బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–మధ్యతరగతి మనస్థత్వం


    మొన్న శనివారం నాడు, మా అమ్మాయి ఆడపడుచు వాళ్ళ వివాహ సిల్వర్ జూబిలీ కి పిలిస్తే వెళ్ళాము.ఆ రోజు మా అబ్బాయి, ల్యాండ్ మార్క్ వారు ముంబైలో నిర్వహించిన, క్విజ్ పోటీకి వెళ్ళవలసివచ్చింది. అందువలన, మా అమ్మాయీ అల్లుడూ వచ్చి మమ్మల్ని తీసికెళ్ళారు.మా అబ్బాయి టీం, క్విజ్ లో సెకండ్ వచ్చారు. ఆగస్ట్ 15 న చెన్నైలో జరిగే నేషనల్ ఫైనల్ కి
క్వాలిఫై అయ్యారు.

   పూణే లో సోలాపూర్ హైవే మీద ‘సంస్కృతి’ అని ఓ రిసార్ట్ ఉంది. అక్కడ పెట్టారు వీళ్ళ ఫంక్షన్.మేము మా తాహతుని బట్టి ఏదో చిన్న బహుమతీయే తీసికెళ్ళాము.మా అల్లుడు, వాళ్ళ అక్కా, బావగార్లకు ఏదైనా గిఫ్ట్ తీసికెళ్ళాలని, ‘సద్గురూస్’ అని ఓ షాప్ కి తీసికెళ్ళాడు. వామ్మోయ్ అక్కడ ఏదీ కూడా,నాలుగైదు వేలకి తక్కువ లేదు!అన్నీ అవేవో ఆర్ట్ పీసులూ, వగైరా….అలాటివాటిలోకి మొట్టమొదటి సారిగా వెళ్ళామేమో, అంతా విచిత్రంగా ఉంది.అప్పుడప్పుడు,పత్రికల్లోనూ, పుస్తకాల్లోనూ చదవడం,బొమ్మలు చూడడమే కానీ అంత దగ్గరగా వాటిని చూసిందెక్కడ?

    అక్కడ కొన్ని కొన్ని పైంటింగ్స్ ఉన్నాయి. నా బుర్రకేమీ అర్ధం అవలేదు.వాటిని ఎప్రీసియేట్ చేసేటంత యీస్థటిక్ సెన్స్ కూడా లేదు. కానీ, మా మనవరాలు తాన్యా అడిగిందీ ‘ తాతయ్యా,క్యా ఆప్కో కుచ్ సంఝా క్యా?ఇస్ మే కౌన్సీ చీజ్ హై.ఐ కెన్ డు బెటర్’అంది.పోన్లే నేనే కాదు, నాలాటి వాళ్ళు ప్రపంచంలో ఇంకా చాలా మందే ఉన్నారు అనుకున్నాను.నేను చెప్పేదేమిటంటే,మన వాళ్ళల్లో చిత్రాలు గీసే వడ్డాది పాపయ్య గారనండి, లేక మన ‘బాపూ’ గారనండి, రవి వర్మ అనండి, వాటిని చూస్తే వారు వేసిన చిత్రాల్లో ప్రాణం ఉంటుంది. ఈ ఆర్ట్ గ్యాలరీల్లో వేసే చిత్రాల్లో ఏం ఉంటుందో నాకైతే ఇప్పటికీ తెలియలేదు.అయినా సరే వాహ్ వాహ్ క్యా చీజ్ హై అనడం ఒక స్టేటస్ సింబల్ !

    బహుశా నా మిడిల్ క్లాస్ మెంటాలిటీ వల్ల నాకు అర్ధం అవమేమో. ముందునుండీ ప్రభుత్వోద్యోగంలోనే పనిచేసి, అందులోనూ రిటైర్ అయే సమయానికి ఆఫీసరు(అదీ గ్రూప్ బి) అయ్యాను, బహుశా, నా మనస్థత్వం కూడా అలాగే ఉండిపోయింది.ఇప్పుడు రిటైర్ అయ్యాక, పిల్లలు సంపాదించి, ఎక్కడెక్కడికో అంటే ఇదివరకెప్పుడూ వెళ్ళని లోకాలికి తీసికెళ్ళినా, బేసిక్ గా ఉన్న మనస్థత్వం మారదు కదా! అప్పుడప్పుడనుకుంటూంటాను, ఇలాటివాటికి వెళ్ళకపోతేనే ప్రాణానికి హాయిగా ఉంటుందని, కానీ పాపం మాఇంటావిడేం పాపం చేసికుంది,అలాటివాటికి వెళ్ళకుండా ఉండడానికీ అనుకొని, మా పిల్లలు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్దామంటే తలూపేస్తూంటాను. ఏది ఎలా ఉన్నా అలాటిచోట్ల ఎవరికీ మాటరాకుండానూ, వీలైనంతవరకూ ఎవరిచేతా మాట పడకుండానూ లాగించేస్తున్నాను!

   ఏది ఏమైతేనేం, మొత్తానికి అక్కడికి వెళ్ళాము.అక్కడి వాతావరణం చాలా బాగుంది. మణిపూర్ బృందం వారు చేసిన గెడకర్రలతో డ్యాన్సూ,కత్తి యుధ్ధాలూ వగైరా, సినిమా పాటల తంబోలా,ఇంకా ఏవేవో ఉన్నాయి.భోజనం, స్నాక్సూ కూడా బాగున్నాయి.రాత్రి 12.00 గంటలదాకా మన ఇష్టం వచ్చినట్టు గడపొచ్చు(తిండి తో సహా!). ఖరీదు కూడా అంత ఎక్కువ కాదు( ఈ మధ్యన ఇలాటి వాటికి వెళ్ళి వెళ్ళి నాలోకూడా మార్పొస్తూంది!) 450/- రూపాయలు.ఇంకా ఏవేవో మెహిందీ, టాటూ, జాతకాలూ కూడా ఉన్నాయి.

    ఎప్పుడైనా బయటకి వెళ్ళాలంటే సిటీ బస్సులోనే వెళ్ళడం, ఆటో ఛస్తే ఎక్కను. అప్పుడప్పుడు మా ఇంటావిడని మేము అద్దెకుండే ఫ్లాట్ కి తీసికెళ్ళినప్పుడు, వెళ్ళేటప్పుడు ఆటోలోనే తీసికెళ్ళినా, తిరిగి వచ్చేటప్పుడు పోనీ బస్సులో వెళ్దామా అని కక్కూర్తి పడి అడూగుతూంటాను.అదేం ఖర్మమో,ఎప్పుడూ బస్సుగురించి వెయిట్ చేయడం, మా ఇంటావిడ తిప్పలు చూసి నా బి.పి. పెంచేసుకోవడం, జీవితంలో ఎప్పుడూ ఇంక నిన్ను బస్సుల్లో తీసికెళ్ళనులే అంటూ ఓ లెక్చరిచ్చేయడం. అసలు తనకి బయటకు రావడానికే కుదరదు, ఎప్పుడో అమావాస్యకీ, పౌర్ణమికీ బయటకు వస్తే నాతో గోల ! ఇదిగో దీన్నే మిడిల్ క్లాస్ మెంటాలిటీ అంటారు. ఎప్పుడో నెలకోసారో, రెండుసార్లో తీసికెళ్ళేదానికి, హాయిగా రానూ పోనూ ఆటోలోనే తీసికెళ్ళొచ్చుగా, అబ్బే, అలా కాదు,అక్కడ కక్కూర్తి.జీవితంలో అసలు ఎప్పటికైనా బాగుపడతానా?

Advertisements

8 Responses

 1. ఎందుకండీ అంత కష్టపడి పిల్లల కోసం కూడబెడుతున్నారు.ఈ వయసు లో ఆటోల్లో వెళ్ళొచ్చు కదా ఇంకా. ఇంతా చేస్తే, మీ పిల్లలకి ఒక ముక్కులోకి కూడా రాదు, అలంటి బడా ఖర్చులతో.

  నాదీ మీ లాంటి మనస్తత్వమే, కానీ ఎక్కడ అవసరమో అక్కడ కర్చు పెడతాను.గొప్పల కోసం అయితే ఒక్క పైసా కూడా కర్చు చేయను.మధ్య తరగతి వాళ్ళు తినే హోటల్స్ లో ఉండే రుచి, గుడ్డి వెలుతురూ లో రుచి తెలియని ఐదు నక్షత్రాల హోటల్స్ ఇవ్వలేవు, నేను ఎంత సంపాదించినా, తక్కువైన, ఎక్కువైనా ఇలాగె ఆలోచించాను, ఆలోచిస్తాను.

  మీ వయసు మా నాన్న గారిది.ఆయన ఇప్పుడిప్పుడే ఆటోలో వెళ్తున్నారు, ఇంకా ఓపిక లేక, బస్సుల కోసం వేచి చూట్టం ఎండలో, చలిలో.మా చెల్లి, తమ్ముడు విచ్చల విడిగా కర్చు పెట్టేస్తారు.భోజనం చేస్తే 500 rs.

  మిడిల్ క్లాసు హోటల్స్ లో తినరు.అంత ఐదు నక్షత్రాలే.చాలా బాధ వేస్తుంది నాకు.మా చెల్లి డ్రెస్ కొంటుంది. చాలా మామూలుగా కనిపిస్తాయి. ఖరీదేమో ఏదీ రెండు వేలకి తక్కువ ఉండదు. మా కజిన్ చెల్లి ఐదు వందలకి బ్రమ్హందమైన డ్రెస్లు కొనుక్కుంటుంది.ఒక తమాషా చెప్పనా ? మా కజిన్ ఒక సారి మంచి చీర కట్టుకుంది. మా చెల్లి పది వేలు ఉంటుందేమో అంది తనతో. తను నవ్వేసి, లేదు ఐదు వందలు అంది.అంతేలే, అలానే ఉంది చీర చీప్ గా అంది !

  చిన్న సమస్య వస్తే,తమ్ముడు కళ్ళు తిరిగే కర్పోరాటే హాస్పిటల్ లో చేరి, లక్ష రూపాయలు బిల్ చేసి,( ఉద్యోగం చేస్తున్న పైసా ఆదా చేయరు, చెల్లి, తమ్ముడు ) నాన్న గారి చేతిలో పెట్టాడు.ఈయన ఎన్ని ఏళ్ళు నోరు కట్టుకుని, తన కోసం ఏమీ కర్చు చేయకుండా, పైసా పైసా సంపాదించి కూడా బెట్టినవో కదా అవి.( నా నుంచి ఏమీ తీసుకోరు ఆయన ఇచ్చినా )ఇంకా తమ్ముడి భార్య అయితే, చెప్పకూడదు తన గురించి.ఆవిడ దృష్టిలో పిల్లలకి బొమ్మలు కొంటె కూడా, మూడు వేలకి తగ్గకూడదు. తగ్గితే, మా ముందే అవతల పారేస్తుంది. అలంటి( ఖరీదు తక్కువ ) బొమ్మల్లో ఇన్ఫెక్షన్స్ ఉంటాయట ! ఇంతకీ ఆవిడ సంపాదన పది వేలు.వాళ్ళ పిల్లలని సంతృప్తి పరచలేము అసలు.ప్రతి దానికి లంచం ఇచ్చి అలవాటు చేసారు. వాళ్ళ దృష్టిలో ప్రేమంటే, నాకు ఎం కొనిపెట్టావ్, ఎంత కర్చు పెట్టావ్. వాళ్ళు అంతే, వాళ్ళ పిల్లలు అంతే.

  అసలు తమ్ముడిని అల పెంచకపోయినా అలాగే తాయారు అయ్యాడు.

  ఒక సారి తన భార్యని, ఎందుకమ్మా ఇలా పిల్లలకి లంచాలు అలవాటు చేస్తున్నావ్ అని నాన్న గారు అన్నదుకు, ఆవిడ వెళ్ళిపోయింది గది నుంచి.తమ్ముడు వచ్చి, మీరెందుకు తనకి చెప్పటం ? తను బాధ పడుతుంది, మీరు ఇక దయ చేయవచ్చు అన్నాడు .నాకు విషయం తెలిసాక, చాచి పెట్టి కొట్టాలి అనిపించింది.

  అనకూడదు కానీ, వీళ్ళంటే అసహ్యం నాకు – నాన్న గారిని, అమ్మ ని పల్లెటూరి బైతు అన్నట్టు చూస్తారు. ఆయనొక పెద్ద ఆఫీసర్, రిటైర్ అయ్యారు.

  ఒక నాలుగు తన్ని వాళ్ళకి తల్లి తండ్రి మీద దయ లేని పుత్రుండు పుట్టలోని చేదాలతో సమానం అని చెప్పాలి అన్నంత కోపం వస్తుంది. వాళ్ళేమైనా చిన్న పిల్లలా, అన్న మాట వినటానికి. నీకెందుకు నోరు మూసుకుని నీ పని చూసుకో అనటం కూడా అయ్యింది నాతొ, ఒక సరి బుద్ధులు చెప్పబోతే.

  అయినా చిన్న వాళ్ళని, వారినే వెనకేసుకు వస్తారు పిచ్చి అమ్మ, నాన్నా. ఎందుకో తెలియదు, ఈ రోజు బాధగా అనిపించింది మీ పోస్ట్ చూసి.గతం లోకి వెళ్ళిపోయి, కొంచెం ఎమోషనల్ అయ్యాను. క్షమించండి.

  Like

 2. కుమార్,

  మీవ్యాఖ్య నేను పోస్ట్ చేసిన బ్లాగ్గుకంటె పెద్దదిగా ఉంది.మీరు వ్రాసిన ప్రతీ అక్షరం నేను అర్ధం చేసికోకలను. నేను మిగిలిన వాటిలో అవసరం వచ్చేచోట ఖర్చు పెడతాను. కానీ అదేమిటో, ఈ ఆటోల వ్యవహారం వచ్చేటప్పటికి బేరం ఆడతాను. బహుశా అది వారసత్వం లో వచ్చిందేమో!! మా నాన్నగారూ అంతే, ఎందుకు డబ్బు ఖర్చుపెడతావూ అని ఎప్పుడూ అడగలేదు. కానీ రిక్షావాడు ఓ రూపాయి ఎక్కువ అడిగాడంటే వాడి పని ఐపోయిందే! ఇటువంటి ప్రవర్తనకి ఏదీ ‘ఎక్స్ ప్లనేషన్’ ఉండదు.65 ఏళ్ళొచ్చిన తరువాత ఇంకేమి బాగుపడతాను? అయినా ప్రయత్నిస్తాను. మీరన్నట్లు బ్రతికినంతకాలం హాయిగా బ్రతికేయక, ఇంకా ఎవరికోసం ఈ తాపత్రయం?

  Like

  • Phani Babu gaaroo. The same kind of hereditary habit I too inherited. My father was a terror for the Rickshawalas.

   Like

 3. >> హాయిగా బ్రతికేయక, ఇంకా ఎవరికోసం ఈ తాపత్రయం?

  హమ్మయ్య. మీరు ఇప్పుడు కూడా కష్టపడుతారు ఆటో ల విషయం లో అంటే, నాకు మా నాన్న గారే గుర్తొస్తారు మరి. 🙂 వెంటనే, ఈయన అంత ఆదా చేస్తే, ఇంట్లో తమ్ముడు, చెల్లి ఒకే ఒక్క పూటలో కర్చు కి కూడా పనికి రాదే అని బాధ.

  అన్నట్టు మా నాన్న గారికి, మీకూ, బోలెడు చాలా పోలికలు ఉన్నాయండీ. బహుశా ఆయనకో బ్లాగ్ ఉంటె, మీరు ఇద్దరు ఒకేలా రాస్తారేమో అనేంతగా. ఆయనకీ cataract ఉంది. ఇప్పటికే వోద్దన్నా టీవీ చూస్తారు,కాలక్షేపం కోసం.ఇంటర్నెట్ లో ,అవీ, ఇవీ చదువుతూనే ఉంటారు ఆధ్యాత్మిక అంశాలు.ఇంకా బ్లాగ్లు కూడా పరిచయం చేస్తే,ఇక ఆయనకీ రోజంతా టీవీ, కంప్యూటర్ radiation తో కళ్ళు పాడు అవుతాయేమో అని, నేనే కొంచెం స్వార్థం తో ఆయనకీ చెప్పట్లేదు బ్లాగ్ల గురించి.

  Like

 4. శివరామప్రసాద్ గారూ,

  ఇలాటివి మాత్రం వారసత్వంలో వచ్చేస్తాయి !!

  Like

 5. కుమార్,

  మీనాన్నగారికి బ్లాగ్గులు వ్రాయడం నేర్పేయండి. ఆయన అభిప్రాయాలు వినడానికి మీ అందరికీ ఎలాగూ సమయం ఉండదు,కనీసం మాలాటి జనంతోనైనా పంచుకుని మనస్సు తేలిక చేసికుంటారు!! రేడియేషనూ అవీ చెప్పి ఊరికే ఖంగారు పడకండి.

  Like

 6. 🙂 అదిగో మళ్ళీ మా నాన్నగారి మాటలూ పద్ధతులే.. మా డాడీని అబ్బా ఏమిటో చాదస్తం అనుకుంటుంటాము అప్పుడప్పుడు సరదాకి (ఇప్పుడు కాదులెండి, మా చిన్నప్పటినుండి అదే అమ్మ దగ్గెర చెప్పి గింజుకునేవాళ్ళం). పిల్లలం కదా. ఆయనకి బహుశా మీ వయసే ఉంటుంది. ఇప్పటికీ ఆయన సంపాదిస్తున్నా, మా కోసం దాచాల్సిన అవసరం లేకపోయినా, ప్రతీరూపాయిదగ్గెర ఆలోచిస్తారు. ఇన్నాళ్ళు కష్టపడ్డారు ఇప్పుడన్న అవన్నీ ఆలోచించకుండా హాయిగా దర్జాగా ఉండొచ్చు కదా డాడీ అంటే అబ్బే, నరనరాల్లోనూ ఉన్న మనస్తత్వం. దానికి ఒక ఉదాహరణ ఆటోలు. 🙂

  మీరన్నట్టు వారసత్వంలో రావేమోనండీ ఇవన్నీ. నేనూ ఇన్నాళ్ళూ అలాగే అనుకునేదన్నీ. వారసత్వంలోనూ, పెంపకంలోనూ వచ్చేవి అయితే, మీ పై తరంవాళ్ళ ఆలోచనలూ, పద్ధ్తతులూ మీకు వచ్చినట్టే, మీ తరంవాళ్ళ ఆలోచనలు ఈ తరంవారికి రావాలి కదా. ఉదా: మా అన్నయ్య (పెదనాన్నగారి అబ్బాయి) కుటుంబం. Growing up yearsలో ఏంతో సర్దుకుని ఉండాల్సివచ్చిందనిట వాళ్ళ అబ్బాయికి ఒకటి అడిగితే పదికొంటారు. ప్రతీరోజూ బయటి్తిండ్లే. పోనీ తను పడ్డ కష్టం(?) తన కొడుకు పడకూడదు అన్ని ఆలోచన కొంచెం పెడత్రోవ పట్టిందనుకోవచ్చు. కానీ ఆరోగ్యానికి మంచిది కాదూ అని స్కూల్లో పేరంట్స్ మీటింగ్లో డాక్టర్‌ చీవాట్లు పెట్టినా కూడా ఇంటికొచ్చి తప్పుతెలుస్కున్న వారిలాగా తలితండ్రులు కబుర్లు చెప్పదమే కానీ పక్కనే అరకేజీ స్వీట్లు గుటుక్కుమనిపిస్తుంటే కనీసం ఆపలేదంటే శ్రద్ధ లేదనుకోవాలా, లెక్క లేదనుకోవాలా. మా అమ్మతో కూడా మొన్న ఇదే తరాల్లోని అంతరాలు గురించి మాట్లాడుతూ మీరు ఈ మధ్య వ్రాసిన పోస్టు (బ్రాండ్ లోయల్టీ) గురించి చెప్పాను.

  ఇన్నాళ్ళూ మీబ్లాగు చూస్తున్నా, కమెంటు పెడదామనుకున్నా అన్ని బ్లాగుల్లో అందరూ అందరికీ చెప్పినట్టు “బాగుంది” అని పెట్టాలనిపించలేదు. కారణం మీరు వ్రాసేవి బాగుండటం బాగోకపోవటం కాదు, మా అమ్మానాన్నలతో conversations గుర్తొచ్చేలా ఉంటాయి.

  Like

 7. చేతనా,

  నా బ్లాగ్గుమీద వెలిబుచ్చిన అభిప్రాయాలకి థాంక్స్ ! ఏదో ఈ కంప్యూటర్లూ బ్లాగ్గులూ వచ్చేయి కాబట్టి సరిపోయింది కానీ, మనలో ఉండే ‘వీక్ పాయింట్స్’ గురించి,ప్రపంచానికి తెలియొద్దూ? అలాగే నా బ్లాగ్గు చదవగానే, మీ పరిసరాల్లో ప్రతీ రోజూ జరిగే విషయాలు గుర్తుకొచ్చాయి. నా బ్లాగ్గు ఉద్దేశ్యంకూడా ఇదే.నేను వ్రాసే విషయాలు, ప్రతీ మధ్య తరగతి వాడిలోనూ ఉంటాయి. కొంతమంది చెప్పుకుంటారు,కొంతమంది అలాటివి ఒప్పుకోడానికి నామోషీ ఫీల్ అవుతారు. నాకైతే నా అభిప్రాయాలు,అనుభవాలూ, అందరితోనూ పంచుకోవడం ఇష్టం!నచ్చితే చదువుతారు ( ఓ వ్యాఖ్య వ్రాస్తారు), లేకపోతే చదివేసి, ‘ఇందులో కొత్తేముందీ,ప్రతీ రోజూ చూసేదేకదా, అబ్బ బోరు ‘ అని ఊరుకుంటారు.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: