బాతాఖానీ-లక్ష్మిఫణి కబుర్లు


    నేను బ్లాగ్గులు వ్రాయడం మొదలుపెట్టిన రొజుల్లో ఒక పాఠకురాలు ఒక బ్లాగ్గుమీద తన అభిప్రాయం వ్రాస్తూ, నా పుట్టిన రోజు ఎప్పుడూ అని అడిగింది. దానికి సమాధానంగా ” నేను చేసికొన్న అదృష్టం ఏమంటే, ప్రఖ్యాత చిత్రకారుడు, శ్రీ బాపూ గారితో, వారి పుట్టిన రోజు పంచుకోవడం’ అని సమాధానం వ్రాశాను.ఆ సంగతి గుర్తుంచుకొని,శ్రీ బాపు గారి పుట్టిన తేదీ, నెట్ లో వెదికి, ఈ వేళ ( డిసెంబర్ 15) కి తను గ్రీటింగ్స్ పంపింది.ఎంత సంతోషంగా ఉందో, యధాలాపంగా,నేను వ్రాసింది గుర్తుంచుకోవడమే కాకుండా,గ్రీటింగ్స్ పంపాలని ఆలోచన వచ్చినందుకు ఆ అమ్మాయికి, ఈ బ్లాగ్గు ద్వారా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.

   భగవంతుడి ఆశీర్వాదంతో 65 సంవత్సరాలు పూర్తిచేసికొన్నాను ఈ వేళ. ఆయన దయ ఉంటే,ఇలాగే మీ అందరి అభిమానంతోనూ,ఏదో నాకు తోచింది వ్రాస్తూ,నా మిగిలిన జీవితం గడపాలని ఆశిస్తున్నాను.

16 Responses

  1. many happy returns of the day sir 🙂

    Like

  2. జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇదే విధంగా అనేకానేక జన్మదినాలు జరుపుకోవాలని అకాంక్షిస్తున్నాను.

    Like

  3. To day is also vijay diwas,
    Wish you a happy and contented long life.

    Like

  4. Many many happy returns of the day.

    Like

  5. puttina roju subhakakshalu sir ee sari haiga punalo kuthuru koduku manavallu manvarallatho anandga jarupukondi

    Like

  6. సంతోషం. అరవయ్యయిదేళ్ళ బుజ్జిబాబుకి యాప్పీ యాప్పీ బర్త్‌డే.
    మొన్న గోదారి వంతెన మిద వెళ్తూ అదో అల్లంత దూరాన్నా ఆ ఫ్లాట్స్ లోనే ఫణిబాబుగారుండేవారు అని రాకేశ్వరుడు చూపించాడు. 🙂

    Like

  7. జన్మదిన శుభాకాంక్షలండీ ఫణి బాబు గారు.

    Like

  8. పుట్టినరోజు శుభాకాంక్షలు ఫణిబాబుగారు…

    Like

  9. రాణి,

    ధన్యవాదాలు.

    Like

  10. శివరామకృష్ణ,

    ధన్యవాదాలు.భగవంతుని కృపా,మీ శుభాకాంక్షలతో ఇంకా మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలనే ఆశిస్తున్నాను.

    Like

  11. Mohan,

    Thank you very much. God Bless you.

    Like

  12. సునీతా,

    ధన్యవాదాలు.

    Like

  13. భారతీ,

    నీవు అన్నట్లుగానే, మా పిల్లలూ,మనవడూ,మనవరాళ్ళతో సంతోషంగా గడిపాను.(మా ఇంటావిడతో సహా)

    Like

  14. నారాయణస్వామీ (కొత్తపాళీ),

    ఇది చాలా అన్యాయం!! మేము రాజమండ్రీ వదిలేదాకా చూసి, ఇప్పుడు వెళ్ళేరా? పోన్లెండి, రాకేశ్వర్ ధర్మమా అని, మేము ఉండే అపార్ట్మెంట్ దూరంనుండైనా చూశారు.ఇప్పుడు తెలిసిందా, నాలో రచనా వ్యాపంగం ఎలా మొదలయ్యిందో? ఆ గోదావరి గాలి ప్రతీ రోజూ ఆస్వాదిస్తుంటే, నాలాటి ‘అరచియత’కి కూడా వ్రాయడం వచ్చేసింది!!
    మీ ‘యాప్పీ యాప్పీ’ అభినందలకి ధన్యవాదాలు. ‘రంగుటద్దాలు’ చదివే అదృష్టం మాకెప్పుడు కలుగుతుందీ ?

    Like

  15. సాహితీ,

    ధన్యవాదాలు.

    Like

  16. జ్యోతి,

    ధన్యవాదాలు.

    Like