బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు


    భాగ్యనగరం కబుర్లు ఇంకో రోజు వ్రాస్తానులెండి. నేను నిన్న వ్రాసిన బ్లాగ్గుకి మాఇంటావిడ తన version
వ్రాసుకుంది. అందుకే అంటారు- మొదటికొద్ది సంవత్సరాలూ మొగుడి మాట పెళ్ళాం వింటుందీ,ఆ తరువాత పెళ్ళాం మాట మొగుడు వింటాడూ, ఇంక ఆ తరువాత వీళ్ళ మాటలు ఊళ్ళో వాళ్ళందరికీ వినిపిస్తాయీ అని, ఊరికే అన్నారా మన పెద్దవాళ్ళూ! ఏమిటేమిటో వ్రాసేసింది ఆవిడ, అదివరకు ఎప్పుడో ఆవకాయమీద తన ‘ టేక్’ వ్రాసి, బ్లాగు లో తన సపోర్టర్స్ అందరినీ కూడగొట్టుకుందిగా, అదీ చూద్దాం ఈ సంబరం ఎన్నాళ్ళో !!

    ఈ మధ్యన మిస్టరీ షాపింగు ప్రకరణంలో ఈ వేళ ‘యాప్ టెక్'(Aptech) వాళ్ళ ‘ఆన్ లైన్ టెస్ట్’ కి ఇన్విజిలేటర్ గా వెళ్ళాను.ఊరికే వాళ్ళు టెస్ట్ ఇస్తున్నంతసేపూ, అక్కడ కూర్చుని, వాళ్ళు కాపీలూ గట్రా చెయ్యకుండా చూడడం,ఆ తరువాత
వాళ్ళకొచ్చిన మార్కులు నోట్ చేసి పంపడం.అంతే. దానికి ఏమీ కంప్యూటర్ నాలెడ్జ్ అఖ్ఖర్లెదు.అయినా నాకేమీ ఉన్నట్లు ప్రిటెండు కూడా చెయ్యను!పరీక్షలు వ్రాసేవారిని సూపర్వైజు చెయ్యడం అంటే బలే సరదా నాకు!ఎంతచెప్పినా నా పరిజ్ఞానం ఎవడూ టెస్ట్ చెయ్యడుగా,అదన్నమాట ఈ సంతోషానికి కారణం !
ముందుగా అక్కడికి వచ్చిన పిల్లల ఐ.డి చెక్ చేయడం,అదేదో పేద్ద ప్రొఫెషనల్ గా చూడ్డం, ఐ.డి తేనివాడికి ఓ లెక్చరివ్వడం, మరీ ఒకళ్ళతో ఒకళ్ళు కబుర్లు చెప్పుకుంటూంటే ఓసారి దగ్గడం! ఇవన్నీ నా చిన్నప్పుడు చదువుకునేటప్పుడు, అసలు నేను ఈ చదువు ఎప్పటికైనా పూర్తి చేస్తానా, లేక జీవితమంతా ఇలా పరీక్షలు వ్రాస్తూనే ఉంటానా, ఎప్పటికైనా ఇన్విజిలేటరుగా కుర్చీలో కూర్చుంటానా అని కలలు కనేవాడిని.ఆ రోజుల్లో మన ఊహలు/కలలు కూడా అలాగే ఉండేవిలెండి
బస్సుల్లో టిక్కెట్లిచ్చే కండక్టరైతే బాగుండుననిపించేది. ఇంకోసారి సినిమా హాళ్ళలో గేటు దగ్గర టిక్కెట్లు చింపేవాడిగా,ఉంటే రోజూ సినిమా ఊరికే చూడొచ్చుగా అనిపించేది!ఏమిటో ఒక్కటీ అవలేకపోయాము! పోన్లెండి కనీసం,పరిక్షల వాచరుగానైనా పెట్టిపుట్టాను! ఆరోజుల్లోని వాచర్ నే ఇప్పుడు స్టయిలుగా ‘ఇన్విజిలేటర్’ అంటారని తెలిసింది!

 7nbsp;  ఆ రూం లో ఓ కుర్చీ వేసికుని,అప్పుడప్పుడు లేచి, ఓ సారి అటూ ఇటూ తిరగడం వరకూ బాగానే ఉంది.అక్కడకేదో, నేను కంప్యూటర్ విషయంలో,పేద్ద జ్ఞానం ఉన్నవాడినేమో అనే అపోహలో వాళ్ళకి జవాబులు తెలియని ప్రశ్నలకి,నన్నడగడం మొదలెట్టారు! పాపం వెర్రోళ్ళు,వాళ్ళకేం తెలుసూ,నాకు ఓ అంటే ఢాం రాదని! ఏదో ఇంట్లో కూర్చుని ఏదో గిలిక్కూండడమే కానీ, బయటకు వెళ్ళి సైబర్ కెఫే లో మెయిల్ చెక్ చెసికోవడం కూడా తెలియని అర్భకుడిని!

    ఇంట్లో పిల్లలందరిదగ్గరా ల్యాప్ టాప్ లు ఉన్నా సరే, దాన్ని వాడడం ఇప్పటిదాకా తెలియదు.ఎంత మెల్లిగా నొక్కినా, ఆ బాణాకారంది కర్సరో సింగినాదమో ఏదో అంటారు,ఎప్పుడూ లొంగదు! అస్తమానూ పారిపోవడమే! ఇదండీ నాకున్న పరిజ్ఞానం! ఏదో వీధిన పడకుండా లాగించేస్తున్నాను! అలాటి ప్రాణిని,సబ్జెక్టులో ప్రశ్నలేస్తే ఎలాగా? ‘ సైలెన్స్’ అంటూ వాళ్ళని కోప్పడేసి,ఏదోలా తప్పించేసుకున్నా! అవన్నీ నా చిన్నతనపు ‘కలలు’. ఆ రోజుల్లో వాచర్లూ అంతే, మనం
చచ్చేటట్లుగా శ్రమ పడి పరీక్షలు వ్రాస్తూంటే, మన వాచరూ, ప్రక్క రూంలోని వాచరూ సినిమా కబుర్లో ఇంకోటో చెప్పుకుంటూండేవారు. వాళ్ళదేంపోయిందీ, వాళ్ళేం చదవాలా బట్టీ పట్టాలా మనలాగ! పిల్లికి చెలగాటం, ఎలుక్కి ప్రాణ సంకటం!

   ఇవన్నీ ఎప్పటికైనా చెయ్యాలనేదే నా జీవిత ధ్యేయం! కానీ ఇందులో తెలియనివాటి గురించి చెప్పడం ‘ఇంక్లూడ్’ అవలేదే! అదొక్కటే బాగుండలేదు!
మొత్తానికి, వాళ్ళచేత టెస్ట్ వ్రాయించి,వచ్చాను. ఊరికే కాదనుకోండి, ఏదో డబ్బులిస్తారు.ఇంట్లో ఉంటే మా ఇంటావిడ బయటకు వెళ్ళి కూరలు తెండీ అంటుంది, బయట మార్కెట్ కి వెళ్తే ధరలు టాపు లేపేస్తున్నాయి.ఒకప్పుడు కిలోల్లో కొన్న ఈ చేతులే, పావుల్లో కొనవలసివస్తోంది ! ఇంటికంటే గుడి పదిలం అంటారు అందుకే!!

Advertisements

9 Responses

 1. చాలా సరదాగా ఉన్నాయండీ మీ మ్యూజింగ్స్! ‘ఆ బాణాకారంది కర్సరో సింగినాదమో ఏదో అంటారు,ఎప్పుడూ లొంగదు!’, ‘ ఇదండీ నాకున్న పరిజ్ఞానం! ఏదో వీధిన పడకుండా లాగించేస్తున్నాను! ’ … భలేగా రాశారు!

  Like

 2. >> ఆ బాణాకారంది కర్సరో సింగినాదమో ఏదో అంటారు,ఎప్పుడూ లొంగదు! అస్తమానూ పారిపోవడమే!
  hahaha 🙂

  Like

 3. Phani sir,
  Thanks for sending a good picture.
  I’ve written a post on our meeting. Please visit my blog and give your opinion. Trust I didn’t hurt you in any way.
  By the way, lakshmi gaaru chaalaa ghaatugaa raasaaru. 🙂
  ramu

  Like

 4. అప్పుడే 300 పోస్ట్లు వ్రాసేసారా ..ఇందాకే మీ శ్రీమతి గారి బ్లాగ్ లో చదివా.. కంగ్రాట్స్..అన్నట్లు మర్చిపోయా.. మొన్న ఎప్పుడో ఫ్రెండ్ ఇంట్లో పాత స్వాతి చూస్తుంటే కోతికొమ్మచ్చి కో మరి దేనికో గుర్తులేదుగాని మీ పొటో చూసా.. ఇక ఒకటే గెంతులు.. ఈయన నాకు తెలుసు నాకు తెలుసని .. అందరికీ చెప్పేసా మీ గురించి 🙂

  Like

 5. చిన్న చిన్న రోజు వారీ సంఘటనలని మీరిద్దరూ భలే సరదాగా, సున్నితంగా చెప్తారు. వదలకుండా అన్నీ చదువుతాను. ఇంట్లో నాతో ఒక్కొసారి మా నాన్న గారూ, మా మావగారూ మాట్లాడినట్టే వుంటుంది.
  శారద

  Like

 6. వేణూ,

  తెలియనిదెదో ఒప్పుకుంటే ఇంటికీ,వంటికీ మంచిదిగా!

  Like

 7. మేధా,

  ధన్యవాదాలు.

  Like

 8. నేస్తం,

  అసలు సంఖ్య 362 ( చిన్నా,చితకా కలిపి).మా ఇంటావిడ సంగతి తెలుసుగా,కరెక్టు గా ఎప్పుడు చెప్పిందీ? ఏప్రిల్ 2009 లో ప్రారంభించాను.
  స్వాతి వార పత్రికలో, ‘కోతికొమ్మచ్చి’ మీద వ్రాసిన ఉత్తరంతోనే, నా తెలుగు టైపింగు ప్రారంభించాను.పనేం లేదుగా, ప్రతీ రోజూ ఓ బ్లాగ్గు పోస్ట్ చెయ్యడం.

  Like

 9. శారదా,
  చాలా థాంక్సమ్మా.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: