బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– సలహాలు…


    ప్రపంచంలో ఒక్క డాక్టర్లవద్దా, లాయర్లవద్దా సలహాలు తీసికోవాలంటే డబ్బు ఖర్చుపెట్టుకోవాలి.ఎందుకంటే ఆ సలహాలివ్వడం మీదే వాళ్ళ రోజెళ్తుంది కాబట్టి!క్లైంటులు లేకపోతే వాళ్ళ పని గోవిందా! మనం చూస్తూంటాము- ఏ కోర్టు/ రిజిస్టార్ ఆఫీసు కైనా వెళ్ళినప్పుడు, అక్కడ ఓ టేబిలూ, కుర్చీ,ఓ టైపుమిషనూ పెట్టుకుని, వాటిమీద ఓ గొడుగు పెట్టి కూర్చునే లాయర్లని.ఎవరైనా వెళ్ళేమంటే చాలు,ఈ లాయర్లు పరిగెత్తుకొచ్చేస్తారు! మనం ఏదైనా మర్డరు చేసినా సరే, ఓ స్టాంప్ పేపరుమీద, ఏవేవో టైపుచేసేసి, దాన్ని లోపలకి తీసికెళ్ళి జడ్జీ గారిచే సంతకం పెట్టించేసి, మన చేతిలో పెట్టేస్తాడు! దాన్ని ఎఫిడవిట్టో ఏదో అంటారుట! ఆ మధ్యన తెల్గీ ధర్మమా అని ఈ స్టాంపు పేపర్లలో కూడా నకిలీలొచ్చాయి, అది వేరేసంగతి.ఇళ్ళల్లో ఉండే లాయర్ల సంగతి ఇంకోలా ఉంటుంది. నాకోటి అర్ధం అవదు వీళ్ళకి ఇన్నిపేర్లెమిటండి బాబూ Advocate, Lawyer, Pleader అని.వీటికి అర్ధాలేమైనా వేరా? తెలిస్తే చెప్పండి.

    ఇంక డాక్టర్ల విషయానికొస్తే అడక్కండి- ఓ పేద్ద కాంప్లెక్స్ లో మన దేహానికి సంబంధించిన అన్ని పార్టులకీ వైద్యం చేసే డాక్టర్లకూ ఒక్కో కేబిన్ ఉంటుంది.మనకొచ్చిన రోగం ఏదైనా సరే, ఆ కాంప్లెక్స్ లో ఉండే అందరి డాక్టర్లదగ్గరకీ వెళ్ళి పరీక్షలు చేయించుకోవాల్సిందే! చివరకు మిగిలెది తడిపి మోపెడయ్యే ఖర్చు మాత్రమే! ఇన్నీ పూర్తయిన తరువాత మనం వెళ్ళిన మొదటి డాక్టరంటాడూ ‘I thought so..’ అని. ఆమాత్రం ముందరే తెలిస్తే, మనచేత ఇంత డబ్బు ఖర్చుపెట్టించడం ఎందుకో? ‘You scratch my back, I will scratch yours’ అని ఈ డాక్టర్లమధ్య ఉండే ‘gentleman’s agreement’ ధర్మమా అని మధ్యలో మనం నలిగిపోతాము!

    ఏ సి.ఏ. దగ్గరకో వెళ్తే, మనం కట్టవలసిన పన్నులూ, ఏవేవి ఎగ్గొట్టొచ్చో వగైరాలమీద సలహాలు దొరుకుతాయి.ఇంక అందరిలోకీ hi-fi వాళ్ళు psychiatrists. వీళ్ళు మనలోఉన్న సొ కాల్డ్ మానసిక సమస్యలు తీరుస్తారు. వీళ్ళ సంగతి అందరిలోకీ హాయి, మన సమస్యంతా విన్నతరువాత కౌన్సెలింగో ఏదో చేస్తారు. అది చివరకు solve అవకపోయినా ఎవరూ అడగలేరు, కారణం-‘నువ్వు నెను చెప్పినట్లు నీ ఆలొచనా పధ్ధతి మార్చుకోలేదూ’అని తీసిపారేస్తారు.అయినా ఫీజు లో రాయితీ ఏమీ ఇవ్వరండోయ్.ఇంక డెంటిస్టులు, మనం వెళ్ళగానే, మననోరు తెరిచేసి,ఓ సుత్తీ, ఉలీ పట్టుకుని,అమరశిల్పి జక్కన గారిలా, మన పళ్ళన్నింటిమీదా టక టకా కొట్టేసి, ఏదో ఒక వైద్యం చేస్తారు.
ఇలా ప్రతీ specialist ఏదో ఒకదానికి సలహా ఇస్తారు,

   ఇంతవరకూ బాగానే ఉంది,కొంతమందుంటారు ఎవడడిగినా అడక్కపోయినా సలహాలివ్వడమే ఓ hobby/ pastime గా పెట్టుకునేవారు.పాపం వాళ్ళు ఫీజేమీ పుచ్చుకోరు.అంతా ఉచితమే.ప్రపంచంలో ఉన్న ఏ సమస్యకైనా వారిదగ్గర ఓ solution ఉంటుంది. వినే ప్రాణి ఉండాలంతే.మనం చెప్పకపోయినా, మనకున్న సమస్య ఎలాగైనా మన నోటితోనే చెప్పించాలని విశ్వ ప్రయత్నం చేయడం వీరికి వెన్నతో పెట్టిన విద్య.మనం ఇంకా మాట్లాడకపోయేసరికి,ఇంక వాళ్ళే డైరెక్టుగా
టాపిక్కు లోకి వచ్చేస్తారు.వాళ్ళ అభిప్రాయాల్ని మనమీద సలహా రూపంలో రుద్దేస్తారు.

   నిన్న రాంగోపాల్ వర్మ మీద ఓ టపా వ్రాస్తూ, టి.వీ-9 వారి 30 Minutes ప్రోగ్రాం మిస్ అయ్యాను. ఈవేళ ప్రొద్దుట చూసే అదృష్టం కలిగింది. జోక్ ఏమిటంటే, నిన్న వర్మ చెప్పిన దానిమీద అభిప్రాయాలు చెప్పించిన ‘ఘనుల’ మీదే
‘బెజవాడ రౌడీలు’ అని ఓ కార్యక్రమం చేయడం
. టి.వి-9 చేస్తే రైటూనూ, వర్మ చేస్తానంటే తప్పూనా! ఇక్కడ చూపించిన ‘హిస్టరీ షీటర్ల'(సేం టు సేం) నే అభిప్రాయం అడగడం-really takes the cake! హాయిగా వీళ్ళదగ్గరున్న క్లిప్పింగులు అన్నీ వర్మకి ఇచ్చేస్తే అతనికేనా ఉపయోగపడతాయి!

Advertisements

6 Responses

 1. స్పెషలిస్ట్ ల గురించి బాగా రాసారు.డెంటిస్ట్ గురించి బాగా రాసారు. ఇంకా లక్ష్మి గారు చేయించుకున్న దంత చికిత్స మర్చిపోలేదన్నమాట 🙂

  Like

 2. మా బాగా చెప్పారు.

  Like

 3. ఋషీ,

  ఈ మధ్యనే జరిగిందిగా, అప్పుడే ఎలా మర్చిపోతాను?

  Like

 4. ఆవకాయా,
  ధన్యవాదాలు.

  Like

 5. బాబుగారూ!

  Advocate, Lawyer, Pleader–ఆమాత్రం తెలీదా?

  ళొ…ళొ…ళొ…సరదాకన్నాను–వీడేమిటీ పెద్ద ‘పుడింగ్’ (అంటే యేమిటో నాకూ తెలీదు–చిరంజీవి సినిమాల్లోకి మా వూరునించే ప్రవేశించిందీమాట.) లా చెపుతున్నాడు అనుకోకండి.

  మీరింకోటి మరిచిపోయారు–“వకీల్”. బ్రిటీష్ వాళ్ల కాలం లో కాస్త ఇంగ్లీష్ వచ్చినవాళ్లెవరైనా ఈ పరీక్ష వ్రాసి, వకీలు పట్టా పొందొచ్చు(ట).

  ప్లీడరు అంటే, మెట్రిక్ ప్యాసు అయ్యాక పరీక్షలకి కూర్చొని, ఈ పట్టా పొందవచ్చు(ట).

  లాయరు అంటే, డిగ్రీ పొంది వుండాలి–లా లో.

  యాడ్వొకేట్ అంటే, హైకోర్టులో కూడా ప్రాక్టీసు చెయ్యగలిగినవాళ్లకి ఇచ్చే డిగ్రీ.

  ఇప్పుడు, రెండేళ్ల, మూడేళ్ల, ఐదేళ్ల కోర్సులు యేవిచేసినా, నేరుగా యాడ్వొకేట్లు అయిపోతున్నారు. వకీలు, ప్లీడర్ పరీక్షలు లేనేలేవు.

  ఇంకా, వకీలు గుమాస్తా, ప్లీడారు గుమాస్తా లాంటి పరీక్షలు కూడా వుండేవట–అలాంటివాళ్లకి.

  అదీ సంగతి. నాకు తెలిసున్నది చెప్పాను. తప్పులుంటే యెవరైనా చెప్పవచ్చు మరి.

  డాక్టర్లకీ, డయాగ్నోస్టిక్ లకీ, మెడికల్ షాపులకీ, ఎం ఆర్ లకీ వుండే ‘అక్రమ సంబంధాలు ‘ అందరికీ తెలిసినవే!

  రాం గో వర్మ అంటేనే–రాంగ్ ఓ వర్మ కదా! ఇంకేమంటాం?

  Like

 6. కృష్ణశ్రీ గారూ,

  మీరు శ్రమతీసికుని అన్నిటినీ వివరించినందుకు ధన్యవాదాలు!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: