బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-గోళ్ళు !


    నేను ప్రతీ శనివారం, లోకల్ లో పూణే స్టేషన్ కి వెళ్ళి, తెలుగు వార పత్రికలు స్వాతి, ఆంధ్రభూమి, నవ్య తెచ్చుకుంటూంటాను. అదే లోకల్ లో తిరిగి వచ్చేయడమే. క్రిందటి శనివారం వెళ్తూంటే, నా ఎదురుగా ఒక యువ జంట కూర్చొని ఉంది. నేను అతనినే అబ్జర్వ్ చేస్తూ కూర్చొన్నాను.ఆమె కిటికీ లోంచి చూస్తూ కూర్చొంది. ఈ అబ్బాయి కొంతసేపు కూర్చొని, ఒక చేత్తో గెడ్డం క్రింద ఉన్న ఓ పొక్కు ని ఊరికే కూర్చొని కెలికాడు. నిజంగా చూస్తే ఇది ఎలాటిదంటే,
మా చిన్నప్పుడు ఓ సామెత చెప్పేవారు–‘ పని లేని మంగలి పిల్లి తల గొరిగాడు’ అని.

    ఆ పొక్కు గిల్లడం దాకా బాగానే ఉంది.ఆ తరువాత వచ్చే పరిణామాలే చిరాకు తెప్పించేస్తాయి! ఓ సారి గిల్లేసి ఊరుకోడు కదా, దాని స్వరూపం ఎలా ఉందో అని వేళ్ళు చూసుకోవడం, చూసేటప్పడికి, ఆ పొక్కు కాస్తా చిట్లి, రక్తం రావడం మొదలయింది. ప్రతీ నిమిషానికీ, అక్కడ చెయ్యి వేలు పెట్టడం, రక్తం ఎంతగా కారుతోందో అని చూసుకోవడం. ఇంక చివరికి, జేబులోంచి రుమ్మాలు తీసి దానితో తుడవ్వలసివచ్చింది.అంతే కాకుండా, ఆ రుమ్మాలు అక్కడ ఒత్తుగా పెట్టుకోవలసివచ్చింది. దీన్నే ‘కోతిపుండు బ్రహ్మరాక్షసి’ అవడం అంటారు. ఇదంతా ఎందుకొచ్చిందీ అంటే మనకు ఉండే కొన్ని కొన్ని అలవాట్ల వల్ల.

    ఏం పనీ లేకుండా చెయ్యి ఊరుకోదుగా!కొంతమంది గోళ్ళు కొరుక్కుంటూంటారు. ఇదివరకు నేనూ ఈ వెధవ పనిచేసేవాడిని. అదృష్టం కొద్దీ ప్రస్తుతం పళ్ళు లేవు. అందుకే ఇలాటి జ్ఞాన ప్రబోధలు చేస్తున్నాను!! ఎంతలా కొరికేసుకుంటామంటే,కొరికి ,కొరికి అక్కడ రక్తం వచ్చేస్తుంది. అది ఏ గోరుచుట్టులోకో దింపుతుంది. ఈ రోజుల్లో పిల్లలూ,పెద్దవాళ్ళూ అవేవో నెయిల్ కట్టర్స్ ట, అవి ఉపయోగించి నాజూగ్గా గోళ్ళు కత్తిరించుకుంటూంటారు. అయినా గోళ్ళు కొరుక్కోవడం లో ఉన్న సుఖం ఇందులో ఎక్కడుందండీ ? గోళ్ళు కొరుక్కుంటూంటే అమ్మ పెట్టే చివాట్లు ఎప్పుడైనా మరచిపోతామా? వీటికి సాయం ఈ గోళ్ళు కొరుక్కోడమనే ప్రక్రియ గడప మీద కూర్చొని మరీ చేయడం. ఇంక చివాట్లే చివాట్లు-ఇంటికి దరిద్రం రా అని.

   ఇదంతా ఎందుకు రాస్తున్నానంటే, నాకు ఆ నెయిల్ కట్టర్ తో స్టైల్ గా గోళ్ళుతీసికోవడం రాదు, అందుకని మామూలుగా చేత్తోనే తీసేసుకుంటూంటాను,పనేం లెదుగా,ఆ గోళ్ళేమో చాలా షార్ప్ గా తయారయ్యాయి.రాత్రిళ్ళు నిద్రలో ఏ దోమో వాలినప్పుడు, వాటిని తోలినప్పుడు,ఈ షార్ప్ గోళ్ళ ధర్మమా అని,మొహం మీద గీరుకుపోయింది. ఏదో ‘వయస్సు’ లో ఉన్నప్పుడైతే ఇలాటి ‘ గీరుళ్ళకి’ ఏదో భాష్యం చెప్పుకునేవాళ్ళం ! ఇప్పుడు అలాటివి చెప్తే బాగుండదుగా !!
మా అబ్బాయి ఆ గీరుళ్ళు చూసి నన్ను ఓ నెయిల్ కట్టర్ కొనుక్కోమన్నాడు.

   ఇంకొంత మందుంటారు, ఊరికే ముక్కులో వేళ్ళుపెట్టుకుంటూంటారు. దానితో ఆగరు, ఆవేలు చూసికొని ఏదో తాదాత్మ్యం చెందిపోతూంటారు. అది చూసేవాళ్ళకి ఎంత అసహ్యంగా ఉంటుందో పట్టించుకోరు.ఇలాటివన్నీ ఒక్కొళ్ళూ ఉన్నప్పుడు చేసికుంటే ఆ ఆనందం ఏదో తనొక్కడే అనుభవించొచ్చుగా! పబ్లిక్ గా చేసి ఊళ్ళోవాళ్ళని హింస పెట్టకూడదు.

6 Responses

 1. 🙂 this post reminded me of wagle ki duniya (no offense)

  Like

 2. ఈ గోళ్ళుకొరికే అలవాటు నాకూవుందండొయ్. ప్రస్తుతం దీన్ని జయించే పనిలోనే వున్నాను.అది కూడా చాలా డిఫ్ఫరెంటుగా మరియు రొటీన్ కి భిన్నంగా

  “గోళ్ళు కొరుక్కోవడం లో ఉన్న సుఖం ఇందులో ఎక్కడుందండీ ? ” కదా:)

  Like

 3. బాగుందండీ…!!, నాకూ ఉంది ఈ అలవాటు… (నా వేళ్ళు చూసి వ్రాయలేదు కదా మీరు? అని అనుమానంగానూ ఉంది..) సరేలేండి… టెన్సన్ తట్టుకోవటాని… ఓ సిగరెట్టో, పాన్ పరాగో, తంబాకో తిని ఒకపక్క ఆరోగ్యం పాడుచేసుకుంటూ, ఒకపక్క ఎదుటివారికి ఇబ్బంది కలిగిస్తూ ఉండే కన్నా ఈ గోళ్ళకొరుక్కోవడమే మేలని తలచో… పాతికేళ్ళుగా ఉన్న అలవాటు మానేస్తే ఏం బావుంటుంది అని అనుకునే ఎమో మరి.. అసలు మానలేకపోతున్నాం…
  అదృష్టంకొద్దీ మీరు చెప్పిన మిగతా అలవాట్లు రాలేదులేంది.. 😀

  Like

 4. బుడుగోయ్,

  ఇందులో అఫెన్స్ ఏమీ లేదు.అంత గొప్ప సీరియల్ గుర్తుకొచ్చిందంటే చాలా సంతోషం.

  Like

 5. ఇండియన్ మినర్వా,

  All the Best !!

  Like

 6. శ్రీనివాసా,

  నీ గోళ్ళు చూడడం తప్ప ఇంకేమీ పనిలేదనుకున్నావా? ‘గుమ్మిడికాయల దొంగ అంటే నీలాటివాడే భుజాలు తడుముకున్నాడుట !

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: