బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు


    రెండు మూడు రోజులనుండి, పేపర్లలోనూ, టి.వీ ల్లోనూ హోరెత్తించేస్తున్నారు- బాబ్లీ డ్యాం కి మన నాయుడుగారూ, ఇంకో డెభ్భై మంది ఎం.ఎల్.ఏ లూ, మీడియావాళ్ళనీ కలుపుకుని అక్కడకు వెళ్ళారనీ, అక్కడ వీళ్ళని మహరాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారనిన్నూ, దగ్గరలో జైలూ అదీలేక, ఐ.టి.ఐ క్యాంపస్సులో బంధించారనిన్నూ, వారికి బ్రేక్ ఫాస్టులూ, మధ్యాన్న భోజనాలూ సరీగ్గా పెట్టడం లేదనిన్నూ.

   అసలు నాకోటనిపిస్తోంది, రోశయ్యగారే అశోక్ చవాన్ కి ఫోను చేసి,‘మావాళ్ళందరినీ జైల్లో పడేయ్, ఇక్కడ రోజూ అసెంబ్లీలో నా ప్రాణం తీస్తున్నారూ, ఓ వారంరోజులైనా ప్రశాంతంగా ఉండొచ్చూ’అని చెప్పారేమో ! ఒకవిషయం చెప్పండి, వీళ్ళేమైనా పిక్నిక్కు కి వెళ్ళారా లేక హనీమూన్ కి వెళ్ళారా, సకల మర్యాదలూ చేయడానికి! గొడవంతా ఎక్కడొచ్చిందంటే, తెలంగాణా విషయంలో, నాయుడు గారు, అటు ఆంధ్రావాళ్ళకీ, ఇటు తెలంగాణా వారికీ సద్ది చెప్పలేక,ఎవరు పట్టించుకుంటారులే అని ఏవేవో స్టేట్ మెంటులు చేసేశారు. రాబోయే ఉప ఎన్నికల సందర్భంలో, తెలంగాణా వారికి ఆ విషయాలన్నీ గుర్తుకొచ్చి, ఇక్కడకొస్తే కాళ్ళిరక్కొడతామన్నారు. ఇంక issue లేకపోయింది,ఎన్నికలకి.
దాంతో ఉభయతారకంగా ఉంటుందని ఈ బాబ్లీ వ్యవహారంలో popular అవుదామని ఇలా మందీ మార్బలంతో వెళ్ళారు.To be on safe side, మనల్ని టి.వీ ల్లో బోరుకొట్టడానికి, ఓ ముగ్గురు నలుగురు నిలయవిద్వాంసుల్ని, ఇక్కడే వదిలేసి!

   మన టి.వీ. వాళ్ళకి ఏదో ఒక కాలక్షేపం కావాలిగా.ఈ లోపులో, టి.ఆర్.ఎస్ రావుగారు, ఇదేమిటీ బాబ్లీ గోడ పెంచేస్తే మనకి కదా నీళ్ళు రానిది,ఈ నాయుడేమిటీ,తనెళ్ళిపోయాడూ, అనుకుని ‘ఇదంతా ఎన్నికల స్టంటూ’ అని ఓ స్టేట్మెంటిచ్చేశారు!నారాయణ గారికీ, రాఘవుల గారికీ ఊళ్ళో ఎక్కడ గొడవైనా, ఓ స్టేట్మెంటిచ్చేస్తే పోదా అనుకుని left,right,centre బాదేస్తున్నారు.ఈ మధ్యలో మన హోం శాఖామంత్రిణి గారు,’ఎవరింటికో వెళ్ళి, అక్కడ గొడవచేస్తే
వాళ్ళు అరెస్ట్ చేయరా అంటూ ‘ నా పుట్టలో వేలెడితే కుట్టనా’అని చీమన్నట్లు,
ఓ స్టేట్మెంటిచ్చారు. పాపం నాయకులందరూ అక్కడేక్కడికో వెళ్ళి కష్టపడిపోతున్నారూ అనుకుని, మన మిగిలిన ఛోటా, మోటా నాయకులంతా ఓ ‘బంద్’ ఏర్పాటుచేసి, బస్సులన్నీ ఆపేసి గొడవ చేస్తున్నారు.Let the common man go to hell అనేట్లుగా!ఒక్కరోజు ఈ బందులూ, హర్తాళ్ళూ చేయడం వలన, ఆ బాబ్లీ గోడ తగ్గుతుందా, అదేమీ ఒక్కరోజులో చేసిందికాదే, అందరు రాజకీయనాయకులకీ తెలుసు ఆవిషయం.ఎవడికి కావలసినట్టుగా వాడు, దాన్ని exploit చేసుకుంటున్నారు.

    ఇంకో విషయం- గోదావరీ, కృష్ణా కూడా మహరాష్ట్రలోనే పుట్టాయికదా, ఏదో అక్కడ ఖాళీ లేక ఆంధ్రదేశంలోకి పొంగిపొర్లి, సముద్రంలో కలుస్తున్నాయి.మరాఠీ వాళ్ళు వాళ్ళింట్లో ఏదో చేసుకుంటున్నారు,అది పక్కవాడికి బాగోలెదూ అని, ఏదో అన్ని పార్టీలూ కూర్చుని మాట్లాడుకుని, వ్యవహారం సెటిల్ చేసికోవడం పోయి ఈ బందులూ అవీ చేసి, మామూలు జనాల్ని ఇరుకులో ఎందుకు పెడతారో తెలియదు.ఇన్నాళ్ళూ మనవాళ్ళకీ, మరాఠీలకీ ఏ గొడవలూ లేకుండా, హాయిగా ఉంటున్నారు. ఇప్పుడు నాయుడు గారి ధర్మమా అని, ఏం గొడవలొస్తాయో?

    ఈ రాజకీయనాయకులందరూ దొందుకు దొందే,వీళ్ళూవాళ్ళూ బాగానే ఉంటారు, మధ్యలో నలిగిపోయేది మనలాటివాళ్ళే.రోశయ్యగారేమో ఢిల్లీ లో ఆయనగొడవేదో ఆయన పడుతున్నారు. చిరంజీవి గారు తిరుపతి వెంకన్న గురించి, పాదయాత్రచేస్తే పుణ్యం పురుషార్ధం అనుకున్నారు. ఇంక మన టి.వీ.వాళ్ళు అదేదో రెండు దేశాలమధ్య యుధ్ధం అవుతున్నట్లుగా,ఫలానా సరిహద్దు ప్రాంతం అంటూ ఊదరకొట్టేస్తున్నారు…మనదృష్టం ఎలాఉందో, ఈ బస్సుల్నీ,రైళ్ళనీ నమ్ముకుని, రిజర్వేషన్లు చేయించుకోడానికి లేదు, ఏ క్షణాన్న ఏ రాజకీయపార్టీకి ఏలాటి ఆలోచన్లొస్తాయో ఆ దేముడిక్కూడా తెలియదు.

Advertisements

6 Responses

 1. As usual nice post.
  >>వీళ్ళేమైనా పిక్నిక్కు కి వెళ్ళారా లేక హనీమూన్ కి వెళ్ళారా, సకల మర్యాదలూ చేయడానికి!
  నాకూ అదే అనిపించిందండీ.
  ఇంకా మా బాగా అయ్యిందనిపించింది కూడా.ప్రజ ల కోసమే మా పార్టీ అంటూ ఉంటారు కదా ఈ నాయకులు(ఏ పార్టీ వారు అయినా సరే).ఒక్కసారి సామాన్యుడి బాధలు తెలిసాయన్నమాట,నీళ్ళు,కరెంటు,దోమల బాధలు ఎక్సెట్రా.

  బందుల పేరుతో బస్సు అద్దాలు పగలగొట్టడమనే రాజకీయ పార్టీల ఆచారం ఎప్పటికి పోయేనో.ఈ బస్సులు పగిలి,తగల బెట్టడం వల్ల అయిన నష్టాలని పూడ్చుకోవడానికి ఛార్జీలు పెంచితే మళ్ళీ బందు.

  >>ఓ ముగ్గురు నలుగురు నిలయవిద్వాంసుల్ని, ఇక్కడే వదిలేసి!
  “హ హహా..అవును వీళ్ళ వేషాలు,టీవీ లో మళ్ళా చాన్సు వస్తుందో రాదో అన్న ఆత్రుతతో మాట్లాడే పొంతన లేని స్టేట్మెంట్లు…

  Like

 2. నిలయవిద్వాంసుల్ని కాదు విధ్వంసులు అనాలి ఏమంటారు. మరాఠాంధ్ర ప్రజలకు మంచి కాలక్షేపం.

  Like

 3. బందంటే మహా ఆనందంగా ఉంది వీళ్ళకి. దీనికి…ఈ మాత్రం కారణానికే బస్సులు ధ్వంసం చేయొచ్చేమో!!!!!ఇంకేమైనా చేయొచ్చేమో అడిగి చెబ్దురూ…..

  Like

 4. ఋషి,

  ధన్యవాదాలు

  Like

 5. శ్రీవాసుకి,
  థాంక్స్

  Like

 6. విజయభానుకోటె,

  మీరు ఆంధ్రదేశంలో ఉన్నారు కాబట్టి మీరే అడిగితే బాగుంటుందేమో !!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: