బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-పుత్రోత్సాహం-3


    ఇదివరకటి రోజుల్లో అయితే చంటి పిల్లలకి ఏమైనా అస్వస్థత చేస్తే, ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు, వారి అనుభవం ఆధారంగా, ఏదో ఇంటి వైద్యం చేసేవారు. అంతదాకా ఎందుకూ, పసిపిల్లకి,సరీగ్గా జీర్ణం అవక, కడుపునొప్పితో ఏడుస్తూంటే, ఇంట్లోని ఏ పెద్దవాళ్ళో, శుభ్రంగా కాళ్ళు జాపేసికొని, చంటి పిల్లకి, ఆరారగా నూనెతో మర్దనా చేస్తే, ఓ అరగంటలో హాయిగా, కడుపు ఖాళీ అయి నవ్వుతూ కేరింతలు కొట్టేది. ఇప్పుడో అసలు నూనె మాట ఎత్తుతేనే చాలు, గయ్య్ మంటారు.ఇంక కడుపు మీద మర్దనా మాట దేముడెరుగు ! ఏమైనా అంటే, ఇప్పుడు మెడికల్ సైన్స్ బాగా అభివృధ్ధి చెందిందీ, నాటు వైద్యాలు చేయకూడదు,అంటారు.పాపం, ఆ పెద్దవాళ్ళు మొహం చిన్నబుచ్చుకుంటారు.ఇంకొంతమందైతే లాప్ టాప్ తెరిచేసి, నెట్ లో వెదికేసి,పసిపాప ఎందుకేడుస్తూందో, దాని వెనక ‘పాసిబుల్ ‘ కారణాలు ఏమిటో ,ఓ లెక్చర్ ఇచ్చేసి , ఇవతలి వారికి ‘జ్ఞానోదయం’ చేస్తారు.

పోనీ ,పెద్దవాళ్ళూ, ఏదో చెప్తున్నారూ అనుకోవచ్చుగా. వీళ్ళుమాత్రం పసిపిల్లని హింస పెట్టేస్తారా? అబ్బే, ‘పాత’ వాళ్ళకంటె, మనకే ఎక్కువ తెలుసూ,అని ఓ భావం.ఒకటి మర్చిపోతారు, ఆ పెద్దవాళ్ళే వీడిని అన్ని బాలారిష్టాలనుండీ కాపాడేరు ! ఒకసారి అనుభవం అయి ,లెక్చర్ విన్న తరువాత ఈ పెద్దాళ్ళూ, రంగంలోంచి తప్పేసుకుంటారు.అటు పసిపాప గుక్క పట్టి ఏడుస్తూంటే చూడాలేరూ, అలాగని వీళ్ళ మూర్ఖత్వానికి సమాధానమూ చెప్పలేరు.అంతే ‘జీవిత చక్రం’ అలా నడుస్తూనే ఉంటుంది.

ఈ బాలారిష్టాలన్నీ జయించి, ఆ పిల్లో, పిల్లాడో ‘ప్లే స్కూల్ ‘ స్టేజ్ కి వచ్చిన తరువాత ఉంటుంది, అప్పటికి ఆ చిన్న పిల్లో/పిల్లాడో ఈ పెద్దవాళ్ళకి చేరువౌతూంటాడు. ఈ సంగతి వాళ్ళకి ఎవరూ నేర్పరు. సహజంగా వచ్చేస్తుంది.ఎంతైనా రక్తసంబంధం కదా ! తల్లితండ్రుల మాట వినకుండా, ఈ పెద్దవాళ్ళ దగ్గరకు వాళ్ళ పిల్లలు రావడం వీళ్ళకు నచ్చదు.అయినా ఏదో మొహమ్మాటానికి కొంత సేపు నోరు మూసుకు కూర్చుంటారు. అయినా ఎన్నాళు ఇలాగ?

ఇంక ఆ పిల్లో పిల్లాడో ఈ తల్లితండ్రులకి ‘ ఆంఖో కా తారా’ ‘ట్వింకిల్ ఆప్ మై ఐ ‘ ఎట్సట్రా, ఎట్సట్రా….చెప్పానుగా వీళ్ళు తమ పిల్లల్ని ఎంతలా ప్రేమిస్తున్నారో,తమ చిన్నతనం లో ఏమేమి కోల్పోయారో, అవన్నీ తాము తమ ‘ఆంఖో కా తారా’ కి ‘వితౌట్ సెకండ్ థాట్ ‘ ఎలా ఇవ్వకలుగుతున్నారో, క్షణక్షణం గుర్తు చేస్తూ రోజులు గడుపుతూంటారు. ఒక్క విషయం చెప్పండి- వీళ్ళ అమ్మా నాన్నలు ఎలా పెంచారో వీళ్ళకి ఎలా తెలుస్తుందీ? ఆ చిన్న పిల్లతో అవీ ఇవీ కబుర్లు చెప్తూ, చివరికి సబ్జెక్ట్ ఎక్కడకు తెస్తారంటే–‘డాడీ,యు ఆల్సో గాట్ టాయిస్ లైక్ మీ,వెన్ యు వర్ ఆఫ్ మై ఏజ్?’ అనేదాకా.అప్పుడు ఈ పిల్ల తల్లితండ్రులు ‘చూడండి, మా పిల్లకి కూడా తెలిసింది, మీ నిర్వాకం’ అనే అర్ధం వచ్చేలా ఓ చూపు విసిరి,వాళ్ళ పాయింట్ రిజిస్టర్ అయింది కదా అని ఇంకో టాపిక్ లోకి వెళ్తారు.

మరి ఆరోజుల్లో చైనీస్ టాయ్ లు, బార్బీ లూ ఉండేవి కాదు. వీళ్ళు మాత్రం ఎక్కడినుండి పుట్టిస్తారూ? ఓ ఎర్ర చందనం బొమ్మో, తాటాకుతో చేసిన బొమ్మలో, మహా అయితే అబ్బాయికి కర్రతో దొల్లించుకోడానికి ఏ సైకిలు టైరో ఉండేవి. ఏ పుణ్య క్షేత్రానికో వెళ్ళినప్పుడు, చిన్న చిన్న తాటాకు బుట్టల్లో లక్క పిడతలూ.ఇంకొంచెం పెద్ద అయిన తరువాత, సిగరెట్టు పెట్టిలతో కుక్క బొమ్మా లాటివీ. ఏదో పండగొచ్చినప్పుడు కొత్త బట్టలూ, ఇంట్లో మగ పిల్లలు మరీ ఎక్కువైతే ఓకే తానులో బట్టలూ ! ఏ తీర్థానికో వెళ్ళినప్పుడు మిఠాయి కొమ్ములూ, జీళ్ళూ, కారప్పూసా–చిరుతిళ్ళు వీటికి మాత్రమే పరిమితం.అలాగని వాళ్ళూ ఏమీ పేచీ పెట్టేవారు కాదు.ఉన్న దానిలోనే హాయిగా ఆనందించేవారు. ఇక్కడ బాటం లైన్ ఏమిటంటే ‘ కంటెన్ట్ మెంట్’ అని నా ఉద్దేశ్యం.

ఇప్పుడు అలాగ కాదే.ఇంటి నిండా బట్టలూ, పెట్టి నిండా రకరకాల బొమ్మలూ.ఎలెక్ట్రానిక్కూ, మెకానికలూ ఒకటేమిటి మార్కెట్ లో దొరికే అన్ని రకాలూ ఇంట్లో ఉండాలి. ఈ చిన్న పిల్ల అమ్మయౌతే కొన్ని రోజులు ఆడుకుంటుంది పాపం, అదే అబ్బాయైతే ఆ బొమ్మ తన చేతికి వచ్చిన పావుగంటలో దానిని పీకి పందిరేస్తాడు.వందలూ, వేలూ పోసి తెచ్చిన బొమ్మ కాస్తా క్షణాల్లో
ముక్కలౌతుంది. తెచ్చే తాహతు ఆ తల్లితండ్రులకి ఉంది, దానిని ముక్కలు చేసే హక్కు ఆ పిల్లాడికి ఉంది.కానీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి మాత్రం గుండె చెరువైపోతూంటుంది. ఏం అనకూడదూ
ఏదో ధైర్యం చేసి అన్నా కానీ ‘ పోనీ డాడీ, లెట్ హిం ఎంజాయ్, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఆడుతాడూ’ అంటారు. ఇంట్లో ఉన్న పెద్దాయన ఏ రిటైర్డ్ టిచరో అయితే పాపం అలవాటు ప్రకారం
-‘ఆడుకోవడం అంటే విరక్కొట్టడం కాదురా అని వాడికి చెప్పొచ్చుగా’ అంటే, ‘మేం విన్నాంగా ఇన్నాళ్ళూ,వదిలేయండి’ అనేస్తారు. ఈ పెద్దాయన చేతిలో వందలాది పిల్లలు చదువులు నేర్చుకొని క్రమ శిక్షణతో పెద్ద అయ్యారు. కానీ ‘పెరటి మొక్క వైద్యానికి పనికి రాదు’ లేక ‘ ఘర్ కీ ముర్గీ దాల్ బరాబర్’ అనుకోవడం తూర్పు కి తిరిగి దండం పెట్టడం!…ఇంకా ఉంది.

Advertisements

7 Responses

 1. అమ్మో, మీ బ్లాగ్ మాత్రం పొరపాటున కూడా మా అమ్మా, నాన్నలకు, ముఖ్యంగా మా అమ్మకు చూపకూడదు 🙂 ఆవిడవి సేం టు సేం ఫీలింగ్స్. మొన్నీమద్దెన ఈ విషయాలమీదే ఓ దులుపి దులుపి మరీ ఇండియా వెళ్లింది.

  Like

 2. ఈనాటి ఆనందమయ మకర సంక్రాంతి
  అందించాలి అందరి జీవితాలకు నవ్య క్రాంతి
  *** మీకు, మీ కుటుంబానికి, మీ మిత్రులు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ***
  SRRao
  శిరాకదంబం
  http://sirakadambam.blogspot.com/2010/01/blog-post_13.html

  Like

 3. నేను మీ ఈ సిరీస్ టపాలు చదివాను. చాలామంది మంది పిల్లలు వారి తల్లిదండ్రుల ను నిత్యం మీకే మీ తెలియదు మేము చాలా బాగా పెంచుతున్నాము మా పిల్లలను మీలాగా కాదు అని అవమానిస్తున్నా వారి మీద ప్రేమఈ తల్లిడండ్రులకు ప్రేమ ఎందుకు? వారికి పోతూ పోతూ ఆస్థి అంతా ఎనదుకు రాసి పోతారు. ఈ తరం పిల్లలు చాలా గొప్ప అచివర్స్ కదా వారికి వాళ్ల తలిదండ్రులు చేతనైతే ఆస్తి ఇవ్వకుండా ఉండాలి. అలా తల్లిదండ్రులు చేయటం మొదలు పేడితే గాని పిల్లలో మార్పు రాదు. లేక పోతె పిల్లలు తల్లిదండ్రులను అవమానిస్తూ ఆ వీరేమి చెస్తారు లే పోతూ పోతూ ఆ ఆస్థి మాకు ఇవ్వకుండా ఎక్కడికి పోతారు అనే ధీమాలో ఉంటారు

  Like

 4. ఫణి గారు,
  చిన్న వివవరణ మీ టపా చదివితే మీరు రాసిందంతా మొదటి స్టెజ్ ఇంకా పోను పోను చాలా స్తేజ్ లున్నాయి. నేను పైన రాసిన వ్యఖ్యలు అన్ని స్టేజ్ లను ఉద్దెశించి రాయటమైంది.

  Like

 5. కృష్ణా,

  మీ అమ్మగారి మెయిల్ ఐ.డి ఇవ్వండి!!

  Like

 6. రావు గారూ,

  ధన్యవాదాలు. మీకూ, మీ కుటుంబానికీ మా అందరి శుభాకాంక్షలు.

  Like

 7. శ్రీకర్,

  అలా చేయడం అనుకున్నంత సులభం కాదు.ఈ బంధాలూ, అనుబంధాలా విలువలే ఉండవు. పరిస్థితుల్ని అర్ధం చేసికొని, అందరూ ప్రవర్తిస్తే ఇలాటివన్నీ అధిగమించొచ్చు !!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: