బాతాఖానీ-లక్ష్మిఫణి కబుర్లు-గృహసూత్రాలు–2


    నేను నిన్న వ్రాసిన గృహసూత్రాలు మా ఇంటావిడ చదివి,’ పోన్లెండి ఇప్పటికైనా నిజాలు చెప్పడం మొదలెట్టారు’ అంది.వచ్చిన గొడవల్లా, తను కూడా ఏదో ‘గృహహింస’అని వ్రాసింది. ఒకేరోజున మేమిద్దరమూ ‘గృహ’ శీర్షిక తో వ్రాయడం తో, మేమిద్దరమూ ఎచ్.డి.ఎఫ్.సి, ఎచ్.యు.డి.సి.ఓ (హౌసింగ్ ఫైనాన్స్,హౌసింగ్ ఎండ్ అర్బన్ డెవెలప్మెంట్) వాళ్ళకి ఏమైనా ప్రకటనలు చేస్తున్నామేమో అన్నట్లనిపించింది

   నేను, మరీ ఆవిడ చెప్పినంత అన్యాయం కాదు. ఈ వేళ ప్రొద్దుటనుండీ చాలా సార్లు కరెంట్ పోయింది. కరెంట్ ఉన్నప్పుడల్లా నేను కంప్యూటర్ మీద ఏదో కెలుకుతూనే ఉన్నాను.చివరికి, ఆవిడ పూజా పునస్కారాలూ అవీ 11.30 కి పూర్తి అయ్యాయి.ప్రతీసారి అయినట్లుగానే,’పోనీ కంప్యూటర్ లో ఏమైనా చూస్తావా’ అన్నాను.అంతే ఒక్కసారి గయ్య్ మంది.పొద్దుటనుండి చూస్తున్నాను, పోనీ బయట బట్టలు అవీ తీయొచ్చుగా అంది.అదేదో పేద్ద పనిఉన్నవాళ్ళలాగ అస్తమానూ కంప్యూటర్ తోనే కూర్చోపోతే, అప్పుడప్పుడు ఇంటి పనులు కూడా చెయ్యొచ్చుగా,అంటూ ఓ లెక్చర్ ఇచ్చేసింది.

   రాజమండ్రీ లో ఉన్నప్పుడు మాకు పనిమనిషి ఆఖరి రెండునెలలూ లేదు. తనే శ్రమ పడేది. పోనీ పని ఎక్కువైపోతూందికదా అని నాకొచ్చిన ఒకేఒక పని , గిన్నెలు తోమి పెట్టడం చేస్తానన్నాను.ఛా బాగుండదు, మీరు చేయడం ఏమిటీ అంటూ, అభ్యంతరం పెట్టింది. అయినా ఊళ్ళోవాళ్ళకోసమా మనం చేసేదీ, ఎవళ్ళో ఏదో అనుకుంటారనుకోవడం ఎందుకూ, అంటూ సర్దిచెప్పి ఒక్కోసారి చేసేవాడిని. వచ్చిన గొడవల్లా ఎక్కడంటే, నేను కిచెన్ లో సింకు లో గిన్నెలె కడిగి పెట్టగానే, పనిమనిషితో ఉన్నప్పటి అలవాటు ప్రకారం, తోమి, కడిగిపెట్టిన గిన్నెలన్నింటి మీదా, నీళ్ళు చల్లేది !! పోనీ మొగుడనేవాడు ఏదో సహాయం చేస్తున్నాడూ అని ఉంటుందా? అబ్బే యమ ఆచారాలూ అవీనూ.

   ఒక సంగతి ఒప్పుకోవాలండి-వంట మాత్రం బ్రహ్మాండంగా చేస్తుంది. ఎప్పుడైనా నాకు బాగా నచ్చిన కూర ఏదైనా చేసినప్పుడు,ఉంటుంది భాగోతం.నేను ముందుగా కావలిసినది వేసుకుంటాను. తను ముందర కొంచెం వేసేసుకుని, టేబిల్ మీద గిన్నెలో,తరువాత వేసుకోవచ్చని ఉంచుకుంటుంది. ఆ విషయం నాకేం తెలుసూ, మిగిలిపోయిందేమోనని, నేను ఆ కూర లాగించేస్తూంటాను.నాకో అలవాటుంది, కూరల్లో వేసే మిరపకాయలు,కరివేపాకు, కొత్తిమిర తో సహా( ఈ మధ్యన పెద్ద సైజు లో ఉన్న శనగ బద్దలు కూడా, పళ్ళులేకపోవడం వల్ల) అన్నీ వేరుచేసేసి, ఆ కూర గిన్నెలోనే ఉంచేస్తూంటాను.ఓ సారి ఏమయిందేమిటంటే, ఆ గిన్నెలో ఉన్నది, తను ‘దాచుకున్న’కూరే అనుకొని, కంచంలో వేసుకోబోయింది ! కూర ముక్కల్లాటివి ఏమీ కనిపించక, ‘గిన్నెడు కూరా తిన్నారు కదండీ, పోనీ పెళ్ళాం ఒకత్తుందీ,తనుకూడా తింటుందేమో అన్న ఆలోచన ఎందుకు రాదండీ బాబూ, అంత ‘ఆబ’ ఎందుకూ, తిండికి మొహం వాచిపోయినట్లుగా?’ అంటుంది. 40 ఏళ్ళు సర్వీసులో ఉండి, తను ఇచ్చే లంచ్ బాక్స్ లో రేషన్ గా తిన్నానా, ఇప్పుడు హాయిగా కంచంలో పెట్టుకుని నోరారా, మనసారా తింటుంటే అంత గొడవ ఎందుకో? అయినా ప్రతీ రోజూ అంత రుచిగా పదార్ధాలన్నీ చేయడం ఎందుకూ, బావున్నాయి కదా అని తింటూంటే సంతోషించక, ఏదో గొడవ పెట్టుకోవాలని కానీ అంత రాధ్ధాంతం ఎందుకో ?

    ఎప్పుడైనా తను మధ్యాన్నం నిద్ర లేవలేదు కదా అని, చాయ్ పెడుతూంటాను.చాలా స్ట్రాంగ్ గా చేశారూ అంటుంది. మా అమ్మాయికి మాత్రం నేను చేసిన చాయ్ నచ్చుతుంది.మా ఇంటావిడ చాయ్ లైట్ గా చేస్తుంది. తనని ఏడిపించడానికి క్యాంటీన్/ప్లాట్ఫారం చాయ్ లా ఉందీ అంటూంటాము.మా అమ్మాయి సపోర్ట్ ఉందికదా అని ఒక్కొక్కప్పుడు ధైర్యం చేసేస్తూంటాను !! మళ్ళీ మిగిలిన గృహసూత్రాలు ఇంకో సారి !

Advertisements

14 Responses

 1. మరే. ఆవిడ గురించి కూడా ఆలోచించాలిగా.
  బావున్నాయి సార్ మీ కబుర్లు.

  Like

 2. me avida blog enti andi?

  Like

 3. బావుందండి మీ వరస.
  మిమ్మల్మ్ని రాజమండ్రి లో ఉండగా కలవలేకపోయాను. మీరు ఇలా ఉన్నఫళంగా వెళ్ళిపోతారని నాకు తెలియదు. క్షమించాలి

  Like

 4. ivvanni prati intlo jarigeve aina vaatin akshara rupamlo pettatam andulonu inta andamga vraayatam chaala chaala bagundi. mee boldanni kaburlu kosam eduru chustu….

  Like

 5. రచన శైలి, మాటల పొందిక, సత్యము, నిర్భయంగా రాయడము, ఉన్నదున్నట్లు వ్రాయడనికి ఎలా పొగడాలొ తెలియటము లెదు . మనసారా నవ్వుకున్నాము. వారపత్రికలో, సీరిఅల్ కోసము ఎదురుచూస్తూన్నట్లు. మీ వ్రాతలకోసము ఎదురుచూస్తూంటాము
  విమల/రామచంద్రుడు

  Like

 6. భవానీ,
  ధన్యవాదాలు.

  Like

 7. లలితా,

  మీలాటి అనుభవజ్ఞులైన బ్లాగర్ ని కలుసుకోలేకపోయానని, మేమూ అనుకున్నాము.ఈ సారి ఎప్పుడైనా అటువైపు వస్తే తెలియచేస్తాను.

  Like

 8. సుబ్రమణ్యం,

  మీ అభిమానానికి కృతజ్ఞతలు.

  Like

 9. రామం, విమలగారూ,

  మీరు మరీ ఎక్కువగా పొగిడేయకండి !!ఇంకా రాసేనంటే, ‘ఇంతే సంగతి’ అంటూ నామీద తను వ్రాసేస్తుంది.

  Like

 10. Thanks a lot Phani garu, me wife blog ni complete ga chadavali ippudu nenu :-). Chadivaka na openion thelisya chesthanu, I dont know how to type in telugu , i will find about it. I have been following your blog regularly its really good. You really write well. The way you wrote your experiences right from your marriage is really good. I could visualise your family.
  Actually eager to see your wife, your daughter , son and grand kids too pictures. If possible can you put your family picture in the blog.

  Rgds
  Santhi

  Like

 11. ఖరీదైన,అదేనండి ప్రియమైన ఫణిబాబు గారు,
  శుభోదయం.మీరు వ్రాసిన గృహసూత్రాలు,ఇంటింటి
  వంటింటి కబుర్లు చాలా బాగున్నాయి.ఇలాటి ఆణి
  ముత్యాలు మీ దగ్గరనుంచి మరిన్ని ఏరుకోవాలని
  ఎదురు చూస్తుంటాను.
  యమ్వీ.అప్పారావు(సురేఖ)

  Like

 12. గురువు గారూ,

  మీకేమిటండి బాబూ, ఎదో మొహమ్మాట పెట్టేస్తున్నారు కానీ !!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: