బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–కొంపా గోడూ-4


    పట్టణాల్లో ఖాళీ స్థలాలు,కొంతమంది కొనుక్కుని,అందులో ఓ డాబా కట్టుకోవడం చూశాముగా, ఇప్పుడు నగరాలకొద్దాము.ఉదాహరణకి నేను 45 ఏళ్ళనుండి పూణే లోనే ఉంటున్నాను.వచ్చిన కొత్తలో చాలా ఖాళీ స్థలాలుండేవి.ఉంటేమాత్రం, కొనుక్కోడానికి,ఆర్ధిక స్థోమతకూడా ఉండాలిగా.ఇన్నాళ్ళున్నావూ, ఓ గుంఠా(మరాఠీ మాట) స్థలమైనా కొనుక్కోలేకపోయావా, అని చాలా మంది అడిగారు.మనకొచ్చే జీతంలో,స్థలాలే కొంటామా, పెళ్ళాం పిల్లల్ని పోషిస్తామా?ఇంకో విషయం-ఒక్క జీతం మీదే వెళ్ళాలి,అదికూడా వేలూ లక్షలూ కాదు.ఉన్న ఇద్దరు పిల్లలకీ, కడుపు మాడ్చకుండా,చదువు చెప్పించగలిగేమూ అంటే, అదంతా భార్య చలవే.ఎక్కడో అక్కడ, సంతృప్తీ అనేది ఉండాలి.ఇప్పుడు, మా స్నేహితులు చాలామంది, స్వంత బంగళాల్లో ఉంటున్నారంటే
రెండు కారణాలు,మొదటిది వాళ్ళవి double income లు. రెండోది income from other sources ( పోస్టల్ ఏజెంటో, ఎల్.ఐ.సి ఏజంటో,స్టాక్ బ్రోకరో, ట్యూషన్లో).అలాటి నైపుణ్యాలేవీ నాకు లేవు.లేవని ఏడ్చేకన్నా, ఉన్నదానితో సంతృప్తిపడడం నాకు హాయనిపించింది. పైన చెప్పిన కారణాలకి తోడు ఇంకోటుంది, పుట్టింటినుంచి ఆస్థైనా కలిసిరావాలి.ఈ మాత్రం చదువుచెప్పించి, నా తిండి నేను తినేటట్లు చేయగలిగేరు, ఇంకా,b> ఏవో అవి ఇవ్వలెదూ, అవీవ్వలేదూ అని ఏడవడం దేనికీ? ఎంత ఏడిస్తే అంత miserable అవుతుంది జీవితం!

ఏదో చెప్తూ,దేంట్లోకో వెళ్ళిపోయాను.లేని పోని వేదాంతంతో కడుపులు నిండుతాయా అనకండి, నాకు నిండింది! I dont have any complaints. మొన్నామధ్యన, మా అబ్బాయి ఫ్రెండూ వాళ్ళింటికి భోజనానికి వెళ్ళాము. ఊరికి చాలా దూరంలో ఉంది.ఇంట్లోకి వెళ్ళిన తరువాత, ‘అబ్బ ఇలాటి ఇల్లుంటే బాగుండునూ’ అని, ఓ wave లాటిదోటి వచ్చింది, (నాక్కాదు!)
ఆ ఇంటి యజమాని చెప్పేవన్నీ వినాలి. ఎప్పుడో 20 సంవత్సరాలక్రితం గజం throwaway price లో( ఇప్పటి రేట్లతో పోలిస్తే),స్థలం కొన్నారుట,అక్కడ ఏవో తిప్పలు పడి ఓ ఇల్లు కట్టారుట.మాకు తణుకులో ఉన్న ఇల్లులాగానే ఉంది.అమలాపురంలో ఉన్న ఇంటితో కంపేరు చేస్తే, దాంట్లో సగం కంటె తక్కువ.ఇప్పుడు నేనేమీ వాళ్ళని,కించపరుస్తున్నాననుకోకండి,’ఎంత చెట్టుకంతగాలి’.ప్రస్తుత రేట్లతో పోలిస్తే,ఓ కోటిరూపాయలపైనే ఉంటుంది.అలాగని ఆయనేమైనా అమ్మేడా ఏమిటీ ఏదో తంత్తుప్తి కోసం, అనుకోడం, వచ్చిన వాళ్ళు కళ్ళల్లో నిప్పులుపోసుకోడం తప్పించి ఇంకోటేమీ లేదు. ఎవరి సరదా వాళ్ళదీ.

ఊరికి పదిహేను మైళ్ళదూరంలో ఉంది కాబట్టి, చుట్టం అనేవాడెవడూ రాడు,ఎందుకంటే అంతకుముందరోసారి వచ్చి, ఊళ్ళోకి వెళ్ళడానికి నానా పాట్లూ పడ్డాడు.అది పూణె అయినా సరే, హైదరాబాదైనా సరే.విడిగా బంగళాలూ అవీ కట్టించుకోవాలంటే, ఈ రోజుల్లో చేతిలో డబ్బులుండాలి బాబూ.ఓ మాట చెప్పండి, ఇప్పటి పరిస్థితుల్లో, ఎవరైనా ( మిడిల్ క్లాసు వాడు, సాఫ్ట్ వేరు వాడు కాదు), ఏ అమీర్ పేటలోనో ఓ విడిగా ఉండే ఇల్లు కట్టించుకోగలడా? విడిగా ఇల్లు కావాలంటే ఊరికి దూరంగానే వెళ్ళాలి, అది హైదరాబాదైనా, ఇంకో కొంకాపల్లైనా సరే. కట్టారండీ, స్వంత ఊళ్ళో ఉన్న తల్లితండ్రుల్ని తమతో ఉండడానికి తెస్తారు. మీదారిన మీరు ఆఫీసుకి ఒకళ్ళు సెక్రటేరియట్ కీ, ఇంకోళ్ళు ఓ బ్యాంకుకీ పోతారు.వచ్చిన కొత్తలో బాగానే ఉంటుంది, రోజులు గడిచేకొద్దీ,తెలుస్తుంది అందులో ఉండే కష్టాలు.ఊరికి దూరంగా ఉండడంతో ఏ పంచాయితీలోనో ఉంటుంది. కార్పొరేషన్ నీళ్ళు రావు, అధమపక్షం వచ్చినా వాటికి ఏవేవో లిమిటేషన్లుంటాయి.ఓ బస్సు రాదూ, ఓ ఆటో దొరకదూ, ఆఖరికి ఇంటర్నెట్ బ్రాడ్ బాండు కూడా ఉండదు. నాలాటి వాడిని అలాటి చోట కోట్లిచ్చినా ఉండలేడు.ప్రతీ వాడికీ బ్రాడ్బాండుండాలా అనకండి, ఏదో ఒక కాలక్షేపం ఉండాలికదా.ఆఖరికి న్యూస్ పేపరుకూడా ఓ టైముకి రాదు.పొద్దుటే ఆఫీసులకెళ్లిన కొడుకూ, కోడలూ, స్కూళ్ళకీ, కాలేజీలకీ వెళ్ళిన పిల్లలూ, కొంపకెప్పుడు చేరతారో తెలియదు.
ఆఖరికి గాస్ అయిపోయినా, ఇంకో సిలిండరెప్పుడిస్తాడో భగవంతుడిక్కూడా తెలియదు.సో కాల్డ్ మధ్యతరగతి వాళ్ళం, BPL లోకి రాము కాబట్టి, కిరసనాయిలు కూడా దొరకదు.పనిమనిషి సంగతడక్కండి.అవసరం వస్తే డాక్టరు దగ్గరకి వెళ్ళాలంటే,నరక యాతన పడాలి.సాయంత్రానికి కొడుకూ కోడలూ వస్తారు,అప్పటిదాకా బతికుండాలికదా!

పైగా ఊరికింత దూరంలో ఎందుకు తీసికున్నారూ అంటే, అక్కడెక్కడో ఉన్న రాబోయే,IT hub చూపిస్తారు.పోనీ వచ్చిందే అనుకోండీ,వీళ్ళకేం లాభంట, ఓ నారాయణమూర్తో, ఓ ప్రేమ్ జీ కో లాభం కాని. ఊరు పెరుగుతుంది, పెరక్కుండా ఉంటుందా, కానీ ఎప్పటికి? ఎప్పటికో, మన అదృష్టాన్నిబట్టి,అయిదేళ్ళో, పదేళ్ళో, రాత్రికి రాత్రేమీ పెరిగిపోదుకదా!

పైగా ఊళ్ళోనే కూతురు కూడా ఉంటోందనుకోండి, అమ్మా నాన్నా అక్కడే ఉంటున్నారుకదా అని, నెలకో,ఏ రెండునెలలకో వస్తూంటారు. వాళ్ళు నగరానికి నడిబొడ్డులో ఉంటారనుకుందాము, ఏ IT లోనో పనిచేసే అల్లుడో అయితే, ఓ ఎపార్ట్మెంటు అద్దెకో,దేనికో తీసుకుని ఉంటూంటాడు.పెళ్ళాం మాట కాదనలేక ఓ శనాదివారాల్లో, ప్రత్యేకంగా ప్రోగ్రాం పెట్టుకుని, పిల్లలింకా లేకపోతే, బైక్కుమీదా, పిల్లలుంటే కారుమీదా
ముందుగా చెప్పుకుని వస్తారు.వీళ్ళు చెప్పకపోవడం వల్ల,ఈ IT hub కి దగ్గరలో ఉన్నవాళ్ళెక్కడికో పోతారనికాదు, ఆ వచ్చిన వాళ్ళకి extra గా పాలూ, పాపాలూ తెచ్చుంచాలికదా.దగ్గరలో ఓ హొటల్ కూడా ఉండదు, ఏదో పాక హొటల్ తప్పించి. అల్లాటివాటిల్లోకి వెళ్ళడానికి IT అల్లుడుగారికి నచ్చదూ. ఏదో కిందా మీదా పడి, ,b>హా అమ్మా, ఆహా నాన్నా అంటూ కూతురి పలకరింపులూ, హాయ్ అంటూ అల్లుడుగారి పలకరింపూ అవుతాయి.
అంతదూరంనుంచి వచ్చి మరీ గంటా రెండు గంటల్లో వెళ్ళిపోలేరుకదా, సాయంత్రందాకా ఉంటారు. ఈ లోపులో వాళ్ళతో ఎ చిన్నపిల్లలైనా వచ్చేరంటే ఇంక చూసుకోండి, మమ్మీ వెళ్ళిపోదాం, బోరుకొడుతోందీ అంటూ పేచీ. ఈ లోపులో అల్లుడుగారు సెల్ ఫోన్లో ఎవరెవరితోనో మాట్లాడేస్తూంటాడు. ‘हां यार मॅरा इनलास का वहां हूं। क्याकरँ कभी कभी सुन्ना पड्ताना!’అంటూ.
వాళ్ళని తిడుతున్నాడో లేక పొగుడుతున్నాడో తెలియదు, పెద్దాళ్ళకి, అందులో ఇన్లాస్ అనేమాటోటీ అర్ధం అవుతుంది, ఎంత చెప్పినా,ఆంధ్రదేశ నడిబొడ్డునుండొచ్చినవాళ్ళూ !!

మిగిలినవి ఇంకో పోస్ట్ లో !

3 Responses

  1. Why, ofcourse I am patient!!! మీరు ఇల్లుకట్టడం అమ్మెయ్యడం రెండూ అయ్యాయి అనేసరికి అనిపించింది, ఆ ఇంట్లొ బస ఉన్నా లేకపోయినా అమ్మేయ్యడం అనేది చాలా కష్టం అని…అందుకే అలా అన్నాను…

    Like

  2. ఏరియన్,

    నా ఉద్దేశ్యం, ఈ సీరీస్ పూర్తయేసరికి, నేను ఇల్లు ఎందుకు అమ్మేశానో తెలుస్తుంది. ప్రస్తుతం పూణె లో కొనుక్కున్నాము.

    Like

  3. అర్ధమైంది సార్!

    మీ మిని సీరీస్ అదిరింది…మీ శైలి బాగుంటుంది, మీ కధనం చాలా “ఎంగేజింగ్”(తెలుగులో ఏమనాలొ తెలియక)గా ఉంటుంది. ఒక సారి మొదలెడితే చివరిదాకా చదవందే విదలలేము. అన్ని కోణాలనుంచీ రాస్తారు…అది ఇంకా నచ్చుతుంది…

    సరస్వతి యెల్లప్పుడూ ఇలాగే మిమ్మల్ని కటాక్షించి మేము మీ టపాలు మరిన్ని చదివేలా చెయ్యాలని కోరుకుంటూ…

    LaRA!!!

    Like

Leave a comment