బాతాఖానీ-లక్ష్మిఫణి కబుర్లు- తాతయ్యలూ,అంకుళ్ళూ


   శీర్షిక లో ఉన్న ‘అంకుళ్ళు’ ఎవరా ‘కుంకుళ్ళు’ లాగ అనుకుంటున్నారా? అదేనండీ ‘అంకుల్స్’ అన్నమాట.ఇదివరకటి రోజుల్లో(అంటే మా చిన్నప్పుడు)55 సంవత్సరాలక్రితం, ఎవరైనా ఉద్యోగంలోంచి రిటైర్ అయ్యారంటే చాలు,ఆయనని
తాతయ్యా అంటే ఏమీ అనుకునేవారు కాదు.వారి వేష భాషలుకూడా దానికి అనుగుణంగానే ఉండేవి. తాతాయ్య గారి భార్యని అమ్మమ్మో, మామ్మో అని పిలిచినా ఏమీ ఫరవాలెదు.

ఇప్పుడు అలా కాదే,వేషభాషలు మారిపోయాయి.ఉద్యోగంలోంచి రిటైర్ అయినా ఇంకా వేషాలు మాత్రం ‘దసరా బుల్లోడి’ లాగే ఉంటున్నాయి. అప్పటికే ఇంట్లో తాతయ్య అయినా కానీ, బయట వాళ్ళెవరైనా తాతయ్యా అని పిలుస్తే చాలా బాధ పడిపోతారు. మనం ఎవరింటికైనా వెళ్తే అక్కడో చిన్న పాప ఉందనుకుందాము.వాళ్ళు మొహమ్మాటానికి ‘అంకుల్’ కి నీపేరు చెప్పమ్మా అంటారు.ఆ చిన్నపిల్ల కన్ఫ్యూజ్ అయిపోతుంది,ఇంట్లో ఉన్నాయన ‘తాతయ్య’ అయినప్పుడు, సుమారు అదే షేప్ లో ఉన్న ఆ వచ్చినాయన ‘అంకుల్’ ఎలా అవుతారూ అని. నేను మాత్రం ఎవరింటికెళ్ళినా ఈ గొడవ లేకుండా’అంకుల్’ ఏమిటండి బాబూ, శుభ్రంగా నోరారా ‘ తాతయ్యా’ అని పిలువమ్మా అంటాను. దీనితో మనం కూడా ఆ పాపతో’ కనెక్ట్’ అవుతామ

మొన్న శనివారం నాడు మామూలుగా మాగజీన్లు తెచ్చుకోవడానికి పూణే స్టేషన్ కి వెళ్ళి, లోకల్ కోసం వెయిట్ చేస్తూంటే, ఓ చిన్నపాప ( నాలుగేళ్ళుంటాయేమో), వాళ్ళ నాన్నతో సతారా వెళ్ళే ట్రైన్ కోసం ఉంది. వాళ్ళతో కబుర్లు మొదలెట్టాను.ఆయన ‘బేబీ, అంకుల్ కో నమస్తే బొలో బేటా’ అన్నారు.’అంకుల్ అఛ్ఛా లగ్తా నహి,దాదా యా నానా బోలో’అన్నాను. దానికి ఆయన ‘ సర్ ఆజ్ కల్, కిత్నా భీ ఉమర్ హోనేదో, కిసీకో దాదా బొల్నేతో బురా లగ్తా హై’
అన్నారు. బహుశా అతని అనుభవం అలా అనిపించిందేమో.

1998 లో మేము వరంగాం నుండి పూణే వచ్చినప్పుడు, మా మేనకోడలి ఇంటికి వెళ్ళాను.తనకి ఇద్దరు అమ్మాయిలు. వెళ్ళీ వెళ్ళగానే ‘ తాతయ్యా’ అంటూ పలకరించారు.అప్పటికింకా నేను తాతయ్య పదవికి రాలేదు. అయినా ఆ పిలుపు ఎంత మధురంగా ఉందో. అదిగో, తాతయ్యా అని నన్ను మొట్టమొదట పిలిచిన పిల్ల పెళ్ళికే, మొన్న హైదరాబాద్ వచ్చింది.పెళ్ళికి రాలేకపోయారుకదా అని నేనూ, మా ఇంటావిడా, అబ్బాయీ, కోడలూ, మనవరాలూ పూణే లో రిసెప్షన్ కి వెళ్ళాము.

ఈ రోజుల్లో భార్యా భర్తలకి వయస్సు ఎదో ఆరు నెలలో, ఏడాదో తేడా ఉంటోంది.మా రోజుల్లో ఎక్కువ శాతం 5-10 సంవత్సరాలు తేడా ఉండేది.అప్పుడు బాగానే ఉండేది,కానీ రోజులు గడిచే కొద్దీ, ఇందులో ఉండే సాధక బాధకాలు తెలుస్తూంటాయి.ఒక్కొక్కప్పుడు రోడ్డుమీద వెళ్తూంటే,’పాపం రెండో పెళ్ళివాడేమో’ అనుకుంటున్నారేమో అనిపిస్తూంటుంది !ఇంట్లో పనులు చేయడానికి ఓపిక ఉండదు,అలాగని ‘రామా కృష్ణా’ అని మూల కూర్చోలేముగా !ఉప్పూ, కారం తింటున్నాము. ఇదివరకటి రోజుల్లో ఉమ్మడి సంసారాల్లో అయితే,ఉన్న ఒక్క కొంపలోనూ ( అది ఎంత పెద్దది అయినా సరే), రిటైర్ అయిపోగానే, ఆయనా, ఆవిడా ఒక్కోళ్ళు వీధిలో ‘మడత మంచం’ వేసికొనీ, ఇంకోళ్ళు ఇంట్లో ఉన్న చిన్న పిల్లలతో( మనవలూ, మనవరాళ్ళూ)నూ పడుక్కోవడమే.ఆ పిల్లలు తెల్లారేసరికి పక్కలు తడిపేసేవారు!!

ఇప్పుడు ఈ రోజుల్లో అలా కాదే.ఎంత లేకపోయినా ఓ డబల్ బెడ్ రూం ఫ్లాట్ లోనే ఉంటున్నారు. ఓ జంటకి ఒకరూమ్మూ, రెండో వాళ్ళకి ఇంకో రూమ్మూ.కనీసం,ఇంట్లో ఇంకో చిన్న పాప వచ్చేంతవరకైనా ! ఆ తరువాత చిన్న పాప వాళ్ళ
అమ్మమ్మా/మామ్మ దగ్గరా, తాతయ్య గారు హాల్లో ‘దీవాన్ ‘ మీదకీ
! ఆరోజుల్లో మడతమంచమూ, ఇప్పుడు ‘ దీవాన్’. ఈ పెద్దవాళ్ళ అదృష్టం బాగుంటే, ఈ పెద్దాయన రిటైర్ అయిన మూడు, నాలుగేళ్ళ దాకా వాళ్ళ అబ్బాయికి పెళ్ళి అవదు. ఇంక మనవాళ్ళు ‘ఠింగ్ రంగా’ అంటూ ఉండక ఏం చేస్తారూ? అందుకనే ఎవరైనా ‘తాతయ్యా’ అంటే పొడుచుకొచ్చేస్తూంటుంది!!

భారత ప్రభుత్వం వారి ధర్మమా అని రైళ్ళలో అరవై ఏళ్ళు దాటిన మగవారికి 30 శాతం ఇస్తున్నారు. అదే వయస్సు స్త్రీ ల కైతే 50 శాతం ఇస్తారుట.ఈ వయస్సు తేడాలతో వచ్చిన భారీ’నష్టం’ ఈ విషయం లోనే. నాకు గత నాలుగున్నరేళ్ళనుండీ ఈ సౌకర్యం ఉంది. మా ఇంటావిడ ఇంకా మూడున్నరేళ్ళు ఆగాలి.మేమిద్దరమూ కలసి కన్సెషన్ మీద ప్రయాణం చేయగలుగుతామనే ఆశిస్తున్నాను.రైళ్ళలో ఇద్దరూ కలిసి కన్సెషన్తో వెళ్ళడానికి లేని సిగ్గు, ఎవరితొనైనా
‘తాతయ్యా, మామ్మా/అమ్మమ్మా’ అని పిలిపించుకోవడానికి ఎందుకంట?

Advertisements

One Response

 1. తాతయ్యాంకుల్
  *********
  తాతయ్య,అంకుల్ వాడకం గురించి మీరు చెప్పిన మాటలు
  చాలా బాగున్నాయి! ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ఎక్కువ
  వినిపించే సంభోధన అంకులే! మా చిన్నతనంలో మా నాన్న
  గారి స్నేహితుల్ని మామయ్యగారు అని పిల్చే వాళ్ళం.కానీ
  ఈ రోజుల్లో పాల అంకుల్,పేపర్ అంకుల్ ఇలా ఎందరెందరో
  అంకుల్స్ని మన పిల్లలకు తయారు చేసాము.
  మట్టెగుంట వెంకట అప్పారావు(సురేఖ)

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: