బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-దంత వైద్యం-2


    సాయంత్రానికల్లా ఆ డాక్టరుగారిచ్చిన sedative ప్రభావం తగ్గిపోయి,నొప్పి మొదలెట్టింది, ఓ రెండు గంటలసేపు అక్కడంతా gardening చేశాడుగా! ఏవో మందులూ, మాకులూ ఇచ్చారు కానీ నొప్పుంటుందిగా!అప్పటికి అనుకుంది హాయిగా మీరు చెప్పినట్లే తీయించుకోనైనా చేయవలసింది అని.ఇంతట్లో, మా చుట్టం ఒకాయనొచ్చారు, ఆయనకూడా ఇలాటి ‘కాలవ’ మరమ్మత్తులు చేయించుకున్నారు. ఆయనకి 70 ఏళ్ళవయస్సుంటుంది. ఆయన చెప్పిన ధైర్యంతో మొత్తానికి కోలుకుంది!

   మర్నాడు మళ్ళీ రెండో రోజు,ఆ సూదులూ, బుల్లద్దం, x-ray డోస్ రిపీట్. నొక్కినప్పుడల్లా just two minutes అదేదో 2 minute noodle ad. లాగ ఆయన అనడం, ఈవిడ ఆహా ఓహో అనడం. అదేమైనా 2 నిమిషాల్లో అవుతుందా? ఏమిటో ఈ వ్యవహారం అంతా చూసి చూసి, అమ్మయ్య నేనెంత మంచి పనిచేశానో అనిపించింది. పళ్ళంటూ ఉంటేనే కదా ఈ గోలంతా! నాకు మాత్రం మా ఇంటావిడకున్నంత సహనమూ, ఓపికా మాత్రం లేవు! ఆ x-ray తీసినప్పుడు మరీనూ, నోరు మూయకుండా అదేదో పెట్టేయడం!ఎన్ని సార్లు నోరు తెరిపించి ఉంచారంటే, అసలు ఈవిడకి నోరు అప్పుడప్పుడు మూయాలని గుర్తుంటుందా అనిపించేలా! ఆ పొడిచిన దంతానికి, సిమెంటు లాటిదేదో పూసి, ఆ నొప్పి తగ్గిన తరువాత రమ్మన్నారు. ఇంక ఈవిడ తినేటప్పుడు, ఆ వైపు తింటే ఆ పెట్టిన సిమ్మెంటూడిపోతుందేమో అని రెండో వైపు తినడం! ఓ నాలుగు రోజులు మొత్తానికీ భాగవతం అంతా అయిన తరువాత, మళ్ళీ టెస్టింగూ.

    ఆ నొప్పీ అదీ తగ్గిన తరువాత, మళ్ళీ సిమెంటు పెట్టి సీలు చేసేసి, ఆ దంతం చుట్టూ కందకంలాటిదోటి తవ్వేసి ( క్యాప్పు పెట్టడానికిట!) పంపేశారు.మొన్న వెళ్ళినప్పుడు మొత్తానికి ఆ మెటల్ క్యాప్పోటి పెట్టారు.అది కూడా పూర్తిగా పట్టకపోయేసరికి, మళ్ళీ దాన్ని తీయడం, నొక్కడం, సర్దడం-శంకరాభరణం గళ్ళనుడికట్టూ, కోడిహళ్ళ మురళీ మోహన్ గారి గడి లో అక్షరాలు సర్దినట్లుగా!!మొత్తానికి మా ఇంటావిడ రూట్ కెనాలింగ్ విజయవంతంగా ముగిసింది.మొదటిరోజు, పళ్ళు కొరికేమంటాము అలాగ దవడలు కలిసినప్పుడు అదేదో చప్పుడౌతోందీ అంటోంది.రెండో రోజుకి అన్నీ సర్దుకున్నాయి. తిరిగి నెలన్నరయిన తరువాత మళ్ళీ రమ్మన్నారు, ఇంకో దంతానికి చేయాలిట వైద్యం!
అంతా అయిన తరువాత అడిగాను ఆయన్ని, మీరెప్పుడైనా పళ్ళు పీకించికున్నారా అని,అంటే ఆయనన్నాడు, నా జ్ఞానదంతాలు తీయించుకున్నానూ అని! పీకడం కాబట్టి ఓ ఇంజెక్షను ఇస్తే ఓ సారి నొప్పెడుతుంది, ఆ దంతం కాస్తా పీకేస్తారు
కానీ ఈ రూట్ కెనాలింగూ అవీ చేస్తే కష్టం కాదండీ? పాపం ఎంతలా ఓర్చుకుందో!పొన్లెండి, మళ్ళీ నొప్పీ అంటూ గోల పెట్టదు!

Advertisements

2 Responses

 1. బాబుగారూ!

  మీరు మరీ అంతయితే యెలాగ!

  నేను 2000 సంవత్సరం లో నా ముందు పై పళ్లు మూడింటికి రూట్ కెనాల్ చేయించుకున్నాను–మావూళ్లో అప్పుడే కొత్తగా ప్రాక్టీసు పెట్టి, లేటేస్ట్ పరికరాలతో వైద్యం చేసే దంతవైద్యుడి దగ్గర. (అయన తండ్రికూడా పాతకాలం దంతవైద్యుడే).

  అసలు నొప్పి అనేది లేదు. రెండు పళ్లకి పూర్తిగా సక్సెస్ అయ్యింది. మూడోదానికి ఆ కెనాల్ సరిగ్గా పూడలేదు–అప్పుడప్పుడూ యేడిపిస్తూంటుంది. అశ్రధ్ధ నాదే–మళ్లీ ఆయనదగ్గరికి వెళ్లలేదు.

  అంతేకాదు–మన పళ్లు సూదిగా బ్లేడుల్లా అరిగిపోయి, నిద్రలో మన నాలుకనీ, దౌడల్నీ కోసేస్తూ వుంటాయి! (మీరు పళ్లున్నప్పుడు అనుభవించారోలేదో గుర్తుచేసుకోండి). వాటిని కూడా ‘బర్సర్ ‘ అనే ఆయుధం తో కొద్దిగా అరగదీసి, సూదిగా కాకుండా చేశేశాడు.

  మా ఆవిడకి కూడా పిప్పి పళ్లు వున్నాయి. యెంతో ప్రయత్నించాను–అసలు నెప్పి వుండదూ, నేను చేయించుకోలేదా, నువ్వుకూడా చేయించుకో అని చెప్పి–ఇప్పటికీ ససేమిరా అంటుంది!

  అన్నట్టు, మీ బ్లాగు గురించి చాన్నాళ్లక్రితమే నేను ఓ టపా వ్రాశాను. ఓ సారి తిలకించండి.

  http://amtaryalu.blogspot.com/2010/08/2.html

  ఇక, అక్కయ్యగారి బ్లాగు వెతుక్కోడానికి సమయం పడుతూంది–కాస్త ఓ లింకుని ప్రసాదించరూ!

  Like

 2. కృష్ణశ్రీ గారూ,

  మీరు మరీ నాబ్లాగు మీద ఒక టపా ప్రత్యేకంగా వ్రాయడం చూసి ఎంతో సంతోషించాను. మీరు ఇచ్చిన సూచనలు పాటిస్తున్నాననే అనుకుంటున్నాను.మీరన్నట్లుగా రోజుకో టపా చొప్పున వ్రాయడం ఓ అలవాటైపోయింది.ఈ ఏణ్ణర్ధంలోనూ 400 పైగా వ్రాశాను. మరీ బోరుకొట్టడంలేదనే అనుకుంటున్నాను. మా ఇంటావిడ బ్లాగు http://bsuryalakshmi.blogspot.com/.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: