బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-ప్రయాణం బట్టలు


    ఇదివరకటి రోజుల్లో ఏదైనా పెళ్ళిళ్ళకెళ్ళితే అది కూడా ఏ ట్రైనులోనైనా వెళ్ళవలసివస్తే, ఓ హోల్డాల్ లో పక్కబట్టలూ, ఓ ట్రంకుపెట్టిలో ( ట్రంకు పెట్టి అని ఎందుకంటారో ఇప్పటికీ తెలియదు!)
ఇంటావిడవీ, పిల్లలవీ, ఇంటాయన కి ఓ రెండు మూడు పంచలూ, ఓ రెండో మూడో లాల్చీలూ పెట్టి ప్రయాణం అయేవారు.

    ప్రస్తుతపు రోజుల్లో అడక్కండి- ఏ రెండుమూడు రోజులో ఉండే మాటయితే, అదీ ఏ పెళ్ళికైనా వెళ్ళవలసివస్తే, కనీసం రెండు సూట్ కేసులు ఉండాల్సిందే.స్నానం చేసిన తరువాతోటి, రిసెప్షన్ టైముకోటీ, పెళ్ళి టైముకోటి,రాత్రి పడుక్కునే ముందరోటీ-మొత్తం నాలుగు. మూడు రోజులకీ కలిపి ఓ డజను చీరలూ, వాటికి accessories ఇంకో మూడు డజన్లూ! అన్నిటికీ మాచింగోటీ. అదృష్టం బాగోక, అవి లేకపోతే అర్జెంటుగా షాప్పు కి వెళ్ళి, మాచ్ అయేవి కొనుక్కోవడం.

    ఈ సరంజామా అంతా సర్దేక, ‘అరే మీబట్టలు ఏవీ వేసికోనేలేదూ’ అని గుర్తొస్తుంది, ఇంకా సామాన్ల బరువు పెంచడం ఇష్టం లేక, ఏదో ఓ carrybag తీసికుని, అందులోనే ఓ రెండు జతల బట్టలు, అవీ డార్కు రంగులోఉండే ప్యాంటులూ, వాటిమీదికి ఓ రెండో మూడో షర్టులూ. వీటికి ఆ సూట్ కేసులో జాగా దొరక్కపోయినా, ఏ పక్క బట్టలతోనో సర్దేసికోవచ్చు!.సదుపాయం ఏమిటంటే ఈ డార్కు పాంట్లమీదకి ఏ రంగైనా సరిపోతుంది! పెళ్ళిళ్ళల్లో ప్రొద్దుటనుండి సాయంత్రందాకా ఒకే జతలో ఉన్నా కానీ ఎవడూ పట్టించుకోడు. పైగా మనల్ని గుర్తుంచుకోవడం కూడా ఈజీ!మహ అయితే,ఇంటావిడ మనం వేసికున్న బట్టలు భరించలేక ज्यादा सॅ ज्यादा disown చేస్తుంది. అలాటివి అసలు పట్టించుకోకూడదు. చాలా మంది దగ్గర ఏ పెళ్ళిళ్ళకో కొనుక్కున్నషేర్వాణీలూ,కుర్తా పైజమాలూ ఉంటాయి. వీటన్నిటికీ ముక్తొచ్చేది ఈ పెళ్ళిళ్ళల్లోనే.మరీ ఇలాటివి ప్రతీ రోజూ వేసికుని ఊరేగలేముకదా!

    ఈ పెళ్ళిళ్ళకోసం తెచ్చుకున్న, ‘ప్రయాణం బట్టల తో ఇంకో సమస్యుంది. ఇంటికి వెళ్ళిన తరువాత, ఈ బట్టలన్నిటికీ dry cleaning ఒకటీ. మళ్ళీ ఏ పెళ్ళికో వెళ్ళేదాకా జాగ్రత్తగా ఉంచుకోవద్దూ!ఇంక ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు, ఈ విడిచిన బట్టలన్నీ దేంట్లోనో కుక్కేయడం, మరి ఆ పెళ్ళిలోనూ, ఇంకో చోటా పెట్టిన ‘పెట్టుబడి బట్టలు’ దాచుకోవాలిగా!

   ఇంక ఏ తీర్థయాత్రలకైనా వెళ్ళాల్సొస్తే, పైన చెప్పిన లెఖ్ఖ ప్రకారం వేసేసికోండి. ఎన్నిరోజులైతే అన్నీ ఇంటూ నాలుగు! అక్కడ రిసెప్షనూ, ఇక్కడ దేముడూ! అంతే తేడా! ఇంకో విశేషముందండోయ్,అన్ని బట్టలూ పైన చెప్పిన నిష్పత్తిలో, ఎలాగోలాగ సూట్ కేసుల్లో సర్దేసిన తరువాత, ఇంటావిళ్ళకో ఐడియా వస్తూంటుంది.‘పోన్లెండి, మరీ ఎక్కువైపోయాయేమో, ఒకటో రెండో తీసేయనా’ అంటూ మొహమ్మాటానికి అడగడం. మనం ఎలాగూ వద్దంటాం అని తెలుసు!అయినా ఒకటో రెండో తీసేస్తే మనకొరిగేదేముందీ? దానివలన వచ్చే material change ఏమీ ఉండదు,మనం తీయించేసేమని ఓ మాట మిగిలిపోతుందంతే !! ఈ మాత్రం దానికి మనం వెల్తిన పడడం దేనికీ?

    ఆతావెతా చెప్పొచ్చేదేమిటంటే ఎప్పుడైనా ఎక్కడికైనా ప్రయాణం పెట్టికుంటే బట్టలు 1:4 ratio లో తీసికెళ్ళడానికి రెడీ అయితేనే, టిక్కెట్లు రిజర్వు చేసికోండి, అంతేకానీ ఆఖరినిముషంలో ఊరికే గొడవ పెట్టుకోకండి! ఇదేదో నాకయ్యిందని ఊరికే ఊహించుకోనక్కర్లేదు పేద్ద, పెళ్ళాం అంటే ప్రేమున్న ప్రతీవాడికీ అవుతూనే ఉంటుంది. మర్చిపోతారేమో అని ఓసారి గుర్తుచేశాను!

Advertisements

8 Responses

 1. అన్యాయం… ఇది మా ఇంట్లో జరిగేది, ఈ ముక్క నా నోట్లో నాన్తోంది. మీరు బ్లాగులో రాసేశారు

  Like

 2. ఏమిటో, బీరువా నిండా వార్డు రోబు నిండా బట్టలు రకరకాల రంగుల్లో, తలుపు తీస్తే పైనుంచి మీద పడేన్ని ఉంటాయా..ఏ పెళ్ళికో వెళ్దామంటే ఒక్క సరైన చీరె లేదనిపిస్తుంది. ప్రయాణం అంటే నాకసలు ఇంట్లో బట్టలన్నీ పాతగా కనపడతాయి.

  అయినా మీ మగాళ్లకేమండీ, ఒక టాపూ ఒక బాటమూ! ఒకటి లైటైదే రెండోది డార్కు! ఒక జీన్సు+నాలుగు టీషర్టులు ఐతే హాయిగా ట్రిప్పు గడిచిపోతుంది. మాకలాగ్గాదే!

  Like

 3. ఐనా మీ మగవాళ్లకు ఉన్న రంగులెన్నంట? చుట్టు తిప్పితే నాలుగైదు. వాటినే లైట్, డార్క్ గా మారుస్తారు. అదే మాకైతే ఒక్క రంగులోనే వందదాకా షేడ్స్, డిజైన్స్ . అందుకే అన్ని అవసరమవుతాయి. ఇంకా పెళ్లిళ్లకు వెళితే వేరేవాళ్లకు ఇంకా మంచి చీర కనిపిస్తుంది. కొనాల్సిన లిస్టులో మరోటి పడిపోతుంది. మగాళ్లంతా ఇంతే . ఎప్పుడు చూసినా ఆడాళ్లమీద కంప్లెయింట్లు. hmmm..

  Like

 4. బాలు గారూ,

  నోట్లో నానుతోందీ అనేకంటే వ్రాసేస్తే బాగుండేది! ప్రతీ ఇంటిలోనూ జరిగే భాగవతమే ఇది! ఏదో ధైర్యం చేసి వ్రాశేశాను !

  Like

 5. సుజాతా,

  పేద్ద మాకు ఏదైనా సరిపోతుందని చెప్పఖ్ఖర్లేదు! అప్పటికే లగేజీ ఎక్కువైపోయిందికదా అని ఆ 1+4 డ్రెస్సులతో సరిపెట్టేసికుంటాము!

  Like

 6. జ్యోతీ,

  దీన్నిబట్టి తెలిసిందేమిటంటే ఎన్ని పెళ్ళిళ్ళకి వెళ్తే అన్ని కొత్త డిజైన్లు తెలుస్తాయి. Moral of the story : Avoid going for receptions!

  Like

 7. maa intlonoo ide repeat avutundi, lekapothe evaro avida bothhiga nasigaa undi aneyaroo..

  Like

 8. వసంత లక్ష్మీ,

  ప్రతీ ఇంట్లోనూ జరిగేదిదే. పైగా ఎవరో ఏదో అంటారని వంకోటీ !!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: