బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు- కిలం పట్టేసిన శ్రీవారి స్వర్ణరథం


    శ్రీవెంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు ఈ నెలలో జరుగుతాయని, ఎప్పటినుంచో అందరికీ, ముఖ్యంగా తి.తి.దే వారికి తెలుసును కదా,అన్ని వ్యవహారాలూ సరీగ్గా చూడాలని ఆమాత్రం తెలియదా వాళ్ళకి? ఈ సాయంత్రం స్వామివారిని స్వర్ణరథం లో ఊరేగించాలి. తీరా ప్రొద్దుట చూస్తే కనిపించేదిమిటీ, ఆ రథానికి ( వాళ్ళేమో అది స్వర్ణరథం అంటారు) కిలం పట్టినట్లుగా, నీలం రంగు ప్యాచ్చీలు చాలా చోట్ల కనిపించింది. బంగారానికి కిలం పడుతుందని ఈవేళే తెలిసింది! అదేమీ రాత్రికి రాత్రయింది కాదు. ఎన్నో ఏళ్ళనుండి జరుగుతూ, వాళ్ళ ఖర్మం కాలి ఈవేళ బయట పడింది! ప్రొద్దుటేమో, ఊరేగింపు జరుగుతూండగా, ఓ పూజారి నిద్రొచ్చి తూలాడేమో, స్వామి వారి ఛత్రం కాస్తా క్రిందికి ఒరిగిపోయింది. వాళ్ళకి జీతాలిచ్చేది,ఇవన్నీ సరీగ్గా చూసుకోమనే కదా, మరేం చేస్తున్నట్లూ?

   పాపం సారా కింగుని తీసేసి అదేదో Specified authority యో సింగినాదమో పెట్టారు. వాళ్ళు పది రోజుల్నుండీ ఒకటే ఘోష పెడుతున్నారు, ‘మీ భవిష్యత్తు కార్యక్రమా లేమిటీ’ అని అడగడం తరవాయి, ‘ఇదిగో బ్రహ్మోత్సవాల తరువాత ప్రకటిస్తామూ’ అంటూ. దానర్ధం బ్రహ్మోత్సవాలకి అన్ని సరీగ్గా చేయాలనే కదా! ఆయనకి నోరు లేదూ, ఎలా చేసినా అడగడూ అనేకదా ధైర్యం? ముత్యాల హారాల బదులు పువ్వుల దండలు.ఆదికేశవనాయుడు ముత్యాలు అన్నీ మూటకట్టుకు తీసికుపోయాడా ఏమిటీ? అంతకు తగ్గవాడే! ఇంకోడు రెండు మూడు రోజులు తిండి మానేసి, ఉపోషం చేస్తే, పాపం ఎవరూ (ఆఖరికి మన టి.వీ.వాళ్ళు కూడా) పట్టించుకోనే లేదు. చివరకి ఎక్కడినుంచో ఓ స్వాములార్ని తెచ్చి, లింబూ పానీ ఇప్పించారు!

   అక్కడి వారందరూ ఏదో తమ తమ జేబుల్లోంచి డబ్బు ఖర్చుపెట్టేసి, బ్రహ్మోత్సవాలు చేస్తున్నంత బిల్డప్ ఇచ్చేస్తున్నారు.అక్కడ ఉండేదంతా ఆ స్వామివారిమీదుండే భక్తితో, మనందరమూ హుండీలో వేసిన కానుకలే. వాటిని కూడా సరీగ్గా మానేజ్ చేయలేనంత దరిద్రుల్ని మన ప్రభుత్వం అక్కడ పెడుతూంటుంది. పోనీ ఏ స్వాములార్నైనా సలహా అడుగుదామన్నా, ఒక్కరికీ నైతిక విలువలున్నట్లు కనిపించదు.అసలు ఓ మాట చెప్పండి-ఆ రమణదీక్షితులో ఎవరో ప్రధాన అర్చకుడుట, ఆయనకిచ్చిన విధులు సరీగ్గా నిర్వహించుకోక, అదేదో పత్రిక స్వాతి లో ‘విన్నపాలు వినవలె’ అనే శీర్షికలో ప్రశ్నలకి సమాధానాలివ్వడం అంత అవసరమా? ఏదో ఆ పత్రిక వాళ్ళిచ్చే పారితోషికానిక్కాపోతే? తి.తి.దే వారు ఆయనకి జీతం బత్తెం ఇస్తున్నారుగా, మళ్ళీ ఈ పైసంపాదనలెందుకూ? రిటైరయిన తరువాత వ్రాసుకోవచ్చుగా? ఈ మధ్యనెక్కడో ఈ రమణ దీక్షితులు గారు, ఓ కెమేరా తీసికుని ఫొటోలు తీయడం ఓటీ.రిటైరయిన తరువాత కావలిసినంత టైము దొరుకుతుంది ఈ పన్లన్నీ చేసికోడానికి. జీతం మాట దేముడెరుగు, ఆయన ప్రధానార్చకుడిగా ఇవన్నీ అంటే ఛత్రం పట్టుకునే పూజారి నిద్రపోకుండానూ,స్వామివారి స్వర్ణరథం కిలం పట్టకుండానూ,ముత్యాల దండలు సరీగ్గా ఉండేటట్లు చూసుకోవడమూ వారి విధుల్లోకి రాకపోయినా, ఆ శ్రీవారిమీదుండే భక్తి, శ్రధ్ధ (అసలంటూ ఉంటే) కారణం చేతైనా ఒకసారి చూసుండొచ్చు.అబ్బే, ఏమైనా అడిగితే అవన్నీ చూసుకునేది ఇంకో విభాగం అంటూ ఇంకోడిమీద పెడతారు.

    ఈ దరిద్రపు రాజకీయనాయకులకి ఓ employment source కింద తయారైనప్పటినుండీ అక్కడి వ్యవస్థ భ్రష్టు పడిపోయింది. ప్రతీ వాడూ టి.వీ.ల్లో కనిపిద్దామనే యావ తప్పించి, అక్కడ స్వామి సేవ చేద్దామనే తపన ఒక్కడిలోనూ కనిపించదు. 1953 లో మద్రాసు రాష్ట్ర విభజన జరిగినప్పుడు, అరవ్వాళ్ళు తిరుపతి ఇచ్చేయమంటే, పేద్ద గొప్పగా కాదూ కూడదన్నారు. అలా చేసినా ఈ రోజు ఇలాటి దుస్థితి ఉండేది కాదేమో. డి.ఎం.కే వారికి ఎంత దేముడిమీద నమ్మకం లేకపోయినా, తమిళనాడులో చూడండి, దేవాలయాలన్నీ ఎంత బాగా మానేజ్ చేస్తారో? ఎక్కడా ఎటువంటి స్కాండల్/ స్కాం గురించీ వినము. ఇక్కడ మనవాళ్ళో, ఏ దేవస్థానం తీసికోండి ప్రతీ చోటా ఏదో ఒకటి వింటూనే ఉంటాము. మన రాజకీయ నాయకులకి తేరగా దొరికేది ఆ దేముడే! పాపం అడగడానికి నోరులేదూ, అడిగేవాడెవడూ లేడు,అంతా మనదే రాజ్యం. దేముడిమీద నమ్మకం ఉందా లేదా అని కాదు ప్రశ్న, ఉన్నవాళ్ళ నమ్మకం వమ్ము చేయకూడదని ఈ దౌర్భాగ్యులకి ఎప్పుడు తడుతుంది?
ఈవేళ అదేదో చానెల్ లో తిరుపతి లో ఉన్న ఖాళీ పోలీసు స్టేషన్లు చూపించారు. అది కొసమెరుపు!

Advertisements

4 Responses

 1. వస్తూందిలెండి–వీళ్లందరికీ ఓ రోజు!

  (మధ్యలో నా శాపాన్ని డిలీట్ చేశాను–ఆ పాపం నాకెందుకని!)

  కొంచెం అటూ-ఇటూగా!

  Like

 2. కృష్ణశ్రీ గారూ,

  ఆ రోజుకై ఎదురుచూద్దాము.

  Like

 3. మొత్తం వ్యవస్థలో దరిద్రాలన్నింటినీ ఒకే ఒక్క టపాలో చాలా సరళంగా ప్రతిబింబించారు. ఒక్క దేలాలయాలనేముంది లేండి ప్రతి చోటా ఇదే తంతు. అస్సలు జవాబుదారీ తనం అనేది మచ్చుకు కూడా కనిపించట్లేదు.

  Like

 4. వీకెండ్ పొలిటీషియన్,

  యథారాజా తథా ప్రజా !

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: