బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-Silly Doubts


    నాకు ఒక విషయం ఎప్పుడూ అర్ధం అవదు. ఏరోప్లేన్లు నడిపే పైలట్లకి లక్షల్లో జీతాలు ఎందుకిస్తారూ అని! ప్లేన్ ఆకాశంలో వెళ్ళేటప్పుడు,ట్రాఫిక్ సిగ్నల్స్ గొడవ ఉండదు,ట్రాఫిక్ జాం ఉండదు,రోడ్లమీద లాగ ఎక్కడపడితే అక్కడ ఆవులూ, గేదెలూ ఉండవు.పైగా అస్తమానూ కంట్రోల్స్ దగ్గరే ఉండఖ్ఖర్లేకుండా, అదేదో ‘ఆటో పైలట్టూ’ అవీకూడా ఉంటాయి.మరి ఈ పైలట్ గారికి పనేమిటంట?వీటన్నిటికీ సాయం, ఎయిర్ పోర్ట్ లో ఉన్న ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళు వీడికి దారికూడా చెప్తారు.

అలాగే ట్రైన్ డ్రైవర్స్ కి కూడా.వీళ్ళకీ అంతే, ఎక్కడో ఒకటీ, అరా తప్పిస్తే ఒకే ట్రాక్ మీద రెండేసి ట్రైన్లు రావు.వీడికో అసిస్టెంటు కూడా ఉంటాడు.పైలట్టు లాగే. ఏం ఉధ్ధరించేస్తున్నారని వీళ్ళకి అంతలేసి జీతాలు ఇస్తారో?
ఇంకో విషయం-ఎయిర్ ట్రావెల్ చేసేవాళ్ళకి ఇన్స్యూరెన్స్ కూడా ఎక్కువే. రైల్లో వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగితే అయిదు లక్షలిస్తారనుకుంటాను.

అస్సలు జీతాలు అందరిలోకీ ఎక్కువ ఇవ్వాలంటే బస్సు డ్రైవర్లకి మాత్రమే న్యాయంగా ఇవ్వాలి. వాళ్ళు రోడ్లమీద బస్సు నడిపేటప్పుడు, ఎంత జాగ్రత్తగా ఉండాలో.ట్రాఫిక్ జాంలు, సిగ్నల్స్,అకస్మాత్తుగా రోడ్డుకి అడ్డంగా వచ్చే ఆటోలు,జంతువులు వగైరా వగైరా…పోనీ మన రోడ్డులేమైనా సరీగ్గా ఉంటాయా అంటే,ఏదో హైవేలు తప్పించి, మన దేశంలో రోడ్ల సంగతి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది! మామూలుగా లాంగ్ డిస్టెన్స్ ప్రయాణాలు, రాత్రిళ్ళే జరుగుతూంటాయి. ఒక్కడే డ్రైవరూ. అతనికి ఎదురుగా వచ్చే ట్రక్కులూ,కార్లూ, బస్సులూ, వేసే లైట్లతో కళ్ళు సరీగ్గా కనిపించవు కూడానూ. అయినా తన డ్యూటీ నాలుగు గంటలూ,జాగ్రత్తగా బస్సుని నడిపి, ప్రయాణీకుల్ని గమ్యస్థానాలకి చేరుస్తూనే ఉంటారు.ఎక్కడో దురదృష్టంకొద్దీ ఏక్సిడెంట్లు జరుగుతాయి. కానీ వాటి శాతం చాలా తక్కువే.

నేను ఈ మధ్యన అంటే గత అయిదారేళ్ళనుండీ, ఈ రాత్రిపూట బస్సుల్లో ప్రయాణాలు తగ్గించాను.అంతకుముందు, ఎప్పుడు ప్రయాణం చేసినా రాత్రంతా మెళుకువగానే ఉండేవాడిని! మొత్తం బస్సంతటికీ, నేనూ, ఆ డ్రైవరే మెళుకువగా ఉండేవాళ్ళం! నేను ఓసారి కన్ను మూసుకున్నా ఫర్వాలెదు.అదే డ్రైవరుకి నిద్రొచ్చిందంటే శ్రీమద్రమాణగోవిందో హరీ !! రైళ్ళలోనూ, ప్లేన్లలోనూ ఓ సదుపాయం ఉంది.హాయిగా కాళ్ళుజాపుకుని పడుక్కోవచ్చు, మధ్యలో అవసరం వచ్చినా టాయిలెట్ కి వెళ్ళొచ్చు.బస్సులో మాత్రం ఆ డ్రైవరుకి అవసరం వస్తేనే ఆపుతాడు. అప్పుడే మనకి వచ్చినా రాకపోయినా రోడ్డు ప్రక్కకి వెళ్ళాలి!ఇదొకటే బాగుండదు.ఈ మధ్యన బస్సుల్లో కూడా స్లీపర్లు ప్రారంభించారు.

ఈ స్లీపర్లు కొత్తగా మొదలెట్టినప్పుడు, ఓ తమాషా జరిగింది. నాకు వీటి సంగతి తెలియదు.ఓ రోజు రోడ్డుమీద నుంచొని ఉంటే, ప్రక్కనుండి ఓ బస్సు వెళ్తోంది. అందులో స్లీపర్ ఉంది కాబోలు, అద్దంలోంచి హారిజాంటల్ గా పడుక్కున్నవారిని లైట్లలో చూసి, అవన్నీ, డెడ్ బాడీస్ అనుకొని, పాపం ఒకేసారి ఎన్ని బాడీలు తీసికెళ్తున్నారో అని బాధ పడిపోయాను!

ఘాట్ రోడ్లమీద బస్సు డ్రైవర్లు ఎంత జాగ్రత్తగా నడపాలో. తిరుమల వెళ్తూంటే అర్ధం అవుతుంది, మన ప్రాణాలన్నీ ఎవరిచేతుల్లో ఉన్నాయో-బస్సు డ్రైవరూ, ఆ శ్రీ వెంకటేశ్వరస్వామీ నూ.మరి ఇంత చాకచక్యంతో మన రోడ్లమీద విజయవంతంగా బస్సుల్ని నడిపించి, గమ్యస్థానాలకి చేరుస్తున్న డ్రైవర్లని ఎవరూ ఎందుకూ పట్టించుకోరూ ?

Advertisements

7 Responses

 1. hmm, government has to thnk this issue.. ahha.

  Like

 2. manchi seifeld tarahaa praSna adigaaru 🙂

  Like

 3. ప్రశాంత్, బుడుగోయ్,

  ధన్యవాదాలు.నాకొచ్చిన సందేహాలకి ఎవరైనా నవ్వుతారేమో అని భయపడ్డాను.

  Like

 4. ఒక్క ట్రైన్లో తప్ప ఫ్లైట్లొ కాని, బస్ లో గాని, ఎన్నిసార్లు ప్రయాణం చేసినా ఎప్పుడూ నిద్రపోలా? ఇరవై నాలుగైనా ముప్ఫైఆర్రు గంటల ప్రయాణమైనా..కూర్చొని నిద్ర ఎలానో? మీ బుర్రలోనూ నాబుర్రలోనూ ఒకే రకమైన సెల్స్ కూర్చినట్లున్నాడు.ఆలోచనల్లో ఎన్నెన్నో సామ్యాలు.మీరన్నట్లు బస్సు డ్రైవర్ల ప్రావీణ్యతను మెచ్చుకోక తప్పదు

  Like

 5. రాఘవేంద్రరావుగారూ,

  ఎంత చెప్పినా తాతయ్యలం కదా! అందుకే ఆలోచనలుకూడా ఒకేలా ఉన్నాయేమో !!

  Like

 6. అద్బుతము గా ఛెప్పారు ఫని గారు, మీ హస్య ఛతురతకి నా వన్ధనాలు

  Like

 7. శివగణేష్,

  నా బ్లాగ్గు చదివి కామెంటు వేసినందుకు ధన్యవాదాలు.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: