బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–రణ్


    ఈ మధ్యన చూసిన హిందీ సినిమాల్లో ‘రణ్’,నాకు నచ్చింది.రాంగోపాల్ వర్మ ‘షోలే’ రీమేక్ తీసి, చేతులు కాల్చుకున్నాడు.ఇంక తన పని అయిపోయిందేమో అనుకునేటంతలో,ఈ ‘రణ్’ తో మళ్ళీ రంగం మీదకు వచ్చాడు.ఇలాటి సినిమాలు తెలుగులో ఎందుకు తీయడో అర్ధం కాదు.

    సినిమా కథ అంతా ప్రచార మాధ్యమం అయిన టి.వీ చాన్నెల్స్, వాళ్ళు టీ.ఆర్.పీ లకోసం తినే గడ్డీ, తిమ్మిని బమ్మీ బమ్మిని తిమ్మీ చేయడం గురించి.అది మనం రోజూ చూస్తున్నదే.’రణ్’ లో ఒక టి.వీ. చానెల్,ఒక ప్రభుత్వాన్ని,పడగొట్టి ఇంకో ప్రభుత్వాన్ని, ఎలా అధికారంలోకి తేగలదో, చాలా బాగా చూపించారు.అదీ బాగా ప్రాచుర్యమున్న చానెల్ ఏదైనా ఒక విషయం గురించి చెప్తే, ప్రేక్షకులు,దాని వెనుక ఉన్న నిజానిజాలు తెలుసుకోకుండా, గొర్రెల మందలా ఎలా ప్రభావితులౌతారో చూడొచ్చు.

    ‘హర్షవర్ధన్ మల్లిక్ (అమితాబ్) ఒక టి.వీ. చానెల్ అధిపతి అతని కొడుకు జై ( సుదీప్).వీళ్ళిద్దరూ కలిపి నడుపుతున్న న్యూస్ చానెల్ కి టీ.ఆర్.పీ లు అంతబాగా ఉండవు. కారణం వాళ్ళ న్యూస్ అంతా మరీ ఉన్నదున్నట్లుగా చూపించేయడం వల్ల.అంతా ‘ రాముడు మంచి బాలుడు’ టైపూ. ఇంకో సంగతేమంటే వీళ్ళ ఐడియాలన్నీ, ఇంకో చానెల్ వాళ్ళు తీసేసికుని, వాళ్ళ టి.ఆర్.పీలు పెంచేసుకుంటూంటారు.ఒక పరిస్థితిలో, ఆర్ధికంగా బాగా కష్టాల్లో పడిపోయేదాకా వస్తుంది.ఇలాటి సమయంలో, జై మల్లిక్ గత్యంతరంలేక మోహన్ పాండే ( పరేష్ రావల్) దగ్గరకు వస్తాడు. ఇతను ఓ టిపికల్ రాజకీయవేత్త ఉఛ్ఛం నీచం అనే పదాలు అతని డిక్షనరీలో ఉండవు. తనకి కావలిసిందల్లా పదవి. అది ఎలా వచ్చినా ఫర్వాలేదు. ఇప్పుడు మన రాష్ట్రంలో ఇలాటి రాజకీయ నాయకులకి ఏం కొదవా లేదు.వాళ్ళకి ‘అధికారం’ అల్టిమేట్ టార్గెట్. అదిరావడానికి ఎంత నీచానికైనా దిగజారతారు.మొత్తానికి వీళ్ళ కుటిల తంత్రంతో, అధికారంలో ఉన్న ప్రభుత్వం
పడిపోయి,పాండే ఆల్మోస్ట్ అధికారంలోకి వచ్చేస్తాడు.ఈ లోపులో,పూరబ్ శాస్త్రి (రితేష్ దేష్ ముఖ్) కారణంగా, ఈ వ్యవహారాలన్నీ బయట పడతాయి. చివరగా, అమితాబ్ బచ్చన్ స్పీచ్ తో సినిమా పూర్తి అవుతుంది.

    నటన విషయంలో అమితాబ్ గురించి ఏం చెప్పం? గ్రేట్! ఇంక మిగిలిన వారిలో మొహినీష్ బెహెల్, రజత్ కపూర్, సుచేతా కృష్ణమూర్తీ ఎవరి పరిధిలో వారు చాలా బాగా చేశారు.

    ఈ సినిమా కొంచెం మధూర్ భండార్కర్ స్టైల్ లో ఉందేమో అనిపించింది.రాంగోపాల్ వర్మా సినిమాల్లో ఉండే సస్పెన్స్ ఎక్కడా లేదు.ఈ మధ్యన మన తెలుగు చానెళ్ళలో వచ్చిన కొన్ని సంచలానాత్మక వార్తలు,ఈ కోవకే చెందినవేమో అనిపిస్తూంటుంది.ఒక విషయం ఏమిటంటే, వాటివల్ల ఎవరూ రాజీనామాలూ చెయ్యలేదు, ఏ చానెల్ ఓనరూ మారలేదు,ఎవరూ ఆత్మహత్యలూ చేసికోలేదు ( ఈ సినిమా లో చూపించినట్లుగా !!).వాళ్ళమానాన వాళ్ళు ఒకరికొకరు పోటీగా సెన్సేషనల్ న్యూసులు చూపిస్తూనేఉన్నారు.
ఉదాహరణకి ఈ వేళ కల్కీ స్వామి తన ఆశ్రమంలో చేసే అరాచికాల గురించి వార్త వచ్చింది.దీని ధర్మమా అని టి.వీ-9 టీ.ఆర్.పీలు ఆకాశాన్నంటాయి.
ఏది ఏమైనా, చాలా స్లీక్ గా తీసిన సినిమా ఇది.ఒకసారి తప్పకుండా చూడవలసినది.

8 Responses

  1. _______________________
    ఉదాహరణకి ఈ వేళ కల్కీ స్వామి తన ఆశ్రమంలో చేసే అరాచికాల గురించి వార్త వచ్చింది.దీని ధర్మమా అని టి.వీ-9 టీ.ఆర్.పీలు ఆకాశాన్నంటాయి.
    _______________________

    నిజమే. కానీ అస్తమానం అదే చూపిస్తుంటే బోర్ కొట్టింది !!

    Like

  2. > కల్కీ స్వామి తన ఆశ్రమంలో చేసే అరాచికాల గురించి వార్త వచ్చింది.
    ఆ వార్త నా చిన్నపటినుంచి వింటునే ఉన్నాము, ఇంతవరకు చర్యలు ఏమి తెసుకున్నారో తెలియదు

    Like

  3. ఈ సినిమా నేను మధుర్ భండార్కర్ పక్కన కూర్చునే చూసాను, లారెల్, వాషింగ్టన్ డి సి దగ్గర్లో. నాకు సినిమా పర్లేదు కాని అంత గొప్పగా అనిపించలేదు.

    నాకు మధుర్ భండార్కర్ దోస్తేం కాదండోయ్. ఆ వేళ పడ్డ మంచు తుఫానుకి సినిమా వాళ్ళు చాలా స్క్రీన్స్ మూసేసారు. ఈ ఒక్క సినిమా రన్ చేస్తే దాంట్లోకొ వచ్చింది 11 మంది. నేను లేట్ గ వెళ్ళి ఓ సీట్లో కూర్చున్నా. తర్వాత ఇంటర్వెల్ లో తెలిసింది, ఆయన మధుర్ అని.

    KumarN

    Like

  4. సుమోటో గా కల్కి కేసును స్వీకరించడానికి ఏ ధర్మాసనానికీ మూడ్ లేదు. ఎందుకంటే, కల్కిని మొక్కేవాళ్ళలో మెజిస్టీరియల్ సర్వీసు వాళ్ళు కోకొల్లలు ఉంటారు. అదే యూనివర్సిటీ మూసేసినా, ఉద్యమాలు చేస్తున్న కుర్రకారు కోసం హాస్టలు తెరవమని, పోలీసుల్ని కాంపస్ నుండీ పంపమనీ, తగుదునమ్మా అని అసంబద్ధమైన తీర్పులు ఇవ్వడానికి మన హై కోర్టు ఫస్టు. ఒక వేళ పోలీసులూ, సీ.బీ.ఐ. కేసులు పెట్టినా, కొట్టి పారెయ్యడానికి సిద్ధంగా ఉన్నారు మన న్యాయమూర్తులు.

    Like

  5. గణేష్,

    అదే మనవాళ్ళలో ఉన్న కిటుకు–టీ.ఆర్.పీలు అలాగే పెంచుకుంటూంటారు. బ్లాగ్గుల్లో స్వంతంగా నొక్కేసికొని హిట్స్ పెంచుకున్నట్లుగా !

    Like

  6. పానీపూరీ,

    కల్కి ఆశ్రమం స్కాండలే కాదు.దేనుగురించైనా సరే, ఏక్షన్ తీసికుంటే,ఇంక రాజకీయ నాయకులకీ, కోర్టులకీ,ప్రభుత్వాలకీ పనేం మిగలదు.అలాగే మన టి.వీ.చానెల్స్ కూడా.ఏం న్యూసూ లెనప్పుడు ఇలాటిదేదో పెట్టుకుంటే, వాళ్ళకీ కాలక్షేపం.

    Public also can be taken for a ride, time and again !!

    Like

  7. కుమార్,
    మధూర్ భండార్కర్ ‘రణ్’ సినిమా చూశాడని, కనీసం మీద్వారానైనా తెలిసింది.మామూలుగా ఎవరైనా, అతనిని, రణ్ సినిమా చూశారా అని అడిగితే, ‘నో! ఐ డిడ్ నాట్ ఫైండ్ టైమ్ టు వాచ్ ద మూవీ’ అని ఉండేవాడు ! అది భారత దేశంలోని ‘సెలిబ్రైటీస్’ కి ఓ ఊతపదం !

    Like

  8. సుజాతా,

    That can happen only in India!
    ఊరికే, ఎవరో వస్తారనీ, ఏదో చేస్తారనీ ఆశించడం దండగ! ఇలాటి బాబాల దగ్గరకి, మన రాష్ట్రపతులూ, మంత్రులూ,క్రీడాకారులూ,పారిశ్రామికవేత్తలూ,పోలీసులూ,న్యాయ మూర్తులూ వేలంవెర్రిగా వెళ్తూంన్నంతకాలం,ఇలాటివి ఆగవు.

    This is the most lucrative business in India!!

    Like