బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–టిప్పులు


   అసలు ఈ టిప్పులు ఈయడం అలవాటు ఎప్పుడు, ఎక్కడనుండి వచ్చిందో తెలియదు. ఎప్పుడైనా ఏ హొటల్ కైనా వెళ్ళినప్పుడు, ఆ టిప్పు ఇవ్వకపోతే, మనని అనాగరీకుల్లాగ చూస్తాడు వెయిటర్.ఏదైనా ఊరు వెళ్ళేమనుకోండి, అక్కడ ఏదైనా హొటల్ కి వెళ్తే,అక్కడ టిప్పు ఇవ్వకపోతే
ఏమౌతుందిట?ఎలాగూ మనం ఆ హొటల్ కి రెండోసారి వెళ్ళం ( ఉండేది ఒక్కరోజే కాబట్టి), ఇంక ఆ వెయిటర్ తో శత్రుత్వానికి ఆస్కారం లేదుగా.
అంటే ఈ టిప్పుల గురించి ఎవరినైనా అడిగితే, ‘ గుడ్ విల్’ కోసం అని అంటారు.
వెయిటర్ బిల్లు తెచ్చిన తరువాత,అది తీసికుని కౌంటర్ దగ్గరకు తీసికెళ్ళి బిల్లు కట్టేస్తే,కొంతమందికి నామోషీ.ఫైవ్ స్టార్ హొటళ్ళలో అయితే అనుకోవచ్చు, అక్కడ అందరూ పెద్ద పెద్దవాళ్ళొస్తూంటారు కాబట్టి, ఆఖరికి ఉడిపీ హొటళ్ళలో కూడా, ఈ కొత్త జనరేషన్ పిల్లలు ఈ అలవాటు చేసేశారు.

    ఏదైనా లాడ్జీ కి వెళ్ళినా ఇదే పధ్ధతి, మన సామాన్లు తెచ్చినవాడు, టిప్పు ఇచ్చేదాకా అక్కడే నుంచుంటాడు! ఆఫీసుల్లో అయితే ‘చాయ్ పానీ’కి డబ్బులివ్వమంటాడు. ఏదైనా రాష్ట్ర/కేంద్ర ప్రభుత్వ ఆఫీసుకి వెళ్తే, అక్కడ ఏ కాగితం మీదైనా సంతకం పెట్టించుకోవాలంటే,ఆఖరున స్టాంపు వేసే వాడికి, టిప్పు ఇస్తే కానీ, మన కాగితం చేతికి రాదు.అలాగని ఈ విషయాలు పై అధికార్లకి తెలియకనా? అంతే అది.

    అంతదాకా ఎందుకూ ప్రతీ పుణ్య క్షేత్రంలోనూ, దేవాదయ శాఖవాళ్ళు పేద్దగా బోర్డులు అందరికీ కనిపించేటట్లుగా, పురోహితులు దక్షిణ అడిగినా ఇవ్వవద్దూ అని.ఏం వేసినా హుండీలోనే వేయండీ అని.ఒక్కచోటు చెప్పండి, పురోహితులు దక్షిణ అడగని క్షేత్రం, అక్కడికి వెళ్ళాలని ఉంది.ఏమో ఉండే ఉంటుందేమో, కానీ నాకు ఇప్పటిదాకా అలాటి క్షేత్రం చూసే అదృష్టం కలగలేదు.

    ఈ మధ్యన పేపర్లలో చదివాను-విజయవాడ కనక దుర్గ గుడిలో, కొత్తగా వచ్చిన ఈ.ఓ. ఒక ఆర్డరు వేశారుట.పూజార్ల పళ్ళేలలో ఎవరూ దక్షిణ వేయకూడదని. ఆయన సడెన్ గా చెకింగు కి వచ్చి, ఏ పూజారైనా దక్షిణ తీసికుంటున్నాడని( అంటే పళ్ళెం లో డబ్బులు) తెలిసిందో, తక్షణమే వారిమీద చర్య తీసికున్నారుట.ఆయన ఏ టైములో చెకింగు కి వస్తారో తెలియదు, అందువల్ల ఈ పూజార్లు కూడా, ఎందుకొచ్చిన గొడవరా బాబూ,అని విడిగా దక్షిణ తీసికోవడం మానేశారు.ఆమధ్యన ఎప్పుడో పదిహేను రోజులు ఆయన డ్యూటీ మీద ఎక్కడికో వెళ్ళవలసివస్తే, అమ్మయ్యా అనుకొని, పూజార్లు మళ్ళీ దక్షిణ తీసికోవడం మొదలెట్టారు.( ఇది పేపర్లో చదివిన వార్త).

    ఇప్పుడు ఎలా ఉందంటే మనిషి పుట్టుక దగ్గరనుండీ, శ్మశానానికి వెళ్ళేదాకా ప్రతీ చోటా ఈ టిప్పులు/దక్షిణలు ఇవ్వవలసిందే. హాస్పిటల్ కి వెళ్ళండి, ఏ భార్య పురిటికో,డిస్చార్జ్ చేసే రోజున లైన్లో నుంచుంటారు,( నర్సులూ, డాక్టర్లూ తప్ప).ఆఖరికి, శ్మశానానికి వెళ్ళినా ఇదే గొడవ. మనం టిప్పు/దక్షిణ ఇచ్చేదాకా, అస్థికలు ముట్టుకోనీయడు అక్కడుండేవాడు.

    ఈ టిప్పులూ దక్షిణలూ మన జీవితంలో ఓ భాగం అయిపోయాయి. అంతదాకా ఎందుకూ, స్టాండు లో ఉన్న ఆటో వాడిని,ఫలానా చోటుకి వస్తావా అంటే, వాడు ఏదో మొత్తం చెప్పి అంత ఇస్తేనే వస్తానంటాడు. మీటరు మీద రావడానికి ఏం రోగంరా అంటే, కొంతమందైతే ‘మీటరు పని చేయడం లేదూ’అంటారు. ఇంకొంతమందైతే ఇష్టముంటే రా, లేకపోతే ఇంకో ఆటో చూసుకో అంటాడు.మన ఇంటిపక్కే ఆ ఆటో స్టాండుంటుంది, వీళ్ళతో అనవసరంగా గొడవెందుకూ, అని వీళ్ళచూపుకందనంతవరకూ నడిచి ఏ ‘రన్నింగ్ ఆటో’ నో పట్టుకోవాలి. రైల్వే స్టేషన్లదగ్గరా, బస్ స్టాండ్ల దగ్గరా ఇంకా అన్యాయం.

    ఎక్కడ చూసినా ఈ టిప్పులగొడవ వదలడంలేదు.స్కూళ్ళలోనూ ఎడ్మిషన్ టైములో అదేదో బిల్డింగు ఫండు పేరుతో, యాజమాన్యం వాళ్ళు ముక్కు పిండి వసూలు చేస్తారు. ఇదో స్టైలిష్ టిప్పు అన్నమాట!మనం ఇల్లుమారేటప్పుడు, ఏ ప్యాకర్స్ తోనో ఓ మొత్తానికి మాట్లాడుకుంటాము, అయినా సరే,ఆ సామాన్లు తెచ్చేవాళ్ళు, ఆఖరున చాయ్ పానీకి ఏమైనా ఇవ్వమంటారు.

    ఆఖరికి తిరుపతి క్షవరానికి వెళ్ళినప్పుడు కూడా, అక్కడుండే వాడు, మనం దక్షిణ ఇవ్వలేదనుకోండి, ఇంక అంతే సంగతులు-గుండు షేప్పు మార్చేస్తాడు.అన్నెందుకూ, మన కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో కూడా ‘ సర్వీసు టాక్స్’ అని ఒకటేశారు. అదీ ఈ కోవలోదే!అందరూ తింటున్నారుకదా అని వాళ్ళూ మొదలెట్టేశారు.

    ఆతావేతా చెప్పొచ్చేదేమిటంటే,భారత దేశంలో బ్రతకాలంటే ఈ టిప్పులూ,దక్షిణలూ,గుడ్ విల్ పేమెంటులూ లేకుండా కుదరదు !!

Advertisements

One Response

  1. బ్రిటీష్ వారు పరిపాలించిన దేశంకదా… అదే దర్జా దర్పం నిలబెట్టుకోవాలని ఇలా టిప్పులిస్తున్నామేమో.. 🙂

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: