బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–“ఇంకోతికొమ్మచ్చి”


    శ్రీ వెంకటరమణగారితో, మూడు గంటలు గడిపి, వారిరువిరి ఆశీర్వచనాలూ తీసికొని, క్రిందకు వచ్చాము. రమణగారు చెప్పిన ప్రకారం, రెండో రోజు వచ్చి శ్రీ బాపూ గారిని కలవ్వొచ్చూ అని.ఒకవైపున చాలా నిరుత్సాహం చెందాము-అయ్యో బాపు గారిని చూడలేకపోతున్నామే అని.తిరుమల దాకా వెళ్ళి ఆ శ్రీవెంకటేశ్వరుని దర్శనం అవకపోతే మరెలాగుంటుందండీ? శ్రీ రమణగారి ని చూడకలిగాము, అయినా అదో feeling of emptiness , ఇద్దరినీ ఒకేరోజున కలిస్తే ఉండే సంతోషం, ఆనందం వేరు.

    క్రిందకొచ్చేసరికి, కిటికీలోంచి శ్రీ బాపు గారి అబ్బాయి శ్రీ వెంకటరమణ కనిపించారు, పోనీ ఆయనతో ఒకసారి చెప్పి వెళ్దామూ, మర్నాడు శ్రీ బాపు గారిని కలవడానికి వీలుంటుందా అని అడగనూవచ్చూ, అనుకుని, తలుపు తట్టాము.ఆయన తలుపు తీయగానే, నేను ఫలానా అని చెప్పగానే, పూణె నుంచి వచ్చారా అన్నారు.అప్పటికే ఆయనతో రెండు మూడు సార్లు మాట్లాడానుకదా! ‘రండి లోపలికి, నాన్నగారు ఇప్పుడే వచ్చారు, చెప్పి వస్తాను’ అనగానే, ఇంక మా సంతోషం ఏమని చెప్పనూ? దేనికైనా రాసిపెట్టుండాలి. అసలు శ్రీ బాపు గారిని చూడగలనుకున్నామా ఆరోజు.

    ఆయన క్రిందకు రాగానే, ఒక్కసారి ఆయన పాదాలకి నమస్కారం చేసేటప్పటికి, మా జన్మ ధన్యం అయిపోయింది. ఆ నిరాడంబరత, ఈయనేనా అంతంత అద్భుతమైన చిత్రాలు సృష్టిస్తారూ అనిపించింది.అందుకే అంటారు నిండుకుండలు ఎప్పుడూ తొణకవు అని.ఆయనతో గడిపిన గంటన్నరా ఏం చెప్పను? ఆ మధుర క్షణాలు గుండెల్లో జీవితాంతం దాచుకుంటాము.మాట్లాడడం లోనూ అదే నిరాడంబరత. ఏదో మాట్లాడుతూ ‘కందా బచ్చలి’ ప్రసక్తి వచ్చింది-ఆయనన్నారూ, ‘మీ కందా బచ్చలి కూరమీద ఓ కార్టూన్ వేశాను, ఈ వారం స్వాతిలో చూడండి’ అన్నారు.
మాటల్లో ఆయనతో చెప్పాము- ‘గురువుగారూ, మీరూ, శ్రీ వెంకటరమణ గారిలాగ, మేమూ తూ.గొ.జి. ప.గో.జీ వాళ్ళమే’ అనగానే, మాకు ఓ కార్టూన్ తీసి ఇచ్చారు. దానిని మా ఇంటావిడ తను వ్రాసే టపాలో పెడుతోంది.
వారిద్దరికీ ఉన్న కోట్లాది అభిమానుల్లో మేమిద్దరం ఎంత? అయినా వారిద్దరూ అంతసమయం మాకోసం స్పేరు చేశారంటే నమ్మ బుధ్ధికావడం లేదు. అదే అసలు సిసలైన celebrities కీ, pseudo celebrities కీ ఉన్న తేడా!

    ఓ పది నిమిషాలు మాట్లాడి పంపించేయొచ్చు, ఎవరూ అడిగే ధైర్యం చెయ్యరు, అలా ఎందుకు చేశారూ అని.కానీ,వారిద్దరిలోనూ ఉన్న గొప్పతనం, అవతలివారిని completely at home చేయడం. అవతలివారిని సంతృప్తి పరచడంలోనే చూపించారు వారి గొప్పతనమంతా!

   మా చెన్నై ట్రిప్పు పూర్తిగా సార్ధకం అయింది.ఎప్పటికైనా చూడకలుగుతామా అనుకున్న నా ఆరాధ్య దైవాల్ని అదీ ఒకే రోజు కలుసుకొని, వారిద్దరితోనూ అంత సేపు గడపడం, ఇంక జీవితంలో ఏం కావాలి? ఎన్నెన్నో వ్రాయాలనుంది, కానీ మేమనుభవించిన ఆనందానికి అక్షరరూపం ఇవ్వలేకపోతున్నాను. That was a feeling of ecstasy,which I can not express in words.

Advertisements

7 Responses

 1. happy for you sir 🙂

  Like

 2. రాణి,

  థాంక్స్.

  Like

 3. It is good to read your experiences with Sri Bapu and Ramana garu. Their life style should be eye opener for present day people.

  Like

 4. ఫణిబాబు గారూ! ఈ టపా లేటుగా చదివాను.
  రమణ, బాపు గార్లను ఎలా కలుసుకుని మాట్లాడిందీ కళ్ళకు కట్టినట్టు రాశారు. రమణ గారితో మీరు ముత్యాల ముగ్గు డైలాగ్స్ గురించి సంభాషణ మొదలెట్టారు. మరి బాపు గారితో? మొత్తానికి కామెరా ముందు అమిత మితభాషులుగా ఉండే ఆ ఇద్దర్నీ గంటలకొద్దీ ముచ్చట్లలోకి దించేశారన్నమాట! 🙂

  Like

 5. @venu: వాళ్ళు మితభాషులు అని టీవీలో చూస్తే అనిపిస్తుంది కానీ, నాకు మాత్రం మేమెళ్ళినప్పుడు మేమే మితభాషులమా? అని అనుమానం వచ్చింది. పైన అన్నట్లు – ’Completely at home’ భావన కలిగింది.

  Like

 6. వేణూ,
  శ్రీ బాపూ గారితో సంభాషణ మొదలెలాపెట్టానంటే–‘సార్, మీరూ శ్రీ వెంకటరమణ గారిలాగే, నాది తూ.గో.జి, మా ఇంటావిడది మీ ప.గో.జీ’-అని !!

  Like

 7. సౌమ్యా,

  మీరు వచ్చి వెళ్ళారని శ్రీ ముళ్ళపూడి వారి భార్య చెప్పారు.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: