బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–ఫుటోలకి దిగడం-2


    ఈ ఫుటోలలో స్కూళ్ళలోనూ, కాలేజీలలోనూ తీసికునేవి చాలా విచిత్రంగా ఉండేవి. క్లాసులో ఉన్న పిల్లలు మొత్తం 50-60 మందిని వాళ్ళ వాళ్ళ హైటు ప్రకారం మూడో నాలుగో బెంచీలు వేసి నుంచోపెట్టేవారు.కుర్చీలలో హెడ్మాస్టారూ, క్లాసు టీచరూ,ఇంకా మిగిలిన టీచర్లూ.క్రిందేమో అంటే ఆకూర్చున్నవాళ్ళ కాళ్ళదగ్గర, ఆడ పిల్లలూ. మొత్తం అంతా కలిపి ఓ 70 దాకా తేలేవారు.
ఆ ఫొటో తీసేవాడు,కొంచెందూరంలో ఉండి, అదేదో కెమేరా లాటి దానిమీద ఓ నల్లగుడ్డ కప్పి, ఆ గుడ్డక్రిందకి దూరిపోయేవాడు. అన్నీ సరిచేసికుని, బయటకు వచ్చి,’రెడీ స్మైల్’ అని ఓ కేకేసి, అదేదో బాటిల్ క్యాప్ లాటిదాన్ని, ఆలెన్స్ మీద ఓ సారి పెట్టి తీసేవాడు.అంతే! ఈ ఫొటో కాపీలు కావాలంటే, ఎక్స్ ట్రా డబ్బులు ఇవ్వవలసి వచ్చేది.ఇంట్లో వాళ్ళు ఇవ్వకపోతే, మన ఫ్రెండు తీసికున్న కాపీయే ఇంటికోసారి తీసికెళ్ళి చూపించుకోవడం.ఇంక ఆ ఫొటో సంగతికొస్తే, అడక్కండి, ఏదో వాళ్ళు మన పేర్లూ వగైరా వ్రాయడం మూలాన, మనం ఆ గుంపులో ఎక్కడ ఉన్నామో తెలిసేది! ఒకటిన్నర బై ఒకటిన్నర కార్డుబోర్డు మీద లిటికంత ఫొటో అంటించి ఇచ్చేవాడు. అందులో పైభాగమంతా మన స్కూలు/కాలేజీ/క్లాసు పేరూ, క్రిందభాగమంతా నాలుగు వరసల్లో ఉన్న వాళ్ళపేర్లూ.చెప్పానుగా, ఆ పేర్ల ధర్మమా అని మన మొహాలు తెలిసేవి! కాపీ తీసికోవడానికి డబ్బులు ఇచ్చారు కాబట్టి, ఫ్రేం కట్టించుకోవడానికి డబ్బులు ‘నో ‘ అనేవారు!అందువలన మనం స్కూలూ,కాలేజీ లలో తీయించుకున్న ఫొటోలు వెరసి ఓ పదిదాకా తేలేవి.వాటన్నింటినీ మన బట్టలు పెట్టుకునే బీరువాలోనే,జాగ్రత్తగా దాచుకోవడం!

కొంతమంది స్టూడియో కి వెళ్ళి ఫొటోలు తీయించుకునే ఆర్ధిక స్థోమత ఉన్నవాళ్ళు.ఇంక అక్కడకు వెళ్ళగానే, ముందుగా ఓ అద్దం ముందు నుంచొని, మొహం అదీ సరీగ్గాఉందో లేదో చూసుకొని, లోపలకి వెళ్ళడం. అక్కడ వాడు రకరకాల సీనరీలూ ఉంచుతాడు.కొన్నిచోట్ల కారులూ,ఏరో ప్లేన్లూ అట్టబొమ్మలూ అవీ పెడతాడు.మన ఇఛ్ఛానుసారం ఏదో ఒకదానిలో దిగడం.మన చుట్టూరా పేద్దపేద్ద లైట్లు పెట్టి, ఒకటికి రెండుసార్లు, మన మెడా,పైకీ, క్రిందకీ తిప్పేసి,రెడీ చెప్పేసి, ఈ లైట్లే కాకుండా ఫ్లాష్ ఒకటీ. అదేం ఖర్మమో, ఆ ఫ్లాష్ నొక్కేసమయానికే మనం కళ్ళుమూస్తాము. మళ్ళీ ఈ కార్యక్రమం అంతా రిపీట్!నాకు ఇప్పటికీ, స్టూడియో కి వెళ్ళి ఫొటో తీయించుకోవాలంటే ప్రాణం మీదకి వస్తుంది! మనం పెట్టుకున్న కళ్ళజోడు తీసేసి, గ్లాసుల్లేని ఓ ఫ్రేం మన కళ్ళకి పెడతాడు. కళ్ళజోడుంటేనే సరీగ్గా కనిపించదూ, ఇలా ఫ్రేం ఒకటీ ఉంటే ఎలా చచ్చేదీ? ఇంత శ్రమా పడి తీయిఛుకున్న ఫోటో అసలు రూపం ఎలా ఉంటుందో అడక్కండి- పోలీసు స్టేషన్లలోనూ, గోడలమీదా, బస్ స్టాండ్లలోనూ పెడతారే ‘ వాంటెడ్ డెడ్ ఆర్ లైవ్’ లాగన్నమాట !

ఇంక పెళ్ళిళ్ళలోనూ, ఏదో శుభ కార్యానికీ ఇంట్లో ఉన్న కుటుంబం అంతా కలుస్తూంటారుగా, అప్పుడు ఎవరికో ఒకరికి ఐడియా వస్తుంది- ఓ గ్రూప్ ఫోటో తీయించుకుందామని.అందరూ కలవాలి కదా. ఏ రెండో అల్లుడికో, మూడో అల్లుడికో ఈ వ్యవహారం నచ్చదు. ఇంక పెడతాడు తిప్పలూ, అడక్కండి. అందరూ ఒకచోట చేరే సమయానికి, ఏదో పని ఉన్నట్లుగా ఎక్కడకో మాయం అయిపోతాడు. ఆయన వచ్చేదాకా ఫొటో తీసేస్తే, ఆకూతురికీ, అల్లుడికీ ఏం కొపం వస్తుండో అని ఇంటి పెద్దాయనకి భయం! ఎలాగైనా ఇంట్లో ఉన్న అల్లుళ్ళందరూ ఒక్కలాగ ఉండరుకదండీ. పైగా ఆరోజుల్లో ఇంటికి ఓ నాలుగైదు మందైనా అల్లుళ్ళుండేవారు. అందరితోపాటూ వచ్చేస్తే ఈయన ఇంపార్టెన్స్ తగ్గిపోదూ?పైగా మిగిలిన నలుగురూ, పై ఊళ్ళనుంచి వచ్చిన వాళ్ళూ, ఈయనేమో లోకల్ హీరో. ఆ మాత్రం బెట్టు చూపించకపోతే ఆయన పరువు పోదూ!

ఏ పెద్ద పిల్ల పురిటికో వచ్చినప్పుడు, పసి బిడ్డని ఉయ్యాలలో వేసినప్పుడో ఫొటో తీయిస్తారు. ఆ ఉయ్యాల చుట్టూరా, రెండు మూడు తరాలవాళ్ళందరూ నుంచుంటారు. పైగా పెద్ద పిల్ల పురిటికి తీయించారు కాబట్టి, మిగిలిన అందరి కార్యక్రమాల్లోనూ తీయించాలి. అందరివీ ఉంటాయి కానీ, పాపం ఇంతమందికి జన్మ ఇచ్చిన ఇంటావిడకీ, ఇంటాయనదీ ఒక్క ఫొటోనూ ఉండదు.ఆ పెద్దాయన పోయినప్పుడు, ఇల్లంతా వెదికి ఏదో గ్రూప్ ఫోటో లోది, విడిగా తీయించి ఎన్లార్జ్ చేయించి ఓ దండ వేయడం!

ప్రతీ ఇంట్లోనూ తప్పకుండా ఉండేది ఓ కాన్వొకేషన్ ఫొటో.అద్దెకు తీసికున్న గౌనూ, హుడ్డూ తో అటెండర్ పంచి పెట్టిన డిగ్రీ కాగితం, జాగ్రత్తగా చుట్ట చుట్టి( మడత పెట్టకూడదు), ఏదో పెళ్ళి
అయిన తరువాత పసుపు బట్టలతో, కొండకు వెళ్ళి దేముడి దర్శనం
చేసికున్నట్లు, ఆ గౌనూ, హుడ్డూ తో ఓ స్టూడియో కి వెళ్ళి ఫొటో తీయించుకోవడం లో ఉన్న మజా ఎందులోనూ లేదు!
అయిపోలేదు ఇంకా ఉందండోయ్……

4 Responses

 1. ఫణిబాబు గారు, మీరు భలేగా మమ్మల్ని ఫొటో దించారండి.అవును
  మీరు మా ఇంటికి వచ్చినప్పుడు మనమూ దిగాము కదండి. అవునూ
  నాకు తెలియక అడుగుతున్నాను. అయినా ఫొటో “దిగడం” అంటారు.
  ఏదో గోతిలోకి దిగినట్లు.లేక పొతే రైలు దిగినట్లు!అసలు ఈ దిగడం అన్న
  మాట ఎల్లా పుట్టిందో?!ఉంటాటాటాటాటాటాటాటా…….మీ సురేఖ…

  Like

 2. హ హా హా.. నవ్వలేక చచ్చానండి.

  డమ్మీ కళ్ళజోడు.. బెట్టుచేసే ఇంటల్లుడు.., ఇంతకు ముందు పోస్టులో, పిల్లనిచ్చిన పాపానికి మావగారికో ఫొటో ఫ్రేమ్.. హ హా.. చాలా బాగా రాసారు.. 🙂
  ఇందులో కొన్ని విషయాలు మాటైములోనూ ఉన్నాయి.. ఇప్పుడు ఆ పాత ఫోటోలన్ని స్కాన్ చేసి హార్డిస్క్ లో దాచుకోవటమే.. గోడకి మేకేస్తే ఇంటివోనర్ ఆఖర్లో ఎక్కడ ఒక నెల అద్దే నొక్కేస్తాడో అని.. పాతఫోటో ఫ్రేమ్ లన్నీ అటకెక్కించక తప్పటంలేదు.

  Like

 3. గురువుగారూ,

  ధన్యవాదాలు.

  Like

 4. శ్రీనివాసూ,

  థాంక్స్.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: