బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-అవసరంలేని మొహమ్మాటం


    మామూలుగా ఏమిటవుతూందంటే, పిల్లలు పెరిగేటప్పుడు,తల్లితండ్రులు, ఇంటికి ఏదైనా తినే వస్తువు తెచ్చినప్పుడు,పిల్లలు తింటారులే అనుకొని
మాకు అవి అంత ఇష్టం లేదూ అని ఓ కుంటిసాకు చెప్పేసి, ఉన్నదంతా పిల్లలకే పెడుతూంటారు.దానితో ఏమౌతుందీ అంటే, ఈ తల్లితండ్రులకి
ఓ ఇమేజ్ ఏర్పడిపోతుంది.

అప్పటివరకూ పర్వాలేదు. కానీ ఈ ఇమేజ్ మన జీవితాంతమూ మనతోనే ఉండిపోతుంది! పెద్దయిన తరువాత కూడా, మన పిల్లలు, వాళ్ళపిల్లలతో చెప్తారు…’తాతయ్యకి ఫలానా ఇష్టం లేదు,నానమ్మ ఫలానాది తినదూ అంటూ. మన ఇమేజ్ కాపాడుకోవాలిగా !ఇన్నేళ్ళు అయిన తరువాత, ‘అర్రే అప్పుడు మీరు చిన్న పిల్లలు కదా అని అలా చెప్పేవాళ్ళమురా, మాకు మాత్రం తినాలని ఉండదూ’ అని చెప్పడానికి చెప్పలేని మొహమ్మాటం! దీన్నే అవసరం లేని మొహమ్మాటం అంటారు!

ఇంత వయస్సువచ్చిన తరువాత, ఇదేం చిరుతిళ్ళూ అనుకుంటారేమో అని ఓ భయమూ. ఈ రోజుల్లో చుస్తూంటారుగా, ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకోసం, నూడిల్సూ, పాస్తా, బిస్కట్టులూ ఎన్నెన్నో తెచ్చి పెడుతూంటారు.ఎప్పుడో ఒకసారి నాకు ఆఫర్ చేస్తే ‘నాకు వద్దూ, మీరే తినండి’అని పొరపాటున అన్నాను! అంతే మళ్ళీ ఎప్పుడూ ఆఫర్ చేసిన పాపానికి పోలేదు.ఇలా కాదు సంగతీ అని, ఈ మధ్యన ఒకసారి మర్చిపోయి, మళ్ళీ ఆఫర్ చేస్తే, మాట్లాడకుండా తీసేసికున్నాను! అప్పటినుండీ పాపం మా వాళ్ళు ఇంట్లో ఇలాటివి ఎప్పుడు చేసినా నాకు కూడా ఇస్తూంటారు!

ఎప్పుడో ఒకసారి ఊరికే మొహమ్మాటానికి పోయి, మా ఇంటావిడ ‘కూల్ డ్రింక్స్ అంత ఇష్టం లేదూ’ అందట.తను తణుకు వెళ్ళినప్పుడు, వాళ్ళ అమ్మగారు, అందరికీ కూల్ డ్రింక్స్ తెప్పించి, ‘ పెద్దక్కకి వద్దురా, తను తాగదూ’ అని ఈవిడని డిలీట్ చేసేశారు.అలాగే ‘స్వీట్స్’ అంటే ఇష్టం లేదూ అన్న పాపానికి, ఎవ్వరూ ఆవిడకి స్వీట్స్ ఆఫర్ చెయ్యడంలేదు!

గుర్తుందా టి.వీ.లో ఆ మధ్యన ఓ యాడ్ వచ్చేది-అదేదో కంపెనీ చాయ్ గురించి.అందరూ కావాలంటారు, కానీ మొహమ్మాటానికి ఒకడు, వద్దంటాడు.ఆ చాయ్ ఖుష్బూ చూసి, పాపం తాగుదామనుకుంటాడు. ‘హోస్టెస్ ‘ అరే నువ్వు వద్దన్నావుకదూ, ఆర్ యూ ష్యూర్’ అంటూ,అతనికి ఇవ్వకుండా మిగిలినవాళ్ళందరికీ ఇస్తుంది. వీడేమో వెర్రిమొహం వేసికుంటాడు.

మా చిన్నప్పుడు, మా చుట్టాలొకళ్ళింట్లో కాఫీ లో పంచదార వేయకుండా ఇచ్చేవారు. పంచదార తక్కువైందని చెప్పడానికి మొహమ్మాటం, అలాగే
ఏదో మందు తాగేసినట్లుగా మింగేవాళ్ళం.40 ఏళ్ళ తరువాత, వాళ్ళింటికి వెళ్ళినా ఇప్పటికీ, అది గుర్తుంచుకొని, పంచదార లేకుండానే ఇస్తూంటారు!

అలాగే రోడ్ సైడులో ఉండే ‘భేల్’, ‘పానీ పూరీ”కచ్చీ దాబ్లీ’ లాటివి తినాలనిపిస్తుంది, ఈ వయస్సులో అక్కడ నుంచుని తింటే, ఎవరైనా చూస్తే బాగుండదూ అనుకొని మానేస్తాము.ఈ ఇమేజ్ బిల్డింగ్ అనేది ఉందే, ఈ అనవసరమైన మొహమ్మాటాల వల్లే వస్తుంది. కేక్కుల సంగతీ అలాటిదే. అందులో ఎగ్ ఉంటుందని మా ఇంటావిడ తినదు. అందుకని ఇంటికి ఎప్పుడు తెచ్చినా ‘ఎగ్ లెస్’ కేక్కులే.

పూణే వచ్చిన కొత్తలో ఆమ్లెట్ తినేవాడిని.చాలా కాలంతిన్నాను కూడానూ. అయినా ఈమధ్యన, మా మనవరాలికి ఓ రోజు ఆమ్లెట్ వేసి, నాక్కూడా ఆఫర్ చేస్తే, మొహమ్మాటానికి పోయి , ‘అబ్బే అరగదూ’ అని చెప్పాను.పోనీ ఇంకోసారైనా అడిగితే లాగించేద్దామనుకున్నాను, అబ్బే అలాటిదేమీ లేదు.

ఇప్పటికీ, మా పిల్లలు ఎప్పుడైనా హొటల్ కి తీసికెళ్తే, ముందరే ‘డాడీ కి ఇది ఇష్టం లేదూ, మమ్మీకి ఫలానా ఇష్టం లేదూ’ అని వాళ్ళే డిసైడ్ అయిపోయి, చివరకు ఏ చపాతీల్లోకో తెచ్చేస్తారు!పోనీ బయటకు వెళ్ళినప్పుడైనా అన్నిరకాలూ రుచి చూపించొచ్చుగా, ఇదిగో ఈ ఇమేజ్ వల్ల వచ్చిన గొడవంతా!

అందుకనే చెప్పొచ్చేదేమిటంటే ఎప్పుడూ మొహమ్మాటానికి వెళ్ళి అది వద్దూ, ఇది వద్దూ అనకుండా, కావలిసినవన్నీ తెప్పించేసికోండి.అలాగని తిండికోసమే బ్రతకండీ అని కాదు, చిన్న చిన్న సరదాలు ఎప్పుడు తీర్చుకుంటారూ ఇప్పుడు కాక.వంట్లో ఏ రోగమూ లేకపోతే, హాయిగా, కావలసినవి అడగండి.

అలాగే ఎవరింటికైనా భోజనానికి వెళ్ళామనుకోండి, ఆ ఇంటివాళ్ళు,మొహమ్మాట పడకుండా అన్నీ వేయించుకోండి అంటారు. అసలు భోజనం చేస్తామని చెప్పడానికే సిగ్గూ, మొహమ్మాటం లేనప్పుడు, కావలిసినవన్నీ తినడానికి ఏం రోగం?అయినా వాళ్ళు చెప్పడం వాళ్ళ ధర్మం!

Advertisements

11 Responses

 1. Well said.

  Like

 2. ఇమేజ్ బిల్డప్పుల గురించి చాలా బాగా చెప్పారండీ తను తీసుకున్న గోతిలో తానే పడటం అంటే ఇదే కాబోలు.’మొహమాటం’ ని ఇంగ్లీష్ లో ఏమంటారో చెప్పగలరా ప్లీజ్ !(వాళ్ళకలాంటివి లేవంటారా?)

  Like

 3. భలే సరదాగా రాసారండీ…… నిజమే, నాకూ ఒక హోటల్ వాడితో ఇలాంటి అనుభవం ఉంది…..వాడి హోటల్లో ఎంటర్ అయితే చాలు, వాడు నన్ను చూసి పూరి ఆర్డర్ చెప్తాడు….. అంతకు ముందు బాగుంది కదా అని మూడు సార్లు వరసగా తిన్నాను, నేను కాదు కానీ వాడు ఫిక్స్ అయిపోయాడు నేను అదే తింటానని, ఇక అప్పటి నుండి మొదలు ప్రతీసారీ పూరీ తినాలిసివచ్చేది….. చివరికి ఆ హోటల్ కి వెళ్ళడం మానేయాలిసి వచ్చింది. ….ఒక రకమయిన మొహమాటం వాడు ఆర్డర్ ఇచ్చాక మనం కాన్సుల్ చేస్తే బాగుండదేమో అని ఫీలింగ్. అంతే……

  Like

 4. శ్రీ,

  థాంక్స్

  Like

 5. సాహితీ,
  నా బ్లాగ్గు మీకు నచ్చినందుకు ధన్యవాదాలు.

  may be you can say ‘ feeling shy’

  Like

 6. శ్రీకరబాబూ,

  ప్రపంచంలో చాలా మందికి ఇలాటి అనుభవాలు జరుగుతూనే ఉంటాయి. ఎప్పుడో ఒకప్పుడు, ధైర్యం చేసేసి చెప్పేయాలి. కానీ ఆ ధైర్యం రాదే.దాన్నే
  మొహమ్మాటం అంటారు!!

  Like

 7. > ఇలా కాదు సంగతీ అని, ఈ మధ్యన ఒకసారి మర్చిపోయి, మళ్ళీ ఆఫర్ చేస్తే, మాట్లాడకుండా తీసేసికున్నాను! అప్పటినుండీ పాపం మా వాళ్ళు ఇంట్లో ఇలాటివి ఎప్పుడు చేసినా నాకు కూడా ఇస్తూంటారు
  🙂

  Like

 8. మీ బ్లాగులు అన్ని చాలా బాగుంటున్నాయండి.

  Like

 9. సుధా,

  నా బ్లాగ్గులూ అవీ తరువాత సావకాశంగా చదువు. ఎనీ వే థాంక్స్.

  Like

 10. ఆలస్యమైన నిజం తెలుసుకున్నారు. మొహమాటాన్ని ఉండచుట్టి పడేసి హాయిగా కావల్సినవి తినండి. మా నాన్నగారు మీ తరహానే. సున్నుండలంటే ఇష్టం ఆయనకు. కాని నాకు ఇష్టమని నాకు పెట్టేయమంటారు. అలాంటప్పుడు ఓ రెండు మూడు సున్నుండలు చేతిలో పెట్టుకొనెళ్ళి తీసుకోమని నేనే ఇస్తా ఇక అప్పుడు కాదనకుండా తీసుకుంటారు. అప్పుడనిపిస్తుంది ఎందుకో ఈ మొహమాటం ఆయన సంపాదన ఆయన తినడానికని.

  Like

 11. శ్రీ వాసుకీ,

  ఎప్పుడో వదిలేశాను మొహమ్మాటాలు! అయినా అప్పుడప్పుడు–ఉదాహరణకి ఏ చాక్లెట్టొ తినాలని ఉందనుకోండి, మరీ చిన్న పిల్లలతో పోటీ పడితే బాగుండదుగా !!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: