బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–‘ లక్ష్మి మొగుడు’


    అమ్మయ్య ప్రాణానికి హాయిగా ఉంది-ఈయన గోల వినలేక పోతున్నామూ,ఈ మూడూ రోజులూ గొడవ వదిలిందీ అనుకుంటున్నారు కదూ.అబ్బే అలా వదులుతానా?ఇంట్లో వాళ్ళెవరికీ,నా గోల భరించే ఓపికా, టైమూ లేదు.నా కున్న బంధువర్గం అంతా నా బ్లాగ్గు స్నేహితులే! మరీ ఎదురుగుండా కూర్చోపెట్టి బోరుకొడితే కష్టం కానీ, ఇలా తోచిందేదో వ్రాసుకుంటూ పోతే, మీరు చదివారా లేదా, పోనీ చదివితే ఏమనుకున్నారూ అనే బాధ ఉండదు,నా కడుపుబ్బరం కూడా తగ్గుతుంది! ఏమంటారు?

మొన్న శనివారం నాడు, మా అగస్థ్య అన్నప్రాశనకి,భాగ్యనగరం వెళ్ళాము( వాళ్ళ తాతయ్య,అమ్మమ్మ ల ఆధ్వర్యంలో జరిగిందిలెండి). ఎలాగూ వెళ్ళాం కదా అని శనివారం నాడు, మా ఇంటావిడ అమ్మ మేనమామగారి కూతురి మనవరాలి మనవడి మేనమామ పెళ్ళికి ( చూశారా ఎంత ‘దగ్గిర’ చుట్టరికమో!) లక్డీకా పూల్ దగ్గర ఉన్న మారుతీ గార్డెన్స్ కి వెళ్ళాము.ఆ రోజు మర్నాడు ప్రొద్దుటే అవబోయే పెళ్ళికి రిసెప్షన్ ట.ఈ రోజుల్లో ముందర రిసెప్షనూ, తరువాతే పెళ్ళిగా! అక్కడ ఒక్కరంటే ఒక్కరూ ( పెళ్ళికొడుకూ, అతని తల్లితండ్రులూ తప్ప) నాకు తెలియదు.
ఆ మాటకొస్తే, మా ఇంటావిడకీ ఎవరూ అంత గుర్తులేరనుకోండి. పేర్లు,చుట్టరికాలూ మాత్రం భేషుగ్గా గుర్తున్నాయి.అక్కడికి వెళ్ళగానే అక్కడ ఉండే బోర్డుల్నీ, వాటిమీదుండే పేర్లనీ బట్టి, ఫరవాలేదూ, కరెక్టు పెళ్ళొకే వచ్చామూ అనుకున్నాము.

కనిపించిన ప్రతీవారినీ అడిగి మొత్తానికి పెళ్ళికొడుకు తల్లి గారిని ట్రేస్ చేశాము.ఆవడేమో, మా ఇంటావిడని, వాళ్ళ ప్రతీ చుట్టం దగ్గరకీ తీసికెళ్ళడం, ‘ మన సీతక్క కూతురొచ్చిందే ( మా అత్తగారి పేరు సీతామహలక్ష్మి లెండి)’ అంటూ పరిచయం చేయడం! ‘ అయ్యో సీతకూతురివా అంటూ బోల్డంత ఆశ్ఛర్యపడిపోవడం! 40 ఏళ్ళక్రితం చూసిన మనిషి ఇంకా బాలా కుమారిలా ఉండదుగా!వాళ్ళూ అమ్మమ్మలూ/తాతయ్యలూ/మామ్మ (మా మనవలూ/మనవరాళ్ళు, మా ఇంటావిడని నానమ్మా అంటారోఛ్!) అయ్యారు, అయినా సరే అదో పలకరింపూ!ఇంక వాళ్ళూ, ఈవిడా ( అంటే మా ఇంటావిడ) ఒకటే ఖబుర్లు! ఒకటా రెండా, నలభైయేళ్ళ ఖబుర్లు చెప్పుకోవాలి.

ఈ కార్యక్రమం ( అంటే ‘ఓహో సిత కూతురివా, వగైరా వగైరా..)జరుగుతున్నంతసేపూ, నన్ను ఎవళ్ళూ మాత్రం పట్టించుకోలేదు.ఇంత పెద్ద మగాడ్ని పట్టుకుని! పాపం ఒక పెద్దావిడ మాత్రం,ముంగిలా వెనక్కాలే నుంచున్న నన్ను చూసి, మా ఇంటావిడని అడిగారు’ ఏమే మీ ఆయనా ఏమిటీ’ అంటూ. మా ఇంటావిడ కూడా అదేదో పేద్ద ఒబ్లైజు చేస్తూన్నట్లు, ‘హా’ అంది.మొత్తానికి నాకూ ఓ గుర్తింపొచ్చేసింది. మరీ ఎవడో పెళ్ళింట్లో సరుకులెత్తుకుపోయేవాడిలా కాక, నాకూ ఓ ‘స్థానం’ ఇచ్చేశారు.అప్పటికే ఓ పాతిక మందిదాకా, గుర్తుపట్టడాలూ( ఆవిడని,నన్ను కాదు, నన్ను ‘ఆల్సో రాన్’ లో వేశారు)వగైరా అయ్యాయి.ఈ లోపులో పెళ్ళికొడుకు తల్లి వచ్చి మా ఇంటావిడని, ప్రత్యేకంగా పిలిచి, పెళ్ళికూతురుని చూపించడానికి తీసికెళ్ళారు.అక్కడ కూడా ‘ జాతి వివక్షణే’ నన్ను పిలవలేదు!పోన్లెండి!

వచ్చిన గొడవల్లా ఏమిటంటే, కనిపించిన ప్రతీ చుట్టానికీ, ప్రక్కనే షాడో లా నుంచున్న, నన్ను ‘ లక్ష్మి మొగుడే’ అంటూ పరిచయం చేయడం. ఒక్కళ్ళంటే ఒక్కళ్ళూ, నా పేరడగలేదు, నా వయస్సడగలేదు, ఏదైనా ఉద్యోగం చేసేవాడినా అని అడగలేదు, అసలు ఊపిరి పీలుస్తున్నానా లేదా అనికూడా అడగలెదు! సింప్లీ ‘లక్ష్మి మొగుడు’ దట్సాల్ !!

వెతగ్గా వెతగ్గా మొత్తానికి నాకూ,వీళ్ళకీ ఉండే ఓ కామన్ ఫ్రెండొకాయన దొరికారు. అమ్మయ్యా అనుకుని,ఆయన్ని పలకరించాను. పాపం ఆయన సంగతీ నాలాగే ‘ఫలానా ఆవిడ మొగుడూ’ అని! ఆయనా వారి భార్య వెనక్కాలే షాడోలా ఫాలొ అవుతూండగా,మొత్తానికి నేను దొరికాను. అదృష్టంకొద్దీ ఆయనతో కబుర్లెసుకున్నాను.
ఇంక మా ఇంటావిడ చుట్టరికాల రివైవల్ కార్యక్రమంలో, ఎవరినో కలవడం,నన్ను పిలవడం, ‘ ఈవిడ తెలుసునా, మన పెళ్ళిలో స్టీలు క్యారీయరిచ్చిందీ,పిల్ల బారసాలకి స్టీలు ప్లేటిచ్చిందీ, గుర్తొచ్చారా’ అంటూ. నాకు నిన్న తిన్నదెదో ఇవాళ్టికి గుర్తుండదు, నలభై ఏళ్ళక్రితం ఎవరు స్టీలు పళ్ళెం ఇచ్చారో, ఎవరు ఉధ్ధరిణిచ్చారో ఎవడికి గుర్తూ? అయినా అదేదో గుర్తున్నట్లుగా, ఓ పోజు పెట్టడం!

ఈ వ్యవహారంలో నన్ను ఇరకాటంలో పెట్టే లోపలే ఇక్కడినుండి వెళ్ళిపోవడం ఆరోగ్యానికి మంచిదీ అనుకుని,మా ఇంటావిడని, వాళ్ళ చుట్టాలతో రాత్రంతా కబుర్లు చెప్పుకోమని, అక్కడ వదిలేసి, ఓ ఆటో పట్టుకుని కాచిగూడా వెళ్ళిపోయాను. అసలు ఈ గొడవంతా ఎందుకొచ్చిందంటే, పదిహేను రోజుల క్రితం, నా మేనకోడలి కొడుకు పెళ్ళికి వెళ్ళాం కదా, అక్కడేమో అందరూ ఈవిడని ‘ఫణి పెళ్ళాం, ఫణి పెళ్ళాం’ అనేకానీ, ఈవిడకి అసలు గుర్తింపే ఇవ్వలేదుట! అందుకని నన్ను ఈ పెళ్ళికి కావాలని తీసికెళ్ళి,తణుకు వాళ్ళేమిటో చూపించింది! ఏమిటో అమాయకుడినీ, ఇవన్నీ తెలియకుండా ‘ట్రాప్ ‘ లో పడిపోయాను!

మా చిన్నప్పుడు ఓ సామెత వినేవాళ్ళం, ఓ పెద్దాయన్ని పెళ్ళైనప్పటినుండీ ‘ పాతూరి బుల్లెంకమ్మ గారి మొగుడూ ‘ అనేవారుట.అంటే ఈ పెద్దాయనకి అస్థిత్వం లేనట్లుగా, అలా మేము వెళ్ళిన పెళ్ళిలో ‘ లక్ష్మి మొగుడు’ గా గుర్తింపు వచ్చింది. అన్ని రోజులూ మనవి కాదుగా! !

Advertisements

37 Responses

 1. ఈ పోస్టు చదువుతూ ఫకాల్న నవ్వడం వల్ల మానిటర్ మీద అంతా నోట్లోది పడింది. మా బాసు వార్నింగ్ ఇచ్చేడు.

  మీరు మళ్ళీ ఇలాంటి పోస్టులు వేస్తే మీమీద కేసు పడుద్ది తప్పదు. చదువుతున్నంతసేపూ నవ్వలేక చచ్చానండి, బుల్లెంకమ్మగారి మొగుడు గారు.

  ఇంతకీ పెళ్ళి భోజనంలో ఏం పెట్టరో చెప్పారు కాదు.

  Like

 2. హ హ!! లక్ష్మి మొగుడు.. !!
  లక్ష్మి గారు అలా కుట్ర పన్నారన్నమాట..మరి మీ రివెంజ్ ఎప్పుడు?

  Like

 3. ఫణి గారు,
  అద్భుతం. ఈ అనుభవం ప్రతి మగ వాడికి ఎదురవుతుందని అర్థమయ్యింది. మనం దిగిన ఒక ఫోటో అర్జెంటుగా నాకు పంపండి. మీరు, మేడం, నేను వున్నది. మోస్ట్ అర్జెంట్.
  రాము

  Like

 4. 🙂 బావుంది. ఎవరి చుట్టరికాల్ని వాళ్ళు రివైవు చేసుకునే కార్యక్రమం ఇది.

  Like

 5. లక్ష్మి మొగుడు గారు,
  మీ బాదు ప్రయాణ ముచ్చట్లు అదే పదనిసలు బాగున్నాయి, అలాగే తను కూడా మిమ్మలని అక్కడ ఏకి ఉండాలే?, ఒక వేళ అలా జరిగితే ఆ లింక్ ఒక్కసారి ఇక్కడ పెట్టండి 😛

  Like

 6. ‘..ఏమిటో అమాయకుడినీ, ఇవన్నీ తెలియకుండా ‘ట్రాప్ ‘ లో పడిపోయాను!’ అంటూనే ఇదంతా బ్లాగులో పెట్టేశారుగా? 🙂

  Like

 7. ఎప్పుడూ ఫణిబాబు పెళ్లాం అంటే మీరు మురిసిపోయారు నా గొప్ప అనుకుని.కాని మీ గుర్తింపు ఎంతవరకో (అందరు మొగుళ్లది అనుకోండి) తెలిసింది కదా. ఉలుకెందుకో?? 🙂

  Like

 8. ఫణిబాబు గారూ,

  ఈరోజు మీ టపా జంధ్యాల గారిని గుర్తు చేసిందంటే నమ్మండి! మీ మీద మీరే జోకులు వేసుకుంటూ ఆహ్లాదకరమైన హాస్యం చక్కగా పండించారు. మా “ప.గో.జిల్లా” ఆడపడుచులతో ఆషామాషీ కాదండోయ్ మరి! ఇక లక్ష్మిగారి టపాకోసం కళ్ళుకాయలు కాచేలా ఎదురుచూస్తున్నాను. 🙂

  భవదీయుడు,
  అబ్బులు

  Like

 9. @లక్ష్మీ మెగుడుగారు.. చాలా బాగా రాసారు..
  తణుకు వాళ్ళు తఢాకా చూపించారు ఐతే.. బాగుంది.. 🙂
  “ఈవిడ తెలుసునా, మన పెళ్ళిలో స్టీలు క్యారీయరిచ్చిందీ,పిల్ల బారసాలకి స్టీలు ప్లేటిచ్చిందీ, గుర్తొచ్చారా’ అంటూ” ఈ ఐడెంటిటీ మాత్రం హైలేట్.. పగలబడి నవ్వుకున్నా.. 🙂

  Like

 10. బాబాయిగారు, చాలా బావున్నాయి మీ విసేషాలు. మొహమాటపడకుండా నవ్వుకున్నాను(కార్యాలయంలొ కదా మరి)…ఊరినించి వచ్చి ఏమి వ్రాస్తారా అని యెదురుచూసాను.
  కాని మరి “you started it” అనే తరహా లొ, మీ చుట్టాల పెళ్ళిలొ పిన్ని కూడా వేగారుగా ఈ పరిస్థితితొ. అందుకని నొ సింపథీస్. 🙂

  Like

 11. అన్ని రోజులూ మీవి కాదు కదండి . అప్పుడప్పుడు ఇలా పిలవబాడుతుంటేనే కాని ఇంటావిడ తడాఖా తెలీదు .

  Like

 12. Very funny.chaalaa baavundi

  Like

 13. IEdu,
  ఇంకా విందు భోజనం ఎక్కడ బాబూ? శనివారం అని ఫలహారం ( అదీ,జిలెబీ,పానిపురీ,ఇంకేదో ఛాట్టో ఏదో) తినేసి,పొమ్మంది!!

  Like

 14. రాం,

  ఆ ఛాన్సూ వస్తుందిలెండి.ఈసారి వాళ్ళచుట్టాల పెళ్ళికి,తనొక్కత్తినే పంపుతాను.నేను ఉన్నానా ఊడేనా అని ఎవరూ పట్టించుకోరు!

  Like

 15. రామూ,
  ఫొటోలు పంపాను.

  Like

 16. చదువరి,

  థాంక్స్.

  Like

 17. raa1,

  అమ్మో ఊరుకుంటుందా! వాళ్ళవాళ్ళని అన్నానని అప్పుడే ఓ బ్లాగ్గు పెట్టింది! http://bsuryalakshmi.blogspot.com/2010/06/blog-post_24.html

  Like

 18. వేణూ,

  మనల్ని మనమే డిఫెండు చేసుకోవాలిగా!

  Like

 19. జ్యోతి గారు,

  మీ దగ్గరనుండి అచ్చం ఇలాటి వ్యాఖ్యే ఆశించాను.ఎంతచెప్పినా,మీవాళ్ళనే సపోర్ట్ చేస్తారు!!

  Like

 20. అబ్బులూ,

  ” మా “ప.గో.జిల్లా” ఆడపడుచులతో ఆషామాషీ కాదండోయ్ మరి!” మళ్ళీ ఈగోలేమిటీ? ‘యూ టూ …’

  Like

 21. శ్రీనివాసూ,
  థాంక్స్..

  Like

 22. ఏరియన్,

  ఆ పెళ్ళిలో వాళ్ళ తణుకు వాళ్ళు చాలామందే ఉన్నారు. నా పరిస్థితంత ‘క్రిటికల్’ గా ఏమీ లేదు! ఊరికే చెయ్యాలని చేసిన ‘డెలిబరేట్’ కుట్ర క్రింద భావిస్తున్నాను ( అధ్యక్షా!!)

  Like

 23. మాలాకుమార్ గారూ,

  తడాఖాలు చూపించడానికి ఇంకా ఎన్నెన్నో మార్గాలున్నాయి!

  Like

 24. ఋషీ,

  థాంక్స్.

  Like

 25. ha ha ha ha !

  Mrs.Phani gari reply kooda chadivanu.
  Thouroughly enjoyed it.

  Like

 26. మీ అభియోగము దానికి మీ శ్రీమతిగారిచ్చిన ప్రత్యుత్తరము రెండూ చదివాను. చాలా సరదాగా ఉన్నాయి. పంచుకున్నందుకు ధన్యవాదాలు.

  Like

 27. తెలుగు యాంకీ,

  ధన్యవాదాలు.

  Like

 28. బాగుందండీ మీ ప్రచ్చన్న యుధ్దం.

  Like

 29. బోనగిరీ,

  ప్రత్యక్షం గా చెయ్యడానికెలాగూ ధైర్యంలేదు. ఏదో ఇండో పాక్ లాగ ఇలా ప్రఛ్ఛన్న యుధ్ధమే బెటరు !!

  Like

 30. ఫణి గారు,
  గుర్తున్నానా. నిజంగా మీ బ్లాగు వలన మా లాంటి(కొత్తగా పెళ్ళైన) వారికి ఎంతో ఉపయొగం. నిజంగా మీకు Hatesoff.

  Like

 31. శివగణేష్,
  గుర్తుండకే నాయనా? మీ మిగిలిన ఇద్దరు స్నేహితులూ ఏమయ్యారు? అప్పుడు ఫోను చేసినప్పుడు, ఇదిగో మళ్ళీ మాట్లాడతానూ, అన్నవాళ్ళు, తుపాగ్గుండుకి దొరక్కుండా మాయమైపోయారు. మళ్ళీ ఉగాదొచ్చేదాకా ఇంతేనా?

  Like

 32. భవానీ,

  థాంక్స్

  Like

 33. నాకు నిన్న తిన్నదెదో ఇవాళ్టికి గుర్తుండదు, నలభై ఏళ్ళక్రితం ఎవరు స్టీలు పళ్ళెం ఇచ్చారో, ఎవరు ఉధ్ధరిణిచ్చారో ఎవడికి గుర్తూ? ……………………….

  🙂 🙂 నవ్వలేక చచ్చానండి…………….

  Like

 34. చాలా కాలం తరువాత ఆఫీసు టాయిలెట్‌లో వెళ్ళి, తృప్తిగా (పిచ్చిలా) నవ్వుకున్నా, తలుపులేసుకుని.

  Like

 35. @మాధవీ,

  థాంక్స్…

  @Snkr,

  మరీ “టాయిలెట్‌లో వెళ్ళి” –ఇది బాగోలేదు…….ఎనీవే థాంక్స్.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: