బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– కాలక్షేపం


    అసలు కార్యక్రమం ప్రకారమైతే, ఏప్రిల్ 15 కి రాజమండ్రి వెళ్ళి ఏదాది పుట్టిన రోజు కి ‘పురిటి మంచం’ ( నన్ను అనుమానించకండి బాబూ, నా బ్లాగ్గు ది) చూద్దామని టికెట్లు బుక్ చేశాము.కానీ కారణాంతరాలవలన క్యాన్సిల్ చేసికున్నాము.మళ్ళీ ఎప్పుడో వీలు చూసుకుని వెళ్ళాలి.ఎంత చెప్పినా నాలో, ఈ బ్లాగ్గులు వ్రాయడానికి స్పూర్తి ‘గోదావరి గాలి’ అని ఒప్పుకోవాలి. ఏమిటో తలుచుకుంటేనే ఆశ్చర్యంగా ఉంది.

    ఎంతమంది కొత్తస్నేహితుల్ని సంపాదించానో? ఎప్పుడు వారందరినీ కలుసుకునే అదృష్టం కలుగుతుందో? ఇప్పుడు తెలుగు వ్రాయడం ఎంత అలవాటు అయిపోయిందంటే, ఎప్పుడైనా ఇంగ్లీషులో మెయిల్స్ పంపాలన్నప్పుడు, చాలా కష్టం అయిపోతూంది.మా వాళ్ళందరూ నన్ను కోప్పడుతున్నారు! ఇంగ్లీషు అలవాటు తప్పిపోతుందీ, అప్పుడప్పుడు ఇంగ్లీషు బ్లాగ్గులు కూడా వ్రాస్తూండండి అని.అందుకోసమని ఈ మధ్యన నా ‘మిస్టరీ షాపింగు’ కొంచెం, ఎక్కువ చేశాను.

   గత వారం లో ‘షాపర్స్ స్టాప్’రెండు-ఒకటి నాదీ, ఇంకోటి మాఇంటావిడదీ చేసి దాని రిపోర్ట్ పంపాను.నేను వ్రాసిన రిపోర్ట్ బాగానే ఉందీ అని 8/10 మార్కులు ఇచ్చారు!ఫర్వాలేదు, ఇంగ్లీషు మరీ అంత అన్యాయంగా లేదూ అనిపించింది! రేపు డాక్టర్.బత్రాస్ క్లినిక్కు కి వెళ్ళాలి( మిస్టరీ షాపింగేనండోయ్). సాయంత్రం ఫోన్ చేసి మెయిల్ పంపారు. కన్సల్టేషనుకే 1500/- కట్టాలిట, మనకి వచ్చేస్తుందనుకోండి, ఏమిటో హోమియోపతీ క్లినిక్కుల్లో కూడా ఇంత ఫీజా, బాబోయ్!
కాలక్షేపం బాగానే అవుతోంది!

    ఈవేళ నాతో వరంగాం ఫాక్టరీ లో పనిచేసిన ఓ అబ్బాయి ( ఆ రోజుల్లో ఆర్డర్లీ గా ఉండేవాడు), ఇప్పుడు స్టాఫ్ లోకి ప్రొమోట్ అయ్యాడు, వచ్చాడు నన్ను కలవడానికి. ఆ ఊరు వదిలి 12 సంవత్సరాలయ్యింది, అయినా గుర్తు పెట్టుకుని వచ్చాడు. తను అన్నాడూ ” మీ దగ్గర పనిచేయడం వల్ల , పధ్ధతులన్నీ తెలిశాయీ, అందువలన ఎవరినైనా కూడా హాండిల్ చేయ కలుగుతున్నానూ’అని. చాలా సంతోషం వేసింది. అబ్బో ఫర్వాలేదూ, నేను ఇచ్చిన ట్రైనింగు కొంతమందికైనా పనిచేసిందీ అనుకున్నాను.

    నిన్న వ్రాసిన నా బ్లాగ్గు పుట్టిన రోజు సందర్భంగా కొన్ని విషయాలు వ్రాయలేక పోయాను, బ్లాగ్గు మరీ పెద్దది అవుతుందీ అని.ఏడాది పొడుగునా వ్యాఖ్యలు వ్రాసిన వారిలో, ఎక్కడో ఒకరిద్దరు తప్ప అందరి దగ్గరనుండీ ప్రోత్సాహకరమైన వ్యాఖ్యలే వచ్చాయి. కొన్ని కొన్ని పోస్టుల్లో లింకులు ఇచ్చినప్పుడు, ఓ రెండు రోజులు పోయిన తరువాత, ఆ లింకులు మాయం అయిపోయాయి.ఇప్పుడు చూస్తే తెలిసింది. కారణం ఏమిటో తెలియదు.ఏదైనా తెలుగు న్యూస్ పేపరు లో నాకు నచ్చిన విశేషం గురించి వ్రాస్తూ, ఆ లింకు ఇచ్చేను. కానీ ఇప్పుడు చూస్తే ఒక్కలింకూ చదవడానికి కనిపించడం లేదు. మీలో ఎవరైనా ఈ సమస్యకి సొల్యూషన్ చెప్తే సంతోషిస్తాను.

    చెప్పానుగా , నాకు పనేం లెదు, ప్రతీ రోజూ తెలుగు పేపర్లన్నీ వివిధ జిల్లాల వార్తలతో సహా చదువుతూంటాను, అందులో ఏదైనా ప్రత్యేకమైన విషయం ఉంటే, మీఅందరితోనూ పంచుకోవాలని అంతే ! ఈ కిటుకేదో చెప్పేసేరంటే, ఈ ఏడాది కూడా మిమ్మల్నందిరినీ బోరు కొట్టేయొచ్చు!!!

6 Responses

 1. Sir,

  eenadu website or other news websites host newspaper in certain link. for eg : http://eenadu.net ani kodithe, ninna unna content ee roju undadu. Link same unna, content marutundi kadaa.

  Alage konni links aa news ayyaka, next day link remove chesestaadu, aa server location nunchi. for eg: http://eenadu.net/saniashoyab.html ane link ee roju unte ( only as eg), repu work cheyadu or vaadiki baddhakam aithe 2-3 days tarvaatha tesestaadu.

  Adi mee tappu kaadu, so meerem cheyaleru. News paathadi aipoyindi kabatti, akkada data host chesi unche avasaram ledani, teesesthaadu annamaata.

  Oka vela meeku permanent gaa news alage mee blog lo undipovaali anukunte, news link ivvakundaa, data ni puchukuni pdf gaa malachi ( meekelago vachu kadaa ), mee blog lo pettukovachu.

  sorry for typing in tenglish.telugu lo type chesentha opika ledu. mee opika ki joharlu. ilaage utsaaham gaa saagipondi, meeku tirugu ledu.

  maa intlo mee vayasu peddalani choosthe, mukhyam gaa maga vaarini, chala badha vestundi.oorike kopam, chinna vaatiki kayyi mantu aravatam,tamanedo takkuva chestunnam ani vaariki vaare oohinchesukuni.

  enduko retire ayyaka chala varaku manushulu inka tama praamukhyam edo taggipoyinattu tega badha padipotaaru. andaaka kasta paddaru, ippudu edoka manchi vyaapakam pettukuni ( service lo unnanni nallu, avi cheyali time ledu, ivi cheyali time ledu antaaru – avevo cheyochu gaa) enjoy cheyochu kadaa, ala chese vaaru nijamgaa, dhanyulu.

  Like

 2. మీరు మళ్ళీసారి గోదావరి వైపు వచ్చినపుడు మా యింటికి తప్పని సరిగా వస్తామని ప్రామిస్ చేసారు. అందుకే ఇందుమూలంగా గుర్తు చేస్తున్నాను. మీకు మా పిల్లల (కుక్క) నుండి ఏవిధమైన ఇబ్బందీ లేకుండా చూచే పూచీ నాది. మా పెప్సీ ఈ మధ్యనే నాలుగు పిల్లల్ని పెట్టింది. రెండు ఆడ, రెండు మొగ. ఎంత ముద్దొస్తున్నాయో బుజ్జిముండలు. మా పిల్లలు మాకు ముద్దురావటం సహజమే. కాని మా వీధిలో వాళ్ళందరూ కూడా మాకో పిల్లనివ్వండి, మాకో పిల్లనివ్వండి అని డిమాండ్లు చేస్తున్నారు కూడా. ఒక్క దానిని మేం ఉంచుకుని మిగిలిన మూడింటిని ఇద్దాం అనుకుంటున్నాం.

  Like

 3. పేపర్లు నుంచి ఇచ్చే వెబ్ లింక్లు మరునాడుగాని, తర్వాత గాని ఆర్కైవ్స్ క్రిందకి వెళ్ళిపోతాయి. అందుకే మనకు కనబడవు. నాకు తెలిసి అవి ఆ ఒక్కరోజుకే పరిమితం. కొన్ని ఆర్టికల్స్ మాత్రం ఓ మూడు నాలుగు రోజులు వరకు ఉంటాయి. అలాంటప్పుడు లింక్ మీద క్లిక్కితే మనకు కనబడతాయి.

  Like

 4. నరసింహారావు గారూ,

  ఆ మాత్రం ఎస్యూరెన్స్ ఇచ్చేరు కాబట్టి ఈసారి అటువైపు వచ్చినప్పుడు, మీ ఇంటికి వస్తాము.

  Like

 5. ఉమా,

  చాలా శ్రమ తీసికుని మొత్తానికి నా డౌట్లు క్లియర్ చేశారు. ఒక సంగతి చెప్పనా, అంతశ్రమ పడి టింగ్లీషు లో టైపు చేయడానికి బదులు, అవే అక్షరాలు యంత్రం.కాం (తెలుగులో) టైపు చేసిఉంటే హాయిగా తెలుగు లిపి లోనే వచ్చుండేవి కదా! ఇది నా సలహా మాత్రమే, నా బుచ్చి యంత్రం.కాం ఏడాది నుండీ నన్ను వీధిన పెట్టకుండా ఏదో లాగించేస్తోంది.
  నా బ్లాగ్గులగురించి వ్రాసిన అభిప్రాయానికి ధన్యవాదాలు.ఇంక, నా వయస్సు వారిలో వచ్చే విసుపూ, కోపాలకి కారణాలు నేను రెండు మూడు బ్లాగ్గుల్లో వ్రాశాను.ఏం చేస్తాం, రిటైర్ అయిన తరువాత తమ ప్రాముఖ్యం తగ్గిపోయిందనే అబధ్రతా భావం ఎక్కువైపోతుంది. దాని ఫలితమే , ప్రతీదానికీ విసుక్కోవడం, ఇంట్లో వాళ్ళమీద ( బయటి వాళ్ళ మీద అరిస్తే పళ్ళూడ కొడతారు!)
  అరవడం.సద్దుకుపోవాలి.!!

  Like

 6. శ్రీవాసుకీ,
  మీరిచ్చిన సమాచారానికి ధన్యవాదాలు.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: