బాతాఖానీ-లక్ష్మిఫణి ఖబుర్లు–భాగ్యనగరంలో ఒక రోజు


IMG_0664

    క్రిందటి బుధవారం నాడు బయలుదేరి భాగ్యనగరం వెళ్ళాను.మా మేనకోడలి కూతురు వివాహం అయింది. దిల్సుఖ్ నగర్ లో జరిగింది. గురువారం ప్రొద్దుటే 7.00 గంటలకి భాగ్యనగరం చేరాను. వివాహం రాత్రి కాబట్టి ఆ రోజంతా పగలు

భాగ్యనగరంలో గడిపే ‘అదృష్టం’ కలిగింది.కోఠీ దగ్గర, ఐ.ఎస్.సదన్ వెళ్ళే బస్సుఎక్కి, మా వదిన గారింటికి చేరాను.అక్కడ కాలకృత్యాలు తీర్చుకొని 12.00 గంటలకి, వివాహ స్థలానికి వెళ్ళాము.మా పిన్నిగారి అమ్మాయిలందరినీ కలుసుకునే

అవకాశం కలిగింది.భోజనం చేసి నేనూ, మా కజిన్ ( రాజమండ్రీ లో ఉండేవాడు) తిరగడానికి బయలుదేరి , ఓ గంటా,రెండుగంటలు గడుపుదామని ‘విశాలాంధ్ర” కి వెళ్ళాము.

    ఈ మధ్యన ఎక్కడో రివ్యూ చదివాను–‘ఇల్లేరమ్మ కథలు’ వ్రాసిన డాక్టర్. సోమరాజు సుశీల గారి తరువాత పుస్తకం విడుదలయిందనీ, చాలా బాగుందనీ.ఆవిడ వ్రాసిన ‘ఇల్లేరమ్మ కథలు’ బ్రహ్మాండంగా ఉంది. దానితో నేను ఆవిడ

అభిమానిని అయిపోయాను. సరేఅని, ఆ కొత్తపుస్తకం గురించి కొట్టులో అడిగితే, పుస్తకం పేరు చెప్తేగానీ, వెదుకలేమన్నారు.అక్కడ అన్నిపుస్తకాలూ వెదికాను, కాని కనిపించలేదు, అక్కడ కొట్లో ఉన్నవాళ్ళు ఏమీ సహాయం చేయలేదు.

ఇంక, వెదకటం ఆపెసి, ఓ మూడు పుస్తకాలు–రంగనాయకమ్మ గారి ‘స్వీట్ హోం’, శ్రీ రమణ గారి “నవ్య లో ముందుమాట”, అడివిబాపిరాజు గారి ‘నారాయణరావు’ తీసికొని, కౌంటర్ లో డబ్బుకడదామని, బిల్లు చేయమన్నాను.

అక్కడ ఉన్న ఒక అమ్మాయి, పుస్తకం మీద ఉన్న ధరతో బిల్లు తయారు చేసింది. డిస్కౌంట్ ఏమీ ఎందుకు ఇవ్వడంలెదూ అని అడిగాను.ఇక్కడ మెంబర్లకే 20% డిస్కౌంట్ ఉంటుందీ, అని ఓ బోర్డ్ చూపించారు. మరి మాలాటి పైఊర్లనుండి

వచ్చేవారికి ఏమీ ఉండదా అన్నాను.పైగా రాజమండ్రీ లో ‘మణికంఠ’ బుక్ స్టాల్ వాళ్ళు ఏమీ అడగకుండానే 10 శాతం ఇస్తారూ, ఇంత పెద్ద దుకాణంలో ఎందుకు ఇవ్వరూ అన్నాను.వాళ్ళు కనుక ఈయకపోతే, పుస్తకాలు అక్కడే తిరిగి

ఇచ్చేసి కాచిగూడా వెళ్ళి కొనుక్కుందామనుకున్నాను. వాళ్ళు ఇస్తారు.కానీ, సణుక్కుంటూ, మొత్తానికి ఓ పది శాతం ఇచ్చారండి. వీళ్ళతో ఈ విషయం మాట్లాడుతూంటే ఎంట్రెన్స్ దగ్గర ఒకాయన కనిపించారు. ఎక్కడో చూసిన మొహంలాగ

ఉందీ, ఎవరబ్బా అనుకున్నాను.

చూస్తే గుర్తుకొచ్చింది, ఆయన ప్రఖ్యాత కవి శ్రీ సుద్దాల అశోక్ తేజా గారని. చాలా ఆనందం వేసి, నమస్కారమండీ, మీరు ఫలానాయే కదూ అని అడిగాను. ఆయనతో పరిచయం చేసికొని, ఓ ఫొటో తీసికుందామని అడగ్గానే, ఆయన

అంగీకరించగా, తీసికొన్న ఫొటో పైన పెట్టినది.ఆయనతో ఇంకొంచెం సమయం గడిపితే బాగుండేదనిపించింది.

రాత్రి పెళ్ళి అయినతరువాత మర్నాడు,ప్రొద్దుట సికిందరాబాద్ స్టేషన్ కి వచ్చి ‘కోణార్క్’ ఎక్కి పూణే తిరిగి వచ్చాను. ఆ ఉన్న ఒక్కరోజు లోనూ, మన బ్లాగ్ ద్వారా పరిచయం అయిన శ్రీమతి జ్యోతి గారికి ఫోన్ చేసి మాట్లాడకలిగాను.

ఈ సారి వారం ఉండేలా వచ్చి, వీలైనంతమంది మిత్రులని కలుసుకోవాలనుకుంటున్నాను. భాగ్యనగరం లో నాకు నచ్చిందల్లా బస్ ఫేర్స్.అసలంటూ ఎక్కకలిగితే,రవాణా టికెట్ మాత్రం, మరీ చవకండి బాబూ.పూణే లో అయితే అయిదు

రూపాయలిస్తే పదినిమిషాలు మాత్రమే కూర్చోకలుగుతాము. అదే భాగ్యనగరం లో ఆ అయిదురూపాయలకీ, అరగంట కూర్చోకలిగాను.ఏమైనా తప్పు విన్నాడేమో, దారిలో దింపేస్తాడేమో అని ఒకటే భయపడ్డాను.మళ్ళీఆటోవాళ్ళు, ఇక్కడా,

భాగ్యనగరం లోనూ నిలువుదోపిడే.మీటర్ పనిచేయదంటారు. కావలిస్తే ఎక్కండి, లేకపోతే పొండి అంటారు.బస్సు రేట్లు, అంత తక్కువైనా, ఎప్పుడైనా ప్రభుత్వం ఫేర్లు పెంచితే అందరూ ఎందుకు గొడవచేస్తారో అర్ధంఅవదు.

ఇంక ట్రాఫిక్ విషయానికొస్తే పూణే యే చాలా నయం. కొంతైనా క్రమశిక్షణ ఉంటుంది. భాగ్యనగరం లో ఇంటికి క్షేమంగా రావడం, మన ఇంటి ఇల్లాలి అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది.

‘విశాలాంధ్ర’ లో వారి ప్రవర్తన తప్పిస్తే ఉన్న ఒక్క రోజూ బాగానే గడిచింది. ఈసారి వచ్చినప్పుడు మాత్రం వాళ్ళకొట్టుకి గుడ్ బై చెప్పేసి,’నవోదయ’ కి వెళ్ళాలి.

Advertisements

4 Responses

 1. మీ టపాలో భాగ్యనగరం అన్నప్పుడున్న ఆహ్లాదం హైదరాబాదు అన్నప్పుడు లేదు చూసారూ?? దయచేసి అన్ని హైధరాబాదులనీ భాగ్యనగరం చేసేద్దురూ..

  Like

 2. బృహస్పతి ,

  మీరు చెప్పినది నిజమే.ఇప్పుడు సరీగ్గా ఉందనుకుంటాను.

  Like

 3. ఫణి గారు , మాకు పూణే లో జరిగిన ఒక అనుభవం …
  ఆటో లో వస్తున్నప్పుడు తాజ్ హోటల్ పక్కన వున్న రోడ్ లో … హటాత్తుగా ఒక వెధవ చేయి లోపలి పెట్టి నా శ్రీమతి బాగ్ లాగబోయాడు …దొరకలేదు అదృష్టం .. వాళ్ళు ఒక బైక్ లో వచ్చి నంబర్ బోర్డు మూసి ఇదంతా చేస్తారు ..అదీ ఆటో రన్నింగ్ లో వున్నప్పుడు …జాగ్రత్త …

  ఇక పూణే ట్రాఫిక్ సెన్స్ మీరు అనుభవించాలంటే Hadapsar వెళ్ళాల్సిందే … భాగ్యనగరం కన్నా అభాగ్యం …

  Like

 4. jatardamal,

  చైన్లు లాగడాలూ, బాగ్గులు లాగడాలూ ప్రతీ నగరం/పట్టణం లోనూ ఉంటాయి.మీరు చెప్పినట్లుగా,కొన్ని ప్రాంతాల్లో( పూణే లోని హడప్సర్,ఖడ్కీ) లో ట్రాఫిక్ అధ్వాన్నంగా ఉంటుంది.కానీ, ప్రధాన మార్గాల్లో మన భాగ్యనగరం కంటే, పూణే లో

  చాలా క్రమశిక్షణ తో ఉంటుందని నా అభిప్రాయం.బస్సుల విషయం తీసికోండి,పూణే లో నూటికి తొంభై శాతం,స్టాప్పుల్లో ఆగుతాయి.భాగ్యనగరం సంగతి తీసికుంటే,అలాటిదేమీ ఉన్నట్లు కనిపించలేదు.బహుశా,నేను గత 46 సంవత్సరాలుగా పూణే

  తో సంపర్కం ఉండడం వలన, నాకు అభిమానం ఎక్కువేమో.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: