బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–పెళ్ళిచూపులు-2


    సమాచార మాధ్యమాలద్వారా ఈ మధ్యన పెళ్ళి సంబంధాలు వెదుక్కోవడం చాలా సదుపాయంగా ఉంది. కొన్ని వార్తాపత్రికలు ఆదివారాలు మూడు నాలుగు పేజీలి వీటికే కేటాయిస్తున్నారు.ఇవే కాకుండా కుల ప్రాతిపదికన చాలా చోట్ల వివాహవేదికలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంలోనే, మాకు తెలిసిన ఒకావిడ నిర్వహిస్తున్న వివాహవేదిక గురించి అడిగాను నాకు అవసరమయి కాదు, ఊరికే వివరాలు తెలిసికుందామని, ఏదో వయస్సులో పెద్దవాడిని కదా అని అప్పుడప్పుడు కొందరు నన్నూ అడుగుతూంటారు- మీ ఎరుకలో ఏమైనా సంబంధాలు ఉంటే చెప్పండీ అని-అలాటప్పుడు ఈ వివాహ వేదిక గురించి చెప్పొచ్చు కదా అని. అయినా ఎవరూ అడగలేదనుకోండి- నా పాప్యులారిటీ అలా ఉంది!
ఈ వివాహ వెదిక వారు వాళ్ళదగ్గర రిజిస్టర్ చేసికున్న వధూ వరులని ఓ వేదిక మీద చేరుస్తారుట, వాళ్ళ పెళ్ళంటూ నిశ్చయం అయితే వాళ్ళిచ్చే తృణమో పణమో తీసికుంటారుట.ఇందులో మీరు చేసేదేముందీ అంటే, డాటా బేస్ తయారుచేయడం వరకే వీరి బాధ్యత ట.ఇంక దేనిగురించీ బాధ్యత తీసికోరుట-ఆ తరువాత ఏదైనా గొడవలొస్తే వీళ్ళమీద పడతారేమో అని భయం.కనీసం వాళ్ళిచ్చిన వివరాలైనా వెరిఫై చేస్తే బాగుంటుంది.

    వార్తాపత్రికల్లో వచ్చే ‘మాట్రిమోనియల్స్’ లొ కొన్ని తమాషాలు కూడా జరుగుతూంటాయి. అసలు ఎడ్రస్ ఇవ్వకుండా ఏదో బాక్స్ నెంబరు ఇస్తారు.చివరకు తెలేదేమిటంటే ఈ వధూవరులిద్దరూ ఒకేవీధిలోనో ఒకే ఎపార్ట్ మెంటు సొసైటీలోనో ఉంటున్నట్లు!! ప్రస్తుతం నగరాల్లోనూ, పట్టణాల్లోనూ ఉన్న పరిచయాలకీ, కమ్యూనికేషన్లకీ ఇదో ఉదాహరణ !! ఇవే కాకుండా, ఆఫీసుల్లోనూ ఇంకో చోటా ఒకళ్ళనొకళ్ళు నచ్చేసికుని,వ్యవహారాలు నడిపేవాళ్ళు. ఇది పెళ్ళికి దారితీస్తే బాగానే ఉంటుంది, లేనప్పుడే గొడవలు. ఈ మధ్యన పేపర్లలోనూ, టి.వీ.ల్లోనూ చూస్తున్నాము పోలీసుల సహాయంతో పెళ్ళిళ్ళు చేసికుంటున్న జంటలని.అప్పుడెప్పుడో మన మెగాస్టార్ గారి కూతురు ఆ కుర్రాడినెవరినో పారిపోయి పెళ్ళి చేసుకుంటానంటే జరిగిన హడావిడీ, టి.వీ ల్లో ప్రత్యక్షప్రసారాలూ, సినిమా డయలాగ్గులూ – ఓ వారంరోజులపాటు బోరు కొట్టేశారు! అన్నీ అయిన తరువాత అందరూ కలిశారు, కొసమెరుపేమిటంటే ఆ కుర్రాడిని సెన్సార్ బోర్డ్ లో మెంబరు కూడా చేశారు! అతనికున్న క్వాలిఫికేషన్ ఏమిటో ఇప్పటికీ అర్ధం అవదు! మన తెలుగు సినిమాలు ( ఏ ఒక్కటో అరో తప్ప) అంత దరిద్రంగా ఎందుకుంటున్నాయో ఇప్పుడు తెలిసింది!ఈ కథలో నీతి ఏమిటంటే– ఏ ప్రఖ్యాత వ్యక్తి కూతురునో ప్రేమించేయి, అందులో ఇన్వాల్వ్డ్ వాళ్ళు ప్రఖ్యాత వ్యక్తులు కాబట్టి టి.వీ. పబ్లిసిటీ ఎలాగూ ఉంటుంది, ఆ తరువాత సెన్సార్ బోర్డ్ మెంబరుకూడా అయిపోవచ్చు.హాయి కదూ!పెళ్ళి సంబంధాలకోసం ఇదో ఆప్షన్ అని మనకి జ్ఞానోదయం అయింది!

   కొంతమంది ఎంతమందిని చూసినా ఇంకా జాతకాలమీదే నమ్మకం ఉంచుతున్నారు. జాతకాలు కలిస్తేనే కానీ ముందుకు వెళ్ళరు.ఎవరి నమ్మకం వారిది. అలాగని ఈ జాతకాలూ వగైరా కలిసినా పెటాకులైన పెళ్ళిళ్ళు ఎన్నో చూశాము.దేనికైనా ‘డెస్టినీ’ అనేది ఒకటుండాలి. దీనికి నాస్థికత్వంతోనూ, ఆస్థికత్వంతోనూ సంబంధం లేదు. ‘ ఇఫ్ ఇట్ హాజ్ టు హాపెన్,ఇట్ వుడ్ హాపెన్’ అంతే. దీనికి కారణం లేదు. అసలు ఈ పెళ్ళి సంబంధాలు చూసుకునే వాళ్ళు,ముందరే వాళ్ళకి కావలిసిన విషయాలు అన్నీ చూసుకుని, అన్నీ సరిపోయాయీ అన్న తరువాతే పెళ్ళి చూపులకి వెళ్ళొచ్చు కదా, అబ్బే ఇంట్లో వాళ్ళు చూడాలి, బయటి వాళ్ళు చూడాలి,వీళ్ళందరూ స్క్రీనింగు చేసిన తరువాత మన కాబోయే వరుడు చూస్తాడు. పోనీ ఈయనేమైనా ఒప్పుకుంటాడా, ఇంకో రెండు మూడు సంబంధాలు చూసిన తరువాతే ఏసంగతీ తేలుద్దామంటాడు.ఇన్ని హడావిళ్ళలోనూ అందరూ ఒక సంగతి మర్చిపోతున్నారు- ఇంతమంది చూసిన తరువాత కూడా ఆ పిల్లకి గ్యారెంటీ ఏమీ ఉండదు,తన పెళ్ళి అవుతుందో లేదో. ఆ పెళ్ళికొడుక్కేంపోయిందీ,తల్లితండ్రులు చూపించినన్ని సంబంధాలు చూస్తాడు.

    అన్ని విషయాలూ ముందరే మాట్లాడుకుని అందరూ ఒకేసారి కట్టకట్టుకుని వెళ్ళి ఏసంగతీ చెప్పేయొచ్చుకదా.ఈ కాబోయే వరుళ్ళకి, తాము ఎన్ని సంబంధాలు చూస్తే అంత గొప్పనుకుంటారు. వాళ్ళ స్నేహితులతోటి చెప్పుకోవచ్చుగా!ఇంతకంటె ఇంకో ‘వాలిడ్ రీజన్’ కనిపించడంలేదు. కావలిసినంతమందిని చూడొచ్చు, వద్దనం, కానీ అందరినీ ‘వెయిటింగ్ లిస్ట్’ లో పెట్టి, అవతలి వాళ్ళని క్షోభ పెట్టకూడదు. అసలు ఈ వ్యవహారాలన్నీ భరించలేక ఏ అమ్మాయో ధైర్యం చేసి’అసలు నువ్వే నాకు నచ్చలేదూ’ అందనుకోండి, వీళ్ళ సంగతి ఏమౌతుంది? ఇంకా మనదేశంలో ఆడపిల్లలు మరీ తెగించి అలా అనడంలేదు. అలా అన్నరోజున మరి ఈ పెళ్ళికొడుకుల పరిస్థితి ఏమౌతుంది? అందుకనే ఏ విషయమైనా తెగేదాకా లాక్కూడదు! లాగితే అంతే సంగతులు!

    చెప్పొచ్చేదేమిటంటే ఈ పెళ్ళి చూపుల తతంగం, ఎవరినీ నొప్పించేటట్లుగా ఉండకూడదు. నచ్చితే నచ్చిందనండి.లేకపోతే అక్కడికక్కడే చెప్పేయండి.’ ప్రపంచంలో ఈ పిల్లొకత్తేనా’ అని ప్రతీ పెళ్ళికొడుకూ అనుకున్నట్లే, ‘ వీడొక్కడేనా’ అని పెళ్ళికూతుర్లు కూడా అనుకోవచ్చు. ఎంతైనా కీడెంచి మేలెంచడం మంచిదికదా!

Advertisements

6 Responses

 1. >>ఏ విషయమైనా తెగేదాకా లాక్కూడదు! లాగితే అంతే సంగతులు!

  బాగా చెప్పారు.

  Like

 2. మీ బ్లాగ్ చాలా బావుందండీ
  destiny గురించి మీరు చెప్పింది చాలా కరెక్ట్

  Like

 3. బంగారుతల్లీ,

  అంతేకదమ్మా !!

  Like

 4. హరేకృష్ణ,

  థాంక్స్.

  Like

 5. ఫణిబాబుగారు.. బాగా చెప్పారు..
  కానీ ఇప్పటి పరిస్ధితుల్లో… వాస్తవాలు వేరుగా వున్నాయి
  అమ్మాయి అబ్బాయికి షెడ్యూల్ ఇచ్చి నలుగురైదుగురు అబ్బాయిల్ని చూస్తుంది..
  ఒక వారం తరువాత చెబుతామంటున్నారు… ఏ కబురూ రాదు.. పోనీలే హడావిడిలో మర్చిపోయారేమో అని అబ్బాయి తరపువారు ఫోనుచేస్తే.. లేదండీ ఇప్పుడప్పుడే మా అమ్మాయికి ఇంట్రేస్ట్ లేదండీ అని చెబుతున్నారు.. ఏ ఇంట్రస్టూ లేకుండా ఇన్ని తతంగాలు ఎందుకు చేసినట్టూ.. అనుకుని ఊరుకున్నాకా తెలిసేది అసలు విషయం. అమ్మాయికి మనకన్నా మంచి ఆన్ సైటు సంబందం వచ్చిందీ అని..

  జాతకాలొద్దూ.. గోత్రాలొద్దూ.. కట్నాలొద్దు.. ( ఇంకా క్యాస్ట్ నో బార్ వరకూ రాలేదులేండి…) మంచి అమ్మాయిచాలు అని ఉన్న అన్ని కండీషన్లూ కాంప్రమైజ్ అయ్యి.. వల చేతిలోవేసుకుని తిరుగుతున్నా దొరకడం లేదు అమ్మాయలు.., అందుకేనేమో అమ్మాయిల తండ్రులు గుండెలమీద చెయ్యివేసుకుని హాయిగా నిద్రపోతున్నారు.. 🙂

  నాకు లక్కీగా చూసిన మొదటి సంభదమే ఒకే అయ్యిందిలేండి.. లేకపోతే నేనెక్కడ తిరిగేది వలలు పట్టుకుని.. 😀

  అన్నట్లు.. మా ఫ్రండ్ ఒకడున్నాడు.. మంచిజీతం.. మంచి ఉద్యోగం.. మంచి మనిషి.. ఎదన్నా సంభంధం ఉంటే చూడకూడదూ??? 🙂

  Like

 6. శ్రీనివాసూ,

  నీలాటి,నాలాటి బుధ్ధిమంతులు మరీ ఎక్కువమందిని చూడఖ్ఖర్లేకుండా సెటిల్ చేసేసికున్నాము.కానీ అందరూ అలాగ కాదుగా. ఎన్ని సంబంధాలు చూస్తే అంత గొప్ప.నా బ్లాగు అలాటి ‘మగధీరుల’ గురించి.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: