాగే అవతలివారికీ అనిపించొచ్చుకదా! So no issue!

    ఇప్పుడు నేను వ్రాసేదంతా దేనిగురించంటే, ఈమధ్యన ఒక దుష్టుడు, వాడికి నా టపాలు నచ్చడంలేదనుకుంటాను, అలాగైతే చదవడం మానేయొచ్చు. కానీ ఓ పిచ్చికుక్కలా, అసభ్యకరమైన పదాలతో, నా టపాలమీద వ్యాఖ్యలు పెడుతున్నాడు. ఇలా అసభ్యకరమైన పదాలు వాడడానికి, వాడిని తప్పుపట్టలేము. వాడి పెడిగ్రీ అలాటిది! దానికి వాణ్ణేం చేయగలము? పైగా ఈ మధ్యన ఓ ఉచిత సలహా కూడా ఇచ్చాడు, వాడి వ్యాఖ్యల్ని దమ్ముంటే ప్రచురించమని,సరైన పదజాలం ఉపయోగించినా, ఆఖరికి వాడి పేరైనా సరీగ్గా ఉండుంటే, తప్పకుండా ప్రచురించేవాడిని. ఎందుకంటే ఈ బ్లాగులోకంలో అందరూ మర్యాదస్థులు కనుక.ఈ మధ్యన వాడి మెయిల్ ఐ.డీ కూడా ఇచ్చాడు.అలాగని వాడికి మెయిల్ పంపితే జరిగేదేమిటీ- అశుధ్ధం మీద బెడ్డ వేసినట్లేకదా, మనమీదకే చిందుతుంది. అసలు దీని గురించి ఓ టపా వేస్టు చెయడం ఎందుకూ అనుకున్నాను కానీ, నాకైనట్లే ఇంకా ఎందరికో జరుగుతూండవచ్చు కదా.

    ఇలాటి దరిద్రులనుండి మనని మనం కాపాడుకోవడం ఎలాగో ఎవరైనా సలహా ఈయగలరా? లేక నాదారిన నన్ను వ్రాసుకోమంటారా? మీరే చెప్పండి.

Advertisements

38 Responses

 1. నేను మీ టపాలు అన్నీ చదువుతాను, కానీ వ్యాఖ్యలు పెట్టని కారణం ఏమి పెట్టాలో తెలియకపోవడమే…

  🙂

  Like

 2. మీకు దారిన మీరు రాసుకోండి సార్. అలాంటి వాళ్ళ గురించి అస్సలు పట్టించుకోవల్సిన అవసరం లేదు.

  Like

 3. పరోపకారార్థమిదం శరీరం కదండి
  మన ధర్మం మనం చేస్కుంటూ పోవటమే
  ఇల్లాంటి వార్ని మనం మార్చలేము
  చెప్పినా వారు మారరు
  అందుకని no regrets!!

  Like

 4. అయ్యో! మీకు కూడా బాధ కలిగిస్తున్నారా!? మీది వర్డ్‌ప్రెస్ కదా! వాడి ఐ.పి అడ్రెస్ ఉంటుంది. అది ప్రచురించండి. జనాలందరూ వాడిపై కన్నేసి ఉంచేందుకు వీలు పడుతుంది. మనవాళ్ళకీ డబల్ పోజులపైనున్న మోజలాంటిది.
  వాడు సర్వత్రా దరిద్రుడైతే ఏం చెయ్యలేం. కొన్నాళ్ళకి మొరిగి మొరిగి వాడే నోరు మూసుకుంటాడు.

  Like

 5. enduku elanti vaari gurinchi alochistaru. time vaste mastaru. meenumchi, lakshmi gari nunchi memu marinni manchi postlu memu chadavali.

  Like

 6. గురూగారూ

  మీకు వీలున్నప్పుడు ఆ పండితమ్మన్యుల వారిని ఒక సారి కుక్కపాలు తాగిరమ్మని చెప్పండి….తరువాత కూర్చోబెట్టి ధనశాంతి, మదశాంతితో సహా వివిధ రకాల తంతులు, శాంతులు మనం చేయిద్దాం

  అయినా శుంఠలతో మనకేమి పని గురువర్యా…! మన పని మనది…కుక్కపాలు కుక్కవి…”పండితుల” పని పండితులది…

  ఓం శాంతి….

  Like

 7. Sir,

  I am one regular reader of your blog. I am frm US, and i am not good at writing telugu. So, i am not commenting on your blog posts for a while because every body comments in telugu. You dont need to worry about those fools. Go with your writing and enlighten us with your experiences.

  Like

 8. బాబుగారూ!

  ఈ వయసులో మనస్తాపం అనవసరం.

  పెద్దావిడ “సూర్య లక్ష్మి” గారి బ్లాగులో ఓ ఎల్ కే (అద్వానీ) యెవడో బూతు కామెంటు పెడితే, వాడిని “……………” ఇలా తిట్టండి అని నేను వ్రాశాను. వీలైతే చదవండి. మీకు వ్రాయమన్నా మళ్లీ వ్రాస్తాను.

  నా కృష్ణశ్రీ బ్లాగులో ‘అనోన్ ‘ లకి ఇస్తున్న జవాబులూ, అమ్మ ఒడి కి నేనిచ్చిన సమాధానం చూడండి.

  వాడు మెయిల్ ఐడీ ఇచ్చాడంటున్నారు కాబట్టి అది నాకు పంపించండి. వాడి సంగతి నేను చూస్తాను!

  బ్లాగులోకాన్ని కాలుష్య రహితం చేద్దాం. అఙ్ఞాతల్ని తరిమి కొడదాం!

  మీమానాన్ని మీరు వ్రాస్తూనే వుండండి.

  Like

 9. nenu maatram koodali lo first mee post vundemo ani vetukutaanu..ilaanti vaati valla meeru raayatam maaneste,,nenu voorukonu… anthe… 🙂 ..plz..roju raastune vundandi…

  Like

 10. @ క్రిష్ణ శ్రీ

  “అఙ్ఞాతల్ని తరిమి కొడదాం! ”

  అందరు అజ్ఞాతలనీ తరిమికొట్టనవసరంలేదు. అజ్ఞాతల్లో మంచి వారు కూడా వున్నారు – వుంటారు. అంటే నేనేదో అజ్ఞాతంగా కామెంట్లు వేస్తానని కాదు. ఇంతవరకు అయితే అజ్ఞాతంగా వ్యాఖ్యానించాల్సిన అవసరం నాకు కలగలేదు.

  Like

 11. @ ఫణి బాబు
  ఏదో అప్పుడప్పుడు వివాదాస్పదంగా వ్రాసే నాలాంటి వారికి అసభ్యమయిన కామెంట్లు ఎప్పుడన్నా వస్తున్నాయంటే ఓ అర్ధం వుంది కానీ ఏ గొడవల్లోనూ తలదూర్చని మీకు కూడా అలాంటి వెకిలి వ్యాఖ్యలు రావడమా! ప్చ్. ఏంటో కొందరు మనుషులు.

  Like

 12. నేను ఈవేళ వ్రాసిన టపాకి వచ్చిన స్పందనలకి నిజంగా, నా కన్నీళ్ళు( ఆనందాశృవులు) వచ్చాయి.నాకూ మన బ్లాగులోకంలో ఎంతోమంది అభిమానులు ఉన్నారు.మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.కొందరు ఐ.పి.ఎడ్రసు ఈయమని చెప్పారు.అది—ఐపీ: దీనివలన మీరు నాకేదైనా ఉపకారం చేసి నా మనస్తాపం తగ్గించకలిగితే ధన్యుడనౌతాను.
  వ్యాఖ్యలు వ్రాసిన ప్రతీవారికీ రేపు విడివిడిగా సమాధానం వ్రాస్తాను. మరీ అర్ధరాత్రైపోయింది!

  Like

 13. nenu kuda mi blog regular reader ne andi.

  Like

 14. > అశుధ్ధం మీద బెడ్డ వేసినట్లేకదా, మనమీదకే చిందుతుంది
  అలాంటి వాళ్ళు ఎక్కడైన ఉంటారు, ప్రక్కకి తప్పుకుని వెళ్లడమే

  Like

 15. Sir,

  I look forward for your posts daily…I feel very happy after reading your posts…Please dont stop writing..The only reason I hesitated to comment all these days is I am not good at writing telugu…..

  Thanks again..

  Valli.

  Like

 16. Sir, extremely sad to see that you’ve been a target of such psychopathic behavior.
  Unfortunately, such is the nature of the “free internet”.
  Please try to ignore him and others of his ilk and continue with your work.
  తెలుగు బ్లాగరుల్లో, బ్లాగు పాఠకుల్లో మిమ్మల్ని అభిమానించేవారమూ, గౌరవించేవారమూ చాలా మందిమి ఉన్నాము.

  Like

 17. మీ బ్లాగ్ ఎప్పుడూ చదువుతూ ఎప్పుడో తప్ప కామెంట్ పెట్టని వాళ్లలో నేనూ ఒకడిని. ఇలాంటివి దయచేసి పట్టించుకోకండి, హాయిగా మీ స్టైల్లో మెరు వ్రాస్తూ పొండి. పెద్దవాళ్లు, పొరపాటున కూడా ఏ వివాదస్పదమయిన విషయమీద అయినా టపా వేయని వాళ్లు, మీకు చెత్త కామెంట్లు పంపుతున్న ఆ మెంటల్ కేసును జాలిపడి క్షమించి వదిలేయండి అంతంకంటె ఇంకో క్షణమయినా ఆలోచించంటం అనవసరం!!

  Like

 18. Sir,
  మీరు ఇలాంటి విషయాలయని పట్టించుకోనక్కర లేదండి. మీరు రాసేది రాస్తూ ఉండండి. దయచేసి అలంటి వాళ్ళని ignore చెయ్యండి. .

  Like

 19. ఆ వ్యాఖ్యల్ని ప్రచురించండి. ఆ తిట్టేపనేదో మీ అభిమానులే చూసుకుంటారు :))

  Like

 20. మీరేం బాధపడకండి బాబాయ్ గారూ, అలాంటివి మాకూ జరుగుతున్నాయి. ఏనుగులు నడుస్తుంటే పిచ్చికుక్కలు మొరుగుతూనే ఉంటాయి, చీ చీ అని మన మానాన వెళ్ళుపోవడమే తప్ప పట్టించుకోకూడదు. Just don’t care!

  Like

 21. ఫణిబాబు గారూ, మీరు లావుగా ఉంటారని సౌమ్య పరోక్షంగా వెక్కిరిస్తున్నట్టు లేదూ?

  Like

 22. బాబూ రౌడీగారు, తమరు తమ దందాల పని చూసుకోండి, మీకెందుకీగోల, ఈ నారదవేషం? 😛

  Like

 23. :))

  Like

 24. ఫణిబాబు గారు, మీ బ్లాగ్ కు నేను కూడా రెగ్యులర్ రీడర్ ని, మీలాంటి వారికి ఇలాంటి సమస్య రావడం అనేది అసలు నాఊహకి అందడంలేదండి. అతని కామెంట్స్ ని /ఈమెయిల్ నికూడా స్పాం గా గుర్తించేయండి మీకు చదవాల్సిన అవసరం కూడా ఉండదు. అతన్ని పూర్తిగా ఇగ్నోర్ చేయండి. ఎవరో ఒకరికి నచ్చనంతమాత్రాన మీరు మీ పంథా మార్చుకోవాల్సిన అవసరంలేదు. మీరు చెప్పే కబుర్లకోసం ఆసక్తిగా ఎదురు చూసే నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అనే విషయం మరువకండి.

  Like

 25. ఫణిబాబుగారు,
  ఇలాంటివి పట్టించుకోవద్దు. మిమ్మల్నికూడా ఇలా వేధిస్తున్నారంటే వాళ్లు ఎంత మానసిక వికలాంగులో అర్ధం చేసుకోండి… మన బ్లాగ్లోకంలో ఇలాంటివాళ్లు చాలామంది ఉన్నారులెండి. మీపని మీరు చేసుకోండి. మిమ్మల్ని అభిమానించేవాళ్లు కొందరు కాదు చాలామంది ఉన్నారు. మొరిగేవాళ్లని మొరగనివ్వండి. అది వాళ్ల జాతిధర్మం.. మారరు. మార్చాల్సిన అవసరం మనకు లేదు.

  Like

 26. Phani babu garu
  mee blog kosame koodali open cheastaanu. mee postlu chala bagumtaayi. meeru vrayadamu maanaddu.

  Like

 27. అందరం పడుతున్న బాధలే ఇవి 😀 ….. మొదట్లో నేను తిరిగి నాలుగు బూతులు ఎదురు తిట్టేవాడిని … దానివల్ల ఉపయోగం లేకపోగా మనమే పలచన అవుతున్నాం అని తెల్సుకుని …… వదిలేశా … అయినా బాబాయి గారు మిమల్ని తిట్టాడు అంటే ఇంక ఆడికి టైం దగ్గర పడినట్టే …. కాగల కార్యం గంధర్వులే తీరుస్తారు . మీరు హ్యాపీగా రాసేయండి . ఇప్పుడు నా వాఖ్య చూసి ఇంకా రెచ్చిపోతాడు. ఎందుకంటే ఆ మూర్ఖులకి నేను అంటే అంత ఇష్టం మరి 🙂

  Like

 28. Sir,

  I am also your fan. Hope your problem with the anonymous commenter gets solved soon. I know how it feels to get these un-welcome comments. They spoiled my peace of mind too. These are the challenges present day blogging has. Never Mind. Go ahead.

  Like

 29. ignore crack people write for us everyday we all are waiting for your post

  Like

 30. ఫణిబాబు గారు మీ బ్లాగు రెగ్యులర్ రీడర్స్లో నేను ఒకడిని….చదివి ఆనందిస్తాను..నాకు అలాంటి అనుభవాలు ఏమన్న వున్నయా అని అలోచిస్తాను…చాలా బాగా రాస్తారు మీరు…

  ఇక మొరిగే కుక్కల విషయానికి వస్తే వాటి పుట్టుకతో వచ్చే అలాంటి బుధ్ధులు చచ్చేదాకా పోవు..మీరు వాటి గురించి అలొచించి మీ సమయం వ్రుధా చెస్కోకండి..

  Like

 31. అందరినీ శ్రమ పెట్టినట్లున్నాను! పైటపా తరువాతి పరిణామాలను ఈవేళ్టి టపాలో వ్రాశాను.

  Like

 32. Phanibabugaaroo. Very late I have seen your post today. I am just shocked to see such attack on you, of all the people! That person deserves to be admitted into mental asylum immediately. Many people are writing the normal reaction, ignore him.

  Why such fellows should be ignored? There should be a way to punish such rogues.

  Like

 33. Why such fellows should be ignored? There should be a way to punish such rogues.
  _____________________________________________

  There is no way, unless that guy does something illegal. By getting into a fight with him, you are playing into his hands directly for he wants that kind of fight.

  Of course, if one has a vested interest in fights ( like me .. hehehe ) then sure one can go ahead :))

  Like

 34. sir, I am a regular reader of your blog…We learn a lot going through your experiences. Please dont stop and keep writing Reagrds Valli.

  Like

 35. ఫణి గారూ,నాకు తెలిసి స్పామ్ కామెంట్స్ ని ఫిల్టర్ చేసే సదుపాయం వర్డ్ ప్రెస్ లో ఉందండీ,ఇలాంటి చెత్త కామెంట్లని ఫిల్టర్ చెయ్యడానికి Akismet సదుపాయం ఉపయోగపడుతుందనుకుంటాను.

  ఇలాంటి వ్యాఖ్యల్ని మన అనుమతి లేకుండా ప్రచురించడానికి ప్రయత్నిస్తే బ్లాక్ చేసే సౌకర్యం ఉంది.

  మీరు ఒక సారి వర్డ్ ప్రెస్ డాట్ కామ్ హెల్ప్ ఫైల్స్ లో చూసి ఆ ఫిల్టర్ అప్లై చేస్తే ఇలాంటి దుష్ట కామెంట్స్ ని ఎదుర్కోవచ్చు.

  ప్రస్తుతానికి Akismet సదుపాయం వల్ల స్పామ్ కామెంట్స్ లేకుండా నా బ్లాగులో ప్రశాంతంగా నేను పోస్టింగులు రాసుకుంటున్నాను.మీరు ఇది కూడా ఒక సారి ప్రయత్నించి చూడండి.ఏదో నా చిన్ని బుర్రకి తోచిన చిన్ని సలహా ఇచ్చాను,ఇది వర్క్ ఔట్ అవ్వకపోతే ఆనక నన్ను తిట్టుకోకండేం! 🙂 🙂

  Like

 36. లేఖరీ,
  మీరు చెప్పింది రైటే. వర్డ్ ప్రెస్ లో unprintable comments డిలీట్ చేసే సదుపాయం ఉంది కాబట్టే వాటిని ప్రచురించి,మన బ్లాగు ప్రపంచాన్నీ పొల్యూట్ చేయలేదు.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: