బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-కొంపా గోడూ -5


    ఊరికి దూరంగా ఇల్లులాటిది కట్టుకుంటే, దానికి సెక్యూరిటీ ఉండదు.ఎంతరావాలనుకున్నా, చుట్టాలు కానీ, స్నేహితులు కానీ రావడానికి ఆలోచిస్తారు.రావాలని మనసే ఉండాలి కానీ, ఎంత దూరమైనా వస్తారు వచ్చేవాళ్ళనొచ్చు.It is more a matter of opinion. మాకు ఓ స్నేహితుడున్నారు పూణె లో, ఆయనో డాక్టరు, ఆయన ఊరికి దూరంగా ఓ బంగళా కట్టుకున్నారు, ఒకసారి ఆయనకి, గుండె నొప్పి వచ్చి, హాస్పిటల్ లో చేర్చేలోపలే పోయారు.అలాగని ఇదో కారణం చెప్పి,ఊరికి దూరంగా ఇళ్ళు కట్టుకోకూడదూ అంటే ఎలాగా అనొచ్చు. నా ఉద్దేశ్యమేమిటంటే, అత్యవసర పరిస్థితుల్లో వైద్య సదుపాయం దొరకదని. దీనికి ఇంకోళ్ళ వాదనేమిటంటే, ఆసుపత్రులు దగ్గరలో ఉన్నవాళ్ళెవరూ చనిపోలేదా అని. అది మన తలరాతమీదాధఅరపడిఉంటుంది. ఇక్కడ by choice మనం ఓ ఇల్లు కట్టుకుంటున్నాము. అదీ తేడా!

ఓపికున్నంతకాలం, ఇల్లు అనేదాన్ని శుభ్రంగా ఉంచుకోగలుగుతాము.వయస్సు పెరిగే కొద్దీ అది కష్టమైపోతుంది.కిందటి టపాలో చెప్పిన పెద్దవాళ్ళు, నగరంలో ఊరికి దూరంగా బాధలు పడలేక, స్వంత ఊరికి వెళ్ళిపోతారు. మళ్ళీ ఎప్పుడైనా కొడుకూ, కోడలూ రమ్మన్నా కానీ, ‘ ఏదో మా జీవితాలు ఇలాగే వెళ్ళిపోనీయ్ నాయనా, ఇక్కడే పుట్టాము, ఇక్కడే మట్టిలో కలిసిపోనీ’ అంటారు.ఎవరైనా ఊళ్ళొవాళ్ళు, ‘అబ్బ మీ పనే హాయండీ, కొడుకూ,కూతురూ ఒకే ఊళ్ళోనే ఉంటునారూ’ అన్నప్పుడల్లా, ఓ వెర్రి నవ్వోటి నవ్వేస్తారు!కొడుకు ఊరికో మూలా, కూతురు ఇంకో మూలా. మళ్ళీ ఎడ్రెస్ లు మాత్రం ఫలానా ఫలానా హైదరాబాద్-500004 ఒకళ్ళూ, హైదరాబాదు-500072 ఇంకోళ్ళూ. అది ముంబై అయినా ఒకటే, పూణె అయినా ఒకటే !

ఇన్ని తిప్పలూ పడి సెపరేట్ ఇల్లెందుకూ అనుకొని, కొంతమంది, ఊరికి దూరంగా ఎపార్ట్ మెంట్లు కొనుక్కుంటారు. ఊరికి మధ్యలో కావాలంటే మనక్కావలిసిన రేట్లలో దొరకవు మరీ.అక్కడా ఊరు పెరుగుతుంది. పెరక్కెక్కడ పోతుంది?కానీ,ఆ పెరిగేవరకూ మనం పడే బాధల సంగతీ? ఎప్పుడో పెరుగుతుందీ అనుకుంటూ కూర్చోడం కన్నా, హాయిగా ఊరికి మధ్యలోనే ఓ అపార్ట్మెంట్ అద్దెకి తీసికోడంలో ఉన్న హాయి ఇంకెక్కడా లేదని నా ఉద్దేశ్యం.అపార్ట్ మెంట్లలో, ఓనర్లందరూ విలన్లనుకోకూడదు. మా మామగారు, తణుకు లో శుభ్రంగా ఇల్లు కట్టుకుని, పాపం విశాఖపట్టణం లో, కొడుకు అద్దెకుంటున్న ఇంటిలో పోయారు.మామూలుగా ఉండే ఓనర్లలా కాక, ఆ ఇంటాయన, బాడీ ని వాళ్ళు అద్దెకుంటున్న పోర్షన్ లోనే ఉండనిచ్చారు. నే చెప్పేదేమిటంటే మన అదృష్టాన్నిబట్టుంటాయి ఇలాటివన్నీనూ.
అద్దెకు ఉంటే ఇంకో హాయేమిటంటే, ఎప్పుడు నచ్చకపోతే అప్పుడు ఇంకో ఇంటికి మారిపోవచ్చు, ఇప్పటి వాళ్ళు ఉద్యోగాలు మార్చడం లేదూ?అలాగే.స్వంతిల్లున్నవాడు, నచ్చినా నచ్చకపోయినా, చచ్చినట్లు తన కొంపనే పట్టుకు వేళ్ళాడాలి!

నేను,తణుకు లో ఓ ఇల్లుకట్టుకుని, ఎందుకు అమ్మవలసివచ్చిందంటే, పిల్లలకి దూరంగా ఉండలేమూ,పోనీ అలాగని, మన తరువాత అబ్బాయేమైనా అక్కడికెళ్ళి సెటిల్ అవుతాడా అంటే అదీ లేదు.పూణే లో పుట్టి పెరిగి, అక్కడకెళ్ళేం చేస్తాడూ? పైగా ఎవరికో దానం ఇచ్చినా ఇచ్చేస్తాడు. అదేదో మేము బ్రతికుండగానే అమ్మేసుకుంటే పోలేదూ అనుకుని, నానా తిప్పలూ పడి అమ్మేశాము.అమ్మగా వచ్చిన డబ్బుకి ఇంకొంత అప్పుచేసి, ఓ రెండు బెడ్రూమ్ములది, ఇక్కడ తీసికున్నాను. అది చిన్నదౌతోందని, దాన్నమేసి ఓ మూడు బెడ్ రూమ్ములది, ఏక్ దం ఊరికి మధ్యలో కొన్నాము.కిందకు దిగితే, కొట్లూ,బ్యాంకులూ, రైల్వే స్టేషనూ ఒకటేమిటి అన్నీ దగ్గరే. ఎవరొచ్చినా ఒకటే మాట, అబ్బ ఇంత మంచిలొకాలిటీ లో ఎలా దొరికిందండి బాబూ అని. అది మేం చేసికున్న అదృష్టం!

హాయిగా తిని కూర్చోక,గోదారీ గట్టుందీ,గట్టుమీదా చెట్టుందీ ... అంటూ, ఓ ట్రక్కుడు సామాన్లేసికుని, రాజమండ్రీ లో ఓ ఎపార్ట్మెంటు అద్దెకు తీసికుని, హాయిగా ఓ ఏణ్ణర్ధం అక్కడ ఠింగురంగా అనుకుంటూ ఉన్నాము.మా కోడలు,సెకండ్ డెలివరీ కోసం, తిరిగి పూణే వచ్చాము. డిజైనర్ ఫ్లాట్ లో, మా ట్రక్కుడు సామాన్లెక్కడ పడతాయీ, అందుకోసమని, మా అబ్బాయిని, సెంటిమెంట్లేమీ పెట్టుకోకు నాయనా అని చెప్పి, హాయిగా అమ్మాయి ఇంటికీ, మా ఇంటికీ మధ్యలో ఓ ఫ్లాట్ అద్దెకు తీసికుని ఉంటున్నాము. పిల్లలకి దగ్గరలోనే. మా ఇద్దరిలో ఎవరికి ఏ రోగం రొచ్చూ వచ్చినా, పిల్లలు దగ్గరలోనే ఉన్నారు.స్వంత ఇంటి కలా తీరింది,మా స్పేసు మాకుంది.పిల్లలకి వాళ్ళ స్పేసు వాళ్ళకిచ్చాము. ఎప్పుడు వాళ్ళకి అవసరం వచ్చినా మేము రెడీ.మాకేమొచ్చినా వాళ్ళు తట్టుకోలేరు, మొన్న కాలు బెణికేటప్పడికి,మా ఇంటికి వెళ్ళి సేవలు చేయించుకోలేదూ? ప్రాణానికి హాయిగా ఉంది. ప్రతీ వారం పిల్లలొస్తారు, స్వంత ఇంట్లో ఉండకుండా, ఇదేమిటీ అనొద్దు.స్వంత ఇల్లొకడుండడం దేనికో మొదట్లోనే చెప్పాను !ఓ సారి ఈ సీరీస్ లో మొదటి భాగం మొదటి పేరా చూడండి.

అందువల్ల, స్వంత ఇల్లూ ఉంది, అద్దె ఇల్లూ ఉంది.Best of both worlds. అవ్వా ఉంది బువ్వా ఉంది. స్వంత ఇల్లు లేదే అని ఊరికే బాధ పడిపోకండి. హాయిగా ఊరికి మధ్యలో అపార్ట్ మెంటోటి,అద్దెకి తీసికుని హాయిగా ఉండొచ్చు.ఎప్పుడు నచ్చకపోతే ఎప్పుడు మార్చేయొచ్చు.No sentiments. No allegiance !! ఏదైనా మన mindset బట్టి ఉంటుంది.మరీ బోరు కొట్టేశానా?

Advertisements

9 Responses

 1. నేను మీ కొంపా గోడూ – 4 లో రాసిన వ్యాఖ్య చదివాక కూడా మీరు “బోరు కొట్టేసానా” అని అడగడం యెమి బాగోలేదు…

  మీ అనుభవ జ్ఞానం అంతా ఇక్కడ ఇలా ఫ్రీగా పంచిపెడుతుంటే అవన్నీ పోగుచెసి ఎక్కడైనా ఒక Anthology చేసి దాచుకుందామా అనిపిస్తుంది…అలాంటిది బోరుకొట్టడమా? Never!!!

  Like

 2. >> మరీ బోరు కొట్టేశానా?

  మామూలుగా కాదు మహాప్రభో, పరమ, చెత్త బోరు కొట్టేసేరు. తిక్కరేగి పోయింది. ఒక్క విజ్ఞప్తి. రెండు మూడు పోస్టులకన్నా ఎక్కువకి లాగకండి దేనినీ.

  Like

 3. IEdu,

  అనుకున్నాను బాబూ.అందుకే అలా అడిగాను.నాకూ అనిపించింది!!Dont worry. Point taken!

  Like

 4. ఏరియన్,

  క్రింద వ్రాసిన ఇంకో వ్యాఖ్య చదివావా? కొంతమందికి నచ్చుతుంది. కొంతమందికి చిరాకు పుట్టిస్తుంది.Both bouquets & brickbats are to be taken sportingly.

  Like

 5. అంతా మామూలే కానీ,
  మీరు ట్రక్కుడు సామానుతో వెళ్ళి రాజమండ్రిలో ఏణ్ణార్థం ఉన్నారే, అదీ వెరైటీ.
  అందరూ అనుకుంటారు కాని, కొంతమందే చేయగలరు.

  Like

 6. To each his own i guess babuji!!!

  @Bonagiri I couldn’t agree more…:)

  Like

 7. బోనగిరీ,

  ధన్యవాదాలు. అలా వెళ్ళడం వల్ల మన బ్యాటరీలు రీఛార్జవుతాయి ( ఐ మీన్ మానసికంగా).

  Like

 8. ఏరియన్

  థాంక్స్.

  Like

 9. @ areien, thanks

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: