బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–Overcautious


    బహుశా చిన్నప్పటినుండీ వచ్చిన అలవాటు కావొచ్చు–ఎప్పుడైనా దూర ప్రయాణాలు ( రైళ్ళే నండి బాబు) చేయాల్సివచ్చినప్పుడు, రైలు రావడానికి కనీసం ఓ గంట ముందర రావడం,ఆ రావడానికి, ఇంకో గంట ముందునుండీ, సన్నాహం చేయడం-అంటే సామాన్లన్నీ సర్దడం, ఆటో పిలుచుకోవడం.ఆ ఆటో వాడిని కూడా ఓ గంట ముందుగానే రమ్మనడం, అంతసేపు ఆపినందుకు వాడిచేత చివాట్లు తినడం.ఇంతా చేసి స్టేషనుకి వచ్చిన తరువాత, ఆ దిక్కుమాలిన ట్రైను తనకి తోచినప్పుడే వస్తుంది,ఆ ట్రైను వచ్చేలోపల,ఇంటావిడ తోనూ, పిల్లలతోనూ,చివాట్లు తినడమూ. ఎంత కాలక్షేపమో చూశారా? ఎంతమందిచేత, ఎన్నిసార్లు చీవాట్లు తిన్నా నా అలవాటు మాత్రం మార్చుకోలెకపోతున్నాను.

నాకు ఓ విషయం ఎప్పటికీ అర్ధం అవదు–ఈ తరం పిల్లలు,(పిల్లలేమిటి, పెద్దలు కూడానూ) ఫ్లైట్ లో వెళ్ళాలంటే చచ్చినట్లు, ఓ రెండు గంటలు ముందర ఎయిర్ పోర్ట్ కి వస్తారుకదా,ఏదో చెక్ ఇన్నూ,సింగినాదం అంటూ వాడు చెప్పినవన్నీ నోరుమూసుకుని చేస్తారు కదా,అక్కడికి రావడానికి ఓ రెండు గంటల ముందరనుండే సన్నాహం మొదలెడతారు కదా, ఈ మాత్రం దానికి, రైలు ప్రయాణం అనేసరికి, అలాగే రమ్మంటే నామీదెందుకు విసుక్కుంటారో తెలియదు.

ఎయిర్ పోర్ట్ లో ( అంటే మనదేశంలో, బయటి దేశాల్లో ఎలా ఉంటుందో నాకు తెలియదు) ఉండే కొన్ని ఫ్లైట్ల సంగతీ ఏదో డిస్ప్లే బోర్డ్ మీద చూడొచ్చు.ఉన్నది ఒకే ఎంట్రీ, ఒకే ఎక్జిట్టూ కాబట్టి గొడవుండదు. రైల్వే స్టేషన్ లో అలా కాదే. ఏ ట్రైన్ ఏ ప్లాట్ఫారం మీదకొస్తుందో, అది వచ్చే అరగంట ముందుదాకా భగవంతుడికికూడా తెలియదు. ఆ ట్రైన్ వచ్చిన తరువాత కూడా, మన బోగీ ఎక్కడొస్తుందో తెలియదు. ఈ మధ్యన కొన్ని పెద్ద స్టేషన్ లలో ఏవేవో డిస్ప్లే బోర్డులు పెడుతున్నారనుకోండి, అవికూడా ఓ రెండు, మూడు స్థానాలు అటో ఇటో గానే ఉంటాయి.మన అదృష్టం బాగోక ఏ వెయిటింగు లిస్టేనా అయితే ఇంక మనం పడే పాట్లు పగవాడిక్కూడా ఉండకూడదు.ప్రతీ సారీ మనం పెద్ద పెద్ద స్టేషన్లనుండే ప్రయాణం చేయము కదా, చిన్న వాటిలో ట్రైను ఎప్పుడొస్తుందో కూడా తెలియదు. వచ్చినా ఏ బోగీ ఎక్కడొస్తుందో తెలియదు.
ఇన్ని బాలారిష్టాలు దాటుకుంటేనే కానీ మనం ఆ ట్రైను ఎక్కలేమూ. లేకపోతే ఆయనెవరో చెప్పినట్లు–” మనం ఎక్కవలసిన రైలు ఓ జీవిత కాలం లేటూ’ అనుకోవాలి!

మరి ఇన్ని సమస్యలున్నప్పుడు ఓ గంటా రెండు గంటలు ముందే బయలుదేరితే ఏం నష్టం? ఇంకో సంగతి, ఇప్పుడు ఏ నగరంలో చూసినా ట్రాఫిక్కు ఎక్కువే, ఎప్పుడు ఎక్కడ మన గాడీ ఆగిపోతుందో తెలియదు. ఒక్కొక్కప్పుడు, గంట ముందుగా బయలుదేరినా,మనం ట్రైను అందుకోలేకపోవచ్చు. ఇన్నీ దాటి,స్తేషన్ కి వచ్చామనుకోండి,మన సామాన్లు మోయడానికి, ఓ కూలీని పెట్టుకోవాలి.అదేదో ఉధ్ధరించేద్దామని మనమే ఏ చక్రాలమీద లాగే ట్రాలీ సూట్ కేసులు ఉన్నా లాభం లేదు. మీరు గమనించే ఉంటారు, ఆంధ్ర దేశం లో అన్ని స్టేషన్ల లోనూ మేట్లే ఉంటాయి కానీ ర్యాంప్ ఉండదు.ఇన్ని ప్లాట్ఫారమ్ములూ దాటుకుంటూ మోసుకుని వెళ్ళలేము. పైగా ఆ కూలీలు కూడా రెండో, మూడో బేరాలు చూసుకుంటాడు, మనల్నీ, మన సామాన్లనీ ఒకచోట కూలేసి ఇంకో బేరం చూసుకోవడానికి వెళ్తాడు. ఇంతలో ఇంకో ట్రైను వస్తే అక్కడకు వెళ్తాడు. ఈ లోపులో మనం ఎక్కవలసిన ట్రైను వచ్చిందా, ఇంక మనకి ఖంగారూ, మన పోర్టరు ఎవడో తెలియదు. ప్రతీ వాడూ ఎర్ర చొక్కాతోనే ఉంటాడు. పైగా అందరిమొహాలూ ఒకలాగానే కనిపిస్తాయి. ఛాన్స్ దొరికిందికదా అని మనతో వచ్చే ఇంటావిడా, పిల్లలూ మనకే పాఠాలు చెప్తారు.” చూశారా, ఆ పోర్టరుతో బేరం పెట్టకండీ అని చెప్పాను. వాడెంత అడిగితే అంత ఇచ్చేస్తే పోలేదూ, ఇదిగో ఇలాటి చోటే మీకు కక్కూర్తీ “అంటూ, ఉన్నవీ లెనివీ కడిగేస్తారు.పోనీ అలాగని పంతానికి వెళ్ళి, సామాన్లు మోస్తారా ,అబ్బే అలాటివేమీ ఉండవు.

ఇలాటివన్నీ మనం వినాలి నోరుమూసుకొని.కానీ ఓ గంట ముందర చేరుదామని బయలుదేరమంటే మాత్రం,మనది చాదస్థం క్రింద వస్తుంది.

Advertisements

3 Responses

 1. నేను ఎప్పుడు రైల్వే స్టేషన్ కి, రైలు సమయానికి ఒక గంట ముందుగానే వ్లెళతాను, ఒకసారి మా ఆవిడ ధూట్,టాట్ నేను ముందర రాను అనేసరికి, చేసిది లేక రైలు సమయానికి స్టేషన్ కి చేరుకునేటట్లు ఇంటి నుండి బయలుదేరాను. కాని అప్పుడే లోకల్ రైలు రావడం లేట్ అవ్వడంతో స్టేషన్ కి కరక్ట్ గా రైలు బయలుదేరే సమయానికి వెళ్ళాము, అప్పుడు మాఆవిడ మీద కోపంతో లగేజి మొత్తాన్ని తనతోనే మోయించాను… అప్పటినుండి తనకు మోత బరువు తప్పుతుందని ముందే వెళదాము అని చెబుతుంది

  Like

 2. బాగుంది రైలు ప్రయాస. ఒక్క రైలనేముంది బస్సు అయినా అంతే. కాకపోతే వెంట వెంటనే ఇంకోటి దొరికే అవకాశం ఉంటుంది. రైలు ప్లాట్ ఫాం దగ్గరకొస్తొందంటే అదోరకమైన ఉద్విగ్నత నాకు. రిజర్వేషన్ ఉన్నాసరే అందులో కూర్చునేదాకా బి.పి తగ్గదు.

  Like

 3. పానీ పూరీ ,శ్రీ వాసుకీ,

  మామూలుగా ప్రతీ వాళ్ళకీ ఇలాటి అనుభవాలు జరుగుతూంటాయి.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: