బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–టైంపాస్


    ఇన్నాళ్ళూ అనుకున్నాను, ఒక్క ఆంధ్రదేశంలోనే గందరగోళంగా ఉందని. చూస్తే దేశంలో అన్ని చోట్లా అలాగే ఉన్నట్లనిపిస్తోంది!Commonwealth Games చూస్తే, అసలు జరుగుతాయా లేదా అని అనుమానపడవలసిన పరిస్థితి! మనవాళ్ళకి ఎనిమిదేళ్ళనుండీ తెలుసు మనదేశంలో జరుగుతాయని. అయినా సరే చివరి నిమిషందాకా ఇంకా ఏవేవో చేయాలనే గోల!పోనీ ఆ చేసినవేమైనా బాగా ఉన్నాయా అంటే, ప్రతీదానికీ ఏదో ఒక గొడవే! ఒకచోట బ్రిడ్జి పడిపోయిందిట, ఈవేళ బాక్సింగ్ స్టేడియం లో సీలింగు పైపెచ్చు ఊడిపోయిందిట! అయినా సరే మన పాలకులు మాత్రం-nothing to worry.Its all minor mishaps.– అనే అంటున్నారు!పోయినవాళ్ళు ఆంఅద్మీ యేకదా, అదే ఏ రాజకీయనాయకుడికో దెబ్బ తగిలుంటే, దాన్ని సీరియస్సుగా తీసికునేవారేమో! ఒకళ్ళతరువాత ఇంకో గొప్ప గొప్ప ఆటగాళ్ళు, ఏదో కారణం చెప్పి ఈ క్రీడల్లో పాల్గొనకుండా తప్పించుకుంటున్నారు. అయినా సరే మా కల్మాడీ గారు మాత్రం
ఏం ఫరవాలేదూ అంటున్నారు! అప్పుడెప్పుడో మణి శంకరయ్యరు వీటన్నిటిగురించీ మాట్లాడేసరికి, కల్మాడీ కి పొడుచుకొచ్చింది! చివరికి మణి చెప్పిందే నిజం అయిందికదా!

    రేపో ఎల్లుండో రావణకాష్ఠలా మండుతున్న అయోధ్య రాం మందిరం గురించి, అలహాబాద్ హైకోర్టు నిర్ణయం చెప్తారుట.తీర్పు ఎలా వచ్చినా, సుప్రీంకోర్టు కి వెళ్తారుకదా, ఈ మాత్రందానికి ఎంత హడావిడి చేస్తున్నారో? మామూలు జనతా react అయినా అవకపోయినా, మన ప్రభుత్వం వారు మాత్రం ముందుగానే లేనిపోని గొడవ చేసేస్తున్నారు.దసరా దాకా ఇదో గొడవా! సుప్రీం కోర్టులో నిర్ణయం వచ్చేసరికి ఎంతలేదన్నా ఓ పది పదిహేనేళ్ళు పడుతుంది. ఇప్పటికే ఆ పిళ్ళై గారు చెప్పనే చెప్పారు-this is only a semifinal-అని! బీహారులో ఎన్నికల ప్రచారానికి, మోదీ వస్తే కాళ్ళిరక్కొడతామంటున్నాడు నితీష్ కుమార్! ఈ మధ్యన అతను తెలుగు పేపర్లు చదువుతున్నాడేమో అని అనుమానం వస్తోంది!

    ఆ మధ్యనెక్కడో చదివాను అపాంగో ఇంకెవడో గత చాలాకాలంగా అరుణాచల్ ముఖ్యమంత్రిగా ఉన్న ప్రబుధ్ధుడు, 1000 కోట్ల ధనాన్ని దుర్వినియోగం చేశాడని! ఇక్కడే అనిపిస్తుంది, ఈ విషయంలో మన ఆంధ్ర నేతలు ఎంత ఫాస్టో! ఆ మాత్రం వెయ్యికోట్లకి 16 ఏళ్ళా?అందుకే పట్టుబడ్డాడు.మనవాళ్ళు చూడండి ఇద్దరు నాయకులు కలిసి 15 ఏళ్ళల్లో లక్షలకోట్లు!అలా ఉండాలి!
మామూలుగా చిల్లర ఖర్చులకి తినే కుహనా రాజకీయనాయకులకి కొదవే లేదు!

    ఎన్ని చెప్పండి, దేశం మొత్తం అందరూ మనవాళ్ళనుంచి ఎంతో నేర్చుకోవాలి. ఇదివరకెప్పుడో లాలూ IIM లకెళ్ళి లెక్చర్లిచ్చాడు.అక్కడికి తానేదో పొడిచేసినట్లు, మమతమ్మ వచ్చి వాడు చేసిన ఘనకార్యాలన్నీ బయట పెట్టింది! నా సలహా ఏమిటంటే curriculam లో ఓ subject పెట్టాలి- తక్కువ సమయంలో బాగా డబ్బు చేసికోవడం ఎలా? రేపు రాష్ట్రవిభజన జరిగినతరువాత
కొంతమంది నాయకులు ఖాళీ గా ఉంటారుకదా, వారందరినీ faculty గా పెట్టేస్తే సరి! మళ్ళీ అక్కడ లోకల్ నాన్ లోకల్ అని ఉండకూడదమ్మా మరి!ఇప్పటికే మన టి.వీ -9 వారు అందరి జాతకాలూ చెప్పేస్తున్నారు ఈ విషయంలో!
జమ్మూ కాశ్మీరులో ఏదో పొడిచేద్దామని మొత్తం అన్ని పార్టీలవాళ్ళూ కట్ట కట్టుకుని వెళ్ళారు.అసలు ఏమయిందో, వీళ్ళేం ఉధ్ధరించారో ఎవరికీ తెలియదు! ఎవడిగోల వాడిదీ.ఈ లోపులో మన ఓదార్పు యాత్రలూ, చైతన్య యాత్రలూ as usual గా జరుగుతూనే ఉన్నాయి.ఎవడి నోటికొచ్చింది వాళ్ళు మాట్లాడుతున్నారు.ఆ మధ్యన ముఖ్యమంత్రిని మార్చొచ్చూ అని ఓ రూమరొచ్చింది.
ప్రతీవాడూ నేనంటే నేనని ముందుకొచ్చేశారు.ఏదో కాలక్షేపం!

    దేశం అంతా ఇలా అట్టుడుగిపోతూంటే మా ఇంటావిడ, హాయిగా వంటలు అందులోనూ మరాఠా వంటలు! గురించి వ్రాయడం, వాటిని ఈనాడు లో ప్రచురించడం! పాపం నాయుడుగారు చదివితే ఎంత బాధ పడిపోతారో? ఇంకా రెండు నెలలవలేదు, ఈ మరాఠీవాళ్ళు చావకొట్టి చెవులు మూసి మన నాయకుల్ని జైల్లో పెట్టి , వాళ్ళ వంటలగురించి వ్రాయడమా! మరీ నాయుడిగారి ఆత్మగౌరవం దెబ్బతినేయదూ! ఏమిటో మాయ! ఊరికే అన్నాన్లెండి, మహారాష్ట్రలో సామాన్య తెలుగు ప్రజానీకానికి వచ్చిన గొడవేమీ లేదు. హాయిగా ఉన్నాము.అందుకే అప్పుడప్పుడు వీళ్ళ వంటలు వండుతూంటుంది, ఎప్పుడైనా కందా బచ్చలీనూ! ఎప్పుడో మరాఠీ పేపర్లలో కందాబచ్చలి గురించి వ్రాసినా వ్రాయొచ్చు!!

Advertisements

4 Responses

 1. >>మోదీ వస్తే కాళ్ళిరక్కొడతామంటున్నాడు నితీష్ కుమార్! ఈ మధ్యన అతను తెలుగు పేపర్లు చదువుతున్నాడేమో అని అనుమానం వస్తోంది!
  :))

  Like

 2. This is a good one. There is a rumour that Kalmadi wanted to hang himself but was saved because the food bridge on which he was supposed to walk on had collapsed and the ceiling from which he wanted to hang himself has followed suit. He is not an aam aadmi so he gets saved.
  Here are some apt movie titles for people and situations…..
  Evari gola vadidi-Andhra politics
  Jaane bhi do na yaroo-CWG
  Ghulam-Dr. Manmohan Singh
  Jeevana Tarangallu title song-Coalition govt
  “Papam” pasivadu-Jagan
  Khel Khel Mein- S.P. Rathore
  Achyut Kanya-Mayawati
  And the list goes on……

  Like

 3. Shyamala,

  Thanks.Liked your take on Movie titles! By the way I gave a
  link on Commonwealth Games in my post today.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: