బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-పూణె ఆంధ్ర సంఘం


    ఈవేళ శనివారం (02/10/2010) ప్రొద్దుట మా పూణె లోని ఆంధ్ర సంఘం వారు ఒక అద్భుతమైన కార్యక్రమము, ఓ అద్భుతమైన అనుభూతీ ఇచ్చారు.మా స్నేహితుడు శ్రీ నాగప్రసాద్ గారు క్రిందటి వారంలో చెప్పారు-అక్టోబరు 2 న శ్రీ సామవేదం షణ్ముఖశర్మగారిచే శ్రీలలితాసహస్రనామం మీద ఓ కార్యక్రమం ఉంటుందని,తప్పకుండా రావాలనీను.రాజమండ్రీ వెళ్ళినప్పటినుండీ, నాకు
ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలమీద కొద్దికొద్దిగా ఆసక్తి కలిగింది. ఆ తరువాత శ్రీ గరికపాటి వారి ప్రసంగం ప్రత్యక్షంగా వినడంతో పుర్తిగా Bowled over అయిపోయాను. ఆ తరువాత శ్రీ చాగంటి కోటేశ్వరరావుగారి ప్రవచనాలు అన్ని డౌన్లోడ్ చేసుకున్నాను.

   మరీ వాటిలోని గొప్పతనం అర్ధంఅవదు కానీ వింటున్నంతసేపూ, మరో లోకంలోకి వెళ్ళిపోతాను.వారు చెప్పేవిధానంలో ఉందేమో?ప్రతీరోజూ ఓ గంటసేపు వీటికే కేటాయిస్తున్నాను.మా ఇంటావిడకైతే అడగఖ్ఖర్లేదు. అమ్మవారి గురించి కార్యక్రమం ఏదైనా ఉందీ అంటే, అన్ని పనులూ మానుకుని, ఎంతదూరమైనా వెళ్తుంది.బహుశా తన పూజల్లోని పుణ్యమేమోనేమో, నన్ను, మాకుటుంబాన్నీ కాపాడుతోంది.

    ప్రొద్దుటే 10.00 గంటలకి వెళ్ళాము.ముందుగా ఉప్మా, కాఫీ తో ఆహ్వానించారు. ఆ తరువాత శ్రీ శర్మగారి ప్రవచనం ప్రారంభం అయింది. అద్భుతం!రెండున్నరగంటలపాటు ఎంతో బాగా చెప్పారు.మేము చేసికున్న అదృష్టం వలన అంత మంచి ప్రవచనం వినే భాగ్యం కలిగింది.

    ఆ తరువాత అందరికి ప్రసాదం రూపంలో పులిహోర, చక్రపొంగలీ, దధ్ధోజనం, ఓ కాజా ( కావలిసినంత), వచ్చినవారందరికీ ( ఓ నూట యాభై మందిదాకా ఉంటారు) పెట్టారు. అవికూడా ఎంత రుచిగా ఉన్నాయంటే, మనం పూణే లోనే ఉన్నామా, లేక ఆంధ్రప్రదేస్ లోని ఏ దేవాలయంలోని ప్రసాదాలా అన్నంత అద్భుతంగా!

    అప్పుడెప్పుడో ఉగాది సంబరాల్లో పెట్టిన ‘తెలుగు భోజనం’ గురించి వ్రాశాను. అందులో పేరులోతప్ప రుచిలో తెలుగుతనం కనిపించలేదు. కానీ ఈవేళ దానికి పూర్తిగా విరుధ్ధం. ప్రసాదాలకుండే రుచి పూర్తిగా అస్వాదించకలిగాము.
ఇటువంటి కార్యక్రమాలు మన ప్రాంతాల్లో తరచూ జరుగుతూంటాయి. కానీ రాష్ట్రేతర ప్రదేశాల్లో ఇంత అద్భుతమైన కార్యక్రమం చేసినందుకు పూణె ఆంధ్రసంఘం వారికి అబినందనలు

Advertisements

13 Responses

 1. దయచేసి శ్రీ చాగంటి కోటేశ్వరరావుగారి ప్రవచనాలు ఏ సైట్‌నుంచి డౌన్‌లోడ్‌ చేసుకున్నారో చెప్పండి

  Like

 2. ఈ విషయం ముందే తెలియజేస్తే నేనూ వచ్చేవాడ్ని కదండీ

  Like

 3. రహ్మానుద్దీన్,

  మీకు నా సెల్ నెంబరు ఇచ్చాను. మీకు టైమే ఉండడం లేదు, నాతో మాట్లాడడానికీ,లేదా మీ నెంబరు ఇవ్వడానికీను. మీకు ఎలా తెలియచేయగలిగిఉంటానో చెప్తారా?

  Like

 4. వజ్రం గారూ,,

  బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు http://pravachanam.com/ మరియుhttp://www.greatertelugu.com/telugu-books/Pravachanalu.htm,
  http://www.torrentreactor.net/torrents/4241460/Ramayanam-Pravachanam-chaganti-Koteswara-Rao. ల నుండి డౌన్ లోడ్ చేసికున్నాను.

  Like

 5. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు
  & పుస్తకాలు : http://www.srichaganti.net/

  Like

 6. మనవాణి,

  అద్భుతమైన లింకు ఇచ్చినందుకు ధన్యవాదములు.

  Like

 7. మీకు ఇక్కడ అన్ని ప్రవచనములు ఉంటాయి.

  http://srichaganti.net/

  Like

 8. చాగంటి కోటేశ్వరరావుగారి ఉపన్యాసం వింటుంటే మన మనసుకి ఎంత వేగం ఉందో తెలుస్తుందండి.

  Like

 9. చాగంటి కోటేశ్వర్రావుగారి వ్యాఖ్యానాలు కావాలంటే నాకు రాయండి నేనె ఫ్రీ గా సీడీ లు చెసి పంపిస్తాను.

  Like

 10. భవాని, దుర్గ,

  ధన్యవాదములు.

  Like

 11. బ్లాగ్ బాబ్జీ,

  మీరు చెప్పారుకదా అని ఒక మెయిలు పంపాను (mohit@gmail.com) ( మీరిచ్చినదే!). అరనిముషంలో బౌన్స్ అయి తిరిగి వచ్చేసింది! ఇలా అయితే ఎలాగండీ?

  Like

 12. తారా,

  థాంక్స్.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: