బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-Unfair comparisons


    ఇంట్లో ఉండే చిన్న పిల్లల దగ్గరనుండి,ఏదో ఫీల్డ్ లో ఉన్నా వారిదాకా ప్రతీవాళ్ళనూ ఇంకోరితో పోల్చడం అంత మంచిది కాదని నేను అనుకుంటున్నాను.మన ఇంటికి ఎవరైనా వచ్చేరనుకోండి,ఇంట్లో చిన్న పిల్లలు అంటే నాలుగైదేళ్ళ వాళ్ళుంటారనుకోండి. వాళ్ళ ప్రజ్ఞా పాటవాలు, ఆ వచ్చినవాళ్ళెదురుగా ప్రదర్శింపచేయాలని, చాలామంది తల్లితండ్రులు ప్రయత్నిస్తారు. ‘ ఏదీ ఒక ఇంగ్లీషు రైమ్ చెప్పమ్మా’అని.ప్రతీ రోజూ,ఇంట్లో వాళ్ళతో బోరుకొట్టేసిన, ఆ చిన్నపిల్ల ఇంక బ్రేక్ లేకుండా,రైమ్ములు చెప్పడం మొదలెడుతుంది. కొంతసేపైన తరువాత, మీ పాప/బాబు కి ఎన్నేళ్ళండీ అని అడుగుతారు. ‘అయ్యో అంతేనా! మా వాళ్ళ పిల్ల ఈ పిల్లకంటే ఆరునెలలు పెద్ద,అయినా సరే ఇంకా స్పష్టంగా మాటలు కూడా రావు’అంటారు.
కొంతమంది పిల్లల్లో పెరుగుదల కొంచెం ఆలశ్యం అవుతుంది,ఆ కారణం చేత కొంచెం టైము తీసికోవచ్చు.ఏం కొంప ములిగిపోదు,అయినా అందరు పిల్లలూ, పుట్టీ పుట్టగానే జీనియస్సు అవాలని అనుకుని వాళ్ళమీద ‘ప్రెషర్’ తీసికొని రావడం చాలా అన్యాయం.

    ఈ మధ్యన సచిన్ తెండూల్కర్ గురించి చెప్పేవాళ్ళు ప్రతీ వాడూ,అతనిని డాన్ బ్రాడ్ మన్ తో పోల్చడం. అసలు ఇద్దరికీ పోలికలు ఎక్కడున్నాయంట?బ్రాడ్ మన్ క్రికెట్ ఆడింది 60 సంవత్సరాల క్రింద.అప్పటి పరిస్థితులు వేరు.పైగా సచిన్ అభిమానులు ప్రతీసారీ, ‘డాన్’స్వయంగా ఒప్పుకున్నాడూ,తన కంటే సచినే బెటర్ అనీ అనడం.అది డాన్ బ్రాడ్ మన్ గ్రేట్నెస్!ఎన్ని యుగాలు ఎందరు క్రికెట్ ఆడినా, బ్రాడ్ మన్ సాధించిన
ఏవరేజ్ సాధించగలరా? పైగా అలా అంటే, ఆయన ఆడినవి అరవై టెస్టులుకూడా లేవూ,ఏవరేజ్ అంత వచ్చిందంటే రాదా అని ఓ ఆర్గ్యుమెంటూ.
సచిన్ గొప్పవాడు కాడూ అనడం లేదు.20 సంవత్సరాలనుండి ఆడుతూ,అన్ని సెంచరీలూ టెస్టుల్లోనూ, ఓ.డీ.ఐ ల్లోనూ చేయడం మజాకా కాదు.
కానీ అతనిని కావలిసిస్తే ఈ శతాబ్దం లో ఆడిన బ్రియాన్ లారా తో పోల్చండి.

    ఈ మధ్యన గారీ సోబర్స్ ఒక ఫంక్షన్ లో చెప్పాడు–‘ నా ఉద్దేశ్యంలో సచిన్ కంటె గవాస్కర్ గొప్పా’ అని.కారణాలు కూడా చెప్పాడు. గవాస్కర్ తన కెరీర్ లో ఎప్పుడూ,హెల్మెట్లూ,ఇంకో రకమైన గార్డులూ పెట్టుకోలేదు.అయినా ధైర్యంగా ప్రపంచంలోని ఫాస్టెస్ట్ బౌలర్స్ మీద సెంచరీలు కొట్టాడు.
ఇప్పుడు క్రికెట్ లో ఆడుతున్న బౌలర్లేమీ, వాళ్ళకంటే ఫాస్ట్ కాదు.అయినా ఇప్పటి ప్లేయర్లు,నెత్తిమీద నుండి ప్రతీ భాగం,రక్షణ లేకుండా మైదానం లోకి దిగలేరు.
ఎవరితోనైనా కంపారిజన్ చేసేటప్పుడు అన్ని పారామీటర్లూ ఇద్దరికీ ఒకేలాగ ఉండాలి.యువరాజ్ సింగూ, సెహ్వాగ్గూ, రిచర్డ్స్ తో పోల్చడం కూడా ఇలాటిదే. ఎవరి గొప్ప వారిదే.

    ప్రతీ క్రీడ లోనూ ఇలాగే.ఎవడో మొదలెడతాడు,ఫలానా వాడు ఈ శతాబ్దానికి చాలా గొప్పవాడూ అంటూ.అయినా ఈ సతాబ్దం మొదలయి ఇప్పటికి 10 సంవత్సరాలు మాత్రమే అయింది. ఇంకా వచ్చే 90 ఏళ్ళలోనూ, ఏమో వీళ్ళందరినీ మించేవాడు రావొచ్చేమో!ఏదో ఫలానా శతాబ్దానికి ఫలానా వాడు’గ్రేటెస్ట్’ అనడం వేరూ,’ఆల్ టైం గ్రేట్’ అనడం వేరూ.

   అలాగే సినిమా పాటలగురించి కూడా.ఏదో తాత్కాలికంగా ఓ పాట పాప్యులర్ అవుతుంది. దానిగురించి ప్రతీవాడూ మాట్లాడేవాడే.ఈ ఏడాది వచ్చిన పాటల సంగతి వదిలేయండి- గత అయిదేళ్ళలోనూ ఎన్నో పాటలు వచ్చాయి, అందులో ఎన్ని పాటలు ఎంతమందికి గుర్తున్నాయీ? ఇప్పుడొస్తున్న పాటలకి ‘షెల్ఫ్ లైఫ్’-ఓ ఏడాది, మహా అయితే ఇంకో ఆరు నెలలు. మరి 60 సంవత్సరాలక్రింద వచ్చిన హిందీ,తెలుగు పాటలు ఇప్పటికీ, ప్రతీ వాడూ హం చేస్తున్నారంటే కారణం ఏమిటి? వాటిలో ఉన్న జీవం.ఆ పాటలు ఎప్పటికీ చిరంజీవులే.

    ఎవరి అభిమానులు వాళ్ళకి ఉంటారు.వాళ్ళు చెప్పిందే వేదం అని ప్రతీవారిమీదా రుద్దకూడదు. కావలిసిస్తే ప్రస్తుత రాజకీయ నాయకుల గురించి, కంపారిజన్లు చేయండి. ఎందుకంటే వీళ్ళలాటి వాళ్ళు కారణ జన్ములు! దేశ పరిస్థితిని నాశనం చేయడమే వీళ్ళ అల్టిమేట్ టార్గెట్.వీళ్ళలాటి నమూనాలు మనకి ఎక్కడా దొరకరు.శాసనసభ/ పార్లమెంటు లో ఈ మధ్యన జరుగుతున్న ‘నౌటంకీ’ వాటికి సాక్ష్యం.

Advertisements

2 Responses

  1. Avunandi miru chepindi aksharala nijam,idi prati family lonu jarigede.prati parents mundu valla pillalni vere vallato comparision maneyali,leka pote vallalo manasika andolana perige avakasam ekkuva kada…

    Like

  2. సుధా,

    త్వరలో ఇలాటివన్నీ ఇంకా అనుభవంలోకి వస్తాయి !!! ఇంకో సంగతి చెప్పు. ఇంట్లో అంత పేద్ద తెలుగు పండితుడిని పెట్టుకుని, ఇలా ‘ఇంగ్లీషు తెలుగులో’ వ్రాయడం బాగా లేదు !!

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: