బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– అలవాట్లో పొరపాట్లు!


ఈ వేళ సాయంత్రం ఏమీ పనీ పాటా లేకపోవడంతో, మా స్నేహితుల ఇంటికి వెళ్దామని ఫోను చేసి వెళ్ళాము. ఫోను చేయకుండా వెళ్తే వారుంటారో లేదో తెలియదుకదా!వారు ఈ మధ్యన అమర్ నాథ్ యాత్ర చేసొచ్చారు. మనం ఎలాగూ వెళ్ళలేకపోతున్నామూ, పోనీ యాత్ర చేసొచ్చినవారి దర్శనం చేసికుంటే పుణ్యమైనా వస్తుందీ అనుకుని. మేం వెళ్ళగానే, ఆవిడ మంచినీళ్ళూ అవీ ఇచ్చారు.ఆయన లోపల దేముడికి దీపం పెట్టుకుంటున్నారుట. సరే అని కూర్చున్నాము. ఇంతట్లో కర్టెన్ తీసికుని ఎవరో వస్తుంటే, ఆయనే వస్తూన్నారనుకుని లేచి నిలబడి ‘ నమస్కారం’ అంటూంటే, తెలిసింది, వచ్చింది ఆయన కాదనీ, వాళ్ళింట్లో పనిమనిషనీ ! నాకేం తెలుసూ! మా ఇంటావిడా, మేం ఎవరింటికి వెళ్ళామో ఆవిడా ఒకటే నవ్వు! అలాటివి జరుగుతూనే ఉంటాయి. ఆమాత్రానికే అలా నవ్వేయాలా? ఏమిటో వాళ్ళెవరికీ అలా ఎప్పుడూ అవలేనట్లుగా!

ఈ విషయం చూసి, ఆవిడకూడా ఒక సంగతి చెప్పారు- మేము వస్తామని ఫోను చేశాముగా, కొద్దిసేపట్లో ఎవరో బెల్లు కొట్టేటప్పటికి, మేమే వచ్చేమనీనుకుని,వాళ్ళాయనతో ‘ఫణిబాబు గారూ భార్యా వస్తామన్నారు, వచ్చినట్లున్నారు, తలుపు తీయండి’ అన్నారుట. తీరా ఆయన తలుపు తెరిస్తే పనిమనిషిట! అలాగే ఈవిడకూడా, మామూలుగా పనిమనిషొచ్చే తైముకి బెల్లు మోగితే, తనే వచ్చిందని తలుపుతీసి పక్కగా నిలబడితే, ఆ వచ్చినావిడ ఎవరో ఫ్రెండుట! ఇలాటివన్నీ జరుగుతూనే ఉంటాయి.

ఎప్పుడో చాలా కాలం క్రిందట, ఓసారి మాఫ్రెండింటికి వెళ్ళాను, అతని భార్య కష్మీరీ. మామూలుగానే ఆ ప్రాంతం నుండి వచ్చిన వారందరూ చాలా ఫెయిర్ గా ఉంటారు, అందులోనూ ఆడవారు మరీనూ.ఇంతలో ఒకావిడ ట్రే లో మంచినీళ్లు
తెచ్చారు. చాలా ఫెయిరు గా ఉంది. ఆవిడే మాఫ్రెండు భార్యేమో అని नमस्तॅ भाभीजी అన్నాను! మా ఫ్రెండు ఒకటే నవ్వు– मेरा बीबी नही। वॉ हमारा काम्वाली मेयिड् అని! నాకేం తెలుసూ, వాళ్ళకి పెళ్ళిళ్ళతో కూతురుతో ఇలా మెయిడ్లు కూడా పంపుతారనిన్నూ, వాళ్ళుకూడా అంత అందంగా ఉంటారనిన్నూ! ఏమిటో, మళ్ళీ జీవితంలో ఎవరినీ నమస్తే భాభీజీ అనలేదు!

నా మరదలికి ఇక్కడి కమాండ్ హాస్పిటల్లో 1975 లో ఆపరేషన్ చేయించాము. మా ఇంటావిడకి ప్రతీ రోజూ, మా అమ్మాయితో వాళ్ళ చెల్లెల్ని చూడ్డం పడేదికాదు. దాంతో నేనే ఫాక్టరీ నుంచి వెళ్ళి ప్రతీ రోజూ చూసొచ్చేవాడిని. ఆ రోజుల్లో
డక్ బ్యాక్ వారి రెయిన్ కోట్లొచ్చేవి ( పోలీసులు వేసికుంటారే అలాటివన్నమాట), ఓసారి వర్షం వస్తూంటే, నేను అది వేసికుని హాస్పిటల్ కి వెళ్ళాను. మా మరదలు, నన్ను ఆ వేషంలో చూసి గుర్తుపట్టలేక, కల్నల్ (డాక్టరు) గారే వచ్చారనుకుని, నమస్తే సార్ అంది. తీరా చూస్తే నేను! ఏదో తప్పుచేసెసినంత బాధ పడిపోయింది! నేనైతే నమస్కారం పెట్టకూడదా? ఏమిటో.ఇప్పటికీ,35 ఏళ్ళ తరువాత కూడా అక్కచెల్లెళ్ళు అది తల్చుకున్నప్పుడల్లా పడి పడి నవ్వుకుంటారు.వేషాలు కాకపోతే ఏమిటంట ?

ఇప్పటికీ రోడ్డుమీదనుండి వెళ్ళేటప్పుడు చూస్తూంటాము Hands free ఫోన్లలో మాట్లాడుతూండడం, అదేమిటో మనల్ని పలకరిస్తున్నారేమో అనుకుని, మనం కూడా వాళ్ళని చూసి ఓ వెర్రినవ్వొకటి నవ్వడం! తీరా చూస్తే వాళ్ళ రంధిలో వాళ్ళుంటారు! అలాగే రోడ్డుమీదెళ్ళే ఏ మనిషో మనకి తెలిసినవాడనుకుని, వాణ్ణి చూడగానే, ఓసారి విష్ చేద్దామని చెయ్యెత్తడం, తీరా వాడు మనల్ని పట్టించుకోపోతే, ఆ యెత్తిన చేతిని, ఏదో జుట్టుసవిరించుకున్నట్లుగా మార్చేయడం!

Advertisements

5 Responses

 1. huhha ha

  Like

 2. Laksmi garu postu adirindi.

  Like

 3. సుజాతా,
  థాంక్స్. మా ఇంటావిడ పోస్టు అదురుతూనే ఉంటుంది. మీలాటివారందరూ ఇలాటి వ్యాఖ్యలు పెడితే ఇంకా అదరగొట్టేస్తుంది!

  Like

 4. Chala baagundi meeru raasina vidham.

  Like

 5. ఉష గారూ,

  ఎప్పుడో రెండేళ్ళ క్రితం వ్రాసిన టపా, చదివి స్పందించినందుకు ధన్యవాదాలు…

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: