బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– పలుకే బంగారమాయెరా!!


    ఇన్నాళ్ళకి టి.వీ. లో ఓ మంచి కార్యక్రమం, చూసే/వినే అవకాశం వచ్చింది.శ్రీ ఎం.వి. అప్పారావు గారి ధర్మమా అని,ముందుగానే తెలిసింది.ఆయన టపాలో వ్రాసేముందరే, నాకు ఫోను చేసి చెప్పేశారోచ్ !పెందరాళే భోజనం చేసేసి, టి.వీ. ముందర తిష్టేసేశాను. మా ఇంటావిడతో చెప్పేశాను, ఈవేళ టి.వీ. నాదీ అని!పాపం తనకీ ఇష్టమే అనుకోండి,అందుకోసమని తన సీరియల్స్ త్యాగం చేసేసి, తనూ సెటిలయిపోయింది. ఈ ఉపోద్హాతమంతా దేనికో తెలిసిందా, ‘ఈ టి.వీ లో ఈవేళ ప్రసారమైన ‘పాడుతా తీయగా’ కార్యక్రమం గురించి. అందులో పాడే పాటలు ఎన్నేన్నో కార్యక్రమాల్లో విన్నాము. నాకు వాటిమీదేం పేద్ద ఆసక్తిలేదు. అలాగని బాగా పాడరనికాదు, విన్నవే మళ్ళీ మళ్ళీ వినాలంటే అంత ఆసక్తిలేదు.నాకున్న ఆకర్షణల్లా ఈ రోజు కార్యక్రమానికి న్యాయనిర్ణేతలుగా వచ్చిన నా దేముళ్ళు-శ్రీ బాపూ, శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ గార్లు ( నరనారాయణులు)!

   శ్రీ బాలూ గారి పరిచయ వాక్యాలే అమోఘం.వారి గురించి శ్రీ బాలూ చెప్పినవి అక్షరలక్షలు!అంతా చెప్పి,వీళ్ళిద్దరూ ఒక్కమాటా మాట్లాడరనే కండిషన్ మీదే వచ్చారు అనడంతోటే, అయ్యో అనిపించింది. శ్రీ బాపు గారి గీతలు చూశాము, శ్రీ రమణగారి రాతలు చదివాము, కొంచెం మాట్లాడితే వాళ్ళ సొమ్మేం పోయిందమ్మా అనుకున్నాను! అంతా బడాయీ( శ్రీ బాపుగారి భాషలో!).అయినా నాకు ఎక్కడో అనిపించింది, బాలూ గారు వీళ్ళని అలా వదిలిపెట్టరూ అని! ఎక్కడో అక్కడ మొహమ్మాటం పెట్టేసి, ఆ మైక్కురొంతా చేతిలో పెట్టేస్తే, ఏం చేస్తారేటీ? అఛ్ఛంగా అలాగే అయ్యింది!

   ఏదో మొదటి గాయకి పాట పాడిన తరువాత,’పోన్లెండి, మీరు ఎలాగా మాట్లాడరూ, పాటెలాగుందోనైనా చెప్పండి’ అనగానే, పెద్ద స్టైలుగా ఓసారి తలూపేశారు.ఇంక ఆతరువాత పాడిన పాటల గురించి, ఏవేవో ప్రశ్నలేసేసరికి,ఊరుకోలేక, శ్రీ బాపు గారు ,కొద్దికొద్దిగా మాట్లాడారు.ఆ పాటల విడియో క్లిప్పులు పెట్టి, మొత్తం కార్యక్రమానికే ఓ విలక్షణమైన శోభ తెచ్చేశారు.శ్రీ బాపూగారైతే కొంచమైనా తన కండిషను ( మాట్లాడనని) సడలించారు. శ్రీ రమణ గారు మరీ పిసినారండి బాబూ
( మాటలలో). మాట్లాడితే ముత్యాలు రాల్తాయన్నట్లుగా మరీ బెట్టుసరి చేసేశారు!
ఎలాగోలాగ, శ్రీ బాలూ గారి ధర్మమా అని శ్రీ రమణ గారిచేత మొత్తానికేమైతేనే, నోరు విప్పించారండి బాబూ! ఏమిటో ఆయన రాతలకీ, మాటలకీ పోలికే లేదు
అలాగనినాకనిపించింది.మరీ సీరియస్సూ. మరి అలాటాయన అంత హాస్యంగా ఎలా వ్రాస్తారో? ఆయన్ని ఇలా చూస్తే, ‘ ఈయనా, శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ గారా ‘ అనిపించిందంటే ఒట్టు!సరసత్తోడు!!!

    ఈ కార్యక్రమానికి స్క్రిప్ట్ వ్రాసిన వారికి,అందులోనూ పరిచయవాక్యాలు, ( వ్రాసిన వారికీ అని ఎందుకన్నానంటే, శ్రీ బాలు, ఓ కాగితంలో ఉన్నది చదివారు) హార్దిక అభినందనలు.9.30. కి మొదలెట్టిన కార్యక్రమం, 11.10 దాకా జరిగినా, ఏమీ చిరాకనిపించలేదు.ఒక్క యాడ్లు తప్పించి. ఒక్కో యాడ్డూ మరీ అన్నిసార్లు చూపించాలా? ఏమో వాళ్ళే టి.వీ. లకి అన్నదాతలు కాబట్టి చూపించాలేమోలెండి.ఏదో పంటికిందరాయిలా,ఆ యాడ్లు వదిలేస్తే, కార్యక్రమం సూపర్!

    ఈ కార్యక్రమం రెండో భాగంలోనైనా శ్రీ బాపూ, శ్రీ రమణగార్లు,మరీ అంత స్ట్రిక్ట్ గా ఉండకుండా,ఇంఖొంఛెం నోరువిప్పి,మనకి విందు చేస్తారని ఆశిద్దాం.బెల్లం మిఠాయి తిన్నంత సంతోషమయింది, నాకైతే!

Advertisements

8 Responses

 1. బాపురమణల పాడుతా తీయగా గురించి వెంటనే చెప్పినందుకు ధన్యవాదాలు.

  నిజానికి బాపుగారికంటే రమణగారే ఎక్కువ మాట్ల్లాడతారు.నేనుకూడా రమణ

  గారితోనే ఎక్కువసార్లు ఫోనుచేసి మాట్లాడుతాను.ఈ సారి మద్రాసు వెళ్ళినప్పుడు

  మిమ్మల్ని తప్పక తీసుకువెళతాను……..అప్పారావు(సు)రేఖాచిత్రం

  Like

 2. పైన చెప్పినట్లు, నిజానికి రమణ గారే ఎక్కువ మాట్లాడతారనే నేనూ విన్నా కానీ, బాపు గారు కూడా బాగా మాట్లాడతారని కలిసాక తెలిసింది! 🙂

  Like

 3. ఈ కార్యక్రమం గురించి ఆఫీసులో కాస్త వర్కు ఎగ్గొట్టి మరీ త్వరగా వచ్చేసాను. మీరనుకున్నట్టుగానే.. బాలూగారు.. “వీళ్ళిద్దరూ ఒక్కమాటా మాట్లాడరనే కండిషన్ మీదే వచ్చారు అనడంతోటే”, నాకు గాలితీసేసినట్టయ్యింది..
  మధ్యమధ్యలో బాపుగారి కార్టున్లు.. బొమ్మలూ.. రమణగారి డయలాగ్గులు.. సీన్లు చూపించారు.. అవి బాగా రక్తికట్టించాయి..

  వాళ్ళను చూస్తే నాకనిపించింది.. వీళ్ళేనా నిజంగా బాపూరమణలు అని.. అంత సాధాసీధా ఏంటండి బాబూ…

  ఇక కార్యక్రమం పూర్తిగా చూడనియ్యలేదు మా కార్తికేయుడు.. వాడి ప్రతాపం చూపించాడు.. సగంలోనే లేచి వెళ్ళిపోవాల్సొచ్చింది..
  వచ్చేవారం కోసం నేనూ ఎదురుచూస్తున్నా.. 🙂

  Like

 4. గురువుగారూ,
  మీకేమిటండిబాబూ.హాయిగా ఎప్పుడు కావలిసిస్తే అప్పుడు మాట్లాడేసికుంటారు.మా లాటి మోర్టల్స్ కి టి.వీ.ల్లో వినే భాగ్యంకూడా ఉండదు!

  Like

 5. సౌమ్యా,

  అదృష్టవంతురాలివి!

  Like

 6. శ్రీనివాసూ,

  ఇంకో వారందాకా ఆగడం తప్ప ఇంకేం చేస్తాం ?

  Like

 7. maream…maream neanu kuuDaa chuusaagaa aa program enchakkaa….!

  Like

 8. అశ్వినిశ్రీ,

  మరేం మరేం ఎంతదృష్టవంతులో కదా !!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: