బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–నా బ్లాగ్గు పుట్టినరొజు–April,15.


    నా బ్లాగ్గు ‘బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు’ మొదలెట్టి ఈవేళ్టికి ఓ సంవత్సరం పూర్తి అయింది. ఇప్పటికి అన్నీ కలిపి 312 పోస్టులు చేశాను.అంటె రమారమి రోజుకి ఒకబ్లాగ్ చొప్పున. నాకు తెలుగు లో బ్లాగ్గు వ్రాయొచ్చని సంకల్పం మొదట మేము రాజమండ్రి లో ఓ రెండు మూడేళ్ళు గడుపుదామని, గోదావరి గట్టు మీద, ఓ ఎపార్ట్ మెంటు అద్దెకు తీసికుని, ఉన్నప్పుడు కలిగింది.గోదావరి గాలి ధర్మమా అని!అంతకుముందు తెలుగులో టైపు చేయాలంటె అవేవో సాఫ్ట్ వేర్లు కొనుక్కోవాలేమో,మనకెందుకొచ్చిన గొడవా అనుకున్నాను.

    కానీ అంతర్జాల పత్రిక ‘ కౌముది’ సంపాదకుడు శ్రీ కిరణ్ ప్రభ గారికి ఒకసారి మెయిల్ పంపినప్పుడు, ఆయనా, శ్రీ వసుంధర గారూ చెప్పిన సలహా ప్రకారం, ఏ సాఫ్ట్ వేరూ డౌన్ లోడ్ చేసుకోనఖ్ఖర్లేకుండా, లేఖిని.కాం లో కి వెళ్ళి, ఇష్టం వచ్చినట్లు టైపు చేయడం మొదలెట్టేసరికి, ఇంగ్లీషు లోది చక్కగా తెలుగులో రావడం మొదలెట్టింది. అరె వా మనక్కూడా తెలుగులో వ్రాయడం వచ్చేసిందీ అనుకొన్నాను.

    ఆ రోజుల్లో శ్రీ ముళ్ళపూడి వెంకట రమణ గారు వ్రాసిన కోతికొమ్మచ్చి సీరియల్, స్వాతి పత్రికలో వచ్చేది.సరే ఆ సీరియల్ గురించి స్వాతి వారికి ఓ ఉత్తరం వ్రాద్దామని కూర్చుని, నా కొచ్చినదేదో, నాకు తెలిసిన భాష( తెలుగే అనుకోండి) లో వ్రాసేశాను. మూడో నాటికి స్వాతి వారపత్రిక వారి దగ్గరనుండి ఓ మెయిల్ వచ్చింది.’ మీరు కోతికొమ్మచ్చి’ మీద వ్రాసిన ఉత్తరం,బెస్ట్ లెటర్ గా సెలెక్ట్ అయిందీ, ఆ ఉత్తరాన్ని ‘పీ.డీ.ఎఫ్ ‘ లోకి మార్చి, వెంటనే, మీఫొటోగ్రాఫ్ తో పాటు మెయిల్ చేయండీ’ అని.

    ఓరిదేముడో ఏదో టైపంటే చేసేశాను కానీ, మళ్ళీ ఈ పీ.డీ.ఎఫ్ లూ గోలా ఏమిటీ అని తల పట్టుక్కూర్చున్నాను. వెంటనే మా అబ్బాయికి(పూణే లో ఉన్నాడు) ఫోన్ చేశాను.తనన్నాడూ, నువ్వు టైపు చేసింది నాకు పంపూ, సాయంత్రానికి దాన్ని పీ.డీ.ఎఫ్ చేసి పంపుతానూ అని.ఇంతలో స్నేహితుడు రాకేశ్వర్రావు కి ఫోన్ చేస్తే, తను బయటెక్కడో ఉన్నాననీ, సాయంత్రం ఇంటికి తిరిగి వెళ్ళగానే ఫోన్ చేస్తాననీ, అప్పుడు ఈ పీ.డీ.ఎఫ్ గురించి చెప్తాననీ అన్నాడు.ఇంక ఇలా కాదని, నాకు కంప్యూటర్ కొనుక్కోని పూర్వం వెళ్ళే సైబర్ కెఫే కి వెళ్ళి అతన్ని అడిగాను, తనకంత బాగా తెలియదనీ, సాయంత్రానికల్లా ఎలగోలాగ చేయిద్దామనీ చెప్పాడు.
నిజం చెప్పాలంటే నేను పూర్తిగా నిరుత్సాహ పడిపోయాను, ఏదో నా అదృష్టం బాగుండి, స్వాతి పత్రిక వాళ్ళు నా ఉత్తరాన్ని ప్రచురిస్తామని చెప్పారూ, దీనికి ఎన్ని తిప్పలు పడాల్సివస్తోందో అని.ఇదిగో ఇలాటి టైము లోనే మనకి దగ్గరుండి ప్రోత్సహించేది ఎవరూ,ఇంకెవరోకాదు బాబూ, మా ఇంటావిడే. నా మూడ్ పాడైపోవడం చూసి,’తెలుగు లో టైపు చెయ్యడం, మీ అంతట మీరే నేర్చుకున్నారుకదా, మళ్ళీ దీని గురించి అంత దిగులు పడిపోతారెందుకూ, నెట్ వెదికి ఆ పీ.డీ.ఎఫ్ ఏదో మీరే నేర్చేసుకుని ప్రయత్నం చేయండి, లేకపోతే సాయంత్రానికల్లా అబ్బాయి ఎలాగూ చెప్తానన్నాడు కదా, ‘జై భజరంగ భళీ ‘ అనుకోవడం,ముందుకు వెళ్ళిపోవడం అని నన్ను ఎంకరేజ్ చేసింది. ఇంకేముంది అంతే సక్సెస్ ఫుల్ గా పీ.డీ.ఎఫ్ లోకి మార్చేశాను !

    ఇంక మనల్ని అడ్డేవాళ్ళెవరూ లేరని, తెలుగులో బ్లాగ్గులు ఏప్రిల్ 15,2009 న ప్రారంభించాను.అంతకుముందు కొద్దిగా ఇంగ్లీషులో వ్రాసేవాడిననుకోండి. మొదటి రోజు వ్రాసిన తరువాత వచ్చిన ప్రోత్సాహకరమైన వ్యాఖ్యలు చదివి ,ఫర్వాలేదూ, నా భాష మరీ అంత అధ్వాన్నంగా లేదూ అని నమ్మకం వచ్చేసింది. ‘లేడికి లేచిందే పరుగూ’ అన్నట్లు రోజుకోటి చొప్పున వ్రాయడం మొదలెట్టేశాను!

    నా బ్లాగ్గుకి ఓ రూపం చేసినందుకు జ్యోతి కీ, వాటికి రంగులూ, ఫాంటులూ పెట్టడం నేర్పిన మా కోడలు శిరీషకీ ధన్యవాదాలు. ఎందుకంటె మొదట్లో బ్లాగ్గులు వ్రాయడం మొదలెట్టినప్పుడు, ఏదో స్కూల్లో కాంపోజిషన్ వ్రాసినట్లుగా వ్రాసుకుంటూ పోయే వాడిని.నా వయస్సు మీద గౌరవం చేతా, ఏదో పెద్దవాడూ, నిరుత్సాహపరచడం ఎందుకూ అని చాలా మంది సందర్శకులు( వీరందరి పేర్లూ రెండో బ్లాగ్గులో ఇచ్చాను) మొహమ్మాటపడ్డారు.ఇంకా వీరిని హింసించడం బాగోదని జ్యోతి సహాయంతొ ‘ప్రెజెంటబుల్’ గా చేశాను.

    సాధ్యమైనంతవరకూ ఎవరి భావాలూ కించపరచలేదనే భావిస్తున్నాను. ఒకటీ అరా ఏమైనా ఉన్నాకానీ వదిలేయండి ఏదో ఛాదస్థం అనుకుని! ఒక ఏడాదిలోనూ సుమారు 42,000 మంది నా బ్లాగ్గుని సందర్శించేరంటే ఎంతో ఆనందంగా ఉంది. ప్రతీ రోజూ ఏదో వ్రాయాలని వ్రాయడం కాదు, నా అనుభవాలు మీఅందరితోనూ పంచుకోవడమే నా ఉద్దేశ్యం.
ఇటుపైన కూడా మీ ప్రోత్సాహం ఇలాగే ఉండాలని ఆ శ్రీ వెంకటేశ్వరుని ప్రార్ధిస్తూ..
….

18 Responses

 1. బ్లాగు జన్మదిన శుభాకాంక్షలు

  Like

 2. మీ బ్లాగు జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు. మీ బ్లాగు ఇదే విధంగా రోజుకో పోస్టు, వంద కామెంట్లతో వర్ధిల్లాలని నా ఆకాంక్ష.

  Like

 3. ఫణి బాబు గార్కి
  ముందుగా మీ బ్లాగ్ పుట్టిన రోజుకి నా శుభాకాంక్షలు .
  మీరు మీ బ్లాగ్ ఓపెన్ చేసిన విధానం చదువుతోంటే నా అనుభవమే గుర్తుకు వొస్తోంది.మన ఇద్దరి ఆలోచనలలో ఏదో దగ్గర పోలిక ఉంది అనిపిస్తోంది .అసలు విషయం నేనుకూడా రాజముండ్రి వాసినే .మీ లగే అలోచించి 2009 లో బ్లాగ్ ఓపెన్ చేసాను .కాని ఎక్కువ గా రాయలేక పోయాను .బ్లాగ్ ఓపెన్ చేసిన కొత్తలో అసలు ఆ బ్లాగ్ ఎలా లింక్ చేయాలి అనే విషయం కూడా నాకు తెలియదు .ఈదో మొత్తానికి లింక్ చేసాను .నీను కంప్యూటర్ పరిజ్ఞామున్న మనిషిని కాదు ఆఫీసు లో కొద్దిగా కంప్యూటర్ పి పనిచేయడం వలన వొచ్చిన కొద్ది అనుభవం తప్ప .ఇంతకీ నా బ్లాగ్ పేరు మీఎకు చెప్పలేదు కాదు . msrmurty.blogspot.కం
  దయచేసి మీరు నా బ్లాగ్ విసిత్ చేసి తగిన సూచనలు సలహాలు ఇవ్వ వలసిందిగా కోరుచున్నాను .

  Like

 4. మీ బ్లాగుకు మెనీ మోర్ టపాల ప్రాప్తిరస్తు

  అభిజ్ఞాన

  Like

 5. బ్లాగు జన్మదిన శుభాకాంక్షలు… బ్లాగు అనే ఉపకరణాన్ని ఎంత సద్వినియోగపరుచుకోవచ్చో మీరు తెలియచేసారు. రోజొక టపా రాసినా కూడా కొండొకచో ఆ టపాలలో మా స్మృతులు కూడా గుర్తుచేసుకునేలా చేసేవారు. నిజంగా ఇన్ని ముచ్చట్లు ఉన్నాయా పంచుకోవడానికి అనిపిస్తుంది మీ టపాలు చూస్తుంటే.. ఇంట్లో కూర్చుని ఎవరెవరో తెలీకున్నా, ఇంతమంది మిత్రులను, శ్రేయోభిలాషులను బ్లాగు ద్వారా సంపాదించుకున్నారు. అభినందనలు. అందుకే అన్నారు. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అని..

  Like

 6. మీ బ్లాగ్ కి జన్మదిన శుభాకాంక్షలు. మీ శైలిలో మరిన్ని టపాలు ఆశిస్తున్నాను. కంప్యూటర్, అంతర్జాల పరిజ్ఞానం ఉండి కూడా నాకు తెలుగులో ఎలా టైప్ చేయాలో అర్థంకాక రవిచంద్రగార్ని, అబ్రకదబ్రగార్ని అడిగా. అప్పుడు లేఖిని, బరహాల గురించి తెలిసింది. బ్లాగ్ ప్రారంభం అయిన ఐదు రోజుల తర్వాత మొదటి టపా వ్రాసాను. మళ్ళీ కలుద్దామండీ.

  Like

 7. Congratulations!!
  I’ll daily read your blog, but, lazy enough to comment 🙂

  Like

 8. మీ బ్లాగ్ కి జన్మదిన శుభాకాంక్షలు
  ఎన్నో మరెన్నో మంచి టపాలు మీ నుండి ఆశిస్తున్నాము.

  నాలుగేళ్ళనుండీ రాస్తున్నా కానీ మొత్తంకలిపి 60 కూడా వుండవేమో.. నావి.. మీరు ఏకంగా మూడువందల పైచిలుకే.. ఒకప్పుడు ఎన్టీఆర్.. ఏఎన్నార్ లు సంవత్సరానకి రెండుమూడు సినిమాలు తీస్తే, సూపర్ స్టార్ కృష్ణ పది పదకొండు తీసేవాడంట… అలాగా.. మీరు పెద్ద బ్లాగరేనండోయ్.. 🙂

  ఇదే రోజున నేను ఫూణేలో అడుగుపెట్టినరోజు.. సరిగ్గా సంవత్సరం ఈ రోజుతో.. 🙂

  Like

 9. బాగున్నాయండీ మీ అనుభవ విశేషాలు. అభినందనలు, మరియు శుభాకాంక్షలు.

  Like

 10. Happy Birthday to you https://harephala.wordpress.com/.
  Nuvvu ilaanti janmadinaalu ennenno jarupukovaalani aakaanksha. 🙂

  Chandu

  Like

 11. అప్పుడే, సంవత్సరం అయిందన్నమాట…

  Like

 12. విజయమోహన్ గారూ, శివరామప్రసాద్ గారూ,

  ధన్యవాదాలు.

  Like

 13. ఎం.ఎస్.ఆర్. మూర్తీ,

  అదేదో సామెత చెప్పినట్లుగా, నన్నే అడిగారూ? నేను కంప్యూటర్ నేర్చుకున్నదే రిటైర్ అయిన తరువాత.ఇంకొకరికి సలహా లిచ్చే స్థోమత లేదు. మీ బ్లాగ్గు చూశాను. మరీ టెక్నికల్ గా ఉందేమోఅనిపించింది. కొద్దిగా నాలాటివాళ్ళ బుర్రల్లోకి ఎక్కేటట్లుగా వ్రాస్తూండండి.అడిగారు కాబట్టి చెప్పాను.

  Like

 14. అభిజ్ఞాన, గణేష్, మాలతీ,

  ధన్యవాదాలు.

  Like

 15. జ్యోతీ,

  అంతంత పెద్ద మాటలతో పొగిడేయకండి. మీలాటి వారి బ్లాగ్గులు చూశాక కలిగిన ఉత్సాహమే ఇది.

  Like

 16. శ్రీనివాసూ,

  పూణె నగరానికి నీవు వచ్చినప్పుడు, నేను రాజమండ్రీ లో బ్లాగ్గు వ్రాయడం మొదలెట్టానన్న మాట.నీవు వ్రాసినవి 60 మాత్రమైతేనేమిటి, వాటిలో క్లాసుంది. నేనేదో ఊసుబోక చెప్పే ఖబుర్లు మాత్రమే. ‘పెద్ద పెద్ద వాళ్ళందరూ క్వాలిటీకే ముందుపీట వేస్తారు, క్వాంటిటీ కి కాదు’.

  Like

 17. చందూ, పానీ పూరీ,

  ధన్యవాదాలు.

  Like

 18. శ్రీవాసుకీ,
  నాకు ఆ బరహాలూ అవీ తెలియదు. యంత్రం.కాం.మాత్రమే తెలుసును,ఏడాది నుండీ నమ్ముకున్నాను.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: