బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-సువాసనలు


    మా చిన్నప్పుడు వేశవి వెళ్ళి వర్షాలు అందులోనూ మొదటి వర్షం వచ్చేముందర ఒక రకమైన మధురమైన సువాసన ఆస్వాదించేవాళ్ళం.మట్టి
మీద మొదటి చినుకు పడగానే వచ్చే వాసన ఇప్పటి రోజుల్లో ఓ తీయటి జ్ఞాపకంగానే మిగిలిపోయింది
.నగరాల్లో అస్సలు మట్టి అనేది ఎక్కడైనా కనిపిస్తోందా? ఏదో గవర్నమెంటు క్వార్టర్స్ ఉన్నచోట కొన్ని కొన్ని ఖాళీ ప్రదేశాలు కనిపిస్తూంటాయి.పోనీ అక్కడైనా ఈ సువాసన ఉంటుందేమో అని చూస్తే, ఈ ప్రకృతి కూడా మనమీద కక్ష కట్టినట్లనిపిస్తూంది.

    క్రిందటేడాది రాజమండ్రీ లో ఉంటున్నప్పుడు పోనీ ఈ అదృష్టం కలుగుతుందేమో అనుకుంటే,అప్పుడు అసలు వర్షాలే పడలేదు !ఆ పాత రోజులు గుర్తుతెచ్చుకుంటూ బ్రతికేయడమే మనకి రాసిపెట్టినట్లుంది.ఆ మట్టి వాసన రావాలికదా అని,బయట ఉన్న మట్టిమీద నీళ్ళు పోస్తే వస్తుందా? ఆ తొలకరి చినుకు ప్రకృతిసిధ్ధమైన మట్టిమీద పడ్డప్పుడే ఆ సువాసన వస్తుంది. ఇప్పటి వాళ్ళకి ఆ విషయాలు చెప్తే ఏం అర్ధం అవుతుందీ? ఇప్పుడు ఎక్కడ చూసినా గ్లోబల్ వార్మింగే.

   అలాటిదే మరో సువాసన పురిటి రోజులు వెళ్ళేదాకా పసిబిడ్డ వద్ద వచ్చే సువాసన! ఇదివరకటి రోజుల్లో పసిబిడ్డలకి, ఆముదమో, ఏదో నూనో మర్దనా చేసి, నలుగు పిండితో నలుగు పెట్టి, శుభ్రంగా స్నానం చేయించి, సాంబ్రాణి పొగ పెడితే, రోజంతా , ఆ పసిబిడ్డ దగ్గర సువాసనే సువాసన.
ఇప్పటి రోజుల్లో అలా కాదే! నూనె పెడితే ఎలర్జీ,పెసరపిండి పెడితే ఎలర్జీ,సాంబ్రాణి పొగ పెడితే ఎలర్జీ.ఇవన్నీ నేను చెప్పేమాటలు కావండోయ్. ఏవో రాషెస్ వచ్చాయని డాక్టరు దగ్గరకు వెళ్ళడం, ఆయనేమో, ఈ బేబీ కి రోజూ ఏం చేస్తున్నారని అడగడం, వీళ్ళు చెప్పినదాన్ని బట్టి, పై చెప్పినవన్నీ
అంటే నూనె,పెసరపిండి, సాంబ్రాణి బ్యాన్ చేసేయడం! ఇదివరకటి రోజుల్లో శుభ్రంగా ఉపయోగించేవి, ఈ రోజుల్లో ఎందుకు పనికిమాలినవయ్యాయో నాకైతే తెలియడం లేదు. వాతావరణంలో మార్పా, మనం తినే తిండిలో మార్పా, లేక మన మనస్థత్వాల్లో మార్పా?

    ఇదంతా ఎందుకు వ్రాస్తున్నానంటే మొన్న 14 వతేదీ న ‘మీకోసం'(here) అనే బ్లాగ్గులో, ఈ రోజుల్లో గర్భిణీ స్త్రీలు ఇంటర్నెట్ ధర్మమా అని ఎంత వత్తిడికి లోనౌతున్నారో అనే అంశమీద ఓ మంచి బ్లాగ్గు వ్రాశారు.దాన్ని దృష్టిలో పెట్టుకుని,గర్బిణీ స్త్రీలే కాదు, పుట్టిన పిల్లల గురించి కూడా, ఇంటర్నెట్ లో ఏవేవో చూసేసి, ఏవేవో ఊహించేసి వాళ్ళు ఖంగారు పడిపోయి, ఇంట్లో ఉన్నవాళ్ళని ఖంగారు పెట్టేస్తున్నారు.పసిపిల్లాడు గుక్కత్రిప్పుకోకుండా ఏడిస్తే, వెంటనే నెట్ ఓపెన్ చేసేయడం,అందులో వాడేదో వ్రాస్తాడు, అది చదివేసి, వెంటనే డాక్టర్ కి ఫోన్ చేసేసి, ఎపాయింట్మెంట్ ఫిక్స్ చేసేసి, వెళ్ళడం.అక్కడ ఆయనేమో, వీళ్ళింకా ఉపయోగిస్తున్నవాటి గురించి అడిగి, వాటిని కూడా బ్యాన్ చేసేయడం.
నాకైతే మాత్రం పైన చెప్పిన రెండు సువాసనలూ చాలా చాలా ఇష్టం !
!

Advertisements

6 Responses

 1. కొత్తవానలోని వచ్చే మట్టి వాసన ఎవరికి నచ్చదు చెప్పండి…, ఈ రోజుల్లో దేనిలోనూ ఒరిజినాలిటీనీ చూడలేకపోతున్నాం.., అంతా కల్తీయే… మనుషుల్లోనూ.. మనుషులు మనసుల్లోనూ కల్తీయే.. అందుకే ఇవ్వన్నీ మధురానుభూతులుగా చెప్పుకోటానికే మిగిలిపోతున్నాయి…

  Like

 2. మీరు చెప్పిన రెండు సువాసనలూ అంటే ఇష్టం లేని వారు ఎవరు చెప్పండి? ఆ మట్టి వాసన కోసమే, నేను అపార్టుమెంటు కొనుక్కోకూడదని, కాస్త ఎక్కువ ఖర్చు అయినా, చుట్టూరూ స్థలం వదిలి, కాసిని మొక్కలు పెంచుకునే వీలు ఉండేలా ఇండిపెండెంటు గా స్థలం కొని ఇల్లు కట్టుకున్నాను. ఇక పిల్లల విషయమంటారా – మా అబ్బాయికి ఎవరో గిఫ్టుగా ఇచ్చారని బేబీ షాంపూ వాడాము – విపరీతంగా ఎలర్జీ వచ్చింది. మళ్ళీ దగ్గర దగ్గర 6 నెలలు సున్నిపిండి వాడితే గానీ వాడికి జుట్టు సరిగ్గా రాలేదు. ఇప్పటికీ చలికాలం మా ఇంట్లో సబ్బు నిషేధం – నూనె రాసుకోని సున్నిపిండితో స్నానం చేయడమే అలవాటు. (ఈ రోజుల్లో వస్తున్న స్క్రబ్ ల మూలం మన సున్ని పిండే అని చెబితే ఈ కాలం పిల్లలు నమ్మరు గానీ ఒక సారి వాడినతరువాత తెలుసుకుంటారు)

  Like

 3. నరసింహారావుగారూ,

  సంతోషం.

  Like

 4. శ్రీనివాసూ,

  అందుకే వీలున్నప్పుడల్లా గుర్తుచేసికోవడం తప్ప ఇంకేమీ చేయలేకపోతున్నాము.

  Like

 5. విరజాజీ,

  అదృష్టవంతులు.ఇంక పిల్లల విషయం అంటారా, నెట్ లోనూ ఉన్నదే వేదం అనుకుంటారు.అనుభవం మీదే తెలుస్తాయి.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: