బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–Field day for TV Channels


   అబ్బ!ఎంత కాలక్షేపమో మన టి.వీ. వాళ్ళకి! ఓ బాబా గురించి చూపించి 24 గంటలు గడవకుండానే, ఇంకోడు దొరికాడు ! ఇంగ్లీషు వార పత్రికలు చూస్తూంటాము, వరసగా ఏదో ఒక టాపిక్ పట్టుకొని అందరూ ఊదరగొట్టేస్తూంటారు.ఏదో సర్వే అని పేరు పెట్టేయడం, అందులో ఎవరో ఓ వెయ్యిమంది ( అని అంటారు)ని ఏవో చెత్త ప్రశ్నలు వేయడం, వాటికి వాళ్ళిచ్చిన సో కాల్డ్ ‘జ్ఞానవంతమైన’ జవాబులు వ్రాసి, ఈ పత్రిక వాళ్ళు చదువరులకి జ్ఞానోదయం చేయడం. అందులోనూ,ఏ సెక్స్ విషయమైనా అయితే ఇంక వాళ్ళ ఫైల్స్ లో ఉన్న పాతవీ, కొత్తవీ ఫొటోలు పెట్టేసికొని పత్రిక సేల్స్ పెంచుకోవడం! సంవత్సరాలనుండీ చూస్తున్నాము ఈ వీధిభాగోతాలు!

    అలాగే మన టీ.వీ. వాళ్ళకి ప్రస్తుతం ‘బాబా’ల హవా . ప్రతీ చానెల్ వాడూ, ఓ ముగ్గురిని పిలుస్తాడు-అదేదో జ్ఞాన విజ్ఞాన కేంద్రం,ఓ మనస్థత్వ విశ్లేషకుడూ, ఓ మహిళా సంఘ ప్రతినిధీ. టి.వీ. ఏంకరుకి కావలిసినంత మసాళా దొరుకుతుంది.ఈ వారమంతా ఇదే గోల భరించాలి. వీళ్ళు చెప్పేది
రైటా, రాంగా అని ఎవడికి కావాలి? వెళ్ళేవాడు, ఎవరు చెప్పినా చెప్పకపోయినా స్వామీజీ ల దగ్గరకు వెళ్తూనే ఉంటాడు. ఈవేళ ఓ చానెల్ లో జరిగిన చర్చలో ఏంకరు అడిగిన ‘ ఈ బాబాలదగ్గరకు మహిళలే ఎందుకు ఎక్కువగా వెళ్తారూ’ అన్న ప్రశ్నకి, ఒకాయన చెప్పాడూ, ‘ఈ స్వామీజీల ఐ.క్యూ. చాలా ఎక్కువా, వాళ్ళ మార్కెటింగ్ స్కిల్స్ ఉపయోగించడంతో అందరూ వాళ్ళ వలలో పడుతూంటారూ’ అని.

    ప్రస్తుతం ఉన్నది ‘కన్జ్యూమరిజం’, అది ఓ సబ్బు అవొచ్చు,ఓ కూల్ డ్రింక్ అవొచ్చు, ఇంకేదో అవొచ్చు. మన మాధ్యమాల్లో జరిగే పబ్లిసిటీ లవల్లే కదా మనం వాటిని కొంటున్నాము.అలాగే బాబా లు కూడానూ.పెద్ద పెద్ద నగరాల్లో ఈ బాబా ఎవడైనా వచ్చేడంటే, ఈ చానెల్ వాళ్ళేకదా ఎగబడిపోతూంటారూ,అక్కడికి ఎవడో మినిస్టరో, సినిమా నటుడో వచ్చేడంటే చాలు, ఇంకా పబ్లిసిటీ ఇచ్చేస్తూంటారు. ఇప్పుడు ఏడవడం దేనికీ?

    మహాత్న్యం గల రాళ్ళూ, రత్నాలగురించి ప్రత్యేక కార్యక్రమం ప్రతీ చానెల్ వాడూ చూపిస్తాడు. ఎందుకంటే, చానెల్ వాడికి ఆ పబ్లిసిటీ ఇచ్చినందుకు డబ్బులు వస్తాయి కాబట్టి. చర్చల్లో మాత్రం, ఏదో మహాత్ముడిలాగ ప్రశ్నలు మాత్రం వేసేస్తూంటారు. ఇలాటి డబుల్ స్టాండర్డ్స్ ఉన్నంత కాలం, వీళ్ళకి ఇంకోళ్ళని ప్రశ్నించే అధికారం లేదు.

    ముందుగా ఈ ‘హిపోక్రసీ’ నుండి బయట పడాలి.వీళ్ళు చూపించే కొన్ని కొన్ని క్లిప్పింగ్స్ ఈ బాబాలు చేసేవాటికన్నా ఛండాలంగా ఉంటాయి.కనీసం ఈ బాబాలు, వాళ్ళ ఆశ్రమాల్లో ఎవడికీ తెలియకుండా వాళ్ళదారిన వాళ్ళు కక్కూర్తి పడుతున్నారు. ఎక్కడో ఎవడికో వాటాల్లో తేడా వచ్చినప్పుడు ఇలా మీడియా దగ్గరకు వచ్చేసి ఛాతీలు బాదుకుంటారు. అక్కడెక్కడో ఢిల్లీ లో కూడా ఈవేళ ఓ స్వామీజీ ని పట్టుకున్నారుట, సెక్స్ రాకెట్ నడుపుతున్నాడని. సో వాట్? ప్రతీ రోజూ పెపరు తెరిస్తే ఇలాటి వార్తలు కోకొల్లలు.అందులో డి.ఐ.జీ లున్నారు, మంత్రులున్నారు, ఆఖరికి ఎనభైయేళ్ళు దాటిన గవర్నరు ని కూడా చూశాము. ఏమైనా ఆగిందా?

   గుర్తుండే ఉంటుంది-రాహుల్ మహాజన్ అని ఓ ‘బుధ్ధిమంతుడు’, వాడికున్న క్వాలిఫికేషన్ ఏమిటిటా, ఓ జాతీయ పార్టీ నాయకుడి కొడుకు,వాడి పెళ్ళాం, ‘డొమెస్టిక్ టార్చర్ ‘ క్రింద వీడిని వదిలేసింది.తండ్రి పోయిన రోజుల్లో ‘డ్రగ్స్ ఏక్ట్’ క్రింద అరెస్ట్ కూడా చేశారు. అవన్నీ మంట కలిసిపోయాయి.పైగా ఇవన్నీ చాలవన్నట్లు, అదేదో ‘బిగ్ బాస్సో’ సింగినాధమో కార్యక్రమంలో ఈ పెద్దమనిషి కి పబ్లిసిటీ కూడానూ. ఈ వేళ అదేదో ఇంగ్లీషు చానెల్ లో రాహుల్ మహాజన్ పెళ్ళి గురించి ఓ వార్తా ! దాని క్రిందే, ప్రమోద్ మహాజన్ ని చంపెసిన తన సోదరుడు ఈ వేళే బ్రైన్ హెమరేజ్ వల్ల చనిపోయాడని-సుఖ పడ్డాడు.

7nbsp;   ఈ చానెల్ వాళ్ళు ఏదో ఉధ్ధరించేస్తున్నట్లుగా కార్యక్రమాలు చేయడం అపేసి, ఎవరి మానాన్న వాళ్ళని బ్రతకనిస్తే అందరూ సుఖపడతారు.

Advertisements

One Response

  1. బాగా చెప్పారు. ఒకప్రక్క చర్చ జరుగుతుంటే మరో ప్రక్క ఎడతెరిపి లేకుండా ఆ బాబా చేసే పనిని విజువల్స్ లో చూపించడం. చిరగ్గా అనిపించింది. వీళ్ళు అసలు మంచి చేస్తున్నారో చెడు చేస్తున్నారో అర్థం కావడంలేదు.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: