బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– భాగ్యనగరం లో… 2


   ఈసారి భాగ్యనగరంలో మూడు రోజులు గడిపే భాగ్యం కలిగింది. మొదటిరోజు శుక్రవారం, నా టపాలనభిమానించే ఒక అమెరికా తెలుగాయన, అబ్బులు ఎప్పుడో ఓ మెయిల్ పంపించారు- నన్ను కలుసుకుందామనుకుంటున్నానని.సరే బాగుందీ, నా బ్లాగులతోనే ఎలాగూ విసిగెత్తిస్తున్నాను, స్వయంగా ఒకసారి కలిసికుంటే ఇంకొంచెం బోరు కొట్టొచ్చూ, మంచి అవకాశం అనుకున్నాను!నేను భాగ్యనగరం చెరేనని, చెప్దామని, అతనిచ్చిన నెంబరుకి ఫోను చేసి,’అబ్బులు ఉన్నారా’ అని అడగ్గానే, ఆవిడెవరో ‘ లేదండీ, ఇక్కడ అలాటిపేరున్నవారెవరూ లేరూ’ అని ఫోను పెట్టేయబోతుంటే, అతను నాకెప్పుడో తెలియపరచిన అసలు పేరు చెప్పి,’ఆయనున్నారా’ అని అడిగాను.’ఆయనైతే ఉన్నారూ’అని చెప్పి, ఫోను అతని చేతిలో పెట్టారు.నాకేం తెలుసూ, మనవాళ్ళు పౌరసత్వంతో పాటు, పేరుకూడా మార్చుకుంటారని!ఇక్కడ ఎవరికీ తన ‘కలంపేరు’ (బ్లాగులు వ్రాసే పేరు) చెప్పలేదనీ, నేనే ఆ పేరును బహిర్గతం చేసేనన్నాడు.ఏదో ఒకటి, మొత్తానికి నేనుండే కాచిగూడాకే వస్తానన్నాడు. ఎడ్రసూ అవీ చెప్పాను. మామూలుగానే, మా వియ్యంకుడుగారు అడిగారు, ‘ఆ వచ్చేఆయన మీకు తెలుసా, ఎలా గుర్తుపడతారూ’ అని. రామూని మొదటిసారి కలిసినప్పుడూ ఇదే సందేహం.

    వాళ్ళందరూ, నాకు తెలియకపోయినా, నా మొహం అందరికీ తెలుసూ, పోలీసు స్టేషన్లలో లాగ, నా ఫుటో అందరికీ పరిచయమే అన్నాను.ఏది ఏమైతేనేం, మొత్తానికి అతనే గుర్తుపట్టాడు.రామూ వచ్చినప్పుడు కూడా గుర్తుపట్టుండేవాడిని, బ్లాగు ప్రొఫైలు లో పెట్టిన ‘గోటీ’ కోసం చూస్తూంటే, ఏ గడ్డం లేకపోవడంచేత, గుర్తుపట్టలేకపోయాను!ఈసారి, ఆ ఫేసుని గుర్తుపెట్టుకుంటే, మళ్ళీ ఓ ‘గోటీ’ పెంచుతున్నాడు! ఏమిటో ఈ ఫేసులేమిటో గొడవేమిటో!ఎప్పుడో ఏ విమానాశ్రయంలోనో, ఏ సెక్యూరిటీ వాడో చివాట్లేసేదాకా ఇలాటి ‘వేషాలు’ వేస్తూనే ఉంటారు!

    అబ్బులు తో ఓ గంట కాలక్షేపం చేశాను. నా బ్లాగు గుర్తుంచుకుని, నాకోసం ‘బెల్లం మిఠాయి’ బ్రతికిపోయాను ఒక ఉండ మాత్రమే తెచ్చాడు! ఎందుకంటే అది మా రోజుల్లోలాగ మెత్తగా ఉండే మిఠాయి కాదు, ప్రస్తుతం మార్కెట్ లో దొరికే
బెల్లం అచ్చు మిఠాయి, పాకం చాలా ముదురుగా ఉంటుంది, దాన్ని విరక్కొట్టడానికే చాలా టైము పడుతుంది, ఇంక తినడం సంగతిసరేసరి! అంత అభిమానంతో గుర్తుంచుకుని, బెల్లం మిఠాయి తెస్తే, సంతోషించడం పోగా, అది కాదూ ఇదికాదూ అని ఓ సణుగుడుకూడానూ, అని మా ఇంటావిడచేత చివాట్లు కూడా తిన్నాను! అదేమిటో,’పడమటి గోదావరి రాగం’ శ్రీనివాసూ అంతే, సరీగ్గా అలాటి మిఠాయే తెచ్చాడు!Intentions are very noble !क्या करॅ ! తినలెనూ, పళ్ళు లేవూ!

   పాపం అబ్బులికి నామీద ఎంతో సదభిప్రాయం ఉన్నట్లనిపించింది. ఏమిటో నేను వ్రాసే టపాలు నచ్చేశాయిట! ఓ వరసా వావీ లేకుండా, నేను వ్రాస్తున్న బాతాఖానీ లో, ఓ సందేశం ఉండదు, చివరలో ఓ ‘నీతి’ ఉండదు.అలాటి టపాలు అందరికీ నచ్చుతున్నాయంటే అది మన బ్లాగర్లలో ఉండే సహృదయత- ‘పోన్లే ఏదో పెద్దాయన వ్రాస్తున్నాడూ,ఉత్సాహపరిస్తే మనదేం పోయిందీ, ఇంకెంతకాలం వ్రాస్తాడులెద్దూ అని! Anyway thank you all! ఈ బాట కార్యక్రమం లో కూడా అంతే,ఎదో పరిచయం చెసికుందామనుకుంటే, నేను కలిసిన ప్రతీవారూ ( ఏ ఒక్కరో ఇద్దరో తప్ప) ప్రతివారూ నా బ్లాగు బాధితులే !

   అబ్బులుతో కబుర్లు చెప్పిన తరువాత, నవోదయా బుక్ స్టొర్ కి వెళ్ళి, అక్కడ నాకు నచ్చిన ఓ అరవై పుస్తకాలు మా కొత్త గ్రంధాలయం కోసం సెలెక్ట్ చేశాను. వాటిని క్యాటలాగ్గు లో పెట్టే కార్యక్రమంలో ఉన్నాను ప్రస్తుతం. ఇంతలో రామూ దగ్గరనుండి ఫోనూ, ఫలానా ఈ.సి.ఐ.ఎల్ చౌరస్తాకి వచ్చేయండి, నేను మిమ్మల్ని కలుస్తానూ అని.ఓ సంగతి చెప్పనా-నేను భాగ్యనగరానికి వస్తున్నానూ అని పదిహేనురోజులక్రితం ఫోను చేసినప్పుడు, తనన్నాడూ’ మీరు ఒక పూట మా ఇంట్లో ఉండాలీ’ అని.నేనొక్కడినే వస్తున్నానూ అని చెప్పగానే, మళ్ళీ ఆ మాటెత్తలేదు!పైగా టపాల్లో బిరియానీలూ వగైరా అంటూ ప్రామిస్సులోటి! ఏదో ప్రతీ పూటా మా వియ్యాలవారినే కష్టపెట్టకుండా, ఇలా ఉన్న మూడు రోజులూ, ఏదో ‘వారాలు’ చెప్పుకుని లాగించేద్దామనుకుంటే, అసలు ఆ మాటే ఎత్తరే!ఉన్న మూడు రోజుల్లోనూ, పెళ్ళి భోజనం ఓ పూటా, మామరదలి దగ్గర ఓ పూటా, శనివారం ఎలాగూ ఫలహారమే,ఏమిటో అనుకుంటాము కానీ….

Advertisements

10 Responses

 1. అహా ! అవున్నిజమే, నిజంగా నిజం – “ఏమిటో అనుకుంటాము కానీ” మటుకు బాగా చెప్పారండి. చురుకు పెట్టాలన్నా, చిర్రెత్తించాలన్నా, చిద్విలాసాలు చిందించాలన్నా అంతా మాట మహత్యమే

  కిరణ్

  Like

 2. > పైగా టపాల్లో బిరియానీలూ వగైరా అంటూ ప్రామిస్సులోటి
  మీకు బిర్యాని ఇప్పించారా లేక ఇరానిచాయ్, ఒస్మానియా బిస్కెట్లు ఇప్పించారా? 🙂

  Like

 3. నాక్కూడా బిర్యానీ ఆశ చూపించారు కానీ టీ బిస్కట్ తో వదిలించుకున్నారు రాము గారు. నా బిర్యానీ నాక్కావాల్సిందే అని వెంటపడటానికి నా దగ్గర సమయం లేకపోయింది.

  Like

 4. Next time when u visit Hyd, Please reserve one day for us too.. oka varam madi !

  Like

 5. కిరణ్,

  నేను వ్రాసిందాంట్లో మీరు మరీ between the lines చదివేస్తే ఎలాగ బాబూ !!

  Like

 6. శరత్,

  బిరియానీలూ అవీ ఇవ్వకపోవడమే కాకుండా, ఆ తరువాత ఫోన్లు చేశానూ, మీరు అప్పటికే వెళ్ళిపోయారన్నారూ అనో వంకా! ఇవ్వాలని మనసే ఉంటే మార్గమే లేకపోయేదా?

  Like

 7. పానీ పురీ,

  సీదా సాదా ఆఫీసులో పెట్టించిన చాయ్ మాత్రమే!! బిస్కట్టులు కూడా మామూలు గుడ్డే (I mean Good Day!).

  Like

 8. సుజాతా,

  తప్పకుండా. ఒక పూట కలిసొచ్చినా కలిసొచ్చినట్లే !!

  Like

 9. అయినా హయిద్రాబాద్ వెళ్ళింతరవాత బిరియానీ ఒకళ్ళు పెట్టించేదేంటి సార్! పేరడైజ్ కి వెళ్ళి మనకెట్లాంటి బిర్యానీ కావాలో అది లాగించెయ్యడమే. 🙂

  Like

 10. కొత్తపాళీ గారూ,

  కొనుక్కోలెక కాదు! ఏదో ఫుకట్ గా వస్తుంటే తిని సంతోషిద్దామని !!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: