బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు- భాషకొచ్చిన తిప్పలు !!


    నేను ఈ మధ్య చెన్నై ట్రైనులో వెళ్ళానుగా, అప్పుడు పగటి ప్రయాణం అంతా ఆంధ్రదేశం చూస్తూ గడపగలిగాను.నాతో ప్రయాణం చేస్తున్న ఓ తమిళమాయన, ప్రతీ పెద్ద స్టేషనూ దేనికి ప్రసిధ్ధో చెప్తూ వచ్చారు( తినే వస్తువులు!). గుంతకల్లు లో ఉప్మా చాలా బాగుంటుందన్నారని, ప్లాట్ ఫారం మీదకొచ్చాను. దగ్గరలో విజయా డైరీ వారి కౌంటరు కనిపిస్తే, అక్కడికి వెళ్ళాను.చూస్తే ఏముందీ? పైన చూపించినది కనిపించింది!ముందుగా అనుకున్నాను- అహో మన తెలుగువారు ఎంత
ధార్మికులో పేడ ని కూడా కొనుక్కుని, పూజలు చేసికుంటున్నారూ
అని. తీరా కొట్టువాడిని ఇదేమిటీ అని అడిగితే స్వీట్ అన్నాడు.మరి దానిమీద వ్రాసిందేమిటయ్యా అని అడిగితే,పాలకోవా అని వ్రాస్తే హిందీ వాళ్ళకు తెలియదుకదండీ అన్నాడు.
నవ్వాలో ఏడవాలో తెలియలేదు. ఈ భాషా సంకరం ఎందుకో అర్ధం అవలేదు. పోనీ వ్రాసిందేనా కరెక్టుగా వ్రాసేరా? హిందీ లోనూ, మరాఠీ లోనూ ఆ స్వీటుని दूध पॅढा/ दूध पॅढॅ అంటారు!పోనీ దేవనాగరి లిపిలో వ్రాసేడందామా అంటే, అబ్బే
అచ్చ తెలుగులో ‘పేడ’ అనివ్రాశారు! మరి ‘పేడ’ అంటే మన ప్రభుత్వం వారికి అర్ధమే తెలియదా? ప్రభుత్వ రంగ సంస్థలు భ్రష్టు పడిపోతున్నాయంటే పడవూ? దానిమీద తెలుగులో వ్రాసిన పేరు చూసి ఏ తెలుగొచ్చినవాడైనా దాన్ని కొనే ధైర్యం చేయగలడా?What exactly the marketing division of Vijaya Dairy (AP Government undertaking),wanted to convey? అందులో ఒక్కడికీ దాన్ని పాలకోవా అంటారూ, దూద్ పేడ అనరూ అనే ఇంగితజ్ఞానమే లేదా? ఆ కొట్టువాడు చెప్పినట్లు, ఇతరభాషలవాళ్ళకి అర్ధం అయేలా వ్రాసేమూ అంటే, పోనీ దేవనాగరి లిపిలో సరీగ్గా ఏడవొచ్చుగా !

    నేను ఉద్యోగంలో చేరినప్పుడు, మా ఫ్రెండొకడుండేవాడు-ఒకసారి ఇక్కడ ‘గూఢచారి 116’ సినిమా వచ్చింది. వీడు పేపర్లో చూసి, ‘ ఊళ్ళోకి తెలుగు సినిమా ‘గూఢాచారి 116’ వచ్చిందిరోయ్’అన్నాడు. అది మాతోఉండే ఇంకో భాషాభిమాని విని, గయ్యిమన్నాడు- ‘దరిద్రుడా వాడేమీ గుళ్ళో ఆచారికాదూ, గూఢచారి అంటే స్పై అన్నమాట’ అని కోప్పడ్డాడు! అయినా సరే మా స్నేహితుడు ఎక్కడ పోస్టరు చూసినా చదివేవాడు-ఓసారి మాయాబజారు కన్నడంలో వచ్చింది.ఇంక చూసుకోండి మావాడు ‘ ಮಾಯಾಬಜಾರ್’ ని ఎలా చదివాడో తెలిసిందా!!

    వచ్చిన కొత్తలో, మరీ బక్కపలచగా ఉన్నానని, ఎగ్ తినమన్నారు. ప్రతీరోజూ మార్కెట్ కెళ్ళి తెచ్చుకునేవాడిని. ఒకసారి తెచ్చినప్పుడు అవేవో ఇంకో రుచితో ఉన్నట్లనిపిస్తే, మా వాళ్ళన్నారూ, ఇది కోడి గుడ్డు అయుండదూ, బాతు గుడ్డైఉంటుంది అని. సరే కొట్టుకెళ్ళి, ఆ కొట్టావిణ్ణి అడగాలంటే, <b.హిందీలో ఎలా అడగాలో తెలిసేడవదు అయినా సరే పెద్ద పోజు పెట్టి येह एग्ग किस्का है? అన్నాను.ఆవిడకి చిర్రెత్తిందేమో मॅरा नय् అంది.ఎక్కడో కోనసీమ లాటి మారుమూల ప్రాంతం నుంచి వచ్చి హిందీలో మాట్లాడమంటే ఎలాగండి బాబూ? అక్కడికీ ఎస్.ఎస్.ఎల్.సీ లో 30% వచ్చాయి. ఎలాగనడక్కండి-ఆ రోజుల్లో పరీక్ష ప్రశ్నా పత్రం మక్కి కి మక్కీ వ్రాసేసినా 30% ఇచ్చేవారు!

   ఇంక ఆఫీసులో మాకు బెంగాలీ స్నేహితులుండేవారు. వాళ్ళు మామూలుగా ‘ఆఫీసు’ని ‘ఘర్’ అంటారు. ఓ రోజున మా తెలుగు స్నేహితుడొకడు, ఇంకో ఆఫీసునుంచి వచ్చి నాతో కూర్చున్నాడు. ఇంతలో ఓ బెంగాలీ స్నేహితుడోడొచ్చి,
మా ఫ్రెండు తో ‘ అభీ అభీ తుమ్హారా ఘర్ సే ఆరహాహూ!‘ అనేసరికి మావాడికి ఖంగారొచ్చేసింది.’ఇదేమిట్రా, నేనిక్కడ ఆఫీసులో ఉంటే వీడేమిటీ, మా ఇంటికి వెళ్ళేనంటాడూ, అసలే మా ఆవిడ ఒక్కర్తీ ఉంది, వీడేం చేసొచ్చాడో’అని.
వాడికి బెంగాలీ వాళ్ళు ఆఫీసునే ఘర్ అంటారూ, మీ ఆఫీసుకెళ్ళొచ్చాడంటున్నాడూ అని చెప్పి వాడిని కన్విన్స్ చేసేటప్పటికి తల ప్రాణం తోక్కొచ్చింది! వీళ్ళు వాళ్ళిళ్ళల్లో ఏదైనా పూజా కార్యక్రమాలున్నప్పుడు, ‘భజన’ కార్యక్రమం కూడా పెడుతూంటారు. భజన కి బదులుగా భోజన్ అంటూంటారు. మనం వాళ్ళింట్లో భోజనం కూడా ఉంటుందని వెళ్ళామా గోవిందా! పూజా, భజన్ అయిన తరువాత, ఓ తాంబూలం చేతిలో పెట్టి పంపేస్తారు! ఇలాటివన్నీ, ఇంకో భాష వారిని కించపరచడానికి వ్రాయడం లేదు, ఒక్కొక్కప్పుడు భాష, యాక్సెంటు తెలియకపోతే వచ్చే కష్టాలెలా ఉంటాయో చెప్పడానికిమాత్రమే.

   నేను చదువుకున్నంత కాలం ‘H’ ని హెచ్చ్ అనేవాడిని. మా పిల్లలు స్కూలికెళ్ళి చెప్పేదాకా ‘ఎచ్’ అంటారని తెలియదు! అలాగే ‘Target’ ని టార్జెట్ అనేవాడిని. టార్గెట్ అనడానికి కొన్నేళ్ళు పట్టింది! అలాగని నేనేదో expert అయిపోయాననుకోకండి.కనీసం ఏదైనా తెలియనప్పుడు Dictionary చూస్తే పోలా! దేనికీ సిగ్గు పడకూడదు. భాష గురించి వ్రాసేను కాబట్టి, నా అనుభవాల్ని మీతో పంచుకోవాలనే ఈ టపా!
ఆగస్టు 29 న భాగ్యనగరం లో జరిగే బ్లాగర్ల సమావేశానికి వద్దామనుకుంటున్నాను. వీలుంటే మన బ్లాగరు స్నేహితుల్ని కలుసుకోవచ్చనుకుంటున్నాను ! See you !!

Advertisements

9 Responses

 1. ‘పాలకోవా’కు ఎంత దుర్గతి పట్టిందో కదా! మీ కోడిగుడ్డు ప్రశ్న కు ఆమె చెప్పిన సమాధానం చదివి ఎంత నవ్వొచ్చిందో.

  గూఢచారిని ఇప్పటికీ ‘గూఢాచారి’ అనేవాళ్ళను ఎందరినో చూశాను. అలాగే సుందరకాండను ‘సుందరా కాండ’ అంటుంటారు. ఇలాంటి మాటలు గుర్తుచేసుకుంటే చాలా ఉన్నాయిలెండి.

  Like

 2. భలే వారే ,!! దూడ పేడ అని వ్రాయనందుకు సంతోషించక
  మళ్ళీ కంప్లైంట్ ఒకటా ! హిందీ వాళ్ళకీ మీలా గోల చేసే తెలుగోళ్ళకీ
  ఇద్దరికీ తెలిసేలా ” గాయ్ పేడ ” అని వ్రాయడానికి ప్రయత్నిస్తారు
  లెండి !!

  Like

 3. excellent post

  Like

 4. చాలా సంవత్సరాల నుండీ నాలో ఉన్న ధర్మ సందేహాన్ని,
  మీ అక్షరాలలో దర్శించినందుకు సంతోషంగా ఉందండీ!
  “పేడ” అనే మాటని ఉత్తరాది/హిందీ వాళ్ళ కోసం రాస్తున్నమని జవాబు;
  మరి అచ్చ తెలుగులో అచ్చు వేసేస్తే, ఎవరికి బోధ పడుతుందనీ>>>>>>>

  Like

 5. ankul can u suggest some songs about half saree function.
  pl.
  as early as possible.

  Like

 6. గొపీకాంత్,

  నాకు అంతగా తెలియదుకానీ, ఈ లింకులో ఏమైనా దొరుకుతాయేమో చూడండి. http://surasa.net/music/lalita-gitalu/#sita_anasuya

  Like

 7. గురువుగారూ, వేణూ,శివానీ, కుసుమాయి,

  ధన్యవాదాలు.

  Like

 8. భలే కలిసింది.. ఇదే నా అనుభవం కూడా.. మొన్న వారం హైద్రాబాద్ వెళ్ళానా.. అబిడ్స్ నుండి కోఠి వెళుతుండగా అక్కడో విజయ వారి దుకాణం ఉంది… అందరూ అంటుటారు కదా.. స్వీట్స్ బాగుంటాయని.. నేనూ అటువేపు అడుగేసి.. ఏమున్నాయా అని చూసాను.. బయటకు కనిపించేలా పెట్టిందొకటే.. దూద్ పేడ…, అది తెలుసు.. చాలా సార్లు తిన్నా కూడాను.. ఇంకేమైనా ట్రై చేద్దాం అని.. తెలుగు అభిమానం ఆగక తన్నుకొచ్చి.. పాలకోవా వుండదా? అని షాపువాడినడిగాను. దూద్ పేడ అంటేనే పాలకోవా మరి.. హిందీలో అట్లంటరు.. తెలుగులో మళ్ళా ఇట్లంటరు.. అని హితబోధ చేసాడు.. నిజంగా నాకు అప్పటివరకూ తెలియదు.. దూద్ పెడ అన్నా పాలకోవా అన్న ఒకటేనని.. మరెందుకు తెలుగులో పలకక…. ఇన్ని తిప్పలు అనుకున్నా మనసులోనే.. షాపువాడితో అనలేదులేండి…. 🙂

  Like

 9. శ్రీనివాసూ,

  ఎంతైనా అది ప్రభుత్వ సంస్థ! ప్రభుత్వం వేలెడితే భాష ఇంకెలా ఉంటుంది నాయనా!!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: