బాతాఖానీ-లక్ష్మిఫణి కబుర్లు


   మా చిన్నప్పుడు ఎవరైనా దేశం బయటకి వెళ్ళడమనేది చాలా అరుదుగా జరిగేది. వెళ్ళిన వారి గురించి ఎంతో గొప్పగా చెప్పుకునేవారు. ఇప్పుడు అలా కాదే.బయటకి వెళ్ళడం ఏదో అమలా పురం నుండి కాకినాడ వెళ్ళొచ్చినట్లుగా ఉంది.

   నాకు బాగా గుర్తు– మా అన్నయ్య గారు మొదటిసారి ఇంగ్లాండ్ ఓ ఏడాది ఉండడానికి వెళ్ళినప్పుడు, నేనూ, మా తల్లితండ్రులూ బొంబాయి ఏరోడ్రం ( అలా అనేవారు !!) కి వెళ్ళి వీడ్కోలు చెప్పాము !! అప్పుడు మేము అందరం కలిసి ఓ ఫొటోకి కూడా దిగాం !! వెళ్ళిన వారానికో, పది రోజులకో ఓ ‘ఏరోగ్రాం ‘ వచ్చేదాకా, ఈ వెళ్ళిన మనిషి క్షేమంగా చేరేడో లేదో తెలిసేది కాదు. కొన్ని రోజులకి మా వదినగారు కూడా వెళ్ళి ఆయనతో ఉన్నారు. ఇంక వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు మళ్ళీ హడావిడీ. ఏవేవో తెచ్చేవారు-టేప్ రికార్డరూ, వాచీలూ వగైరా వగైరా.అలాగే మా పెద్దన్నయ్య గారు కూడా ఎవరో వాళ్ళ స్టూడెంట్ పిలిస్తే వెళ్ళారు.అప్పుడూ ఇంతే !!
ఇప్పుడో దేశం బయటకి వెళ్ళని వారిని వేళ్ళమీద లెఖ్ఖ పెట్టొచ్చు, ఉదాహరణకి నేనూ, మా ఇంటావిడా. మా పిల్లలేమో బయటకి ‘లాంగ్ టర్మ్’ మీద వెళ్ళరూ, వెళ్ళినా ఏదో వారం, పదిహేను రోజులకీ వెళ్తూంటారు. ఇంక మమ్మల్నెవరు తీసికెళ్తారూ?

   ఈ సోదంతా ఎందుకు చెప్తున్నానంటే క్రిందటి శుక్రవారం, మా అబ్బాయి యు.ఎస్. ఓ వారం పనిమీద వెళ్ళాడు. వెళ్ళినప్పటినుండీ, మా మనవరాలితో మాట్లాడని క్షణం లేదు.అస్సలు ఆ పాపకి, వాళ్ళ నాన్న బయటకు వెళ్ళడనే భావమే లేదు.తను లేకపోతే ప్రొద్దుటే స్కూలికి వెళ్ళడానికి ఏమైనా ‘పేచీ’ పెడుతుందేమో అని, ప్రొద్దుటే ఫోన్ చేసి లేపడం నుండీ, తను స్కూలు బస్సు ఎక్కేదాకా ఫోన్లే !! ఏమిటో ఈ ఫాస్ట్ జీవితం !!

   నేను కొంతమందిని చూశాను–ఉద్యోగ రీత్యా బయటకు వెళ్ళకపోతే ఇంక నిద్ర పట్టదు, దానికోసం ఉద్యోగాలు మార్చడానికైనా వీళ్ళు రెడీ. ఆన్ సైట్ అనేది ఓ అబ్సెషన్ అయిపోయింది.
ఇంక సంవత్సరాలనుండీ బయటే ఉండేవారి గురించి నాకేమీ తెలియదనుకోండి.ఎక్కడో కొంతమంది ఉంటారు, పిల్లల పురుళ్ళకి వెళ్ళేవారు. వెళ్ళడం ఓ ఆరునెలలుండడం (వంతుల వారీగా).కొడుకు ఏ అమెరికాలోనో ఉన్నాడనుకోండి, ఇంక ఊళ్ళో వాళ్ళందరూ అతని తల్లితండ్రుల్ని సమయం దొరికినప్పుడల్లా పరామర్శీస్తూంటారు–‘అబ్బాయి దగ్గరకెప్పుడు వెళ్తున్నారూ?’అని.
‘ఇంకా వాళ్ళు పిలవలేదండీ’అని ఓ వెర్రి సాకు చెప్తారు. అప్పటికే ఆ అబ్బాయి అత్తమామలు వెళ్ళి ఆరునెలలుండి వచ్చేస్తారు. ఈ సంగతి ఈయనదాకా రాదు.ఎంత చెప్పినా మొదటి ప్రిఫరెన్సు అత్త మామలకే. పురుళ్ళకీ, చాకిరీకీ అవసరం వచ్చినప్పుడు మాత్రం అమ్మ గుర్తొస్తుంది, ఆ అమ్మతో ‘యాడెడ్ లగేజ్ ‘ నాన్న !! అందరూ అలా చేస్తారని కాదు, నేను విన్న కేసులు అలాటివి. ‘మీరు ఎప్పుడూ దేశం బయటకి వెళ్ళకుండా ఇలాటి విషయాలమీద అంత ఘంటాపథం గా ఎలా చెప్తున్నారూ’ అంటే ఇవన్నీ నేను విన్నవీ, చదివినవీ. ఇందులో ఎవరినైనా ‘హర్ట్’ చేస్తే క్షంతవ్యుడిని.నేను విన్నదీ చదివినదీ నిజం కాకూడదనే నా ఆశ.

   మనం ఎప్పుడైనా ఎవరింటికైనా వెళ్ళామనుకోండి,ముందుగా ఓ చాక్లొట్ డబ్బా తెచ్చి ముందర పెడతారు.అంటే మనకి తెలియాలన్నమాట, వాళ్ళ అబ్బాయో కోడలో వచ్చేరని.అది చాక్లొట్ల ద్వారా మనకి తెలియచేయడం !! ఆ తరువాత వాళ్ళ పిల్లల ఆల్బం, ఆ వచ్చిన పిల్లో పిల్లాడో-వాళ్ళు యమా అక్సెంట్ తో ఎదో అడగడం,ఆ అడిగినది ఈ మామ్మకో, తాతయ్యకో అర్ధం అవదూ. ‘అక్కడంతా ఇంట్లో ఇంగ్లీషేనండి, తెలుగు అస్సలు అర్ధం అవదూ ‘ అని వీళ్ళ వివరణా!. ఇంక ఆ తాతయ్య గారు వీళ్ళని ఏ బజారులోకో తీసికెళ్ళి అన్నీ వివరించడం. అందరూ

   ‘సీతారామయ్య గారి మనవరాలు’ లాగ ఉండరుగా !!

Advertisements

3 Responses

 1. చాలా బాగా వ్రాసారండీ…

  వెళ్ళినవాళ్ళకన్నా ఈ చాక్షెట్ ఇచ్చేవాళ్ళే అమెరికా గురించి ఎక్కువచెప్తుంటారు…
  వెళ్ళిన వాళ్ళ తల్లిదండ్రులకు.. వచ్చే “ఇంకా పిలవలేదాండీ..” కామెంట్లకన్నా…
  ” ఏంటీ.. మీ కంపెనీలో ఆన్ సైట్.. ఎసైన్మెంటులు లెవా… అయ్యో..”, అని నిట్టూర్పులు మరీ భరించలేనివి…
  “తెలుగు అసలు అర్ధం అవదూ” అనేది డిగ్రీగా భావించడం, తెలుగు వచ్చినా మాట్లాడితే.. ఎక్కడ మనం తక్కువ అయిపోతామో అనుకోవటం.. ఇవి మన తెలుగువారికి ఉన్న జాఢ్యాలేలేండి…

  Like

  • నేను చెప్పాలి అనుకున్నది రాజు గారు చెప్పారు. నిజంగా నిజం.

   సుధ

   Like

 2. chaala baavundhi all the best

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s