బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-భాగ్యనగరంలో….


    నాకు ఈ సారి భాగ్యనగరం వచ్చినప్పుడు తెలిసింది- కొంతమందికి భాషాభిమానం ఎలా ఉంటుందో! మేము ప్రారంభించిన టెండర్ లీవ్స్ గ్రంధాలయం కోసం, కాచిగూడా నవోదయా కి వెళ్ళాను.అక్కడ ఓ అరవై పుస్తకాలు, ఎంపిక చేసి, ఇంకా మిగిలినవి చూస్తున్నాను. ఇంతలో ఒకాయన వచ్చి,కొట్టాయనని కథావిమర్శ పైన ఏమైనా పుస్తకాలున్నాయా అని అడిగారు. అక్కడ ఎలాగూ నేను కూడా పుస్తకాలకే చూస్తున్నాను కదా అని, ఏదో పుస్తకం గురించి చెప్పాను, అది కాదూ అని ఇంకో పుస్తకం గురించి వెదికారు.
నా అలవాటు ప్రకారం, ఆయనతో పరిచయం చేసికున్నాను. పేరేమిటీ అని అడగ్గానే ‘పట్ వర్ధన్’ అన్నారు. మరాఠీయా అన్నాను.కాదూ శుధ్ధ తెలుగువాడినీ, అంతే కాదూ తెలుగు టీచరుని కూడా అన్నారు. ఆయనకి ఆ పేరెలాగ వచ్చిందంటే, ఆయన పుట్టినప్పుడు వారి మేనమామ, మహరాష్ట్రలో ఉన్నారుట, ఆయనకేమో, మరాఠీ సాంఘిక సంస్కర్త శ్రీ అచ్యుత్ పట్వర్ధన్ అంటే ఎంతో ఇష్టంట, అందువలన ఇతనికి వెంకట పట్వర్ధన్ అని పేరు పెట్టారు.ఇంక ఇతని సంగతికొస్తే- ఎలెక్ట్రానిక్స్ లో ఎం.ఎస్.సి చేశారు. అయినా ఏ ఉద్యోగంలోనూ చేరక, తెలుగుమీదుండే అభిమానంతో ఉస్మానియా నుండి, ఎం.ఫిల్ తెలుగులో చేసి, మంచర్యాల దగ్గరలో ఓ కుగ్రామంలో ఉపాధ్యాయుడిగా చేరారు. అక్కడ అయిదు సంవత్సరాలు పనిచేసి,ప్రస్తుతం మంచర్యాలలో జూనియర్ లెక్చెరర్ గా పని చేస్తున్నారు.ఇప్పుడు, భాషమీదున్న అభిమానంతో పీ.ఎచ్.డీ చేస్తున్నారు.
చెప్పొచ్చేదేమిటంటే, భాషమీదున్న అభిమానం ఎంతవరకూ తీసికెళ్తుందని.సంపాదించే డబ్బుకాదు విశేషం. సంతృప్తి చేసే పనిలో.That is the bottomline! ఆయన మొహంలో ఎంత ఆనందం చూశానో!ఓ గంట సేపు, ఆయన పనిచేసిన మారుమూల గ్రామంలో, విద్యార్ధుల పరిస్థితి ఎలా ఉండేదో, ఈయన వారికి ఎలా సహాయం చేశారో, వగైరా చెప్పుకొచ్చారు.నాకైతే చాలా సంతోషం వేసింది.‘మాతృభాషా దినోత్సవానికి’ ముందు రోజు ఇలాటి వ్యక్తిని కలవడంకంటె ఇంకేంకావాలి!

    భాగ్యనగరం లో జనాల గురించి ఇదివరలో నాకు కొన్ని దురభిప్రాయాలుండేవి. అవన్నీ తప్పని ఈసారి తెలిసింది.శుక్రవారం నాడు, ఈ.సీ.ఐ.ఎల్ దాకా బస్సులో వెళ్ళాను( రామూ సలహా మీద).చౌరస్తా దగ్గరకు రాము వచ్చి నన్ను ఎచ్.ఎం.టి.వీ కి తీసికెళ్ళి, అక్కడ అందరికీ పరిచయం చేశారు. అతని ధర్మమాఅని, టి.వీ.ల్లో మనం ఇంట్లో కూర్చుని రిమోట్ నొక్కగానే కనిపించే వార్తలు,విశేషాల వెనుక ఎంతమంది కృషి ఉంటుందో తెలిసింది.అంతా గ్లామరనుకుంటాము కానీ, ఎంత శ్రమపడతారో! టీ .అర్.పీ లకోసం శ్రమపడాలంటే మరి పడొద్దూ !!Thanks Ramu and Chakradhar (from Konaseema!)

    రాము నన్ను సిఖ్ విలేజ్ దగ్గర దింపేసి ( నా కోరికమీదే) వెళ్ళిపోయారు.అక్కడ మా స్నేహితుడి కొడుకు పెళ్ళి. తిరిగివచ్చేటప్పుడు ఆటోలో వచ్చేద్దామనుకుంటే, అక్కడ ఉన్నవారు చెప్పారు-ఆటోలో వద్దూ, బస్సులో సికిందరాబాద్ దాకా వెళ్ళి,అక్కడనుంచి లోకల్ ట్రైన్ లో కాచిగూడా వెళ్ళమని.నాకేమో అంతా కొత్తా. పైగా రాత్రి సమయం. ఏదైనా అయితే ఏ టి.వీ.లోనో బ్రేకింగ్ న్యూసు లో వచ్చేస్తానేమో అని భయం, అయినా ధైర్యం చేశాను.ఎక్కడా ఎటువంటి గొడవాలేకుండా
హాయిగా అంచెలంచెలుగా ఇంటికి చేరాను. ఆఖరికి సికిందరాబాద్ నుండి కాచిగూడా ఏ దిక్కునుందో కూడా తెలియదు.అయినా సరే ఎవరో పరిచయం లేని ఓ అబ్బాయి, నన్ను క్షేమంగా ట్రైనెక్కించాడు.ఇంకో అతను నాకు కాచిగూడా స్టేషను రాగానే దింపి వెళ్ళాడు. వాళ్ళెవరో నాకు తెలియదు. అయినా ఓ అపరిచితుడికి సహాయం చేశారంటే, మనం అడిగే పధ్ధతిలో ఉంటుందన్నమాట!
ఏదొ రాజకియనాయకులవలన అందరి మధ్యలో గొడవలొస్తున్నాయి కానీ, స్వతహాగా అక్కడివారు సహృదయులు.నాకైతే చాలా నచ్చేశారు.

    ఒక్కటిమాత్రం నచ్చలేదు! ఆదివారం ప్రొద్దుటే తెలుగుతల్లి విగ్రహందగ్గరకు వెళ్ళానా, అక్కడ చూసిన మొదటివారిలో శ్రీ కోడిహళ్ళి మురళీ మోహన్ గారు. మా ఇంటావిడ ప్రతీవారం ఈయన ఇచ్చే ‘తురపుముక్క’,పజిలు చేస్తూంటుంది. పోనీలే పరిచయం ఉన్నవారుకదా, ఆయనలాటి వారిని కలిశానూ అంటే, మాఇంటావిడ దగ్గర నా ‘ఇమేజ్’ ఇంకా పెరిగిపోతుందీ అనుకుని, పరిచయంచేసికున్నాను. సుజాత ఇచ్చిన బ్యాడ్జి మీద నా పేరుండనేఉంది. ఈయనంటే, మా ఇంటావిడకెంత అభిమానమో, ఆయన ఇచ్చే పజిల్స్ ఎంత నచ్చేస్తాయో చెప్పగానే ఆయన ‘ ఓహో మీరు భమిడిపాటి సూర్యలక్ష్మి గారి భర్తా ‘ అన్నారు! ఇలా ఉంటుంది. పెళ్ళిళ్ళకెళ్తే ‘లక్ష్మి మొగుడా’ అంటారు.ఇలాటి కార్యక్రమాలకొచ్చినా తప్పడం లేదు
నా తిప్పలు! అసలు నాలాటి ‘అమాయకులకి’ గుర్తింపే ఉండడం లేదు ఈమధ్య !!

Advertisements

18 Responses

 1. మీ కబుర్లు చాలా మటుకు చదువుతుంటానండి. కానీ ఈ సారి ఆ చివరి రెండు వాక్యాలు చదివేసి నవ్వు ఆపుకోలేక ఇలా బయట పడ్డాను. 🙂

  Like

 2. ఫణి బాబు గారు.. Hyderabad అలవాటు అవుతుందన్నమాట…!

  అసలు నాలాటి ‘అమాయకులకి’ గుర్తింపే ఉండడం లేదు ఈమధ్య !!
  🙂 😀

  Like

 3. గురూజీ…
  ఈ ఫోటోలో ఉన్నది ఎవరో కాస్త ఒక లైను రాయవచ్చు కదా! ఆ తెలుగు సారు ఈయన. మరి పక్కాయన?
  రాము

  Like

 4. > ఓహో మీరు భమిడిపాటి సూర్యలక్ష్మి గారి భర్తా ‘ అన్నారు
  దీని గురించి అక్కడ కూడా ఒక పోస్ట్ వచ్చిఉండాలే? 😀

  Like

 5. ఒక తెలుగు భాషాభిమాని గురించి వ్రాసి మంచి పని చేశారు. ఫొటోలో ఆయన పక్కన ఉన్నది, ఆ పుస్తకాల దుకాణం యజమాని అనుకుంటాను.

  Like

 6. ఏదైనా అయితే ఏ టి.వీ.లోనో బ్రేకింగ్ న్యూసు లో వచ్చేస్తానేమో అని భయం, ha ha ha !

  Like

 7. భాస్కర రామిరెడ్ది గారు,

  వామ్మోయ్!! ‘హారం’నిర్వహిస్తూ కూడా, నా టపాలు చదవడానికి వీలుచేసికోవడం చాలా సంతోషంగా ఉంది.

  Like

 8. రామూ,

  ఏదో హడావిడిలో పేర్లు వ్రాయడం మర్చిపోతే, మరీ అంత వీధిన పెట్టేయాలా? ఒకాయన తెలుగు మాస్టారు. రెండో ఆయన నవోదయా సాంబశివరావుగారు.

  Like

 9. పాని పూరీ,

  కొద్దిగా బిజీగా ఉందావిడ. లేకపోతే ఇంతసేపా?

  Like

 10. హంసా,

  ఈ మధ్యన హైదరాబాదు మరీ ఎక్కువగా వస్తున్నట్లనిపిస్తోంది నాక్కూడా!!

  Like

 11. శివ గారూ,
  ధన్యవాదాలు.

  Like

 12. సుజాతా,

  ఈ బ్రేకింగున్యూసులు చూసి చూసి భయపడ్డాను !!

  Like

 13. నేనలా అడిగానా? అడిగే ఉంటాను 🙂 సూర్యలక్ష్మి గారు క్రాస్‌వర్డ్ పజిల్ పూరించి పంపుతారు కాబట్టి నాకు పరిచయం. వారు మీ శ్రీమతి గారా అని అడగబోయి అలా అడిగి ఉంటాను. చిన్నబుచ్చుకోకండి గురువు గారూ.

  Like

 14. మురళీమోహన్ గారూ,

  మరీ అమాయకంగా ” నేనలా అడిగానా? అడిగే ఉంటాను ” అనఖ్ఖర్లేదు!!! అందుకేగా నా గోలంతా !!!
  ఎంతైనా మీరందరూ ఒకేఫ్యామిలీ కదా! నేనేమీ అంత intellectual కాదులెండి !!!

  Like

 15. ఫణిబాబు గారూ!

  నిజంగా నాకు ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదండి.

  “నేనేమీ అంత intellectual కాదులెండి !!!”

  మరీ నన్ను అంతగా అవహేళన చేయనక్కరలేదు సార్!

  Like

 16. మురళీ మోహన్ గారూ,

  మరీ అంత సీరియస్సుగా తీసికోకండి నా మాటలు !! మిమ్మల్ని చూసిన తరువాత సరదాగా అలా వ్రాశాను. జీవితంలో అన్నీ లైటుగా తీసికుంటేనే, ఆనందం!!

  Like

 17. కొత్తపాళీ గారూ,

  మీలాటి పెద్ద రచయిత నుండి అలాటి వ్యాఖ్య వచ్చిందంటే సంతోషంగా ఉంది.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: