బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-ఏమైనా అనుకుంటారేమో-2


    కూతురూ, కొడుకూ ఒకే ఊళ్ళో ఉంటే వచ్చే సమస్యలు ఒకలా ఉంటాయి. అమ్మాయి పిల్లలతో ఎక్కువ టైము గడిపేస్తున్నామేమో ని కొడుకూ,కోడలూ, అస్సలు తనకీ, తన పిల్లలకీ టైము ఇవ్వడం లేదని కూతురూ అనుకుంటారేమో అని ఓ భయం! వాళ్ళు అలా అనుకోపోవచ్చుకూడానూ, అదంతా మన భ్రమైనా కావొచ్చు! వాళ్ళు వాళ్ళ పిల్లలతోనే గడపడానికి సమయం దొరకనప్పుడు, మనల్ని గురించి ఏం ఆలోచిస్తారూ? అయినా అలా అనుకోవడంలో ఓ ఆనందం!

   మనం ఎవరింటికైనా వెళ్ళాం అనుకోండి, వాళ్ళిచ్చే చాయో కాఫీలోనో అసలు పంచదార వేయకుండా ఇస్తారనుకుందాము వారికున్న సుగర్ కంప్లైంటు వలన, మనం పంచదార కావాలని అడిగితే ఏమైనా అనుకుంటారేమో!వాళ్ళనుకున్న లేకపోయినా ఇంటావిడ ( మనకి సంబంధించిన వారు), గయ్య్ మనొచ్చు, ‘ఏం ఒక్కరోజు పంచదార లేకపోతే ఏమైనా కొంప మునుగుతుందా, అలా లేకిగా అడిగితే వాళ్ళేమనుకుంటారూ’అని! ఈ చివాట్లు తినేకంటే, ఆ పంచదారలేని కాఫీయే బెటరు! ఏదో మందులా గుటుక్కుమని మింగేస్తే సరిపోతుంది!
మన అలవాటు ప్రకారం లొడలొడా మని వాగేస్తే ఏం అనుకుంటారో, అలాగని ఏం మాట్లాడకుండా ముంగిలా కూర్చున్నా కష్టమే! అటు తిప్పీ ఇటు తిప్పీ మనమీదకే వస్తుంది! ప్రాణం మీదకొచ్చినా సరే, టాయిలెట్టెక్కడ ఉందని ఛస్తే అడక్కూడదు, అడిగితే ఏమనుకుంటారో? మనం వెళ్ళేవారింట్లో పెద్దాళ్ళెవరైనా ఉంటే వాళ్ళకి పళ్ళూ, ఎంతమందుంటే అంతమందికీ ఏవో స్వీట్లూ తప్పనే తప్పవు, లేకపోతే ఏమైనా అనుకుంటే, అమ్మో!అంతదాకా ఎందుకూ ఏ పెళ్ళికైనా వెళ్తే చేతిలో పెట్టడానికి ఏదో ఒకటి కొని దాన్ని పెద్ద ప్యాకెట్లో పెట్టి ఇవ్వడమంత హాయి ఇంకోటుండదు,చవకలో తేలిపోతుంది.డబ్బులు ఎంతిచ్చినా ఓస్ ఇంతేనా అని అనుకుంటారేమో అని భయం!

   మనవడో మనవరాలో టి.వీ. పెట్టుకుని చూస్తూండగా, చానెల్ మారిస్తే పిల్లలేమనుకుంటారో అని భయం! బస్సుల్లోనూ, ట్రైన్లలోనూ ఖాళీ సీట్లున్నా కానీ, వాటిల్లో కూర్చోడానికి భయం, అప్పటికే ఆ సీట్లో కూర్చున్నవారేమనుకుంటారో? ఇంటావిడ, అప్పటిదాకా చీరలు కట్టి, సడెన్ గా డ్రెస్సుల్లోకి మారితే ఊళ్ళోవాళ్ళేమనుకుంటారో అని భయం. ముందురోజు విచిత్రంగా కనిపిస్తుంది, రెండో రోజునుండి అలవాటైపోతుంది! అసలు వాళ్ళు పట్టించుకోనేపోవచ్చు,అంతా మన భ్రమ!

    ప్రపంచంలో నూటికి తొంభై మంది ఊళ్ళోవాళ్ళగురించి పట్టించుకోరు, వాళ్ళిష్టంవచ్చినట్లు చేస్తారు. మనం చూస్తూంటాము, పార్కుల్లో వయస్సుతో ప్రమేయం లేకుండా, ఒకళ్ళనొకళ్ళు పెనవేసేసికుని.. మరీ అలాగ ఉండఖ్ఖర్లేదూ, ఆఖరికి 60 ఏళ్ళు దాటినతరువాత, మొగుడూ పెళ్ళాం దగ్గరగా కూర్చోడానికి కూడా భయ పడతారు, పిల్లలేమనుకుంటారో అని! మరీ ఇంత భయమైతే ఎలాగండి బాబూ?
ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని భయపడే సందర్భాలు నాకు గుర్తొచ్చినంతవరకూ వ్రాశాను. చాలామందికి ఇలాటి అనుభవాలు అయే ఉంటాయి. పాఠకులు వారి వారి అనుభవాలు హాయిగా అందరితోనూ పంచుకోండి. ఎవరూ ఏమీ అనుకోరు,అనుకున్నా వాళ్ళ ఖర్మ అని వదిలేయండి.
బై ద వే ‘కామన్వెల్త్ గేమ్స్ ‘ గురించి గత పదిరోజులుగా జరుగుతున్న గొడవమీద ఓ ఆర్టికల్ చదివాను. మీరూ చదవండి ఇక్కడ
.

Advertisements

6 Responses

 1. రోజూ మీ బ్లాగులు చదివి ఆనందిస్తూ, వ్యాఖ్యలు పెట్టకపోతే మీరేమైనా అనుకుంటున్నారేమో! ఇవాళ పెట్టేస్తున్నా – మీ ఆలోచనలు కొన్ని మా నాన్నగారివిలాగానే వుంటాయి.

  Like

 2. జేబీ,

  పోన్లెండి, ఏమైనా అనుకుంటానేమో అనుకునైనా ఓ వ్యాఖ్య పెట్టారు! మీ నాన్నగారి ఆలోచనల్లా ఉన్నాయని వ్యాఖ్య పెట్టారా లేక నిజంగా నచ్చుతున్నాయా! చెప్పండి ఏమీ అనుకోనులెండి!!!!

  Like

 3. నచ్చాయండి, మా నాన్నగారి ఆలోచనలు నాకిష్టం – అలాగే మీరు వ్రాసే కొన్ని.

  నాకు ‘గారు’, ‘అండి ‘ చేర్చవద్దని విజ్ఞప్తి.

  Like

 4. సరిపోయింది మీ టపా
  ఒకింత ఏదో ఒక నీటిని నేర్పుతూ మళ్ళీ దానికి హాస్యాన్ని సమపాళ్ళలో కలపటంలో మీరే సాటి

  Like

 5. రహ్మానుద్దీన్ షేక్,

  ధన్యవాదాలు.

  Like

 6. జేబీ,

  సరే నాయనా ‘అండీ’ ‘గారూ’ అనను !!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: