బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–అవసరంలేని heroics


    నిన్న ప్రొద్దుట, మా మనవరాలు నవ్య ని స్కూలు బస్సులో ఎక్కిద్దామని, మా ఇంటిముందర రోడ్డు ప్రక్కన వెయిట్ చేస్తున్నాను. ఇంతలో ఓ 15-16 ఏళ్ళుంటాయేమో, ఓ కుర్రాడు ఝూం అంటూ ఓ మోటార్ బైక్కుమీద రెండు చేతులూ వదిలేసి స్పీడ్ గా వెళ్తూన్నాడు. మామూలుగా రెండు చేతులూ పట్టుకుంటే కూడా,జనాలు సరీగ్గా బ్యాలెన్సు చేయలేకపోతున్నారు. మరి వీడికి ఏం రోగం,రెండు చేతులూ వదిలేయడానికి? ఇదనేకాదు, సినిమాలూ, వాణిజ్య ప్రకటనలూ చూసి, ‘పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు’ గా ప్రతీ వాడూ ఓ పేద్ద హీరో అయిపోయాననుకుంటాడు.

   అసలు వీళ్ళని కాదు,18 ఏళ్ళు నిండకుండా, పిల్లాడికి స్కూటరూ,బైక్కూ, కార్లూ ఇచ్చే తల్లితండ్రులని ముందర జైల్లో పెట్టాలి! వాళ్ళకి బాధ్యత అనేది లేదా? వీడి హీరోఇజం ధర్మమా అని, వాడికే కాదు, రోడ్డు మీద వెళ్ళే ప్రతీవాడికీ
ప్రాణం మీదకి తెస్తాడు. చేతిలో డబ్బుందికదా అని ఈ నియో రిచ్ పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి గాడీలు ఇవ్వడంతో, వాళ్ళకి తమ పిల్లలమీద ఉన్న ప్రేమా, అభిమానం చూపించేమనుకుంటారు. ఆ పిల్లాడూ/పిల్లా రోడ్లమీద వేసే వేషాలు ఎప్పుడైనా తెలిసికోవడానికి ప్రయత్నం చేస్తారనుకోను.
అలాగే నగరాల్లో లోకల్ ట్రైన్లూ, బస్సుల్లోనూ చూస్తూంటాము–లోపల ఎంత ఖాళీ ఉన్నా సరే, ద్వారాన్ని పట్టుకునే వేళ్ళాడతారు.వాడు లోపలకి వెళ్ళడూ, ఇంకోళ్ళని వెళ్ళనీయడూ.అదేదో హీరో లా ఉందామని అనుకుంటాడు.మామూలుగా లోకల్ ట్రైన్, అరనిమిషం కంటే ఎక్కువ ఏ స్టేషన్ లోనూ ఆగదు. అయినా సరే, ట్రైను బయలుదేరేదాకా ఆగి, అప్పుడు ఎక్కడం ఓ సరదా!ఏ కాలో జారిందంటే, పులుసులోకి కూడా ఎముక దొరకదు.ఇంక ఇంట్లో వాళ్ళ తల్లితండ్రులు జీవితాంతం వీడిని భరించాలి. ఇక్కడ మాకు పూణే లో ఉన్నవి మొత్తం 18–20 సర్వీసులు. లొనావలా దాకా నడుపుతారు. ముంబై లోకల్స్ తో పోలిస్తే ఇది ‘చికెన్ ఫీడ్’.ముంబైలో ఉన్న రద్దీ వేరు.అక్కడ ఎన్ని లోకల్ సర్వీసులు వేసినా,రష్ తగ్గదు.అక్కడ జనాలు ట్రైన్ కంపార్ట్మెంట్ రాడ్లు పట్టుకుని వేళ్ళాడారంటే అర్ధం ఉంది. ఏదో అక్కడ చేస్తున్నారుకదా అని ఇక్కడకూడా చేయడం!లోపలకి వచ్చి కూర్చోడానికి వీళ్ళకి ఎందుకు తట్టదో తెలియదు.

    స్కూటర్/ బైక్కు మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవడానికి నామోషీ. కొన్ని కొన్ని నగరాల్లో హెల్మెట్ కంపల్సరీ చేశారు. మాకు ఇక్కడ పూణే లో ఇప్పటికి లెఖ్ఖలేనన్నిసార్లు నోటిఫికేషన్ ఇచ్చారు కానీ, పట్టించుకునే నాధుడే లేడు. ట్రాఫిక్ డ్యూటీ మీద ఉండే పోలీసులే ఈ రూలు పాటించకపోతే, ఇంక మామూలు జనాభా ఎందుకు పాటిస్తారు? అలాగే కారులో వెళ్ళేటప్పుడు సీట్ బెల్ట్ ఇవన్నీ ఎవడికోసమో కాదు, మన సేఫ్టీ కోసం అని ఎవరూ ఎందుకు ఆలోచించరో? వీటన్నిటికీ సంబంధించిన చట్టాలున్నాయి. రోజుకి ఇన్ని కేసులూ అని ఓ కోటా ఉంది కాబట్టి, పోలీసులు ప్రతీ రోజూ కొన్ని కేసులు బుక్ చేస్తారు.అవికూడా, ఆపోలీసువాడికి పరకో, పాతికో చేతిలో పెడితే కేసుండదు.

    ఈ మధ్యన రోడ్డుమీద ఎక్కడ చూసినా, ప్రతీవాడూ చెవిలో అవేవో ‘యియర్ ఫోన్’ పెట్టుకుని తిరిగేవాడే. ఇదివరకటి రోజుల్లో, ఏ పెద్దమనిషికైనా కొంచెం వినబడకపోతే, ఇలాటివి చూసేవాళ్ళం. జేబులో దానిసంబంధిత మెషీనూ, చెవిలో అదికూడా ఒక చెవిలోనే,పెట్టుకునే వారు. ఓహో పాపం ఈ పెద్దాయనకి వినబడదూ,అనుకొని, మనం కూడా ఆ యియర్ ఫొన్ ఉన్నవైపు వెళ్ళి మాట్లాడేవాళ్ళం.ఇప్పుడో మొబైల్ ఫోన్ కి, ఐపాడ్ లకీ ఈ ‘చెవిలో పువ్వులు’ మొదలయ్యాయి. మొదట్లో ఇలాటి వాళ్ళని చూసి అయ్యోపాపం ఇంత చిన్న వయస్సులోనే చెముడు వచ్చేసిందీ అనుకునే వాడిని.మొబైల్స్ కి వాడే యియర్ ఫోన్ సరే, కానీ రోడ్లమీద వెళ్ళేటప్పుడు ఐపాడ్ లేకుండా ఉండలేరా?
ఆ పాటలే వింటారా, లెక వెనక్కాల వాళ్ళు ఇచ్చే హారన్ లే వింటారా? లేక అవధాన ప్రక్రియ లో లాగ అన్నీ వింటూ, రోడ్డుమీద వెళ్ళే బడుగు ప్రాణుల పని పడతారా?

Advertisements

6 Responses

 1. Naaku mee lage anipistundi.
  15,16 years vallaki bikes iche parents pattukoni nalugu tannalani.
  Aa matram pattinchukolera pillalni.
  deenito pate inkoka vishyam.
  Naaku engineering ayipoyi,job searching ki hyd vachedaka maa intlo vallu cell phone konivva ledu.
  Adi communication kosam ani matrame.
  Kani ippudu 4,5 years pillalu kuda cell tho adukontaru.
  Nenu intiki vellinapudu maa vadina valla pillalu vachi cell lo camera pettivu photo teestanu,games pettivu adukontaanu antunte naaku mandi potuntundi.
  Vallaki ee age lo ivi avasaram ledu.
  Adi parents responsibility,konniti joliki vellakunda cheyadam.
  Maa vadina valla koduku anni serials follow avutadu.
  ETV lo abishekam nunchi night Gemini lo Sundarakanda varaku.
  Ivanni chusi vellu emi nerchukontaru valla parents ki ardam kaadu ippudu,future telustundi cinema.

  Like

 2. శ్రావ్యా,

  నేను వ్రాసిన దానితో ఏకీభవించినందుకు సంతోషము.ఈ రోజుల్లో తల్లితండ్రులే ( అందరూ కాదు) బాధ్యతా రహితంగా ప్రవర్తిస్తున్నారు. పిల్లల భవిష్యత్తు ఏమౌతుందో భగవంతుడికే తెలియాలి.

  ఇంకో సంగతి–హాయిగా తెలుగు లిపిలోనే టైపు చెయ్యొచ్చు కదా!! http://type.yanthram.com/te/

  Like

 3. kshaminchanDee telugu loa Taipu cheyyaDaaniki Taimu leadu.meeru raasea Sailee chaalaa baagundanDee.roaju kaLLa mundu kanipinchea vishayaalaayinaa chaalaa chakkagaa,oka vaipu saradaagaa, tappu cheastunna vaallaaki churukkumanipincheaTaTTu baagaa raastunnaaru.meelaa raayaalani naaku kooDaa koarikaa.ikapoate ee veaLLaaDDaalu vagairaa neanoo cheastaanu,kitikee daggara jaagaa dorakkapoatea,gaali aaDutundani.kaakapoatea pratee vaallaki manki eami kaadani oka bharoashaa!vayasuloa vunnavaallu kadaa.perigea vayasu toa maarutaaru anukuntaanu.

  Like

 4. హుమ్మ్.. నేను ఎప్పట్నుండో అనుకుంటున్న బ్లాగులో కొన్ని పాయింట్లు మీరు రాసేసారు.. :), ఇందులో చాలా విషయాలు ముందు నేను పాటించాకా అప్పుడు రాస్తే బాగుంటుంది అని వేచిచూస్తున్నాను..

  మరీ ట్రైన్లో వేలాడే అలవాట్లు, పల్సర్ 200 సి సి బైకుపై 100 స్పీడులో మెలికలుతిరుగుతూ వెళ్ళటం లాంటివి లేవులేండి.., ఈ మధ్య మార్కెట్లో 150 సి సి కి మించి వస్తున్న పవర్ బైక్స్ ఎవైతే ఉన్నాయో అవి కొనుక్కుంటున్న వారిని చూస్తుంటే.. లక్షలు పెట్టి ఏక్సిడెంట్లు కొనుక్కుంటున్నారని అనిపిస్తుంది. మనకున్న ఇరుకు కూడళ్ళకి అంత స్పీడున్న బైకులు, అంత స్పీడుగా నడపటం అవసరమా చెప్పండి?

  ఎవడిపాపాన వాడేపోతాడనకోటానికి లేదు.. వాడివల్ల మనకే చిక్కు..
  చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకున్న చెవిటివెధవ మన బైకుకిందో కారుకిందో పడితే.. తప్పు మనదే అంటారుకానీ వాడిది అనరు కదా??

  అన్ని చేదు నిజాలే.. కాబట్టి ఎవరికీ పట్టవు…

  Like

 5. కృష్ణా,

  థాంక్స్.

  Like

 6. శ్రీనివాసూ,

  ఇదివరకెప్పుడైనా తింగరి వేషాలు వేసినా, ఇప్పుడు ఇంక వెయ్యవులే ( ఇంట్లోకి ఇంకో మెంబరు వచ్చాడుగా!)

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: