బాతాఖాని–లక్ష్మిఫణి ఖబుర్లు-పాశర్లపూడి


IMG_0550IMG_0552IMG_0559IMG_0560IMG_0573IMG_0576

    పూణే తిరిగి వెళ్ళడానికి ఇంకా టైముంది కదా అని నిన్న బయలుదేరి , నేనూ, మా కజినూ బస్సులో పాశర్లపూడి వెళ్ళాము. అమలాపురం నుండి బోడసకుర్రు రేవు దాటి వెళ్తే చాలా దగ్గర. కానీ, మా ఇద్దరికీ కూడా గోదావరి పడవలో దాటడం భయం. అందువలన రోడ్డు మార్గం లో, ముందుగా అంబాజీపేట, అక్కడనుండి జగ్గన్నపేట దాకా బస్సులో వెళ్ళి, షేర్ ఆటో ఎక్కి మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాము ( ఆయన నాకు వరంగాం లో పని చేసినప్పుడు మంచి స్నేహితుడు).

    వాళ్ళ ఇల్లు ఓ కొబ్బరితోటలో ఉంది. ఆ ఇల్లూ పరిసరాలూ చూస్తూంటే కడుపు నిండిపోయింది. దానికి సాయం ఆయన మాకోసం తాజాగా కొబ్బరిబొండాలు తీయించి ఉంఛారు. అక్కడ ఓ రెండు గంటలు గడిపాక, ఆయనే అన్నారు–తిరిగి వెళ్ళేటప్పుడు రేవు దాటి వెళ్ళండీ అని.సరే అని మళ్ళీ ఓ షేర్ ఆటో తీసికొని,పాశర్లపూడి రేవు దాకా వేళ్ళే సరికి, అక్కడ రేవు దాటడానికి ” బంటు” అంటే బల్లకట్టులాగ ఉంది, దానికి ఓ ఇంజనూ. దానిమీద కార్లూ అవీ కూడా తీసికెళ్ళొచ్చుట. దానిమీద అప్పటికే ఓ కారు కూడా ఉంది.నెనే అనుకుంటే, మా వాడికి నాకంటే ఎక్కువ భయం, ఇలా వద్దురా, మనం బస్సు రూట్లోనే వెళ్ళిపోదామని ఒకటే గొడవ.టికెట్ 3/- రూపాయలు, తీసికొని, భగవంతుడి మీద భారం వేసేసి అది ఎక్కేశాము!!

    రేవు దాటడానికి ఓ పావుగంట పట్టింది. ఎంత బాగుందో చెప్పలెను. ఆ ప్రక్కనే వంతెన కడుతున్నారు. ఇప్పటికే ఓ పిల్లర్ ఒరిగి పోయింది. అది ఎప్పుడు బాగుచేస్తారో, ఎప్పటికి ఈ వంతెన పూర్తి అవుతుందో ఆ భగవంతుడుకే తెలియాలి. కొసమెరుపేమిటంటే–హైదరాబాద్ ఫ్లై ఓవరూ, ఢిల్లీ లో మెట్రో ఫ్లై ఓవరూ కట్టిన “గామన్ ఇండియా ” వాళ్ళే ఈ వంతెనా కడుతున్నారు !!

    రేవు దాటి బోడసకుర్రు చేరాము. మా చిన్నతనంలో మా ఇంటి ముందరనుండి బోడసకుర్రు కి బస్సులుండేవి. పది సంవత్సరాలనుండీ ఆటో వాళ్ళు ఆందోళనలు చేసి ఈ బస్సులు ఆపేశారు .అందువలన ఆటోలే గతి. మళ్ళీ ఓ షేర్ ఆటో తీసికొని అమలా పురం చేరాము. ఈ మధ్యన మూడు నాలుగు సార్లు అక్కడికి వెళ్ళినా నేను చదివిన స్కూలు చూడలేకపోయాను. అమ్దువలన ఈ అవకాశం తీసికొని అక్కడకు వెళ్ళి హెడ్మాస్టారు గారిని కలుసుకొన్నాము. ఆ రూం లో మొదటినుండీ అక్కడ పని చేసిన హెడ్మాస్టర్లందరి పేర్లూ ఉన్నాయి. మా నాన్నగారు మూడు సార్లు పనిచేశారు. ఆ స్కూలూ అదీ చూసిన తరువాత నా చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ మళ్ళీ తాజా చేసికొని తిరిగి సాయంత్రానికి రాజమండ్రీ చేరాము.

మీలో ఎవరికైనా అవకాశం వస్తే రేవు దాటి వెళ్ళండి. కార్లున్నా ఫరవా లెదు. అదో మధురానుభూతి.

Advertisements

12 Responses

 1. బాగుందండి ………….ఫోటోలు చాలా బాగున్నాయి.

  Like

 2. ఫోటోలు బావున్నాయి. పాశర్లపూడి అంటే బ్లో-ఔట్ సంఘటన గురించేమయినా ఉంటుందేమో అనుకున్నా. చాలా బావున్నాయి మీ భయాలూ, అనుభూతులూ !

  Like

 3. నేను క్రమం తప్పకుండ మీ బ్లాగు ఫాలో అవుతుంటా . ఫోటోలు చాలా బాగున్నాయి.

  Like

 4. వినయ్, గణేష్,

  మీ ప్రశంసలు చదివిన తరువాత, ఫర్వాలేదూ, నేనూ ఫొటోలు తీయొచ్చు అనిపించింది. ధన్యవాదాలు.

  Like

 5. సుజాతా,

  బ్లో ఔట్ జరిగి చాలా కాలం అయింది. మేము బస్సుల్లో వెళ్ళడం వలన అక్కడికి వెళ్ళలేకపోయాము. మా ఇంటావిడ కూడా ఉండి ఉంటే కారులో అక్కడికి వెళ్ళేవాళ్ళమేమో.అక్కడికి వెళ్ళే రోడ్డు మాత్రం చూశాము ( అదీ షేర్ ఆటో లో వెళ్తూ!). ఫొటోలు నచ్చినందుకు ధన్యవాదములు.

  Like

 6. బంటు కాదండి పంటు అంటారు PANTOON నుండి వచ్చింది.
  నాకెప్పటినుండో డౌటు.
  ఈ పాశర్లపూడి, వంశీ గారి పసలపూడి ఒకటేనా? వేరా?

  Like

 7. బోనగిరీ,

  మీరు చెప్పినదే రైటు.క్షంతవ్యుడిని. వాళ్ళు చెప్పారు, కానీ ఇక్కడకు వచ్చేసరికి అసలు పేరు మరచిపోయాను. దానికి సాయం, మా కజిన్ కూడా బంట్ అనేసరికి రైటేమో అనుకున్నాను. చెక్ చేయవలసింది, ఇంకోళ్లని గుడ్డిగా నమ్మకూడదు !! వంశీ గారు వ్రాసినది “పసలపూడి ” . ఈ గ్రామం, తూర్పుగోదావరి జిల్లా లోనే, దాక్షారం, రామచంద్రపురం లకి మధ్యలో ఉన్నట్లుగా నెట్ లో చదివాను.

  Like

 8. కొబ్బరాకు నీడలొ గొదారి వడి లొ వయ్యరి భామలా వదిగి ఉన్న కొనసీమ అలాంటి కొనసీం ఎలా చూసినా అందమె!ఎటు చూసినా పచ్చదనమె!.అక్కద అడుగడుగూ దెవాలయమె. మన పూర్వ రిషుల చె స్తాపించిన కొవెలలు ఎన్నొ కాని అన్నీ సరి అయిన maintanance ledu.vaati lo.మురమల్ల,అంతర్వెది,ముక్తెస్వరం,కొటిపల్లి,అయినవిల్లి,ద్రాక్షరామం,బిక్కవొలుఇవి కొన్నిమాత్రమ!

  Like

 9. 2006 కి ముందు నేను కూడా పాశర్లపూడి దగ్గర పంటి ఎక్కి రేవు దాటాను. బోడసకుర్రు నుంచి అమలాపురంకి బస్సులు తక్కువ. ఆటో ఎక్కి అమలాపురం వెళ్ళాలి. పాశర్లపూడి నుంచి రాజోలు, పాలకొల్లు వెళ్ళే బస్సులు కూడా తక్కువే. పాశర్లపూడిలో ఆటో ఎక్కి తాటిపాక లేదా రాజోలు వెళ్ళి పాలకొల్లు వైపు వెళ్ళే బస్సులు ఎక్కాలి.

  Like

 10. ప్రవీణ్,

  మా చిన్నప్పుడు శుభ్రంగా బస్సులుండేవి. అమలాపురం లో మా ఇంటిముందరగా వెళ్ళేవి. ఇప్పుడు ” గ్లోబలైజేషన్” ధర్మమా అని, బస్సులు పోయి ఆటోలు వచ్చేశాయి !! పైగా వాళ్ళెంత రేటు చెప్తే అంత ఇవ్వడమే. లేకపోతే అక్కడినుండి రావడానికి ఇంకో మార్గం లేదు.

  Like

 11. భాస్కరా,

  మీరు చెప్పినది అక్షరాలా నిజం.

  Like

 12. అమలాపురంలో మీ ఇల్లు SKBR కాలేజ్ రోడ్ లో ఉందా? బోడసకుర్రు వెళ్ళే బస్సులూ, ఆటోలు ఆ రూట్లోనే వెళ్తాయి. ఓడలరేవు, బెండమూర్లంక వెళ్ళే బస్సులు కూడా SKBR కాలేజి మీదుగా వెళ్తాయి కానీ పేరూరు జంక్షన్ లో టర్నింగ్ తిరుగుతాయి. బోడసకుర్రు వెళ్ళే బస్సు తిరిగేది రోజుకి రెండు మూడు ట్రిప్పులే. అందుకే జనం ఎక్కువగా ఆటోలు ఎక్కుతుంటారు.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: