బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు- టైం పాస్


    పెద్ద చేయడానికి పనేం లేదు. మా అబ్బాయి online library లో చేర్పించడానికి, నాకు పరిచయం ఉన్న స్నేహితులదగ్గరకు వెళ్ళాను, మొన్న శనివారం.మనం అడగ్గానే చేరిపోతారా ఏమిటీ, ఎన్నెన్ని ఆలోచించాలో, ఈ లైబ్రరీ వాళ్ళు సరైనవారేనా, ఏమిటో మరీ తెలుగువాళ్ళైపోయారూ, నమ్మొచ్చా, వచ్చిన పెద్దాయన కబుర్లైతే బాగానే చెప్పాడూ, నిజంగానే మనం ఆ లైబ్రరీకి వెళ్ళఖ్ఖర్లేకుండా, పుస్తకాలు మన ఇంటికో ఆఫిసుకో తెచ్చి ఇస్తారా అంటూ.ఒకసారి చేరితేనే కదా తెలిసేది, మా మాటల్లో నిజాయితీ ఎంత ఉందో? ఇంతా చేస్తే నెలకి 150/- రూపాయలు మూడు పుస్తకాలు, దానికి కట్టే డిపాజిట్టు 500/- రూపాయలూ, ఎప్పుడు సభ్యత్వం మానేస్తే అప్పుడు చేతిలో పెడతాము.

   ఈవేళ ప్రొద్దుటే టి.వీ వార్తలు చూస్తూంటే, వాడెవడో రాజకీయనాయకుడిని నిన్న రాత్రి హత్య చేశారుట హైదరాబాదులో. ఇంకేముందీ టి.డి.పీ వాళ్ళందరూ వచ్చేసి, హమ్మొయ్ నాయనోయ్ దేశం తగలడిపోతోందీ, ఎవరికీ రక్షణలేదూ, హోం మంత్రి రాజీనామా చేయాలీ, మొన్నటికి మొన్న వాళ్ళెవరినో చంపేశారూ, వీళ్ళెవరినో చంపేశారూ, అసలు మన రాష్ట్రంలో ప్రభుత్వమనేది ఉందా,ప్రతిపక్ష నాయకులని చంపడం, పాలక వర్గం వారికి ఓ ఆట లా తయారయిందీ, వగైరా వగైరా...
మధ్యాన్నానికల్లా తేలింది, ఆ పోయినవాడికీ, ఇంకోడికీ ఎదో సెటిల్మెంటు వ్యవహారంలో మాటా మాటా వచ్చి, వీణ్ణి చంపేసి పోయాడని!సెటిల్మెంటులూ వగైరాలంటే ఈ హత్యచేయబడిన ఘనుడూ ఇదివరలో ఏవేవో వెధవ పనులు చేసినట్టే కదా, ఈ మాత్రందానికి, ఏదో అమాయకుడిని ప్రభుత్వమే పొట్టపెట్టుకున్నట్లుగా ఏడవడమెందుకూ? ఇలా ఊళ్ళో ఉండే history sheeters అందరూ, ఎవడెవడు ఎవడెవడిని చంపుతున్నారో చూడ్డమే ప్రభుత్వం బాధ్యతా?

   నాకోటి అర్ధం అవదూ, ఎక్కడ ఏ గొడవ జరిగినా, మన రాజకీయనాయకులు/రాళ్లు అంత ప్రొద్దుటే మేకప్పులు చేసికుని, టి.వీ.ల్లో స్టేట్మెంట్లు ఇవ్వడానికి ఎలా వచ్చేస్తారండి బాబూ? వీళ్ళకి ఇంకేమీ పనీపాటాలేదా?అవున్లెండి, వీళ్ళేమైనా మనలాగ పిల్లల్ని ముస్తాబు చేసి స్కూళ్ళకేమైనా పంపాలా ఏమిటీ, ట్రాఫిక్కు జామ్ములు దాటుకుంటూ ఆఫిసులకెళ్ళాలా.రాత్రంతా ‘ఇప్పుడే అందిన వార్తలూ’,’Just in’ ‘బ్రేకింగు న్యూసు’ ఉండనేఉంది చూస్తూ గడుపుతారనుకుంటాను, అందుకే తెల్లారేసరికి టి.వీ. స్టూడియోల్లో తయారు, మన ప్రాణాలు తీయడానికి!
రెండురోజులక్రితం విజయవాడలో అదేదో ‘సృష్టి’ట, బ్రహ్మదేవుడికి ప్రతిసృష్టి లా, ఆయన చేయడం మర్చిపోయినా,ఈ డాక్టర్లు ప్రతిసృష్టి కార్యక్రమంలో పడ్డారు.ఆ హాస్పిటల్ వాళ్ళకీ మన చానెల్ వాళ్ళకీ ఏదో ఇచ్చిపుచ్చుకోడాల్లో తేడా వచ్చిందనుకుంటాను, ఓ రోజంతా ఆ ‘సృష్టి’హాస్పిటల్ ని ఏకేశారు! మీకు గుర్తుండేఉండాలి, కొన్ని సంవత్సరాలక్రితం శ్రీ యండమూరి వీరేంద్రనాథ్, ’13-14-15′ అనే పేరుతో ఒక నవల వ్రాశారు,విజయవాడలో ఒక యదార్ధ సంఘటన ఆధారంగా. ఇదేమీ ఈవేళ కొత్తగా జరుగుతున్నదికాదు, దురదృష్టవశాత్తూ పిల్లలు లేనివారు, చేతిలో డబ్బుంటే ఇలాటివి ప్రయత్నిస్తారు.యోగం ఉందా ఫలితం ఉంటుంది. లేకపోతే, మన ప్రయత్నం మనం చేశామూ అనుకోవాలి.అప్పటికీ
ఆ హాస్పిటల్ వాళ్ళు మొత్తుకుంటూనే ఉన్నారు- మేమేమీ 100% సక్సెస్ ఉంటుందని చెప్పడం లేదూ-అని.అన్నిటికీ ఒప్పుకునే, వాళ్ళిచ్చిన కాగితాలమీద సంతకాలు పెట్టారూ, ఏదో చానెల్ వాళ్ళకీ, ఆ హాస్పిటల్ వాళ్ళకీ వచ్చిన గొడవల్లో, ఈ పేషంట్లందరూ రోడ్డెక్కారు.ఆ వ్యవహారం ఏదో సెటిల్ అయినట్లుంది, మళ్ళీ సృష్టి వ్యవహారం గురించి ఏమీ వినబడడం లేదు!

    ఎలాగైతేనేం సుప్రీం కోర్టు వాళ్ళు రంగంలోకి దిగి, రేపటినుండి, విచారణ మొదలెడతారుట, అయోధ్య వివాదం మీద తీర్పు పోస్ట్పోన్ చెయ్యాలాలేదా అని!ఎప్పటికి తేలుతుందో ఏమిటో? ఈ గొడవలన్నీ ప్రక్కన పెట్టి, ఆ సుప్రీం కోర్టు వాళ్ళే కేసును విచారించొచ్చుగా! అదేదో అత్తా కోడలూ యాయివారం బ్రాహ్మడి గొడవలా ఉంది!- ఒకసారి యాయివారం బ్రాహ్మడు, బిక్ష్క్షకొస్తే, కోడలు ఈ వేళ ఖాళీ లేదండీ, రేపు రండీ అందిట. పాపం ఆ బ్రాహ్మడు వెళ్తూంటే, చెరువులో స్నానం చేసి వస్తూన్న అత్తగారు కనిపించి, అదేమిటీ ఖాళీ చేతుల్తో వచ్చేస్తున్నారూ అంటే, ఆయన చెప్పాడుట ‘మీకోడలు పంపించేసిందీ’ అని. హాత్తెరీ అదెవరు మిమ్మల్ని పంపించేయడానికీ అని, తిరిగి ఆయన్ని తీసికెళ్ళిందిట. పోన్లే ఏమైనా ఇస్తుందేమో అనే ఆశతో ఆవిడతో వెళ్తే,లోపలికి వెళ్ళి బయటకు వచ్చి ‘ఏమనుకోకండీ, ఈవేళ చేయి ఖాళీ లేదూ, రేపు రండీ’ అందిట!ఇక్కడేమిటంటే protocolఅన్నమాట!
తొందరగా లీగల్ ఫార్మాలిటీస్ పూర్తిచేసి, ఏదో ఒక తీర్పిచ్చేస్తే, హాయిగా మనరాజకీయనాయకులు కూడా ఇంకో Issue పట్టుకోవచ్చు! ఏమిటో అలహాబాద్ హైకోర్టు వాళ్ళు తీర్పు చెప్పాలిట, అది నచ్చని పార్టీ సుప్రీం కోర్టుకెళ్తుందిట! ఇప్పటికే
ఆ లాయరు శాంతి భూషణ్, సుప్రీంకోర్టు గత 16 మంది ప్రధాన న్యాయమూర్తుల్లోనూ 8 మంది లంచగొండ్లూ, అని అననే అన్నాడు. అని ఊరుకోవచ్చా ఓ సీల్డ్ కవరులో 16 మంది పేర్లు వ్రాసి ఇప్పటి సి.జె కి ఇచ్చాడుట! కొట్టుకు ఛస్తున్నారు ఆ లిస్టులో ఎవడి పేరు వ్రాశాడో అని! మన రాజ్యాంగంలో ఉన్న హాయి ఇదే- ఎవడి నోటికొచ్చింది వాడు చెప్పొచ్చు, వాడేమీ ప్రూఫ్ ఇవ్వఖ్ఖర్లేదు. ఎవడిమీదైతే ఆరోపణ వచ్చిందో వాడు ఛస్తాడు, నేను నిరపరాధిని మొర్రో అని పృవ్ చేసికోడానికి! అది ఓ డొమెస్టిక్ టార్చరు కేసవచ్చు, లేక అట్రాసిటీ కేసవచ్చు, లేక లైంగిక వేధింపు కేసవచ్చు, ఏమైనా అంటే ‘సామాజిక న్యాయం’ అని ఓ high sounding పేరెట్టొచ్చు! मेरा भारत महान !!

Advertisements

12 Responses

 1. బావుందండి. చాలా మంది సామాన్య జనాల్లో ఉండే అనేక అసంతృప్తులని ఒక్క టపాలో ప్రతిబింబించారు.

  వేగంగా తీర్పులివ్వడం లేనప్పుడు ఒక రకంగా మొత్తం వ్యవస్థ, ధనవంతులకీ బలమైన వాళ్ళకీ అనుకూలంగా ఉన్నట్లే లెక్క.

  నాకో విషయం ఎప్పట్నుంచో సందేహం. కావలిసినంత discretionary power ఉన్నాకూడా పీనల్ కోడ్ ని మరీ ఏమాత్రం బుఱ్ఱ ఉపయోగించకుండా వాడే న్యాయ మూర్తుల్నీ ఎందుకని ఎవరూ ప్రశ్నించట్లేదని.

  Putting the proof of burden on the accused might be needed in the present context in some cases especially when the victims are too poor and weak to use the justice system.

  I think in stead of all these adjustments and confusion, it would be simple and just to make the recourse to Law cheaper and faster.

  Lets hope to see at least some politicians who will make these issues as the priority.

  Like

 2. మరీ అలా తీసి పారెయ్యకండి. ఆ డాక్టరమ్మ(సునంద) వేరే వూరిలో హాస్పిటల్ పెట్టి అక్కడ ఎవరో చనిపోతే, అక్కడ కొట్టు మూసేసి తన పేరు నమ్రత గా మార్చుకొని ఇక్కడ హాస్పిటల్ తెరిచింది అట. అల డాక్టర్స్ పేరు మార్చుకుంటే చట్టపరంగా ఏమి చెయ్యాలో ఎవరన్న డాక్టర్స్ చెబితే బాగుంటుంది మనకైతే తెలీదు. ఆ డాక్టర్ సీమ్స్ ఫిషి. రోజు ఛానల్ లో వెయ్యడానికి అదేమన్న భక్తి పురాణమా. మీడియా లో వచ్చిన తరువాతైన, పోలీసు, లా, మరియు సోషల్ వర్కేర్స్ ఫాలో అప్ చెయ్యాలి. ఏదన్న మంచి విషయం లేదా ప్రొగ్రెస్స్ ఉంటె మల్లి మీడియా ఉండనే ఉంది. ఊరకే వ్యతిరేక ధోరణి ఎందుకు అన్నింటి మీద

  Like

 3. వీకెండ్ పొలిటీషియన్,

  ధన్యవాదాలు. I still am very apprehensive with the present crop of politicians !

  Like

  • Sir,

   I share your apprehension and disappointment to a certain extent. However, I have hope in the good sense of our people and the collective wisdom of our society.

   What we need is a new crop of leaders who put more value in Truth and Justice than to political expediency. For that to emerge in my opinion only chance is for the decent folks to get involved in politics to the maximum extent possible.

   I believe we are getting there in about a decade from now. We all need to try and play our part during this time according to ones own intellect and energy.

   Like

 4. బాబీ,

  నా ఉద్దేశ్యం ఆ డాక్టరుని సమర్ధించడం కాదు. మన టి.వీ. చానెల్స్ కి సంబంధించినంతవరకూ, వాళ్ళకి ముట్టచెప్పేది ముట్టచెప్పకపోతే వాళ్ళు చేసే ప్రచారం గురించి. దీనికి సంబంధించి నేను ఒక టపా పెట్టాను,https://harephala.wordpress.com/2010/08/22/baataakhaani-303/ ఒకసారి చూడండి. ఈ మధ్యన కామన్వెల్తు గేమ్స్ గురించి ఇంకో పోస్టులో ఒక లింకిచ్చాను http://canarytrap.in/2010/08/26/cwg-kalmadi-indian-media-and-paid-news/.

  Like

 5. వీకెండ్ పొలిటీషియన్,

  నాకు కూడా మన యువతమిద నమ్మకం ఉంది. కానీ ఒక్కొక్కప్పుడు లాలూ ప్రసాదు లాటివారు వారి వారి కొదుకులని తమ రాజకీయ వారసులుగా పరిచయం చేసినప్పుడు, మన భవిష్యత్తు గురించి భయం వేస్తూంటుంది ! Pedigree also matters, don’t you agree?

  Like

 6. yes sir. I agree to a large extent. But I am betting on real drivers and leaders whether they have the pedigree or otherwise.

  apart from it our society is having too many Lalu’s, only the best of them are getting into leadership positions. As a collective we are getting better and will be seeing better politics.. at least in m life time 🙂

  Like

 7. వీకెండ్ పొలిటీషియన్,

  ” will be seeing better politics.. at least in m life time :)”
  అలా అన్నారు బాగుంది!

  Like

 8. Howdy there, are you getting troubles with all the internet hosting? I needed to refresh the page about enormous amount of instances to be able to get the web page to run!

  Like

 9. This is really a genuinely excellent go through for me, Should confess that you’re 1 of the most effective bloggers I ever saw.Thanks for posting this informative article.

  Like

 10. It? s the initial time I’ve heard that in Macedonia, obits are an strange observe. You’ve got wonderfully written the publish. I have liked your way of writing this. Thanks for sharing this.

  Like

 11. Greetings, this is really a truly absorbing Internet blog and I’ve cherished learning lots of in the content material and posts contained around the web site, keep up the exceptional operate and want to go through a great deal more stimulating articles inside the long term.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: