బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– పుణ్యానికి వెళ్తే…


    ఆమధ్యనేదో పాత ‘రచన’ మాసపత్రిక చదువుతోంటే ఒక కథ చూశాను. అందులో ఒక ఎన్.ఆర్.ఐ. ఒకసారి ఇండియా చాలా రోజుల తరువాత వచ్చినప్పుడు తన అనుభవాల్ని ఒక కథారూపంలో వ్రాశారు.అది కథే అయినా,అనుభవం మీదే వ్రాసినట్లనిపించింది.ఎన్నెన్నో ఆశలు పెట్టుకుని ఏ రెండేళ్ళకో, నాలుగేళ్ళకో తమవాళ్ళందరినీ కలిసి, వారితో తమ ఆనందం పంచుకుందామని వస్తూంటారు.కానీ ఇక్కడకొస్తే చూసేదేమిటీ-నాకేం తెచ్చావూ, నాకేం తెచ్చావూ,అరే ఇదా ఇవి ఇక్కడకూడా దొరుకుతున్నాయీ, అంటూ తెచ్చిన వారి ఉత్సాహం మీద నీళ్ళు పోసేస్తూంటారు.పైగా ఇంట్లో వాళ్ళకే కాదు, వాళ్ళవాళ్ళ చుట్టాలకి కూడా తేవాలి.ఇండియా రాగానే ఆచారం ప్రకారం పాపం ఆ అమ్మాయి మొదట అత్తారింటికి వచ్చి, ఆ తరువాతే పుట్టింటికి వెళ్తుంది. ప్రతీ వాళ్ళూ తమకేమీ తేలేదని ఏడవడం తప్పిస్తే ఆ అమ్మాయి ఎలాగ ఉందని ఒక్కళ్ళూ అడిగినపాపానికి పోరు.ఒక్క ఆ అమ్మాయి తల్లి ఒకరే అడుగుతారు-ఒసే అమ్మాయీ, పురుడూ అదీ బాగా జరిగిందా, ఆరోగ్యం ఎలా ఉంటోందీ అని! ఎంతైనా తల్లిప్రాణం కదా! ఆఖరికి వీళ్ళ చిన్న బాబుకి వేసిన డైపర్లతో సహా, ఇక్కడి వాళ్ళు వల్చుకుపోతారు-మాకు ఇలాటి మంచి క్వాలిటీవి దొరకవు ఇక్కడా అంటూ.ఈ కథ నిజానికి చాలా దగ్గరగా ఉంది.బయటి దేశాల్లో ఏదో సుఖపడిపోతున్నారూ, లక్షలకొద్దీ డాలర్లే డాలర్లూ, వాళ్ళు డబ్బుని మంచినీళ్ళలా ఖర్చుపెడతారూ అని ఓ అపోహ ఇక్కడ ఉండే చాలా మందిలో ఉంది. దానికి కారణం ఇక్కడ ఉండేవారి లేకితనమా లేక, అక్కడ చాలాకాలం నుండీ ఉండేవారి ప్రవర్తనా, ఏమో ఎవరికి తెలుసు? ఎవరి ఆర్గ్యుమెంటు వారికి ఉంది.

   ఇదంతా ఎన్.ఆర్.ఐ లకే పరిమితం కాదు. ఇక్కడకూడా,దూరంగా ఉద్యోగార్ధం ఏ నగరంలోనో పనిచేస్తూ, కుటుంబంతో ఓసారి, మన పుట్టిన ఊరూ,ఆ చుట్టుపక్కల ఉండే యాత్రా ప్రదేశాలూ చూద్దామని వెళ్ళండి. మనం ఆ ప్రాంతం వదిలి చాలారోజులయ్యాయి కనుక, అక్కడి పరిస్థితులూ అవీ మనకు తెలియవు. ఊరికే బస్సుల్లో పడి వెళ్ళడం ఎందుకూ అనుకుని, అక్కడ ఉండే మన చుట్టానికి ఫోను చేసి చెప్తాము.ఫలానా తేదీ నుంచి ఫలానా తేదీ దాకా మెము అక్కడికి వస్తున్నామూ,ఓ టాక్సీ మాట్లాడుకుని, చుట్టుపక్కల ఊళ్ళూ, గుళ్ళూ, గోపురాలూ చూద్దాము, వాటన్నిటికీ బుక్ చేసి ఉంచూ అని.ముందరే అడుగుతాము, సాధారణంగా టాక్సీ రేట్లెలా ఉన్నాయీ అని, మర్నాటికి ఆ వివరాలతో ఫోను వస్తుంది- SUV అయితే ఇంతా, Indica/ Santro ఇంతా, AC అయితే ఎంతా non AC అయితే ఎంతా- ఇందులో ఏది బుక్ చెయ్యమన్నావో చెప్పూ అని.మన బడ్జెట్ ప్రకారం ఎదో ఒకటి చిన్న కారు ఫైనలైజు చేస్తాం.ఎలాగూ హొటల్ లో ఉంటే బాగోదు, ఎంతైనా చుట్టాలూ వగైరా మొహమ్మాటాలు.అక్కడ ఒరిగేదేమీ లేదు ఉత్తి సెంటిమెంటు!

   వెళ్ళిన రోజు రెస్ట్ తీసికుని, వాళ్ళ పిల్లలకోసంతెచ్చినవేవో సమర్పించుకుని, మర్నాటి మన యాత్రకి ప్రొద్దుటే రెడీ అవుతాము.ఎలాగూ బయటకెళ్తున్నాము కదా, బ్రేక్ ఫాస్టు బయటే ఎక్కడో తీసేసికోవచ్చులే తో ప్రారంభం అవుతాయి మన కష్టాలు.మొట్టమొదట కారులో కూర్చోవడం-మన హొస్టున్నాడే ఆయన, ముందు సీట్లో సెటిల్ అవుతాడు, ఎంతైనా స్థలప్రాభవం,పైగా డ్రైవరుకి రూట్టూ అదీ చెప్తూండాలి, హొస్టెస్స్ గారు వెనక్కాల ఓ విండో సీటు పుచ్చుకుంటుంది, వాళ్ళ పిల్లలు రెండో విండో ని కబ్జా చేస్తారు.ఇంక మిగిలిన రెండు ప్రాణులూ(అంటే బుధ్ధిలేక వాళ్ళకి ఈ టూర్ అప్పగించిన అభాగ్యులు అంటే మనం!), ఆ హొస్ట్ కుటుంబం కబ్జాచేయగా మిగిలిన లిటికంత ప్లేసులో ఒకళ్ళ ఒళ్ళో ఒకళ్ళు సెటిల్ అవుతారు.
పైగా చేసిన వెధవపని చాలక జోకులోటీ- అరే అన్నయ్యగారూ, వదినా ఎంత రొమాంటిక్ గా కూర్చున్నారో అంటూ-ఇక్కడ కాళ్ళు పట్టేసి ఛస్తున్నారు.

   బాగా పెద్దగా ఉండే హొటల్ కి వెళ్ళడం,మరీ చిన్న హొటళ్ళల్లో మీరు కూర్చోలేరూ అంటూ. మన హోస్ట్ ఫ్యామిలీ ఆ హొటలుకి ఎప్పుడైనా వెళ్ళారో లేదో తెలియదు, వచ్చిన అవకాశం మాత్రం పూర్తిగా సద్వినియోగం చేసికుంటారు, అదెలా తెలుస్తుందంటే, వాళ్ళ పిల్లాడో పిల్లో టిఫిన్ తింటూ,‘డాడీ, చూశావా ఈ హొటల్లో ఎంతబావుందో, ఎన్నిసార్లడిగినా ఎప్పుడూ తీసికెళ్ళేలేదూ’అనే డయలాగ్గు ధర్మమా అని! ఇక్కడ గెస్ట్ మాస్టారికి ఒ ప్లేటిడ్లీ తో సరిపోతుంది.గెస్ట్ గారి భార్యకి, ఎక్కువ తింటే ఎక్కడ ఒళ్ళు చేసేస్తానో అని లైటుగా తేల్చేస్తుంది.అలాగని మనం మిగిలినవాళ్ళని మాడ్చలేంకదా, పైగా ఓ పెద్ద ఆఫరూ, మీకు కావలిసినవేవో మీరే ఆర్డరు చేసికోండీ అంటూ!అంటే నా ఉద్దేశ్యం,యాత్రలకీ, టూర్ లకీ వెళ్ళినప్పుడు కక్కూర్తిగా ఉండమనికాదు.

   ఖర్మకాలి ఏ SUV యో బుక్ చేసికున్నామా, అందులో కష్టాలు ఇంకోలా ఉంటాయి. మన హోస్టెస్స్ ఆ ముందురాత్రే పక్కింటి పిన్నిగారితో చెప్తుంది-మేమందరం మర్నాడు ప్రొద్దుటే బయలుదేరి ఫలానా ఫలానా చోట్లకెళ్తున్నామూ, సాయంత్రానికల్లా తిరిగి వచ్చేస్తామూ అని.ఇంక చూసుకోండి, ఆ పిన్నిగారెవరో మనకి తెలియదు,అయినా సరే, మన హోస్టెస్ తో ‘ అలాగా అమ్మాయీ, ఎప్పటినుంచో చూద్దామనుకుంటున్నానూ, పైగా మొక్కోటి తీర్చుకోవాలి, మా మనవడు పుట్టినప్పుడు పెట్టుకున్నమొక్కు,ఎన్నిసార్లడిగినా, మా పెద్దాడికి వీలే పడ్డం లేదూ, పోన్లే మీతో వచ్చేస్తాన్లే, కొంచెం పుణ్యం ఉంటుందీ, తీసికెళ్ళమ్మా, ఎంతా గుమ్మంలో ఎక్కి గుమ్మంలో దిగడమే కదా‘.అంతే బుక్ అయిపోయాం.హోస్టు ముందర సీటులోనూ, హోస్టెస్ ఓ విండో సీటులోనూ, పిల్లలు ఇంకో విండో సీటులోనూ, భారీ పిన్నిగారు,గెస్టు గారి భార్యా మధ్యలోనూ,ఓ వెధవ మొహం వేసికుని,ముంగిలా వెనక్కాలాఖరి సీట్లో మనమూనూ. పైగా ఎక్కడైనా దిగాల్సొచ్చినప్పుడు, డ్రైవరు వచ్చి డోర్ తీసేదాకా మనకి దిక్కుండదు.ఎక్కేటప్పుడు ముందర తోసేస్తారు.దిగేటప్పుడు ఆఖర్నే!పైగా ప్రయాణం చేస్తున్నంతసేపూ మన హోస్ట్ డ్రైవరుతో ఖబుర్లోటీ, అక్కడికి తనే ఈ ట్రిప్పు స్పాన్సర్ చేసినట్లు!అప్పుడప్పుడు గట్టిగా అరచి చెప్పాలనిపిస్తుంది- ‘ఓరి దగుల్బాజీ డ్రైవరూ, నీకు పేమెంటు చేసేది నేను రా!‘ అని.ఎంత చిత్రహింసో అనుభవిస్తేనేకానీ తెలియదు.

    ఇదంతా మొదటి రోజు ట్రిప్పు. ఇంటికెళ్ళి వంటేం చేసికుంటాంలే అని వచ్చేదారిలోనే భోజనాలోటీ. అన్నీ అయి ఇంటికి రాగానే, మొదట ఇంట్లొకి పారిపోయేవాడు మన హోస్టు. బిల్లు సెటిల్ చేసికోవడానికి, మనల్ని డ్రైవరుకొదిలేసి.ఈ వ్యవహారాలన్నీ చూశాక, మళ్ళీ జీవితంలో ఎవరికీ చెప్పి టూర్ ప్లాన్ చేసికోకూడదనిపించేటంత వైరాగ్యం వచ్చేస్తుంది. హాయిగా ఏ హొటల్లోనో దిగి,మనదారిన మనం వెళ్తే ఉన్న హాయి ఇంకోటి లేదు.అలాగని అందరూ అలా ఉంటారనిలేదు. మన అదృష్టాన్ని బట్టి! ఇంకొందరుంటారు, ట్రిప్పు మొత్తానికి ఎంతయిందో,దాంట్లో సగభాగం పెట్టుకునేవాళ్ళనీ చూశాను.

Advertisements

8 Responses

 1. Very well said sir.ofcourse most of the HOSTS are like that

  Like

 2. వాస్తవాలు రాశారు. అక్కడి వాళ్ళు ఏదో బావుకుంటున్నారు, వాళ్ళను పిండుకోవడం మన ధర్మము అనే మనస్తత్వము. ఆకరుకు చిలక జోతిష్కులు కూడా డాలర్లలోనే అడుతాడు, అక్కడ వాళ్ళకేదో తేరగా వస్తున్నట్టు!
  బాగుంది, ఎంజాయిడ్.

  Like

 3. బాబాయి గారూ, అందరు గృహస్థులూ అలా ఉండరండీ! మా అమ్మగారింట్లో చుట్టాల తాకిడి విపరీతంగా ఉండేది. ఈ మధ్య కాస్త తగ్గింది కానీ మా చిన్నప్పటినుంచీ చుట్టాల వల్ల బాధలు మాలా ఎవ్వరూ అనుభవించి ఉండరు. మీరు చెప్పిన దానికి చాలా వ్యతిరేకం – మా విషయంలో. రోజూ అదనంగా మనిషి లేకుండా మా భోజనాలు అయ్యేవే కావు. ఏదో ఈ మహా నగరంలో స్వంత ఇల్లు అంటూ ఉండబట్టి కానీ, లేకుంటే మా పాట్లు అంతా ఇంతా అయ్యి ఉండేవి కావు. (పెళ్ళయ్యాక కూడా పెద్దగా తేడా ఏమీ లేదు లెండి. మరీ రోజూ కాదు కానీ, దాదాపు ప్రతీ నెలా మా ఇల్లు అతిధులతో ఓ నాలుగైదు రోజులు కళ కళ లాడాల్సిందే! 🙂 )

  Like

 4. పరుగుల జీవితం నుంచి కాసింత వెసులుబాటు కోరుకొని వచ్చి అప్పటి ఆత్మీయతలు వెతుక్కుంటూ వాళ్ళు, పరుగుల జీవితాలలో పాట్లు పడుతూ ఆర్ధిక సంకాటాలతో కూడా ఆర్భాటాలు వదులుకోలేక అతిధులతో వీళ్ళు,మారుతున్న కాలమాన స్థితిలో కాలగమన వేగంలో మారని సామాజిక . వ్యవస్తలో విన్యాసాలు చేస్తూ…. సామాన్యుడు . కాని ఇబ్బడిముబ్బడిగా డబ్బు మూలుగుతున్న వాళ్లకు మొహమాటాలేమీ వుండవులెండి వాళ్లకు ఈ ఇబ్బందులూ వుండవు… ఎటు తిరిగీ మధ్య తరగతిలోని మధ్యతరగాతివారికే ఈ పాట్లు అనుభవాలు.చక్కగా విశ్లేషించారు .ఫణిబాబు గారూ……
  శ్రేయోభిలాషి …నూతక్కి రాఘవేంద్ర రావు.

  Like

 5. విరజాజీ,

  నా టపా చివరలో వ్రాశానుకదా, అందరూ అలాగ ఉండరని.కానీ అలాటివారి శాతం తక్కువ.

  Like

 6. అయ్యా/అమ్మా

  మిమ్మల్ని ఎలా సంబోధించాలో తెలియలేదు. అదేదో ఐ.పి నెంబరూ,ఇంకోటేదో ఐ.డీ అంతా గందరగోళంగా ఉంది.ఏమైతేనేం, నాటపా నచ్చినందుకు ధన్యవాదాలు.

  Like

 7. రాఘవేంద్ర రావుగారూ,

  ధన్యవాదాలు.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: