బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు


    ఈవేళ మా అమ్మాయి ఆఫీసుకెళ్తూ, నన్ను చూడ్డానికి వచ్చింది, కాలినొప్పితో రెస్ట్ తీసికుంటున్నానుకదా అని.నిన్న రాలేకపోయినందుకు కారణం ఏమిటయ్యా అంటే, మా మనవడి స్కూలునుండి ఓ ‘నోట్’ వచ్చిందిట, వచ్చి క్లాస్ టీచర్ ని కలుసుకోమని.వాడు చదివేది ఏమిటయ్యా అంటే Class 1. స్కూలునుంచి పిలుపొచ్చిందంటే, ఇక్కడ కొంపలు మునిగిపోతున్నా సరే,ప్రళయం వచ్చినా సరే, వాళ్ళు చెప్పిన సమయానికి చచ్చినట్లు వెళ్ళాల్సిందే!అక్కడకి వెళ్ళిన తరువాత,మన turn ఎప్పుడొస్తుందీ అన్నది, మన అదృష్టం మీద ఆధారపడిఉంటుంది! నోరుమూసుకుని వాళ్ళు పిలిచేవరకూ wait చెయ్యడం తప్ప ఇంకో choice లేదు.మా అమ్మాయేమో ఖంగారుపడిపోతూ పాపం వెళ్ళింది, మొత్తానికి తన turn వచ్చిందండి.

    ఆ క్లాసు టీచరమ్మ చెప్పినదేమయ్యా అంటే, ‘మీవాడు ప్రతీ పీరియడ్ తరువాతా పాస్ కెళ్ళాలంటాడూ,పోనీ పంపినా త్వరగా రాడూ, అందుకోసమని ఈవేళ పనిష్మెంటిచ్చి, క్లాసు బయట నుంచోపెడితే, అక్కడ ఇంకో పిల్లాడితో ఆటలాడుతున్నాడూ, ఇంక నేనిచ్చిన పనిష్మెంటుకి విలువేముంటుందీ’అని ఆవిడ complaint! మా అమ్మాయికేంచెప్పాలో తెలియలేదు.ఎంత చెప్పినా మగపిల్లలు కొంచెం hyper active.మా ఆదిత్యని అడిగింది-‘అలా ఎందుకు చేస్తావూ,ప్రతీ గంటకీ ఎందుకు బయటకు వెళ్తావూ ‘అని,వాడంటాడూ.. मै क्याकरू मम्मा,एखी टैम्कॉ होतानहीं, बार बार जानॅ मॅ मजा आता है ! ఇంక వాణ్ణేం చేస్తాం చెప్పండి? పోనీ చదువులో ఎలా ఉన్నాడూ అని అడిగితే
‘దాంట్లో ఏమీ సమస్య లేదూ, అన్నిటిలోనూ ఫస్టే, పైగా అన్నిటికీ అందరికంటే ముందే జవాబు వ్రాసేసి, పక్కనున్నవాడితో కబుర్లు మొదలెడతాడు’.
పోనీ ఇంటికి వచ్చి హోం వర్క్ చేయమంటే,వాళ్ళమ్మని దగ్గరుండమంటాడు, పాపం తనకి ఆఫీసు కాల్సూ వగైరాలతో రాత్రిళ్ళు 10.00 గంటలదాకా బిజీ.వాడిదారిన వాడు, హోం వర్క్ చేసేసి, ఆపుస్తకం వాళ్ళమ్మ మొహానకొట్టేసి,టి.వి.పెట్టుకోడానికి వెళ్ళిపోతాడు.చదవడం లేదూ అనడానికి లేదు.ఎంత చెప్పినా అమ్మాయిలకీ, అబ్బాయిలకీ సహస్రాంతం తేడా ఉంటుంది.అమ్మాయిలయితే,వాళ్ళూ, వాళ్ళ చదువులూ.అబ్బాయిలకి ఊళ్ళో ఉన్న సంగతులన్నీ కావాలి! working women పడే పాట్లు చూస్తూంటే చాలా జాలేస్తూంటుంది.పైగా ఇంకోటి,అబ్బాయిలందరూ అమ్మ కూచి లే! ఆ వెర్రితల్లి కూడా ‘అబ్బ మా అబ్బాయి, నేనంటే ఎంత ప్రేమో అనుకుంటూంటారు’.అదంతా పెళ్ళయేవరకేలెండి!

    క్రిందటి వారం www.outlookindia పత్రికలో ఒక కవర్ స్టోరీ వచ్చింది.అది చదువుతూంటే, ఈ రోజుల్లో సమస్య పిల్లలతోనా, టీచర్లతోనా, లేక తల్లితండ్రులతోనా అన్నదీ అర్ధం అవడంలెదు.ఇదివరకటి రోజుల్లో అంటే మేము చదువుకునే రోజుల్లో,వంటి మీద దెబ్బ పడకుండా స్కూలు చదువయిందీ అంటే ఆ అబ్బాయి exceptionally intelligent అన్నమాట.లేకపోతే, దెబ్బలు తినడం అనేది ఓ పెద్ద విషయంగా ఉండేది కాదు.ఇంకో సంగతికూడా చెప్పుకోవాలి, మరీ గొడ్దును బాదినట్లు బాదేవారు కాదు,అరచేతిలో బెత్తం తోనూ, వేలి ముణుకులమిద పెన్సిళ్ళతోనూ,మరీ సీరియస్సైతే గూబ మీదా కొట్టేవారు. అలా కొట్టేరుకదా అని పిల్లలూ ఇళ్ళకెళ్ళి తల్లితండ్రులతో చెప్పేవారుకాదుకూడానూ.అధవా ఎప్పుడైనా చెప్పినా, పైగా ఇంట్లో కూడా దెబ్బలు తగిలేవి!

    అలాగని ఆరోజుల్లో తల్లితండ్రులు,పిల్లల బాగోగులు పట్టించుకోలేదనలేము కదా.ఒకసారి స్కూలుకి పిల్లాడిని పంపేమూ అంటే, వాడిని ఓ దారిలో పెట్టడం బాధ్యతంతా స్కూల్లో టీచర్లదే.టీచరు అంటే, ఓ గౌరవం అదీ ఉండేది.అలాగని వాళ్ళకేమీ
వేలూ లక్షలూ జీతాలుండేవికావు.కొన్నిచోట్లైతే నెలల తరబడీ జీతాలే ఉండేవి కావు,అయినా వారంతా అదొక స్వంత బాధ్యత క్రింద తీసికుని చెప్పేవారు. ఇప్పటిలాగ గందరగోళంగా ఉండేది కాదు.ఇప్పుడెక్కడ చూసినా కార్పొరేట్ స్కూళ్ళూ,కాలేజీలూ. ప్రతీదానికీ ఎంట్రెన్సులూ,మళ్ళీ వాటికి కోచింగులూ!

    అసలు ప్రతీ సంగతీ రాజకీయం చేయడంతో ప్రారంభమయ్యాయి ఈ గొడవలన్నీ.1965 తరువాత నుండీ, కాలేజీల్లోనూ,స్కూళ్ళలోనూ, రాజకీయ పార్టీలు వేలు పెట్టడంతో దరిద్రం మొదలెట్టింది.దానికి సాయం, ప్రతీ రాజకీయ నాయకుడికీ తెలిసింది, స్టూడెంట్స్ ని పట్టుకుంటే చాలు,వాళ్ళ ధర్నాలకీ వాటికీ కావలిసినంత రిసోర్సెస్ అని.

    మనం ప్రతీరోజూ పేపర్లలో చదివే, టి.వీ.ల్లో చూసే టీచర్ల కిరాతకాలు చూస్తూంటే ఒక్కోప్పుడనిపిస్తూంటుంది, అంతంత ఫీజులు తీసికోడమే కాకుండా, పిల్లల్ని సాడిస్టిక్ గా ట్రీట్ చేస్తూంటే ఏ పేరెంటు మాత్రం చూస్తూ ఊరుకోగలడు?

Advertisements

6 Responses

 1. ఫణిబాబు గారు ఎమ్తటి నిజం చెప్పారు. ముంబాయిలో మా మనవడు కౌస్తుభ్ ను
  ఉదయం డెల్హి పబ్లిక్ స్కూల్కి బుస్సులో పంపడానికి మా కోడలు,అబ్బాయి పడుతున్న
  పాట్లు చూస్తుంటే జాలి వేస్తుంది. పాపం వాడికి నిండా 3 ఏళ్ళు కూడాలేవు. సాక్సూ,బూట్లూ,
  వెనకో బ్యాగూ ! ఏమిటో మనం చదువుకునే రోజులే బాగున్నాయని పిస్తుంది.

  Like

 2. *ఆ వెర్రితల్లి కూడా ‘అబ్బ మా అబ్బాయి, నేనంటే ఎంత ప్రేమో అనుకుంటూంటారు’.అదంతా పెళ్ళయేవరకేలెండి!*
  మీరు పైన రాసి న వ్యాఖ్య నాకు “a son is son till marriage where as a daughter is daughter till death” ఈ కోట్ ని గురుతుకు తెచ్చింది. ఇక్కడ మీరె ఒక్కసారి ఆలోచించండి పేళ్ళి అయిన తరువాత వచ్చిన పేళ్ళాం ఎంత గడుసు ది,గయ్యాళి ది కాక పోతె అతని లో తల్లిదండృల ప్రసక్తి మరచి పోయేట్టట్లు చేస్తుంది. వస్తుతహా అబ్బాయిలే మంచి వారు అని మా నాయనమ్మా, మా అమ్మమల అభిప్రాయం.

  Like

 3. >>చెప్పుకోవాలి, మరీ గొడ్దును బాదినట్లు బాదేవారు కాదు,అరచేతిలో బెత్తం తోనూ, వేలి ముణుకులమిద పెన్సిళ్ళతోనూ,మరీ సీరియస్సైతే గూబ మీదా కొట్టేవారు

  బాగా చెప్పారు.ఈ మధ్య టీచర్లు కూడా మరీ బాదెస్తున్నారు లెండి.అసలు ఎల్కేజీ,యూకేజీ పిల్లల్ని చూస్తే అలా ఎలా బాదాలనిపిస్తుందో.

  2-3 యేళ్ళనుండే పిల్లలు అన్నింటిలో షైన్ అయిపోవాలి అని ఆత్రుత.వీళ్ళని క్యాష్ చేసుకోవడానికి రకరకాల స్కూళ్ళు.పిల్లలకి అన్నీ నేర్పించెయ్యలనే తొందరలో బాదెయ్యడం.తల్లి తండ్రులు కూడా కాస్త మారాలండీ.

  Like

 4. గురువుగారూ,

  థాంక్స్.

  Like

 5. శ్రీ,

  అమ్మమ్మలూ,నాయనమ్మలూ మనవల్ని అలాగే అంటారు. అసలుకంటె వడ్డీ ఎప్పుడూ బాగానే ఉంటుంది!!

  Like

 6. ఋషీ,

  ఇప్పుడు టీచర్లుకూడా మరీ సాడిస్టిక్ అయిపోయారు.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: