బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-Swine Flu, etc..etc..


    మెము రాజమండ్రి లో ఉన్న ఏణ్ణర్ధం లోనూ, ఆంధ్రదేశానికి సంబంధించి మూడు ముఖ్యమైన సంఘటనలు- ఎలక్షన్లూ,వై.ఎస్ గారి మరణం, రామలింగరాజు అందరి నెత్తిమీదా శఠగోపం పెట్టడం- వీటికంటే, మాకు సంబంధించినంతవరకూ జరిగినదేమిటంటే Swine flu epidemic in Pune. మీరు రాజమండ్రీ లో ఉన్నారుకదా, పూణే లో Swine flu వస్తే మీకేమయిందీ అంటారు. అక్కడే వచ్చింది గొడవంతా.

    మేము వెళ్ళిన మొదట్లో అడిగినవాడికీ, అడగనివాడికీ, కనిపించి పరిచయం అయిన ప్రతీవాడికీ,చెప్పడం- నేను రిటైరు అయి గోదావరి మీద ఉండే అభిమానంతో గోదావరిగట్టున ఓ ఫ్లాట్ అద్దెకు తీసికుని మరీ ఉంటున్నానని,అదేదో రిక్షాల్లో సినిమా యాడ్లకి క్యాసెట్టు పెడతారే అలాగ ప్రతీవాడితో చెప్పేసికున్నాను!ముందరలో ఆహా ఓహో అన్నారు!అదే నా ప్రాణం మీదకొస్తుందనుకోలేదు ముందర!స్వైన్ ఫ్లూ మొట్టమొదట పూణే లో వచ్చిందనీ,అక్కణ్ణించి వచ్చినవాళ్ళు దాన్ని ఇక్కడ(అంటే మన ప్రాంతాల్లో)spread చేయొచ్చనీ అందరికీ ఓ గట్టినమ్మకం ఏర్పడిపోయింది. తెలిసిన ఏ కొట్టుకెళ్ళినా, అదోలా చూడ్డం మొదలెట్టారు.పైగా, ‘మాస్టారూ మీరు కొద్దిగా లైన్లో కాకుండా పక్కకు నుంచోండి‘అంటూ. మొదట్లో నాకైతే ఏమీ అర్ధం అవలేదు.తర్వాత్తర్వాత తెలిసింది, నన్ను వీళ్ళు isolate చేస్తున్నారూ అని!ఆఖరికి దేవాలయాల్లో కూడా,ప్రసాదం చేతిలో పెట్టకుండా, పైనుంచి అరచేతిలో వేసేవారు!భోజనాలమాట దేముడెరుగు, కాఫీక్కూడా పిలవడానికి ధైర్యం చెయ్యలేదు.

   మా ఇంటివెనక్కాల ఓ కార్పొరేటరుండేవాడు, అతను ఉండవిల్లి అరుణ్ కుమార్ కి క్లోజుగా ఉండేవాడు.ఏదో సెలిబ్రైటీ కదా ( రోజూ రామోజీరావు మీద ఏదో ఒకటి అంటూండేవారు)పోనీ ఓ సారి ఆయన్ని కలుద్దామూ అనుకున్నాను.పైగా నాతో చెప్పాడుకూడా, సారు ( ఉండవిల్లి) ఊళ్ళో ఉన్నప్పుడు మిమ్మల్ని తీసికెళ్తానూ అని.అలా చెప్పిన మనిషి పూణే లో స్వైన్ ఫ్లూ వచ్చిందని తెలియగానే పత్తా లేకుండా పోయాడు!ఇక్కడ ఈ గొడవ భరించలేక,పూణే పిల్లలదగ్గరికి వెళ్దామూ అనుకుంటే, మా అబ్బాయి, ‘అక్కడ మీకు ఏ సమస్యా లేకుండా ఉందీ, ఇక్కడకొస్తే, మిమ్మల్ని కూడా చూసుకోవాలీ, ఈ హడావిడంతా అయిన తరువాత వద్దురుగానీ’ అన్నాడు.దాంతో టిక్కెట్లు క్యాన్సిల్ చేశాను.
నేను చెప్పేదేమిటంటే,for the simple reason, we are from pune,మమ్మల్ని చాలా మంది avoid చేశారు! అయినా వాళ్ళని అనేం లాభం లెండి. టి.వీ లూ, పేపర్లూ హోరెత్తించేశాయి,’గొడవంతా పూణే లోనే వచ్చిందీ, అక్కడికి వెళ్ళి వచ్చినవారితో జాగ్రత్తగా ఉండాలీ’ అని! ఈ ఏడాది మొదటి కేసు విశాఖపట్నం లో వచ్చింది. అలాగని కోణార్క్ express, LTT-Vizag express లో వచ్చిన వాళ్ళందరినీ quarantine చెయ్యాలంటారా? ప్రస్తుతం పూణే లో కూడా ఎక్కువగానే ఉంది. అయినా Serum Institute, Pune వాళ్ళు డెవెలప్ చేసి మార్కెట్ చేస్తున్న ఓ వాక్సీన్ ( ముక్కులో వేసేది) వచ్చింది. వచ్చిన గొడవల్లా ఏమిటంటే,ఆ వాక్సీన్ ప్యాక్ ఆఫ్ ఫైవ్ గా వస్తోంది.అయిదుగురుంటేనే కానీ కిట్టుబాటవదు.అంతా కలిపి 1500/- పుచ్చుకుంటున్నారు. పదిహేను రోజులక్రితం మేమందరమూ తీసికున్నాము. ఏ సైడు ఎఫెక్టూ లేదు.ఓ రెండు మూడు రోజుల్లో సింగిల్ డోస్ కూడా వస్తోందట.

    ఈవేళ టి.వీ లో ఆవిడెవరో మంత్రిణి గారి వజ్రాలహారం పోయిందన్నారు. సాయంత్రానికల్లా ఇంకోళ్ళదెవరిదో పదిహెను తులాల హారం పోయిందన్నారు. అదేదో పేద్ద విశేషం అన్నట్లు.ప్రతీ రోజూ వందలాది కొంపల్లో దొంగతనాలు జరుగుతున్నాయి.ప్రతీదానికీ అంత ప్రాముఖ్యం ఇస్తారా? సోనీ వాళ్ళు చేస్తున్నIndian Idol లో మన తెలుగబ్బాయి ఆఖరి మూడు స్థానాల్లోనూ ఉన్నాడుట.అతన్ని నెగ్గించడానికి ప్రతీవారూ SMS చేసి నెగ్గించాలని, అన్ని చానెల్సూ,బ్లాగ్గుల్లోనూ చెప్తున్నారు.ఆ అబ్బాయి <b.బాగానే పాడుతున్నాడు, కాదనం. ఎస్.ఎం.ఎస్ లు ఊరికే రావండి బాబూ.అందర్నీ అడిగే బదులు, ఆ చానెల్( తెలుగు) వాళ్ళే, హాయిగాఎస్.ఎం.ఎస్ లు flood చేయొచ్చుకదా!ఎక్కడినుంచొచ్చాయని ఎవడూ అడగడు, ఎన్ని ఎక్కువొచ్చాయో మాత్రం చూస్తారు.పైగా మన నాయకులందరిదగ్గరా, అంతంత డబ్బులు మూలుగుతున్నాయి, ఆమాత్రం చేస్తే ఏం పోయిందిట!మన తెలుగు ఆత్మగౌరవం తిరిగి తెచ్చుకోవచ్చుగా!

    ప్రతీదానికీ ఈ ఎస్.ఎం.ఎస్ లు అడగడం, ఓ ఫ్యాషనైపోయింది.ప్రతీ రోజూ ఏదో ఒక విషయం మీద ఏదో ఒక చానెల్ అడుగుతూనే ఉంటుంది- తిరుమల కొండమీద తిరుగుతున్న పులి ఆడా, మగా, ఆడైతే ఏ అనీ,మగైతే బి అని ఎస్.ఎం.ఎస్ చెయండి అని.నిన్నేదో చానెల్ లో చూశాను, ‘యథా ప్రజా యథా రాజా’ అని. కార్యక్రమం మొదట బాగానే మొదలెట్టారు. కానీ, రానురానూ, అసెంబ్లీ లో మన వాళ్ళు కొట్టుకుంటారే అలా తయారయింది.ఇంక రాజశేఖర్, మెగా స్టార్ వెనక్కాల పడ్డాడు.అల్లు అరవిందు కూడా, ‘నాలిక కోస్తాను…’ భాషలోకి వచ్చారు.నాయుడుగారు యాత్రల హడావిడిలో ఉన్నారు.విజయవాడలో మన కమ్యూనిస్టు సోదరులు,వాళ్ళుకూడా ఉన్నారూ అని చూపించికుంటున్నారు.
మన రాజకీయ నాయకుల ధర్మమా అని తెలుగు vocabulary భ్రష్టు పడిపోతూంది.సినిమాల్లో డయలాగ్గులు వ్రాసేవారికి కూడా కావలిసినంత కాలక్షేపం!
ఓ వారం రోజులపాటు మీ అందరినీ బోరు కొట్టను.పునర్దర్శనం 18 న.

Advertisements

6 Responses

  1. అయ్యో! యెందుకలగ? వారం రోజులు?

    ‘పూనా’ పోయొస్తారా యేమిటి?

    లేదా, “సింగిలుడోసు” పడేదాకా మాట్లాడరా?

    “….ఆ చానెల్(తెలుగు) వాళ్లే, హాయిగా ఎస్.ఎం.ఎస్ లు ఫ్లడ్ చేయొచ్చుకదా!”

    సూపర్ అవిడియా–మరందరికీ యెందుకు మెరవలేదో?

    18 వరకూ యెదురు చూడక తప్పదంటారు……హూఁ!

    Like

  2. నేను ఉండేది కూడ పూణే లోనే. క్రితం సారి కంటె ఈ సారి కేసులు అగ్రిగేట్ గా చూస్తే 120% ఎక్కవట. ఇదిగో ఈరొజు స్వైన్ ప్లూ స్కోరు http://timesofindia.indiatimes.com/city/pune/H1N1-claims-four-more-lives/articleshow/6290811.cms

    కాని ఈసారి మీడియా కవరేజి అంతగా లేకపోవటం గమనించదగ్గ విషయమే

    Like

  3. కృష్ణశ్రీ గారూ,
    నేను పూణే లోనే ఉన్నానండి బాబూ! సింగిల్ డోసు కోసం వేచిఉండఖ్ఖర్లేదు. అప్పుడే వేయించేసికున్నాను.

    Like

  4. శ్రీనివాస గుప్తా,

    పేపర్లూ, మీడియా వల్లె జనంలో భయం పెరిగిపోయింది.

    Like

  5. నమస్కారం ఫణిబాబు గారూ.

    నేను ప్రస్తుతం ఇండియాలో ఉన్నాను. దాదాపు పది రోజులు మీ బ్లాగులు చదవడం మిస్సయ్యాను. ఈరోజు మొత్తం చదివేసాలెండి 🙂

    నిన్న టీవీలో ఎదో ఛానెల్ చూస్తుంటే “ఫ్లాష్ న్యూస్” అంటూ క్రింద స్క్రోలింగ్. ఏమిటనుకుంటున్నారా?….”హాస్య నటుడు వేణు మాధవ్ కి కడుపునొప్పి” అని. మొదట షాక్ తిన్నా…వెంటనే నా కడుపు నొప్పెట్టేలా నవ్వుకున్నా. నా నవ్వు ఇంకా ఆగనూలేదు, నా కడుపునొప్పి ఇంకా తగ్గనూలేదు, ఇంతలోనే మళ్ళీ ఇంకో స్క్రొలింగ్….”వేణు మాధవ్ కి అపెండిసైటిస్” అని. ఇవెక్కడి న్యూసులండీ బాబూ. నవ్వాలో ఏడ్వాలో తెలియడంలేదు. 😦

    భవదీయుడు
    అబ్బులు

    Like

  6. అబ్బులూ,

    అప్పుడే ఎక్కడ అయిందీ? ఇంకా ఎన్నెన్ని స్క్రోల్స్ చూసి నవ్వుకోవాలో.

    This is only the tip of the iceberg!!

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: