బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– దంత వైద్యం


    మా ఇంటావిడకి అప్పుడప్పుడు పంటినొప్పి వస్తూంటుందని అంటూంటుంది. అప్పుడప్పుడేమిటిలెండి, నెలలో పాపం ఓ పదిరోజులు బాధ పడుతూనే ఉంటుంది. నేను ఏమయినా అంటే, ‘నా బాధ మీకేం తెలుస్తుందీ, పళ్ళుంటేనే కదా!’ అని ఓ రిటార్టొకటీ మధ్యలో.అస్తమానూ గుర్తుచేయడం ఎందుకో? ‘ఇంటాయనకి అసలు ధ్యాసే లేదూ, నేనేమైపోయినా’ అనుకుని,మా అబ్బాయిని తీసికెళ్ళి ఓ dentist దగ్గరకు వెళ్ళింది.ఆ కుర్రడాక్టరు ఈవిడని చూసి అన్నాడూ’ आंटी जी, ये उमर मॅ आप्की दांत इत्नी मज्बूत है। इस्कॉ बचानॅकॅलियॅ खॉशिश करॅगॅ!'( మీకీ వయస్సులో దంతాలు ఇంత గట్టిగా ఉన్నాయంటే really great, వాటిని పీకేయడం ఎంతసేపూ, కానీ దాన్ని సేవ్ చేద్దామూ) అని ఓ standard dialogue చెప్పేశాడు.ప్రతీ dentist చెప్పే డయలాగ్గిదే. పైగా వయస్సూ, దంతాల ప్రసక్తొచ్చేటప్పటికి, ప్రతీవారూ tempt అవుతారు! మొత్తానికి ఈవిడకి root canal చేయడానికి ఒప్పించేశాడు! పుత్రప్రేమా, అభిమానంతో మావాడి మాట కాదనలేక ఈవిడ ఒప్పేసికుంది.కాదంటే పాపం వాడేమనుకుంటాడో అని!వాడుకూడా, ఆహా మా మాతృశ్రీ ఇంకా కొంతకాలం, తనకి కావలిసినవి తృప్తిగా తినొచ్చుకదా అని సంతోష పడిపోయాడు! తన tenderleaves.com హడావిడిలో ఉండి, మా ఇంటావిడని ఆ dentist దగ్గరకు తీసికెళ్ళే కార్యక్రమం నాకప్పచెప్పాడు.

నాకేమీ మునిగిపోయేటంత రాచకార్యాలేముంటాయి,సరే ఇదో కాలక్షేపం, పైగా ఈ dentist లను చూసి అప్పుడే పదేళ్ళవుతోందీ, అని మా ఇంటావిడని ఆ రూట్ కెనాలింగో, సూయజ్ కెనాలింగో అదేదో చేయించడానికి నేనూ వెళ్ళాను.
ముందుగా, ఆయనచేయబోయే వైద్యం, అలా చేస్తే ఎంతకాలం నిలుస్తుందీ,వగైరా వగైరా.. పెద్దమనిషి తరహాలో అడిగాను.పాపం ఆ డాక్టరుకూడా ఓపిగ్గా, అవేవో x-ray film strips అవీ చూపించి, తను ఇప్పటిదాకా ఎన్ని చేశాడో, వాళ్ళందరూ ఎంతలా సుఖపడిపోతున్నారో వగైరాలమీద ఓ చిన్నపాటి లెక్చరిచ్చేశాడు.అది అతని పనీ.పైగా మనిషికి దంతాలు, పళ్ళూ ఎంత ముఖ్యమైనవో, వాటిని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో, పళ్ళు లేకపోతే వచ్చే కష్ట నష్టాలూ ( అదేనండీ, పళ్ళు లేకపోతే మాట సరీగ్గా రాదూ అవతలివాడికి మనం మాట్లాడేది అర్ధం అవదూ,etc.. etc..)అనే టాపిక్కుమీద,నాకర్ధం అవడంలేదేమో అని హిందీ లోనూ, ఇంగ్లీషులోనూ చెప్పారు.

తను చెప్పవలసిందంతా చెప్పనిచ్చి, అప్పుడడిగాను, నా గురించి మీ అభిప్రాయం ఏమిటీ అని.తనన్నాడూ, ఈవిడదయిపోయిన తరువాత చూద్దాం అన్నారు. అప్పుడు చెప్పాను, నా సంగతి, నమ్మడే !నా నోరు శ్రీకృష్ణుడిలా తెరిచి చూపించాకే నమ్మాడు! ఇంక నాలెక్చరు మొదలెట్టి, పదేళ్ళనుండి నేను పళ్ళు లేకపోయినా ఎంత సుఖంగా ఉంటున్నానో ఛాన్సొచ్చింది కదా అని ఆయన్ని బోరుకొట్టేశాను. అంతా విని తనడిగిందొక్కటే ‘ మీరు విజిటింగు రూమ్ములో కూర్చున్నారంటే, నాకొచ్చే బేరాలు పోతాయీ, దయచేసి ఇక్కడే కూర్చోండీ’ అని. పోన్లే పాపం ఇతనిని కష్ట పెట్టడం ఎందుకులే అని, అక్కడే, మాఇంటావిడ కి ఈ ‘ కాలవ’పనులు జరిగేచోటే సెటిల్ అయ్యాను!

ముందుగా ఓ బుల్లద్దం,చేతిలో అదేదో ఆయుధం దానికో సూదీ లతో ఒకసారీ, ఇంకోసారి ఇంకోదానితో ఠక్ ఠక్ మని కొడుతూ दुख्ता है क्या, ( నొప్పెడుతోందా!) అంటూ అడగడం, ఆహా ఓహో అంటూ మా ఇంటావిడ చెప్పడం,
మళ్ళీ ఏవేవో పోయడం, ఆనీళ్ళుమింగాలో లేక ఉమ్మేయొచ్చో తెలియక, ఉక్కిరిబిక్కిరవడం, ఈ exercise అంతా పూర్తిచేసి, చివరకు ఓ sedative injection పుటుక్కుని పొడిచేశాడు. कुछ नही, कुछ नही అంటూనే! ఆయనదేంపోయిందీ. నాకోటర్ధం అవదు అసలు ఈ dentist లు వాళ్ళ పళ్ళేమైనా ఎప్పుడైనా పీకించుకున్నారా అని.ఎప్పుడు చూసినా అక్కడున్న ఇరవయ్యో, పాతికో సూదులు దేనికో గుచ్చడం, దాంతో ఊరికే మన పళ్ళన్నీ కెలికేయడం!ఏదో సెడెటివ్ ధర్మమా అని , దాని ఎఫెక్టున్నంతసేపూ నొప్పెట్టదు కానీ, ఆ తరువాత విపరీతమైన నొప్పొచ్చి, ఎందుకొచ్చిన తద్దినంరా బాబూ, ఆ పన్ను నొప్పే బాగున్నట్లుందీ అనేంతవరకూ వెళ్ళిపోతారు!ఎరక్కపొయొచ్చామూ అనుకుంటారు. అలాటప్పుడు నాకోటనిపిస్తూంటుంది- ముందే చెప్పానుగా హాయిగా పీకించేసుకుంటే సుఖంగా ఉండేదానివీ-అని.అప్పుడావిడంటుందీ,‘ఇలా పాడిపోయిన దంతాలు నేను బాగుచేయించుకుంటే మీకెందుకూ అంత దుగ్ధా? నేనేదో అన్నీ తినేయకలుగుతానని మీకు జెలసీ’ అని. అక్కడికెక్కడో ‘ మొగుడు కొట్టేడని కాదూ, తోడికోడలు నవ్విందనీ..‘ అని ఓ సామెతుంది.అలా ఉంది.తను ఏదో నొప్పితో బాధపడుతోందని, నేనేదో అంటే, చివరకి నామీదకొచ్చింది!
మొత్తానికి మొదటిరోజు మా ఇంటావిడ నోటితో ఆడేసికుని ( అదేనండీ ఆ సూదులూ, కత్తులూ, కఠార్లతో) ఓ మూడు రకాల మాత్రలూ అవీ రాసిచ్చేసి పంపేశాడు….
మిగిలిన విశేషాలు ఇంకో టపాలో…

Advertisements

6 Responses

 1. బావుంది.. ఈ మధ్య మీలో హాస్య చతురత ఎక్కువవుతోంది రోజురోజుకీ.మీ ఇంటావిడ మీద టపాలంటే మరీను :)… Tenderleaves.com చూసాను,బాగుంది. ఫ్రీ సర్వీసాండీ ఇది?

  Like

 2. ఋషీ,

  ఊళ్ళోవాళ్ళమీద జోకులేస్తే పళ్ళూడగొడతారు ( పళ్ళే లేవు అది వేరే సంగతి!). టెండర్ లీవ్స్ మరీ ఉచిత సర్వీసు కాదండి.మేమేమైనా రాజకీయ నాయకులమా ఏమిటీ? పుస్తకాలకి
  పెట్టిన పెట్టుబడేనా రావొద్దూ? అలాగని మరీ ఎక్కువా కాదు.నెలకి 150/- రూ.లు. మూడు పుస్తకాలు ఒక్కోమారు.చదివే ఓపికని బట్టి పుస్తకాలు తీసికోవచ్చు.డిపాజిట్ 500/-(రిటర్నబుల్)

  Like

 3. ఈ దంతవైద్యులు వేరే వైద్యునిదగ్గర పన్ను పీకుంచుకుంటేనే గానీ అది ఎంత నొప్పో తెలియదనుకుంటాను.. 🙂

  ఇక టెండర్ లీవ్స్ మెదట (తెలుగు) కష్టమర్ ని నేనే అని చెప్పరే… దానిగురించి ఒక పోస్టురాయండి మరి.. అదే నాకు రాయల్టీ అనుకుంటాను.. 🙂

  Like

 4. ఫణి గారు,

  మొత్తం దంతాలు పోకుండా ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదు ? పది ఏళ్లు అంటున్నారు…ఒక దశాబ్ద కాలం కదండీ..! చాలా ఓపిక మీకు. చిన్నప్పుడు బాగా స్వీట్స్ తినడం వల్ల 2 దంతాలు పోయాయి..అందుకే తెగ ఫీలయిపోతు వుంటాను…

  -శ్రీరామ్

  Like

 5. శ్రీనివాసూ,

  రాస్తాను బాబూ. అగ్రతాంబూలం నీదేగా !

  Like

 6. శ్రీరాం,

  పాతికేళ్ళు నానా బాధలూ పడి, ఇంక భరించలేక 2001 సంవత్సరంలో మొత్తం అన్నీ తీయించేసికున్నాను. ఇప్పుడు హాయిగా ఉంది.డెంచర్స్ కూడా లేవు.ఎటువంటి సమస్యా లెదు.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: