బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-కాలక్షేపం


    మా ఇంటావిడ మనవడితో బిజీ బిజీ అయిపోయింది.పాపం కంప్యూటర్ వైపు చూడ్డానికి సమయమే ఉండడం లేదు.నేను ఈ మధ్యన పూణే లోని సిటీ బస్సు వాళ్ళు, సీనియర్ సిటిజెన్స్ కి నెలవారీ (300 రూపాయలు) ఇచ్చే పాస్ ఒకటి పుచ్చుకున్నాను.

   ప్రొద్దుటే 8.15 కి మా నవ్య స్కూలు బస్సు వస్తుంది. ఈ లోపులో ఎదురుగా ఉండే గణపతి గుడికి వెళ్ళి ప్రసాదం తెస్తాను.ఇంతలో బస్సూ లో, మా పెద్ద మనవరాలూ(తాన్యా),మనవడు (ఆదిత్య) వస్తారు. ఈ ముగ్గురికీ ఈ ప్రసాదం ( పంచదార క్యూబ్బులు) ఇచ్చేసి టాటా చెప్పేసి, నా తరువాతి కార్యక్రమానికి
అంటే అయ్యప్ప గుడీ,దుర్గ గుడీ, హనుమాన్ గుడీ, దత్త మందిరం దర్శనం చేసికొని, దారిలో తెలుగు పేపరూ,ఓ ఇంగ్లీషు పేపరూ తెచ్చుకోవడం,కొంప చేరడం.బ్రేక్ఫాస్ట్ ఏ చపాతీయో,పరోఠా యో తినడం. అప్పుడప్పుడు బోరు కొడితే ఎదురుగా ఉన్న హొటల్ లో ఏదో ఇంకో వెరైటీ తినడం.

    10.00 గంటలకల్లా ఓ సంచీ, కెమేరా వేసికొని, ఏ బస్సు దొరికితే ఆ బస్సు ఎక్కేయడం చివరిదాకా వెళ్ళడం.45 ఏళ్ళనుండి ఇక్కడే ఉన్నా చాలా ప్రాంతాలు తెలియవు.ఇంకో సంగతేమంటే పూణే నగరం అన్ని దిక్కుల్లోనూ పెరిగిపోయింది.కొన్ని కొన్ని పేర్లైతే అసలు వినలేదు కూడానూ. ఈ బస్సు పాస్ ధర్మమా అని ఊరంతా తిరగకలుగుతున్నాను.ఏ ఒంటిగంటకో ఇంటికి చేరడం. ఈ లోపులో మేము రెంటు కి పుచ్చుకున్న ఫ్లాట్ కి వెళ్ళి
అక్కడకూడా ఓ సారి చూసుకోవడం. ఏదో లాగించేస్తున్నాను.

    ఈ మధ్యలో ఏదైనా మిస్టరీ షాపింగ్ ఎసైన్మెంట్ వస్తే దానికి వెళ్ళడం. భోజనం చేసేసి, ఓ గంట నిద్రపోవడం. సాయంత్రం 5.30 కి మళ్ళీ నవ్య స్కూలునుండి తిరిగి వస్తుంది. అప్పుడు మళ్ళీ మా తాన్యా, ఆదిత్య లకు టాటా చెప్పడం.ప్రతీ రోజూ వాళ్ళని పలకరిస్తున్నాను కదా అని, మా అమ్మాయికి ఫోన్ చేయడం కొంచెం అశ్రధ్ధ చేశాను. ఈ వేళ ఓ లెక్చర్ ఇచ్చేసింది-కొడుకూ కోడలే కాదూ, మేము కూడా ఈ ఊళ్ళోనే ఉన్నామూ అంటూ.’తల్లీ ! మనవడూ, మనవరాల్నీ రోజూ రెండు సార్లు పలకరిస్తున్నాను కదా అని ఫోన్ చేయడం లేదూ’అన్నాను.అంటే తను అందీ’నా పిల్లల్ని పలకరిస్తున్నావు సరే, నీ పిల్లని కూడా గుర్తుంచుకోవాలి కదా’ అని. ఇంక రేపటినుండి మర్చిపోకుండా చేయాలి!

    ఇంట్లో చెప్పాను, పూణే లో ఏ ప్రాంతం లో పని ఉన్నా నాకు చెప్పేయండి, బస్సు పాస్ ‘పైసా వసూలీ’ చేయాలి అని! ఇన్నీ పూర్తి అయిన తరువాత సాయంత్రం 7.00 నుండి 8.00 దాకా, మా బిల్డింగ్ గేట్ దగ్గరే నుంచోవడం-ఎవరో ఒకరు రిటైర్ అయినవాళ్ళో, సర్వీసులో ఉన్నవాళ్ళో పలకరిస్తూంటారు.

    ఇన్ని పనుల కార్యక్రమాల మధ్యలో ఇంట్లో ఉన్న పాత ‘రచన’ లు అన్నీ చదవడం.మొదటి సంచిక నుండి అన్నీ జాగ్రత్త చేశాము! అవి చదువుతూంటే తెలుస్తోంది, 10-15 సంవత్సరాల క్రితం ఆ పత్రికల్లో వచ్చే కథలు ఎంత బాగుండేవో అని.ఇప్పటి ‘సెక్స్ విజ్ఞానాలూ’అవీ లేకుండా
హాయిగా చదువుకోడానికి బాగుండేవి. ఇప్పుడు మనందరం బ్లాగ్గుల్లో వ్రాసే విషయాలు, ఆ రోజుల్లోనే అప్పటి వారు వ్యాసాలలో వ్రాశారు.ఒక్కోటీ చదువుతూంటే అప్పటి రచయితలు ఎంత ముందుచూపుతో వ్రాశారో తెలుస్తుంది.వారు ఆ రోజుల్లో వ్రాసినవన్నీ ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తూనే ఉన్నాము.

    అదే కాకుండా ‘భక్తి’ ‘ఎస్.వి.బి.సి’ చానెల్లలో వచ్చే ‘ప్రవచనం’ కార్యక్రమాలు వింటూంటే, ‘అర్రే ఇప్పుడు ప్రపంచం లో జరుగుతున్నవన్నీ ఆ రోజుల్లోనే ఊహించేశారా’ అనిపిస్తుంది. మన పురాణాల్లో వ్రాసినవన్నీ నిజమే అనిపిస్తూంది.

    ఈ అంతర్జాల మహిమ ధర్మమా అని, కావలిసినవాటి అన్నింటిగురించీ తెలుసుకోకలుగుతున్నాను.ఇదివరకైతే అంతా మిడి మిడి జ్ఞానం! అలా అని ఇప్పుడు ఏదో మహా జ్ఞాని అయిపోయానని కాదు. కనీసం తెలియనివాటి గురించి, ఎవరో చెప్తే తల ఊపేయడం కాకుండా,స్వయంగా తెలిసికోవడానికి
ఓ ఉపకరణం దొరికింది.ఏమీ తెలియని నాకే ఇలాగుందంటే, కంప్యూటర్ లో ప్రవీణులైన మీకందరికీ ఎలా ఉంటుందో?

    అందుకే అంటాను-దేనికైనా టైము రావాలీ అని.మేము రాజమండ్రీ గోదావరి తీరానికి వెళ్ళుండకపోయినా, ఆ గాలి పీల్వకపోయినా, ఇంకా ‘ కూపస్థ మండూకం’ లాగానే ఉండేవాడిని .

Advertisements

8 Responses

 1. > ఓ సంచీ, కెమేరా వేసికొని, ఏ బస్సు దొరికితే ఆ బస్సు ఎక్కేయడం చివరిదాకా వెళ్ళడం.
  ఏమన్నా మంచి ఫోటోలు తీస్తే మీ బ్లాగులో పెట్టండి 🙂

  Like

 2. మీరు రాజమండ్రి గురించి చెప్పినప్పటి నుండీ నాకు రాజమండ్రి చూడాలని ఒకటే కోరిక, అది మహశివరాత్రికి తీరింది. ధవలేశ్వరం బ్రిడ్ఝ్ కడియపులంక అంతర్వేది అన్ని తిరిగేసాను, కొనసీమ అందాలన్ని అద్బుతం. రాజమండ్రి వీధుల్లో తిరుగుతుంటె మీరు ప్రస్తావించిన చిన్న చిన్న సందులన్ని కనిపించాయి, అప్పుడు చెప్పాను మా వారికి నేను ఇవన్ని చూడాలని ఎందుకంత ఆత్రుత పాడ్డాను అంటె ఒకటి ఫణిబాబు గారు ఇంకొకరు వంశీ రాసిన పసలపూడి కతలు, అని చెప్పాను. ఇక పాపికొండలు టూర్ మాత్రం అనిర్వచనీయమైన అనుభూతి మిగిల్చింది.
  ఇంకా కడియపు లంక పూర్తిగా చూడనే లేదు మళ్ళి వెళ్ళాలి వీలు చూసుకుని.

  Like

 3. పానీపూరీ,
  సలహా బాగానే ఉంది.కానీ ఎక్కడచూసినా మాల్స్,హైరైజ్ బిల్డింగ్సే, ఆ కాంక్రీటు జంగిల్ ని ఫోటోలు తీయడం ఎందుకూ?ఇంకో సంగతి- ఏదో ఫొటో తీసేసమయంలో, ఎక్కడో ఉన్న సి.సి.కెమేరా లో నాఫొటో పడిందంటే అంతే సంగతులు ! హాయిగా ఏదో కాలక్షేపం చేసేస్తున్నాను, లేనిపోని గొడవలెందుకు?ఎప్పుడైనా పూణే బయటకు వెళ్తే తప్పకుండా తీస్తాను !

  Like

 4. భారతీ,

  చాలా సంతోషం.మేము ఏప్రిల్ లో ఒకసారి వెళ్ళే ప్లాన్ చేస్తున్నాను.అక్కడుండగా మిస్ అయినవన్నీ చూడడానికి. కోనసీమ నచ్చినందుకు సంతోషం.

  Like

 5. మీ కాలక్షేపం బాగుంది. సమయాన్ని బాగా గడుపుతున్నారన్న మాట. నేను రాజమండ్రిలోనే ఉద్యోగం చేస్తున్నాను.

  Like

 6. శ్రీవాసుకీ,

  అదేమిటో, మేము రాజమండ్రి వదిలిన తరువాతే మన బ్లాగర్లు రాజమండ్రీ వస్తున్నారు! ఓ ఆరు నెలలముందొస్తే మాకూ మిమ్మల్ని కలిసే అదృష్టం కలిగేదిగా !!

  Wish you a very very happy time!

  Like

 7. చాలా బావుంది సార్ మీ కాలక్షేపం పద్ధతి.
  మొన్న డిసెంబర్లో విజయవాడలో వారం రోజులున్నప్పుడు నేనూ ఇదే ప్లాన్ వేశాను – బస్టాండుకి వెళ్ళి ఏ బస్సొస్తే ఆ బస్సెక్కి టెర్మినస్ దాకా వెళ్ళి రావాలి అని – కుదరనే లేదు, ప్చ్!
  మీ అమ్మాయిగారికి ఈ రెండు సామెతలు చెప్పండి ఈ సారి మాట్లాడినప్పుడు.
  అసలు కన్న వడ్డి ముద్దు.
  ముందొచ్చిన చెవుల కన్న వెనకొచ్చిన కొమ్ములు వాడి 🙂

  Like

 8. కొత్తపాళీ,

  ఏదో మా పూణే మ్యున్సిపల్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళ ధర్మమా అని ప్రతీ రోజూ కాలక్షేపం అవుతోంది. మీరు అన్నట్లుగా అసలు కంటె వడ్డీ ముద్దు.కానీ
  ఆ అసలు వాళ్ళు ఒప్పుకోరుగా !!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: