బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–ఫుటోలకి దిగడం–1


    ఇప్పుడంటే ఇన్స్టెంట్ ఫొటోలు వచ్చాయి కానీ, ఇదివరకటి రోజుల్లో అయితే, ఫొటోలు తీయించుకోవడం ఓ యజ్ఞం లాటిది.ఊరంతటికీ ఓ ఫొటోలు తీసేవాడొకడుండేవాడు. అతని కొట్టుని ఏదో ‘ఫలానా స్టూడియో’ అనేవారు. అక్కడికి వెళ్ళగానే,అక్కడ ఏ సినిమా స్టారుదో ఓ పేద్ద ఫొటో ఉంటుంది. అలాగే, ఏ సినిమా శతదినోత్సవానికి సంబంధించినదో ఓ ఫొటో.అందులో ఎవరినో సత్కరిస్తున్నట్లుగా ఉండేది. ఆ పక్కనే ఓ బైక్కుమీద కూర్చుని, కంటికి చలవ కళ్ళజోడు ( గాగుల్స్) తో పోజు పెట్టి ఒకడి ఫుటో.

ఆరోజుల్లో ఎక్కడా అంత పెద్దగా ఫొటోల అవసరం ఉండేవి కావు.ఇంకా మనుషుల్లో, నీతీ నిజాయితీ అనేవి ఉండేవి.పరీక్ష హాల్ టికెట్లకైనా సరే, ఫొటోల అవసరం ఉండేది కాదు.హెడ్మాస్టర్/ప్రిన్సిపాల్ గారి సంతకం తో సరిపోయేది. మరి ఈ రోజుల్లో, దేనికైనా ఫొటో ఐడింటిటీ అవసరం అవుతోంది.ఎందుకంటె,ప్రతీ ఫీల్డ్ లోనూ,ఎప్లికెంటు ఒకడు పరీక్ష రాసేవాడు ఇంకోడూ, ఆఖరికి ఇంటర్వ్యూ లోకూడా అలాగే.అందువలన ప్రతీ విషయంలోనూ ఈ ఫొటో ఐడెంటిటీ కంపల్సరీ అయిపోయింది. పెళ్ళి చూపులకోసం కూడా, ఫొటోలు ఎక్కడుండేవండీ? ఎవరో మధ్యవర్తి ద్వారా ఎవరిదో సంబంధం గురించి వినడం, వాళ్ళ గోత్రం, మిగిలినవీ సరిపోతే పెళ్ళిచూపులకి వెళ్ళడం, పెళ్ళి నిశ్చయించుకోవడం. స్థోమత ఉన్నవాడైతే పెళ్ళిలో మంగళసూత్రం కట్టేటప్పుడు ఓ ఫొటో తీయించడం. అది ఏ కొండమీదైనా పెళ్ళి అయితే ( మా లాగ), ఇంకో పెళ్ళీకి వచ్చిన ఫొటోగ్రాఫర్ కాళ్ళు పట్టుకుని, ఒకటో రెండో ఫొటోలు తీయించుకోవడం. అంతే. ఆ పెళ్ళికొడుకు,మెళ్ళో తాళి కడుతూ, ఫొటో కి పోజు ఎలా ఇస్తాడో ( నాదీ అలాగే ఉందనుకోండి),ఆ తరువాత, ఆ ఫొటోలు తీసినవాడికి, మన ఎడ్రస్సు ఇచ్చి రెండంటే రెండే కాపీలకి ముందుగానే డబ్బులిచ్చి, ఆ ఫోటోలు వచ్చేదాకా ప్రతీ రోజూ పోస్ట్మాన్ కోసం ఎదురుచూడ్డం.ఆ ఫొటో వచ్చిన తరువాత, దానికి ఓ ఫ్రేం కట్టించి, ఒక ఫ్రేం అల్లుడికీ ( పిల్లనిచ్చుకున్న పాపానికి), రెండో ఫ్రేం, పెళ్ళి అయిందీ అన్న సాక్ష్యానికి ( ఆ రోజుల్లో పెళ్ళిళ్ళ రిజిస్ట్రేషన్లూ అవీ ఉండేవి కావు), హాల్లో ఓ గోడకి మేకు కొట్టి ప్రదర్శించేవారు.అందుకనే మీరు చూసే ఉంటారు, ప్రతీ పెళ్ళి ఫొటో పసుపు బట్టలతోటీ (అంటే కలరు కనిపించిందని కాదు),కర్పూరం దండలతోనూ కనిపిస్తాయి. ఇంటికి ఎవరైనా వచ్చారంటే, వాళ్ళకి కనిపించేది ఈ ఫొటోయే.

ఇవే కాకుండా, దేముడి ఫొటోలూ-మళ్ళీ వాటిలో కొన్ని బ్రహ్మాండమైన పూసల తోనూ, చెమ్కీలతోనూ చేసిన శ్రీరామ పట్టాభిషేకం, దానికి ఓ పేద్ద ఫ్రేమూ.ఆ లైనులో ఇంక దేముళ్ళ ఫొటోలు తప్ప ఇంకేమీ ఉండేవి కావు.ఏ తీర్థ యాత్రకో వెళ్ళినప్పుడు కొనుక్కున్న సత్యనారాయణ స్వామి ఫొటో, ఇవే కాకుండా ఏ బట్టల కొట్టువాడో ఇచ్చిన ఏ దేముడి ఫొటోనో ఫ్రేం కట్టించి ఉంచడం. ఆ వరసలోనే గణపతీ,అమ్మవారూ,శ్రీ వెంకటేశ్వరస్వామి,అలా ఉండేవి.ప్రతీ రోజూ ప్రొద్దుటే స్నానం చేసి, ఓ అగరొత్తు పుల్ల వెలిగించి,ఆ ఫ్రేం కార్నర్ లో గుచ్చడం. ఈ అగొరొత్తు పుల్లనుండి వచ్చే పొగతో, ఆ ఫ్రేం అంతా పొగచూరడం.ఆ ఫొటోలన్నీ ఏ నెలకోసారో,తుడుచుకోవడం.మర్చిపోయానండోయ్, శ్రీరామ పట్టాభిషేకం ఫొటోకి, రంగు కాగితాల దండలో మరోటో వేయడం.ఆ దండకూడా కొన్నిరోజులకి మట్టీ, దుమ్మూ పేరుకుపోతూంటుంది.అయినా సరే అలాగ ఉండాల్సిందే. ఈ దేముళ్ళ ఫొటోలు మొత్తం అన్నీ అయిన తరువాత, రెండో లెవెల్ లోకి, ఇంటి పెద్ద ఏ తాతగారో,నాయనమ్మో (ఇద్దరిదీ కలిసి ఉంటే ఫర్వా లేదు) లేకపోతే విడి విడిగా ఉన్నా సరే ఒకే ఫ్రేం కట్టించేసి పెట్టడం. దానికో దండా.ఆ ప్రక్కనే ఇంటి వంశోధ్ధారకుడి కాన్వొకేషన్ ఫోటో,ఆ ప్రక్కనే కాలేజీ, స్కూల్ ఫొటోలూ. ఎవరైనా ఇంటికి వచ్చారంటే, ఈ ఫొటోలు చూసి వాళ్ళ వంశవృక్షం అంతా తెలిసేది.

ఇంటికి ఏ సున్నాలో వేయించేటప్పుడు, ముందుగా ఈ ఫొటోలన్నీ తీయవలసి వచ్చేది. ఈ తీయడం, తిరిగి పెట్టడం అనే ప్రక్రియ లో కొన్నిటి గ్లాస్ పగిలిపోయేది.ఆ పగిలిన ఫొటో వాడి ఇంపార్టెన్స్ ని బట్టి, ఆ ఫ్రేం మళ్ళీ వేయించడమో, లేక దానికి పూర్తి రిటైర్ మెంట్ ఇచ్చేయడమో.అలా రిటైర్ అయిన ఫొటోలు, ఇంట్లో ఉండే చెత్తా చదారాల్లోకి వెళ్ళి చెద పట్టేసి పంచభూతాల్లోనూ కలిసిపోయేవి. ఇవాళ్టికివి చాలు. ఇంకా చాలా ఉన్నాయి…….

One Response

 1. Dear grand father
  Advancing technology:
  12mega pixel camara with 16 GB Card
  +
  “HP smart print & share”
  =
  instant photo.

  “Adobe photoshop CS3” helps you with your imagination and you can modify any photo in minutes.

  However, the pleasures of nonsense and togetherness are missing in this nuclear age.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: