బాతాఖానీ–లక్ష్మిఫణి ఖబుర్లు-మా కోనసీమ అందాలు

IMG_0696IMG_0707IMG_0708IMG_0709IMG_0731IMG_0733IMG_0735

    ఈ ఫొటోలు అన్నీ, నేను బ్లాగ్గులు వ్రాయడం ముందు తీసినవి. కోనసీమ అందాల గురించి ఎంత వ్రాసినా కొంచెమే.ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా చూడండి, ఆనందించండి.ఫొటోలు చూడతగ్గట్లుగా ఉన్నాయని భావిస్తూ, రేపటి టపాలో కోటిపల్లి రైలు ఫొటోలు…..

బాతాఖానీ -లక్ష్మిఫణి ఖబుర్లు–రాజమండ్రీ లో ఘాతుకం

   .క్రింద పెట్టిన క్లిప్పింగ్ చూడండి. మొన్న రాజమండ్రీ లో జరిగిన ఘాతుకాన్ని మా కేబిల్ టి.వీ వాడు ఓ అయిదారు సార్లైనా చూపించాడు. అప్పటికి ఆ దంపతులు ప్రాణాలతో ఉన్నట్లుగా చూశాము.కానీ, మనవాళ్ళు వాళ్ళ ప్రాణం కాపాడడం కన్నా, టి.వీ ఘనకార్యం చూపించారే తప్ప, ఆ దంపతుల ప్రాణాలు కాపాడాలని అనుకోలేదు. ప్రతీ సారీ జరిగినట్లుగానే, ఘోరం జరిగిపోయిన తరువాత, మన రాజకీయ నాయకులూ, విద్యార్ధి సంఘాలూ, మహిళా సంఘాలూ వాళ్ళ వాళ్ళ ఫొటోలు తీయించుకొని, పైగా ఫొటో తీస్తున్నారో లేదో అని, కెమేరా వైపే చూడడం. ఇదండీ ఇలా ఉంది మన మీడియా !!

D28596994

బాతాఖానీ-లక్ష్మిఫణి ఖబుర్లు– Some of my favourite cricketers

IMG_0589IMG_0590IMG_0592IMG_0593

    Neville Cardus has thus described Ali, “His cricket at times was touched with genius and imagination. There was a suppleness and a loose, easy grace which concealed power, as the feline silkiness conceals the strength of some jungle beauty of gleaming eyes and sharp fangs.”

   One of the all time greats of Indian cricket, Polly Umrigar was a heroic figure from the late forties to the early sixties, almost always shining in a losing cause.

   Alan Philip Eric Knott (born 9 April 1946 in Belvedere, Kent, England) was a Kent County Cricket Club and English cricketer, as a wicket-keeper-batsman.

He played for the England Test side between 1967 and 1981, and was Wisden Cricketer of the Year in 1970. He was particularly known for his habit of conducting limbering-up exercises at any inactive moment during a match. His major strengths were the sweep and the cut.

On 6 September 2009, Alan Knott was inducted into the ICC Cricket Hall of Fame

   Few cricketers have matured so gradually yet ripened so fruitfully as Richie Benaud. With little to show for his first six years in Test cricket, he blossomed as a fully fledged allrounder in South Africa in 1957-58, then flowered as a charismatic captain at home against England in 1958-59. He repossessed the Ashes, which his teams then successfully defended twice. As a legspinner, he was full of baits and traps, and he batted and fielded with verve. Yet it was his presence, as much as anything, which summoned the best from players: cool but communicative, he impressed as one to whom no event was unexpected, no contingency unplanned for. The same has applied to his journalism: terse, direct and commonsensical, and his broadcasting: mellow and authoritative.

   నాకు చాలా ఇష్టమయిన క్రికెటర్స్– పోలీ ఉమ్రీగర్, సయ్యద్ ముష్తక్ ఆలీ. రిచీ బెనౌ, అలాన్ నాట్ ల వద్దనుండి నాకు వచ్చిన ప్ర్తత్యుత్తరాలు మీతో పంచుకుంటున్నాను.

బాతాఖాని–లక్ష్మిఫణి ఖబుర్లు-పాశర్లపూడి

IMG_0550IMG_0552IMG_0559IMG_0560IMG_0573IMG_0576

    పూణే తిరిగి వెళ్ళడానికి ఇంకా టైముంది కదా అని నిన్న బయలుదేరి , నేనూ, మా కజినూ బస్సులో పాశర్లపూడి వెళ్ళాము. అమలాపురం నుండి బోడసకుర్రు రేవు దాటి వెళ్తే చాలా దగ్గర. కానీ, మా ఇద్దరికీ కూడా గోదావరి పడవలో దాటడం భయం. అందువలన రోడ్డు మార్గం లో, ముందుగా అంబాజీపేట, అక్కడనుండి జగ్గన్నపేట దాకా బస్సులో వెళ్ళి, షేర్ ఆటో ఎక్కి మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాము ( ఆయన నాకు వరంగాం లో పని చేసినప్పుడు మంచి స్నేహితుడు).

    వాళ్ళ ఇల్లు ఓ కొబ్బరితోటలో ఉంది. ఆ ఇల్లూ పరిసరాలూ చూస్తూంటే కడుపు నిండిపోయింది. దానికి సాయం ఆయన మాకోసం తాజాగా కొబ్బరిబొండాలు తీయించి ఉంఛారు. అక్కడ ఓ రెండు గంటలు గడిపాక, ఆయనే అన్నారు–తిరిగి వెళ్ళేటప్పుడు రేవు దాటి వెళ్ళండీ అని.సరే అని మళ్ళీ ఓ షేర్ ఆటో తీసికొని,పాశర్లపూడి రేవు దాకా వేళ్ళే సరికి, అక్కడ రేవు దాటడానికి ” బంటు” అంటే బల్లకట్టులాగ ఉంది, దానికి ఓ ఇంజనూ. దానిమీద కార్లూ అవీ కూడా తీసికెళ్ళొచ్చుట. దానిమీద అప్పటికే ఓ కారు కూడా ఉంది.నెనే అనుకుంటే, మా వాడికి నాకంటే ఎక్కువ భయం, ఇలా వద్దురా, మనం బస్సు రూట్లోనే వెళ్ళిపోదామని ఒకటే గొడవ.టికెట్ 3/- రూపాయలు, తీసికొని, భగవంతుడి మీద భారం వేసేసి అది ఎక్కేశాము!!

    రేవు దాటడానికి ఓ పావుగంట పట్టింది. ఎంత బాగుందో చెప్పలెను. ఆ ప్రక్కనే వంతెన కడుతున్నారు. ఇప్పటికే ఓ పిల్లర్ ఒరిగి పోయింది. అది ఎప్పుడు బాగుచేస్తారో, ఎప్పటికి ఈ వంతెన పూర్తి అవుతుందో ఆ భగవంతుడుకే తెలియాలి. కొసమెరుపేమిటంటే–హైదరాబాద్ ఫ్లై ఓవరూ, ఢిల్లీ లో మెట్రో ఫ్లై ఓవరూ కట్టిన “గామన్ ఇండియా ” వాళ్ళే ఈ వంతెనా కడుతున్నారు !!

    రేవు దాటి బోడసకుర్రు చేరాము. మా చిన్నతనంలో మా ఇంటి ముందరనుండి బోడసకుర్రు కి బస్సులుండేవి. పది సంవత్సరాలనుండీ ఆటో వాళ్ళు ఆందోళనలు చేసి ఈ బస్సులు ఆపేశారు .అందువలన ఆటోలే గతి. మళ్ళీ ఓ షేర్ ఆటో తీసికొని అమలా పురం చేరాము. ఈ మధ్యన మూడు నాలుగు సార్లు అక్కడికి వెళ్ళినా నేను చదివిన స్కూలు చూడలేకపోయాను. అమ్దువలన ఈ అవకాశం తీసికొని అక్కడకు వెళ్ళి హెడ్మాస్టారు గారిని కలుసుకొన్నాము. ఆ రూం లో మొదటినుండీ అక్కడ పని చేసిన హెడ్మాస్టర్లందరి పేర్లూ ఉన్నాయి. మా నాన్నగారు మూడు సార్లు పనిచేశారు. ఆ స్కూలూ అదీ చూసిన తరువాత నా చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ మళ్ళీ తాజా చేసికొని తిరిగి సాయంత్రానికి రాజమండ్రీ చేరాము.

మీలో ఎవరికైనా అవకాశం వస్తే రేవు దాటి వెళ్ళండి. కార్లున్నా ఫరవా లెదు. అదో మధురానుభూతి.

బాతాఖానీ–లక్ష్మిఫణి ఖబుర్లు -Immortal Cricket Commentators.

IMG_0526IMG_0528IMG_0531

    పైన పెట్టిన ఉత్తరాలు నాకు, బి.బి.సి, ఏ.బి.సి లలో క్రికెట్ కామెంటరీలు ఇచ్చిన ఉద్దండులవి. ఆ రోజుల్లో ఇప్పటిలాగ టీ.వీ లు ఉండేవి కావు. రేడియో లే దిక్కు.ఈ పైన చెప్పిన వారి కామేంటరీలు వినడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను.

Brian Johnson, who could turn a boring 3 hours lost to rain into great listening

John Arlot – Same as above

Alan McGilvray – who made you think you were at the game watching it, and originnaly did the broadcasts in Oz, off telegrams and used a pencil and coconut shell to mimick the sound of the ball hiting the bat.

బాతాఖానీ–లక్ష్మిఫణి ఖబుర్లు–Melville De Mello

IMG_0522IMG_0523

    నాకు 1963 నుండీ సెలిబ్రైటీస్ కి ఉత్తరాలు వ్రాయడం ఒక అలవాటు. ఈ అలవాటు మా పెద్దన్నయ్యగారినుండి వచ్చింది. ఆయన దగ్గర భారతదేశంలో ఉన్న ప్రతీ రాజకీయనాయకుడి వద్దనుండీ వచ్చిన ఉత్తరాలు ఉండేవి. దురదృష్టవశాత్తూ, అవేమీ ఇప్పుడు లేవు. నేను మాత్రం నాకు వచ్చిన ఉత్తరాలన్నీ జాగ్రత్త చేశాను. కొన్నింటిని మీ అందరితోనూ పంచుకోవాలనుకుంటున్నాను.

    ఈ వేళ ఆల్ ఇండియా రేడియో లో ఆ రోజుల్లో ఇంగ్లీష్ వార్తలు చెప్పే శ్రీ మెల్విల్ డి మెల్లో దగ్గరనుండి నాకు వచ్చిన రెండు ఉత్తరాలు. ఆ తరం వారికి ఈయన గురించి చెప్పఖ్ఖర్లేదు. రాత్రి 9.00 గంటలయ్యిందంటే చాలు, ఆయన చదివే వార్తల కోసం అందరూ వేచి ఉండేవాళ్ళు. ఆయన మహాత్మా గాంధీ అంతిమ యాత్ర కి ఇచ్చిన వ్యాఖ్యానం మన ఆకాశవాణి చరిత్రలో ఒక మచ్చు తునక.

“Melville De Mello was a student of St. George’s College . He did the
Junior Cambridge in 1932 and was admitted into the Military Academy at the
end of the same year. He became a Lieutenant in the 5/2 Punjab regiment,
retired from the Army as a young officer and attached himself to All India
Radio where he surely made his name famous.
Some of his awards are :-(14 are listed ) including a Padma Shri (highly
ranking in the list of Indian Honours)

Melville is the author of the following books:- Story of the Olympics;
Remembered Glory; the Olympics and their Heroes; Researching for
Excellence; The Glory and Decay of Indian Sports; Indigenous Games and
Martial Arts of India (1987)

Melville expired in 1989 having attained his 76th year.”

We remember Melville de Mellow well and his broadcasts(Gandhi’s funeral was
one of the epics of his broadcasting)

బాతాఖానీ–లక్ష్మిఫణి ఖబుర్లు- Freedom at Midnight-2

IMG_0521IMG_0520

    మా ఇంటావిడ పదిహేను రోజులనుండి ఫ్రిజ్ లో జాగ్రత్త పెట్టిన క్రీం ని నిన్న వెన్నలోకి మార్చేను. ఫ్రిజ్ లో పెడితే అది చూడ్డానికైనా వెన్నలాగుంటుందని ఫ్రిజ్ లో పెట్టేశాను. దానిని నెయ్యి లోకి మార్చాలని ఈ వేళ నిశ్చయించుకొన్నాను. ప్రొద్దుటే, దేవాలయ దర్శనము అయిన తరువాత, బ్రేక్ ఫాస్ట్ తీసికొని ఆ కార్యక్రమం మొదలెట్టానండి. ఎంత సేపు మరిగించినా ఉడుకుతుందే తప్ప, ఏమీ మార్పు కనబడలేదు!! బహుశా వెన్నగా కన్వర్ట్ అవలెదేమో అనుకున్నాను. అక్కడే నుంచొని, దానిని పరిశీలించగా, ఓ గంట సేపైన తరువాత నెయ్యిలోకి మారినట్టనిపించింది. సాయంత్రం మా కజిన్ వచ్చి అది లేత కాపు వచ్చిందీ, ఇంకొంచెం ఉంచితే బాగా అయ్యేదీ అన్నాడు. ఏమైతేనే నెయ్యి లాంటి పదార్ధాన్ని తయారుచేశాను.

    మరీ మూడు రోజులైపోయింది కదా అని, ఇల్లు తుడవడం, తడిగుడ్డతో పోచా చేద్దామని మొదలెట్టాను. మేము 30 న ఖాళీ చేస్తామని మా ఇంటి ఓనర్ తో చెప్పడం వల్ల, అద్దెకు ఈయడానికి, ఎవరైనా వస్తే చూపించడానికి, మా వాచ్ మన్ ఎవరో ఒకరిని తెస్తూంటాడు. అలాగే ఈ వేళ ప్రొద్దుటా ఎవరో వచ్చారు. నేనేమో ఇల్లు క్లీనింగ్ ప్రాసెస్స్ లో ఉన్నాను, బెల్లు కొట్టగానే తలుపు తీయడం, ఎవరో ముగ్గురు లోపలికి వచ్చేశారు. ఇక్కడ ఎవరికీ అడగడం లాటి అలవాటు లెదు, నేరుగా వచ్చేయడమే.నేను చచ్చేటట్లుగా తడిగుడ్డ పెట్టి తుడిచి, ఇంకా తడి ఆరని నేల మీద అడుగులు వేసేసరికి నాకైతే చిర్రెత్తుకొచ్చింది. ఇదివరకు మా ఇంటావిడ ఎప్పుడైనా, అలా తుడిచిన నేలమీద నేను ఎప్పుడైనా అడుగేస్తే గయ్య్ మని ఎందుకు అరిచేదో !!

    వాళ్ళని చూస్తే చాలా చిరాకనిపించింది. అద్దె ఎంతిస్తున్నారూ అని అడగ్గానే ఒళ్ళు మండి ” ఏమీ ఇవ్వడం లేదండీ, ఊరికే ఉంటున్నామూ ” అన్నాను.వాళ్ళ ఉద్దేశ్యం ఇంట్లో ఉన్న అన్ని సరుకులూ కూడా ఇంటాయనే ఇచ్చినట్లు అనుకుంటున్నారేమో !! అడగ వలసిన పధ్ధతి లో అడిగితే ఏదో సరైన సమాధానం చెప్పేవాడిని. ఈ మూడు వారాలూ, ఎవడో ఒకడు వచ్చేదాకా నాకు ఈ గోల తప్పదులా ఉంది.

బాతాఖానీ–లక్ష్మిఫణి ఖబుర్లు- Freedom at Midnight.

    మా మనవరాలు నవ్య కి కొంచెం వంట్లో బాగుండ లేదని మా అబ్బాయి ఫోన్ చేశాడు. అందువలన మా ఇంటావిడ కొంచెం ముందుగానే పూణే వెళ్లింది. మా నవ్య తల్లి ప్రస్తుతం కులాసాగానే ఉంది. ఎలాగూ, ఈ నెలాఖరుకి మేము పూణే తిరిగి వెళ్ళిపోతున్నాము, సంగతేమంటే మా ఇంటావిడ నాకంటే ఓ మూడు వారాలు ముందుగా వెళ్ళింది. రెండు మూడు రోజులకి సరిపోయేలా తోటకూర పులుసూ, వంకాయ కూరా చేసేసి వెళ్ళింది. కొంచెం కొంచెం మైక్రోవేవ్ లో వేడి చేసికొని తినమంది.

ఈ రెండు రోజులూ కుక్కర్ లో అన్నం పడేసుకొని, ఆ కూరా,పులుసూ తో లాగించేశాను. ఇంక రేపటినుండి ప్రారంభం అవుతాయి నా పాట్లు !!

    ఫ్రిజ్ లో వారానికీ కావలిసిన కూరలన్నీ కొని పెట్టి ఉంచాను, ఆవిడ వెళ్ళే ముందర, అవన్నీ నేనేం చేసికోనూ అని, అవన్నీ మా కజిన్ వాళ్ళింటికి తీసికెళ్ళి వాళ్ళకి ఇచ్చేశాను, సాయంత్రం అక్కడే భోజనం చేసేసి వచ్చేశాను. మా మరదలు అందీ, ప్రతీ రోజూ వాళ్ళింటికే భోజనానికి వచ్చేయమని, సలహా బాగానే ఉంది కానీ, దూరం ఎక్కువ అందుకని అక్కడికి ప్రతీ రోజూ రావడానికి వీలు పడదని చెప్పాను.

    ప్రొద్దుటే మా అత్తగారు తణుకు నుండి ఫోన్ చేసి అక్కడికి వచ్చేయమన్నారు. నాకు కాలక్షేపం అవదూ రానని చెప్పేశాను. ఏదో ఇంటావిడ ఇక్కడ ఉన్నంత కాలమూ, హాయిగా నా దారిని నన్ను వదిలేయొచ్చు కదా అనుకునేవాడిని.ఇదిగో ఇలా అవసరం వచ్చి తను వెళ్ళేసరికి, నేను వీధిని పడిపోయాను !! ఎమ్తైనా భార్య భార్యే !! ఎలాగోలాగ భరిస్తుంది. అస్సలు భర్తా అంటే భరించేవాడంటారు. కానీ ఇప్పుడు అర్ధం అవుతోంది– నిజంగా భరించేది భార్యే అని . ఈ విషయం అర్ధం చేసికోవడానికి, అరవైయ్యేళ్ళు దాటింది ” బెటర్ లేట్ దాన్ నెవ్వర్”.

    హాయిగా చేస్తూంటే తిని తిరక్క, ప్రతీ దానిమీదా వంకలు పెడతాము. ఏదో అలసిపోయి ఏదైనా చిన్న పనిచేయమంటే ఏదో ఘనకార్యం చేసినట్లు పోజులు పెడతాము. అలా చేసిన పాపాలన్నీ ప్రోగై ఇదిగో ఇలా మనమీదకే త్రిప్పి కొడతాయి !! మా కజిన్ అంటాడూ, ఉన్న కొన్ని గిన్నెలూ నువ్వే తోమేయొచ్చూ, ఇల్లు తుడవడానికి మాత్రం ఓ పనిమనిషిని పెట్టుకో, ఈ మూడు వారాలూ అని. ఈ వేళ సాయంత్రం వాళ్ళింటికి వెళ్ళినప్పుడు చూశాను, వాళ్ళ పని మనిషి వారంరోజులనుండి రావడం లేదుట. వాళ్ళింట్లో పని చేసుకోలేక నానా అవస్థా పడుతున్నారు. ముందుగా మీ ఇంట్లో పనిమనిషి సంగతి చూసుకో, నా గొడవేదో నేనే పడతానూ అన్నాను.

    పని మనిషంటే గుర్తొచ్చింది–మా ఫ్లాట్ పైన ఒకరుంటున్నారు. వాళ్ళింటికి ఓ పనిమనిషి వస్తుంది. అదేం ఖర్మమో తెలియదు, ప్రతీ రోజూ ఏదో ఒకటి రుబ్బురోలులో రుబ్బడమో, లేక దేంట్లోనో నూరడమో, లేకపోతే ఏదో ఒకటి పేద్దగా చప్పుడు చేసికుంటూ కొట్టడమో. ప్రతీ రోజూ మధ్యాహ్నం 1.00 నుండి, 2.00 వరకూ, మళ్ళీ రాత్రి 9.00 నుండి అరగంటా ఈ భాగోతం తప్పడం లేదు. మరి ఆ ఇంటావిడ మిక్సీలూ అవీ వాడరేమో !!ఇన్నాళ్ళూ, ఆ పనిమనిషి ఇంకో చోట ఎక్కడో ఉండేది. అందువలన ఆ చప్పుళ్ళ కార్యక్రమానికి నిర్ణీత సమయాలుండేవి. మా అదృష్టం బాగుండక, ఆ పనిమనిషి భర్త మా సొసైటీ లొకే వాచ్ మన్ గా వచ్చాడు. ఇంక మకాం ఈ బిల్డింగ్ లోనే కదా, ఈ చప్పుళ్ళ భాగోతానికి ఇంక ఓ టైమూ అవీ లేవు. ఎప్పుడు పడితే అప్పుడు రావడం, ఈ నూరడాలూ, రుబ్బడాలూ ప్రారంభం !! ఎప్పుడో తిక్కరేగిందంటే, టెర్రేస్ మీదకు వెళ్ళి నేనూ మొదలెట్టేస్తాను చప్పుళ్ళు చేయడం. ఈ హింస ఎలా ఉంటుందో వాళ్ళకీ తెలియాలిగా !!ఏదో అంటాం గానీ అలా చేయడానికి సంస్కారం అడ్డొస్తుందిగా !!

    ఎప్పుడో మూడ్ వచ్చినప్పుడు ఇల్లంతా తుడుచుకోవాలి. ఇదివరకు మా ఇంటావిడ ప్రొద్దుటా, సాయంత్రమూ ఇల్లంతా తుడిచి తడిగుడ్డ పెట్టి పోచా చేస్తూంటే, తిన్న తిండి అరక్క ఏవేవో వ్రాసేశాను నా బ్లాగ్గుల్లో. ఇప్పుడు తెలుస్తోంది, అలా చేయడం వల్ల ఉండే సుఖం ఏమిటో. ఇల్లంతా కడిగిన ముత్యం లా ఉండేది. మా ఇంటికి ఎవరొచ్చినా ” అబ్బ లక్ష్మిగారు ఎంత నీట్ గా ఉంచుతారో “ అనే వారు. అదంతా ఆవిడ ఇమేజ్ బిల్డింగ్ ఎక్సర్సైజ్ అనేవాడిని. చెప్పుకుంటే చేసిన పాపం పోతుందిట !!

అందుకనే ఈ బ్లాగ్గు.

    అందుకనే తిట్టుకుంటూ, కొట్టుకుంటూ కలిసే ఉండాలి కానీ లెకపోతే ఇలా ఎక్పోజ్ అయిపోతాము.అయినా ఇదంతా పురిటి వైరాగ్యం లాటిది. మళ్ళీ పూణే వెళ్ళిన తరువాత, ఎక్కడున్నావే గొంగళీ అంటే అక్కడే. ఆవిడ తాపత్రయాలూ ప్రారంభం, నా గోలా ప్రారంభం. ఫ్రీడం ఎట్ మిడ్నైట్ వినడానికీ, చదవడానికీ మాత్రమే బాగుంటుంది. కావాలని ఎప్పుడూ కోరుకోకండీ !! సర్వే జనా సుఖినోభవంతూ.

బాతాఖానీ–లక్ష్మిఫణి ఖబుర్లు–ద్వారకా తిరుమల

IMG_0483IMG_0512IMG_0515

    మేము పూణే తిరిగి వెళ్ళేలోపల ద్వారకా తిరుమల వెళ్ళి స్వామివారి కల్యాణం చేసికుందామనుకున్నాము. నిన్న ప్రొద్దుటే 5.30 కి బయలుదేరి, కారులో అక్కడికి వెళ్ళాము. ప్రొద్దుటే 7.30 కి కౌంటర్ తెరిచారు. కల్యాణానికి టికెట్ట్ 1000/- రూపాయలు. 9.00 గంటలకి కల్యాణ మండపం తెరిచారు, ముందుగానే వెళ్ళడం వల్ల, మొదటి లైను లోనే కూర్చోడానికి స్థలం దొరికింది.

    ఇదివరకు 2004 లో నా షష్టిపూర్తి కి తిరుమల తిరుపతి దేవస్థానం లో కల్యాణం చేసికున్నాము. ఈ రెండు కల్యాణాలకీ చాలా తేడా కనిపించింది, అక్కడ అంతా వ్యాపార సరళిలో జరిగిందనిపించింది. బహుశా అక్కడ రద్దీ ఎక్కువ అవడం వలనేమో. ఇక్కడ మాత్రం చాలా సంతృప్తికరంగా ఉంది. చేయించే పురోహితులు కూడా, రెండు మూడు సార్లు మన పేరూ, గోత్రం చదువుతారు. దగ్గరకు వచ్చి అందరికీ అక్షింతలూ, పూలూ ఇవ్వడం,అక్షింతలు నీళ్ళతో వదిలేయమనడమూ, ఇవన్నీ కాకుండా ఏదో పెర్సనల్ అటెన్షన్ తో చేస్తూన్నట్లనిపించింది.

    అన్నింటిలోకీ అద్భుతమేమంటే ఆ ప్రధాన పురోహితుడు గారు మొదటి సారి పేరూ గోత్రం ఒక పుస్తకంలో వ్రాసినది చదివారు. ఆ తరువాత మంత్రపుష్పం చదివేటప్పుడు, అవన్నీ గుర్తు పెట్టుకొని వరుసగా ఏ తప్పూలేకుండా, చూడకుండా చెప్పడం. నిన్నటి రోజున మొత్తం 25 జంటలు కల్యాణం చేసికున్నారు. అందరి పేర్లూ చెప్పారు. ఈ విషయం ఎవరితోనో అంటే, ఆయనన్నారూ,” మీరు ఈ వేళ 25 జంటల విషయం లోనే ఇంత ఆశ్చర్య పోతున్నారూ, నేను ఒకసారి వెళ్ళినప్పుడు 150 మందివి, ఒకేసారి అడిగి, ఆ తరువాత గుర్తు పెట్టుకొని ప్రతీ వారి దగ్గరకూ వచ్చి, గోత్రనామాలు తప్పులేకుండా చెప్పడం నే

ను ప్రత్యక్షం గా చూశాను “. శతావధానం చేసేవారు కూడా ఇలాగే ప్రతిదీ గుర్తుపెట్టుకుంటారని చదివాను కానీ, ప్రత్యక్షంగా చూడడం ఇదే మొదటి సారి.

    కల్యాణం పూర్తి అయిన తరువాత, ప్రతీ జంటకూ 5 లడ్డులూ, పులిహోరా, తీపి ప్రసాదం,ఒకచీరా జాకెట్టూ, మొగవారికి పట్టు శాలువా ఇచ్చారు. ఇవికాకుండా మనం అడిగినన్ని మీల్స్ కూపన్లూ ( ఆరుకి ఎక్కువ కాకుండా) ఇచ్చారు. నేను చెప్పేదేమిటంటే మనం పెట్టిన వెయ్యి రూపాయలలో సగ భాగం మనకి ఏదో రూపంలో తిరిగి ఇచ్చేస్తారు. అన్నింటిలోకీ ముఖ్యమైనదేమిటంటే ఎవరూ బక్షీస్ అడగక పోవడం. పెద్ద తిరుపతి, అన్నవరాలలో ప్రతి వాడూ (పురోహితులతో సహా) బహుమతి ఇవ్వమని మనని పీకేస్తారు. ఇక్కడ అలాటివేమీ చూడలేదు.

    ఆ తరువాత దేముడి దర్శనం చేసికుని, భోజన శాలలో భోజనం చేసేటప్పడికి 12.00 అయింది. ఆ తరువాత దగ్గరలో ఉన్న కుంకుళ్ళమ్మ అమ్మవారినీ,సంతానగోపాల స్వామినీ దర్శనం చేసికుని జంగారెడ్డిగూడేం దగ్గరలో ఉన్న ” మద్ది ఆంజనేయ స్వామి” ( రెండు, మూడు ఫొటోలు) దర్శనం చేసికుని రాజమండ్రీ సాయంత్రం అయిదింటికి తిరిగి వచ్చాము.

బాతాఖానీ–లక్ష్మిఫణి ఖబుర్లు–గృహిణులూ,ఉద్యోగాలూ

    నా చిన్నప్పుడు స్కూల్లో ఎప్పుడూ స్త్రీలని ఉద్యోగాల్లో చూసిన జ్ఞాపకం లేదు, ఒకరూ, ఇద్దరూ అటెండర్ల క్రింద ఉండేవారు. ఆ తరువాత కాలేజీ లో చేరిన తరువాత అక్కడ ముగ్గురు లెక్చరర్స్ ఉండేవారు. అందులో ఒకరు మా భాస్కరం అక్కయ్యగారు,ఇంకొకరు ఝాన్సీ లక్ష్మి గారు, మూడో వారు పారుపూడి వెంకటరత్నం గారూ. ముగ్గురిలోనూ మా అక్కయ్యగారికి, ఝాన్సీ గారికీ వివాహం అవలెదు,ఇంక మూడో ఆవిడకి బహుశా భర్త లేరేమో( నాకు అంతగా తెలియదు). ఏది ఏమైనా నాకు ఓ పిచ్చినమ్మకం ఉండేది–వివాహం అయినవారెవ్వరూ ఉద్యోగాలు చేయరని !! నాకు తెలిసిన వాళ్ళలో కూడా ఎవరూ ఉండేవారు కాదు.

    ఇది ఇలాగ ఉండగా నెను 1963 లో పూనాలో ఉద్యోగంలో చేరాను. అక్కడకూడా మా ఫాక్టరీ లో ఉన్న పది,పదిహేను అమ్మాయిలూ వివాహం అవని వారే !! ఓహో మనం అనుకునేది కరెక్టే అని ఆ నమ్మకం ఇంకా కన్ఫర్మ్ అయిపోయింది !! ఒకటి మాత్రం ఒప్పుకోవాలి–మా కాలేజీ లో పనిచేసే ముగ్గురూ, ఆ తరువాత ఫాక్టరీ లో పనిచేసే వారిని చూసిన తరువాత, ఆ రోజుల్లో ఉద్యోగం చేసే స్త్రీ లమీద అందరికీ ఎంత గౌరవమూ, ఆప్యాయతా ఉండేదో. వారిని చూస్తే అదో విధమైన, భక్తి భావం ఉండేది. వాళ్ళలో ఆత్మవిశ్వాసం ఉట్టి పడుతోండేది.

    మా ఫాక్టరీ లో ఒక తెలుగాయన శ్రీ కృష్ణమూర్తి గారు, నాకు ఫోర్మన్ గా ఉండేవారు. ఒకసారి ఆయనా, నేనూ ప్రక్కనే ఉండే ఆఫీసుకి వెళ్ళవలసి వచ్చింది, అక్కడ ఒకావిడ ఆఫీసరుగా ఉండేవారు. మాతో మాట్లాడుతూ, కూల్ గా చేతిలో ఒక సిగరెట్టు తీసికొని, దానిని అంటించి ఉఫ్ మని పొగ విదలడం మొదలెట్టారు !! నాకు అప్పటికే ఇంగ్లీష్ సినిమాలు చూసే అలవాటుంది కాబట్టి, ఆ విషయం పెద్దగా పట్టించుకోలేదు. కానీ, మా కృష్ణమూర్తి గారిని చూస్తూంటే నాకు నవ్వాగలేదు, ఆయన కొంచెం చాదస్థం మనిషి, ఆయన అవస్థ చూస్తూంటే నవ్వితే , ఆవిడకు కోపం వస్తుందేమో అని భయం.ఈ సంఘటన జరిగి 45 ఏళ్ళు అయింది, అయినా ఇప్పటికీ తలచుకుంటే నవ్వు ఆపుకోలేను.

    1972 లో నా వివాహం అయింది, చెప్పానుగా నాకు సంబంధించిన చుట్టాలలో ఎవరూ పెళ్ళయిన ఉద్యోగస్తులు ఆడవారు లెరు. ఒక్కసారిగా చూస్తే మా అత్తగారు టీచర్ గా పనిచేస్తున్నారని తెలిసి, అమ్మయ్యా పెళ్ళయిన వాళ్ళుకూడా ఉద్యోగాలు చేస్తారూ, ఫర్వా లెదూ అనుకున్నాను !! మా ఇంటావిడ కూడా వివాహానికి పూర్వం, అత్తిలి లో టీచర్ గా పనిచేసిందిట. బహుశా అందువలనెమో రోజూ నాకు పాఠాలు చెప్పి నా ప్రాణం తీస్తుంది. చదువుకునేరోజుల్లో ఇంటినిండా టీచర్లే, చుట్టాలందరూ టీచర్లు. పెళ్ళి అయిన తరువాత అత్తగారూ, మామగారూ టీచర్లు. నేను ఎక్కడ సుఖపడిపోతానో అని ఓ టీచర్ ని కట్టబెట్టారు !! రోజూ నాకు”జ్ఞాన్” పంచుతుంది !!

    అయినా పెళ్ళి అయిన తరువాత సంసార బాధ్యత అంతా ఈ మొగుడు అనే ప్రాణి కే ఉంటుంది అనే అపోహలో పడి, మా ఇంటావిడని ఉద్యోగం చేస్తావా అని కూడా అడగలేదు.ఏదో ఈ 37 ఏళ్ళూ లాగించేశాము. అయినా ఛాన్స్ వచ్చినప్పుడల్లా సణుగుతుంది–నన్ను ఉద్యోగం చేయించలేదూ, లేకపోతేనా…..అంటూ.బహుశా ఈ కారణం వల్లనెమో, తను పిల్లల బాధ్యత పూర్తిగా తీసికొని వాళ్ళని ప్రయోజకులు చేసింది. అలాగని ఉద్యోగాలు చేసే తల్లులు, పిల్లల్ని సరీగ్గా పెంచరని కాదు. ఎంత చెప్పినా ఉద్యోగస్తులు, హౌస్వైఫ్ ల లాగ పూర్తి న్యాయం చేయలేరు కదా. చాలా శ్రమ పడాలి, అదీ నా ఉద్దేశ్యం, కోప్పడకండి.

    ఈ రోజుల్లో ఏ మాట్రిమోనియల్ యాడ్ చూసినా, ఉద్యోగాలు చేసే స్త్రీలే. అదే కాకుండా ప్రస్తుత కుటుంబ అవసరాలు తీరడానికి ఇద్దరూ ఉద్యోగం చేయాల్సిందే. లేకపోతే

చాలా శ్రమ పడాలి. పిల్లలు కూడా తల్లితండ్రులిద్దరూ ఉద్యోగానికి వెళ్ళడం అలవాటు పడ్డారు, అడ్జస్ట్ అయిపోయారు.వారి దినచర్య కూడా మారింది. ఏదో వీకెండ్స్ లోనే అందరూ కలసి బయటకు వెళ్ళడం లాటివి అలవాటు చేసికున్నారు. అలాగని ఉద్యోగం చేయని గృహిణులందరూ ప్రతీ రోజూ బయట తిరుగుతారనికాదు.

    ఈ సోదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజుల్లో అబ్బాయిలు కూడా ఉద్యోగం చేసే వారికోసమే చూస్తున్నారు. ఏదో వేణ్ణీళ్ళకి చన్నీళ్ళ లాగ, ఓ ఫ్లాట్టూ, కారూ, మిగిలిన అలంకారాలూ పెళ్ళైన ఏడాదిలో సమకూర్చుకోవచ్చు, పిల్లల్ని పబ్లిక్ స్కూళ్ళలో వేయవచ్చూ, వగైరా వగైరా… అదే కాకుండా, ఆడ పిల్లలు కూడా చదువులలో, మొగ పిల్లల కంటే ముందున్నారు. ఎక్కడ చూసినా ఇంజనీర్లు, డాక్టర్లు. ఇదివరకటి రోజుల్లో స్కూళ్ళకి వెళ్ళి చదువుకోలేదు కానీ, వాళ్ళకున్న జ్ఞానం ఇప్పటివారికంటే ఎక్కువే.

    అమ్మాయి క్వాలిఫికేషన్ చూసి, తనకన్నా ఎక్కువైనా ఎలాగోలాగ ఒప్పేసికుని పెళ్ళి చేసేసుకుంటున్నాడు ఈ రోజుల్లో అబ్బాయి–మొదటి కారణం వీడి ఉద్యోగం ఆర్ధిక మాంద్యం ధర్మమా అని ఊడిపోయినా, భార్య సంపాదనమీద కొత్త ఉద్యోగం వచ్చేదాకా లాగించేయొచ్చు. ఆతావేతా చెప్పొచ్చేదేమిటంటే చాలా మంది కుర్రాళ్ళు వాళ్ళ భార్యలు ఉద్యోగం చేస్తే బాగుంటుందని ఆసిస్తారు.

    నేను ఈ మధ్యన రెండు కేసులు చూశాను మా చుట్టాలలో. ఒకరికి మంచి క్వాలిఫికేషన్ ఉంది, ఉద్యోగం చేయమ్మా అంటే ” నాకు సరిపడే ఉద్యోగం వచ్చినప్పుడు చేస్తానూ” అంటుంది. ” సరిపడే” అంటే ఏమిటీ, ఆ ఉద్యోగం ఎప్పుడు వస్తుందీ, ఈవిడ ఎప్పుడు సంపాదించడం మొదలెడుతుందీ, మనం అమ్మా నాన్నల్ని నాదగ్గరకు ఎప్పుడు తీసుకు రాగలనూ– ఇవన్నీ ప్రశ్నలే. అప్పటి దాకా మావాడు మింగా లేడు, కక్కా లేడూ.

రెండో కేసు–ఉద్యోగం చేస్తూందికదా అని సంబంధం ఖాయం చేసికున్నారు, ఈ అమ్మాయి పెళ్ళికి ముందర ఉద్యోగానికి రాజినామా చేసింది. భర్త ఉద్యోగం చేసే ఊళ్ళో

ఈ అమ్మాయికి ఉద్యోగం దొరికేలా లేదు. ‘ఫర్వా లెదూ ” అంటుంది ఈ అమ్మాయి. ఫర్వా ఎవరికమ్మా నీకు కాదు, నాకు, ఏదో ఉద్యోగం చేస్తూంది కదా అనుకుంటే ఈవిడేమో ఉద్యోగం వచ్చినా లేకపోయినా ఫర్వా లెదంటుంది.

    అంటే ఈ ప్రపంచం లో నాలాటి వారుంటారన్నమాట–చదవరా చదవరా అని నెత్తీ నోరూ బాదుకున్నా నాకు చదువు మీద అంత ఇంటరెస్ట్ లెదూ అని ఒక

పుణ్యాత్ముడు ఉద్యోగం వేయిస్తే ఠింగ్ రంగా మంటూ వెళ్ళిపోయి సుఖ పడ్డాను. ఇప్పుడు కొంతమంది అమ్మాయిలు ఉద్యోగం చేయమ్మా అంటే ‘అబ్బే నాకు ఇంటరెస్ట్ లెదండి” అంటున్నారు.

%d bloggers like this: